Monday, July 15, 2013

తెలంగాణాకు ప్యాకేజి ఇస్తే "అంధ్ర"కు తీరని నష్టం!అలోచించండి!!

తెలంగాణాకు ప్యాకేజి ఇవ్వడానికే కాంగ్రెస్ మొగ్గు చూపుతోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనీసం లక్షకోట్లతో ప్రత్యేక "అభివృద్ది" ప్యాకేజీ రానుందని అంచనా.
కాకపోతే ఈ ప్యాకేజి ప్రకటించడం ఖచ్చితంగా మిగతా ఆంధ్ర ప్రాంతాలకు ఇప్పుడేకాదు భవిష్యత్ లో తీరని అన్యాయమే అవుతుంది..
అదెలా అంటే ప్రస్తుతం ప్యాకేజి ఇవ్వడం వల్ల తెలంగాణా విభజన నినాదం పూర్తిగా అటకెక్కదు. కాకపోతే ఆ లక్షకోట్లతో ఆ ప్రాంతం అభివృద్ది పథంలో నడుస్తుంది.కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ తెలంగాణా ఇవ్వవల్సిన పరిస్థితి తప్పక వస్తుంది. బీజేపీ అధికారంలోకి రావడమో, లేక కాంగ్రెస్సే తిరిగి తెలంగాణా ఇవ్వాలని తలిస్తే ఆంధ్రా పరిస్తితి ఏమిటి. ఈ విషయం విజ్ఞులైనవాళ్ళంతా ఆలోచించాలి. తెలంగాణా ఇచ్చి ఆంధ్రాకు ప్యాకేజీ ఇవ్వడమో, లేక ఆ సమస్యను అలాగే ఉంచడమో చేస్తే మంచిదని నా అభిప్రాయం ! మీరేమంటారు?  

3 comments:

  1. మీరన్నది అక్షరాలా నిజం. ఇప్పటికే ఉద్యమాన్ని సముదాయించాలని హైదరాబాదు మీదే చాలా ఖర్చులు పెట్టారు. రాష్ట్రం లోని మిగిలిన పట్టణాలని, నగరాలనీ, పాడుబెట్టారు. ఫలితం శూన్యం. ఇవాళ కాకపొతే రేపటికైనా తేల్చాల్సిన విషయమే కానీ, నాన్చాల్సిన విషయం కాదు. పేకేజీ తరవాత తెలంగాణా ఇవ్వవలసి వస్తే నిండా మునిగేది రాయలాంద్రా వాళ్ళే. సందేహం లేదు. ఆ ఇచ్చే పెకేజేదో రాష్ట్రం లోని మిగిలిన నగరాలకి పట్టణాలకి ఇస్తే సమస్య కొంతవరకు తిరవచ్చును.

    ReplyDelete
  2. డబ్బుకు లోకం దాసోహం.
    గట్లయితే "తెలుగు తల్లి ఆదర్శం" గత్తరన్న మాట.
    సమైక్యవాదం "సమ్ మెక్కే వాదం" అన్న మాట.

    ReplyDelete
  3. పైసామే పరమాత్మా హై, మా ఉద్యోగాలు, మా పదవులు మా ఆస్తులు అనకుండా ఉండే మునులు స్వామిజిలు లేరు. అడవిలో తపస్సు చేసుకొనే వారు లేరు. పదవుల కోసమో ఉద్యోగాల కోసమో ఈ ఉద్యమాలు. ఎవరికైనా బ్రతుకు తెరువే కదా కావాలిసింది.

    ReplyDelete