దిష్టిబొమ్మను ఆంగ్లంలో స్కేర్ క్రో అంటారు. స్కేర్ అంటే బెదిరించడం, క్రోఅంటే కాకి. దీనిని బట్టి కాకులను బెదరగొట్ట డానికి తయారు చేసుకున్న బొమ్మ ను స్కేర్క్రో లేక దిష్టిబొమ్మ అంటా రు. ముఖ్యం గా దిష్టి బొమ్మ మోసగించడానికి తయారు చేసుకున్న ఒక డెకారు. సాంప్రదాయకంగా ఇది మానవుని రూపం కలిగిన మనిషి బొమ్మ వలె ఉంటుంది. దీనిని కర్ర, వరిచెత్త వంటి వాటితో తయారు చేసి పాత బట్టలను తొడుగుతారు. ఈ విధంగా తయారు చేసుకున్న దిష్టిబొమ్మను రైతులు పొలాలలో కాకి, పిచ్చుక వంటి పక్షుల నుంచి పంటను రక్షించుకునేందుకు ఉంచుతారు. ఈ దిష్టిబొమ్మను చూసిన పక్షులు నిరుత్సాహానికి గురై కలవరం చెంది ఇక్కడ మనిషి కాపలా ఉన్నాడనే భయంతో పంట జోలికి రావు. ముఖ్యంగా రైతులు పంట పొట్ట దశకు వచ్చే సమయంలో ఈ దిష్టిబొమ్మలను ఏర్పాటు చేస్తారు.
From: Visalandhra , wiki
From: Visalandhra , wiki
No comments:
Post a Comment