Sunday, December 29, 2013
Monday, November 25, 2013
మంచి ఆలోచనలే మంచి కార్యాలకు నాంది
జరగాలనుకున్నవి జరగకపోయినా, జరిగినవి జరగకూడదనుకున్నా దుఃఖం తప్పదు. అదే
కోరిక. మన తలలోని మెదడు కంప్యూటర్‌లోని హార్డ్‌వేర్‌లాంటిదైతే మనసనేది
జరుగుతున్న ప్రోగ్రామ్- సాఫ్ట్‌వేర్ లాంటిది. మనసు మనం చేసే ప్రోగ్రామ్‌ను
బట్టే నడుచుకుంటుంది. కంప్యూటర్‌లో తప్పుడు ప్రోగ్రామింగ్ వల్ల తప్పుడు
ఫలితాలు వచ్చినట్టే మనసులో ప్రోగ్రామింగ్‌లో లోపం ఉంటే తప్పుడు రిజల్టే
వస్తుంది. అదే మన ఎదుగుదలకు అవరోధంగా తయారవుతుంది.
పుట్టుకతో మెదడు ఉంటుంది కాని మనసు ఉండదు. సమాజం, తల్లిదండ్రులు, పెద్దలు, చదువు- ఇవి మైండ్ ఏర్పడటానికి బాధ్యులు. ఈ మైండ్‌లో నమ్మకాలు, ఆచారాలు, దేశకాల పరిస్థితులు అంతర్లీనంగా దాగి ఉంటాయి. భౌతికంగా ఏ ఉనికిలేని నీ మనసు నీవు ఊహించలేనంత శక్తిమంతంగా తయారవుతుంది. నీవు మాయలో చిక్కుకునేట్లు చేస్తుంది. నీవు ఏది కావాలో అనే నీవు అనుకునే భ్రమలో పడేస్తుంది. అసలు మైండ్ అంటేనే ఆలోచనల ప్రవాహం.
గతానికిగాని, భవిష్యత్తుకిగాని సంబంధించిన విషయాలు మైండ్‌లో ఆలోచనలుగా చోటు చేసుకుని నిన్ను నిన్నుగా ఉండనీయవు. శూన్యం, స్వచ్ఛత, శాంతి, ఆనందం అనేవి నీ నిజతత్వమైతే, ఆలోచనలు నిన్ను ఆవిహ ంచి నీ ఆనందాన్ని, శాంతినీ హరించి వేస్తాయి. గతంలో నీవు అనుభవించనిదే కోరిక. కలల రూపంలో, కోరికల రూపంలో ఆలోచనలు నిన్ను ఎప్పుడూ వెంటాడుతుంటాయి. నీవు అన్‌కాన్షియస్‌గా ఉంటే అప్పుడు వాటి విజృంభణ మొదలవుతుంది. నీ కాన్షియస్‌నెస్, స్వచ్ఛత, శూన్యతకు భంగం కలిగిస్తాయి. మైండ్ స్వచ్ఛం అయ్యేంతవరకు నీకు విజయం చేకూరదు.
ప్రతికూలమైన ఆలోచనలు, నెగటివ్ భావాలు మనస్సుపై ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నప్పుడు ఆధ్యాత్మికపరమైన మంచి పుస్తకాల పఠనం, ధ్యానం, జపం, ప్రార్థనలపైన కూడా ఆధారపడాలి. ఎల్లప్పుడూ వేకువతో, చేతనతో, ప్రజ్ఞలో ఉండాలి. కొన్నిసార్లు బద్దకంగా కానీ, నిద్రాస్థలో ఉన్నప్పుడు కానీ కొన్ని ప్రాణాయామాలు, ప్రణవ మంత్రోచ్చారణ చేస్తుండాలి. రక్తానికి అలవాటు పడిపోయిన పులిని ఎలా అడ్డుకోలేమో అలాగే మైండ్ కూడా. ఏదైనా వ్యామోహానికి గురయినప్పుడు మనసు ఈ ఒక్కసారికే కదా! ఏమీ కాలేదులే అని అనుకుంటుంది. ఒక్కసారి అనుకున్నది అల వాటుగా మారి ఇక కోరికలను చంపుకోలేని స్థితికి తీసుకు వస్తుంది.
మనసుకి చెడు అలవాటు చేస్తే విముక్తి లభించడం అసాధ్యం. చెడు ఆలోచనలను ఆపేయాలి. టీవీలు, సినిమాలలో చూపించే సీరియల్స్, కథలలోని పాత్రలు ప్రదర్శించే కోపం, ద్వేషం, పగలాంటి నెగటివ్ ఆలోచనలు మనలో లేకపోయినా అవి మనలో కూడా కలిగే అవకాశం ఉంది. వాటిలో చూపించే పగ, ద్వేషం, కోపం లాంటి లక్షణాలు నిజంగా లేకపోయినా ఆ ప్రోగ్రాములు చూసేవారి మనసులో కూడా అవి నాటుకుంటాయి. దానివల్ల మనలో సంస్కారాలు పెరుగుతాయి. అవి ప్రక్షాళన చేసుకోవడానికి ఎన్నో జన్మలు ఎత్తవలసిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి వ్యామోహాలకు తావివ్వకుండా చెడు విషయాలు మీ చుట్టూ లేకుండా బహిష్కరించండి. ఈ సందడిలో పడి అసలు విషయమైన మోక్షసాధనను మరువకూడదు.
మనసులో పేరుకుపోయిన సంస్కారాలను, కోరికలను తొలగించుకుని మనసును అదుపులో ఉంచుకోవాలి. మనసు మనల్ని ఏదో ఒక మాయలో పడేస్తూనే ఉంటుంది. మనసులో మలినాలు పెరగడం వలన నేను ఆత్మను అనే విషయం మరచిపోవడం జరుగుతుంది. మన నిజతత్వాన్ని మరచిపోయి ఒక రకమైన అవిశ్రాంత స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ప్రేమ, కరుణ, శాంతి, సచ్చిదానందానికి దూరంగా ఉంటుంటాం. అందుకే ఆలోచనలలో స్వచ్ఛత ఉండాలి. ఒక ఆలోచనే కార్యాచరణకు నాంది కాబట్టి మంచి ఆలోచనలు చేయడం ఎంతో ముఖ్యం.
మైండ్ రకరకాలుగా మనల్ని లోబరచుకుని అహంకారం కలిగిస్తుందని గమనించాలి. సేవ, జపం, భగవన్నామ స్మరణ, దైవచింతన మనల్ని కోపం, దుఃఖం, అహంకారం, ద్వేషంలాంటి భావాలనుంచి బయటపడేస్తాయి. శాంతి, ధైర్యం, సంతోషం కలిగిస్తాయి.
-స్వామి మైత్రేయ, ఆధ్యాత్మిక గురువు
Source: సాక్షి

Friday, November 22, 2013
[ॐ] ఓంకారం అంటే?
“ఆన్ని మంత్రాలోకి శక్తివంతమైన ఏకాక్షర
మంత్రం ‘ఓం;’. దినినే ప్రణవమని అంటారు. మంత్రోచారణం జీవునికి, పరమాత్మ
అనుగ్రహాన్ని సులభతరం చేసే సాధనం. ఉదాహరణకు బిడ్డ తన తల్లిని ‘అమ్మా’ అని
పిలువగానే, ఆ తల్లి ఎన్ని పనులతో సతమతమవుతున్న;;ప్పటికి ఆప్యాయంగా ఆ
బిడ్దను గుండెకు హత్తుకుంటుంది కదా! అలాగే సకల దేవత్తముర్తులు,
మంత్రోచ్చారణతో మనం మననం చేయగానే మన పట్ల ప్రసన్నులవుతున్నారు.
హిందూ ధర్మంలో చాలా కీలకమైన అంశం ఓంకారం. కాబట్టి ఆదిలోనే దానినందిస్తున్నాము. ఓంకారమంటే బ్రహ్మవిద్య.
ఓం అనే పదాన్ని తీసుకుంటే, ఇది ఒక పదమా ? లేక అక్షరమా ? లేక వాక్యమా ? భాషలో అచ్చులు, హల్లులు కలిసి ఉంటాయి. కొన్ని హల్లులు అచ్చులు కలిసి అర్థాన్ని ఇవ్వగలిగితే పదం అని అంటాం. 'గోవు' ఇది కొన్ని అక్షరాల కలయిక,ఆ కలయిక ద్వారా ఒక అర్థాన్ని ఇవ్వగల శక్తి దానిలో ఏర్పడింది, కనుక పదం అని అంటాం. అలానే కొన్ని పదములు కలిసి మన సంశయాలను తీర్చగలిగినట్లుగా అర్థం ఇవ్వగలిగితే దాన్ని వాక్యం అని అంటాం. 'గోవు పాలు ఇచ్చును' ఇలా కొన్ని వాక్యాలు కలిసి మనకు గోవు ఏమి చేస్తుంది అనే సంశయాన్ని తీర్చి, ఒక అర్థాన్ని ఇస్తుంది కనక అది ఒక వాక్యం అని అంటాం. 'ఓం' అనేది అక్షరమా ? 'ఓం ఇత్యేకాక్షరం' అంటుంది వేదం. అంటే ఓం అనేది ఒక అక్షరం. భగవద్గీతలో భగవానుడు 'ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామ్ అనుస్మరన్' అని చెబుతాడు. ఓం అనేది ఒక అక్షరం, ఇది బ్రహ్మ, ఇది వేదం. ఏం చెబుతుంది అది ? 'మామ్ అనుస్మరన్' నన్ను తలవాలి అని చెప్పాడు. ఇది స్వతంత్రంగా అర్థాన్ని ఇవ్వ గలదు కనక దీన్ని ఒక పదం అని కూడా అనవచ్చు. ఇది కొన్ని అక్షరముల కూర్పు కూడా. అవి 'అ','ఉ' మరియూ 'మ్' అనే అక్షరాలు. ఈ మూడు అక్షరాలు కలిసి ఒక పదం అయ్యింది. మామూలుగా కొన్ని అక్షరాలు కలిసి పదం అయ్యి ఒక అర్థాన్ని ఇస్తాయి, కానీ ఒక్కో అక్షరాన్ని విడదీస్తే ఏమి అర్థాన్ని ఇవ్వవు. ఇక్కడ ఓంకారంలో ఉన్న 'అ','ఉ' మరియూ 'మ్' అనే అక్షరాలు ఒక్కోటి విడి విడి అర్థాన్ని ఇవ్వగలవు. అట్లా అకారం స్వతంత్రంగా ఒక అర్థాన్ని చెప్పగలదు, ఉకారం స్వతంత్రంగా ఒక అర్థాన్ని చెప్పగలదు, మకారం స్వతంత్రంగా ఒక అర్థాన్ని చెప్పగలదు. కనుక ఇవి మూడు పదాలు అని కూడా చెప్పవచ్చు. ఇలా మూడు పదాలు కలిసిన ఓంకారం ఒక స్వతంత్ర అర్థాన్ని ఇవ్వగలదు, మన సంశయాలను తీర్చగలదు కనక వాక్యం అని చెప్పవచ్చు. అందుకే ఓంకారాన్ని ఒక అక్షరం అని చెప్పవచ్చు, ఒక పదం అని చెప్పవచ్చు లేదా ఒక వాక్యం అని చెప్పవచ్చు. ఓంకారంలో ఉన్న 'అ','ఉ' మరియూ 'మ్' అనే అక్షరాలు ఒక్కోటి ఏం అర్థాన్ని ఇస్తాయో తెలుసుకోవాలి, పదంగా ఏం అర్థాన్ని ఇస్తాయో తెలుసుకోవాలి అట్లా వాక్యంగా కలిసి ఏం అర్థాన్ని ఇస్తాయో కూడా తెలుసుకోవాలి.
‘అసలు మంత్రం అంటే ఏమిటి?’ అన్న సందేహం కొంత మందికి కలుగవచ్చు.
మననాత్ త్రాయతే
ఇతి మంత్ర: అని అన్నారు. అంటే మననం చేయడం వలన రక్షించేది అని అర్ధం, అటువంటి మహా శక్తివంతమైన మంత్రాలను మన ౠషులు, తమ అమోఘ తపశ్శక్తితో, భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలు.
‘ఐం’, ‘శ్రీం’, ‘హ్రీం’, ‘క్లీం’ అనే బీజాక్షరాలను అయా దేవతల పేర్లతో కలిపి జపించినపుడు శక్తివంతములైన మహా మంత్రాలవుతున్నాయి. మన్ ఇష్టదేవతను ప్రసన్నం చేసుకోవడమే మంత్రంలక్ష్యం. ఈ మంత్రాలు మూడు విధాలు. క్షుద్రంతో ఉచ్చాటన చేసే తామస మంత్రాలు, యుద్ధంలో గెలుపు కోసం చేసే రాజలమంత్రాలు, ఆధ్యాత్మిక సాధనకై జపించే సాత్వికమంత్రాలు, చంధోబద్దంగా ఉన్నవి ‘ౠక్కులూ గద్యాత్మకంగా ఉన్న మంత్రాలు ‘యజస్సులూ.
ఇక అన్ని మంత్రాలకు ముందు ‘ఓం’ కారాన్ని చేర్చి జపిస్తాం. ఎందుకంటే ‘ఓం’ కారం లేని మంత్రం ఫలవంతం కాదు. అలాంటి మంత్రం ప్రాణవయువులేని నిర్జీవశరీరం వంటిది. ఈ ఓంకారం ఆ సర్వేశ్వరుని మంచి ఓక జ్యోతిగా ప్రారంభమై, అందునుంచి ఒక నాదం ధ్వనించింది. ఆ ధ్వనే ‘ఓంకారం’. ‘ఓం’ నుంచి వేదరాశులే ఉద్భవించాయి. ౠగ్వేదంనుండి ‘ఆకారం, యజుర్వేదం నుండి ‘ఊకారం, సామవేదం నుండి ‘మాకారం కలసి ‘ఓంకారం’ ఏర్పడిందని ౠషివాక్కు.
సకలవేదరూపం ఓంకారం.”

Sources: సంస్కృతి – సాంప్రదాయం – భక్తి
Thursday, November 14, 2013
బాలల దినోత్సవం ,Children's Day
ప్రతి సంవత్సరం నవంబరు 14న బాలల దినోత్సవం జరుపుకుంటాము. భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుంది.భారత తపాళా శాఖ ప్రతి సంవత్సరం ఈ రోజు తపాలా బిళ్ళను విడుదల చేస్తుంది.ఈ బాలల దినోత్సవం నాడు ప్రతి పాఠశాలలోనూ ప్రత్యేకంగా వేడుకలను నిర్వహిస్తారు.అందరూ అనుభవించే బాల్యం.. భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు. అటువంటివారి పేరిట బాలల దినోత్సవం వేడుకను నిర్వహించటం వారిలో నూతనోత్తేజాన్ని...ఈ సందర్భంగా చిన్నారులకు వివిధ రకాల పోటీలు, సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలల్లో ఉండే నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పాఠశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి.
పేద, నిరుపేద కుటుంబాలకు చెందిన కొంతమంది చిన్నారులు అతి చిన్న వయసులోనే పలకా బలపం పట్టాల్సిన చేతులతో తట్ట, పార పట్టి పనులకు వెళ్లడం ప్రతినిత్యం మనం చూస్తునే ఉన్నాం. దీనికి ఆ తల్లి దండ్రుల్లో ఉన్న నిరక్షరాస్యత కొంత కారణమైతే ఆ కుటుంబాలు ఆర్ధిక స్ధితి గతులు మరో కారణంగా చెప్పవచ్చు. మారుమూల గ్రామాల్లో ముఖ్యంగా యాదవ, మత్య్సకార ఇతర కులాలకు చెందిన చిన్నారులను బడికి పంపకుండా పనుల్లో పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతేకాకుండా పిల్లలకు మూడో సంవత్సరం రాగానే బుడి బుడి నడకలతోనే మోయలేని పుస్తకాల మోతతో పట్టణాల్లో, మండల కేంద్రాల్లోను ఆ పిల్లలు బాల్యం మోయలేని భారంగా మారుస్తున్నారు. నేటి బాలలే రేపటి పౌరులని ప్రకటనలు గుప్పిస్తున్న నేతలు, అధికారులు ఇళ్లల్లో ఎక్కువగా పనులలో బాలలే కనిపిస్తున్నా ఏ ఒక్కరికీ అది తప్పుగాను, చట్టవిరుద్దంగాను కనిపించకపోవడం పలువురికి ఆశ్చర్యం కల్గిస్తుంది.
ఒకసారి బాలల దినోత్సవం చరిత్రను మననం చేసుకుందాం. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని నవంబర్ 20న అధికారికంగా జరుపుకుంటుంటారు. అయితే 1959కి ముందు అక్టోబర్ నెలలో బాలల దినోత్సవాన్ని జరుపుకునేవారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన ప్రకారం బాలల దినోత్సవాన్ని మొదటిసారిగా 1954లో ప్రపంచమంతటా నిర్వహించారు.1959 నవంబర్ 20న బాలల హక్కుల ప్రకటనను ఐరాస సర్వసభ్య సభ రూపొందించిన సందర్భంగా బాలల దినోత్సవాన్ని ప్రపంచ మంతటా జరుపుకోవాలని నిర్ణయించారు. 1989లో పిల్లల హక్కులపై నవంబర్ 14న ఓ బిల్లును ఐరాస ఆమోదించింది. ఈ బిల్లును ఆమోదిస్తూ 191 దేశాలు సంతకాలు పెట్టాయి కూడా.పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని పంచుకోవడాన్ని, పరస్పర అవగాహనను పెంచుకోవడాన్ని ప్రోత్సహించేందుకు గాను ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ బాలల దినోత్సవానికి రూపకల్పన చేసింది. ప్రపంచమంతటా పిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకోసం పలు చర్యలు చేపట్టడం ఈ దినోత్సవం లక్ష్యం.
నవంబర్ 14 భారతీయ బాలలకు ఎంతో ఇష్టమైన రోజు. ప్రభుత్వం అధికారికంగా వారికోసం కేటాయించిన ఒక్కగానొక్క రోజది. అయితే బాలల దినోత్సవాన్ని మనలాగా ప్రపంచదేశాలన్నీ అదే రోజున జరుపుకోవు. ఒక్కో దేశం ఒక్కో రోజున జరుపుకుంటుంది. చైనాలో జూన్ 1వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. శుభాకాంక్షలు చెప్పుకుని పాఠశాలల్లో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోజు పాఠశాలలు తెరిచివున్నా తరగతులు జరగవు. మన పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో నవంబర్ 20వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఆరోజున పాఠశాలలు మామూలుగానే నడుస్తాయి. టీవీలు, రేడియోల్లో మాత్రం ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తారు. జపాన్‌లో మే 5న జరుపుకుంటారు. ఆరోజున మగపిల్లలున్న వారు చేప ఆకారంలో వున్న గాలిపటాలను ఎగురవేస్తారు. అంతేకాక యుద్ధవీరుల బొమ్మలతో కొలువు ఏర్పాటుచేస్తారు. ఆరోజు జాతీయ సెలవుదినంగా కూడా ప్రకటిస్తారు. దక్షిణ కొరియాలో మే 5వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఆరోజున ఇక్కడ పిల్లలకోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. వారు ఎప్పుడూ గుర్తుంచుకునేలా పెద్దలు పిల్లలకోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఎక్కడికైనా బయటకు తీసుకెళతారు. పోలాండ్‌లో జూన్ 1న బాలల దినోత్సవం చేసుకుంటారు. ఆరోజున స్కూళ్లల్లోనే రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. పార్కుల్లో, వినోద కేంద్రాలలో పిల్లలకోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. శ్రీలంకలో అక్టోబర్ 1 అంటే పండుగే. పెద్దలు తప్పనిసరిగా వారిని బయటకు తీసుకెళతారు. ఇళ్లల్లో వారికోసం ప్రత్యేకంగా స్వీట్లు చేస్తారు. ఇవేకాక వివిధ దేశాలలో బాలలదినోత్సవాలను ఒక్కోరోజు జరుపుకుంటున్నారు.
Children's Day in India:
మనకు చాలా మంది దేశ నాయకులుండగా జవహర్‌లాల్ నెహ్రూ పుట్టినరోజునే బాలల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటావో తెలుసా... పిల్లలంటే ఆయనకు చాలా చాలా ప్రేమ కాబట్టి! నెహ్రూ మన దేశానికి మొదటి ప్రధానమంత్రి. ఆ పదవిలో ఉండేవారికి ఎన్నో బాధ్యతలుంటాయి. తీరిక అస్సలే ఉండదు. కానీ ఆయన మాత్రం అంత పని వత్తిడిలోనూ ఎలాగోలా వీలు చేసుకొని పిల్లలతో మాట్లాడేవారు. పిల్లలంతా ఆయన్ని ప్రేమగా 'చాచా' అని పిలిచేవారు. నెహ్రూ గురించి ......
నెహ్రూ పూర్వీకులు కాశ్మీర్ నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరపడ్డారు. వారి కుటుంబం ఢిల్లీలో ఒక కాలువ ఒడ్డున ఉండేది. హిందీలో కాలువను 'నెహర్' అంటారు. అలా వారికి నెహ్రూ అనే పేరు ఇంటిపేరుగా మారింది. నిజానికి వారి ఇంటి పేరు 'కౌల్'.
* నెహ్రూ తల్లిదండ్రులు స్వరూపరాణి, వోతీలాల్. అలహాబాద్‌లో పేరు పొందిన న్యాయవాది వోతీలాల్ చాచాకు ఇద్దరు చెల్లెళ్లు... విజయలక్ష్మి, కృష్ణ. నెహ్రూ అలహాబాద్‌లో స్కూల్‌కి వెళ్లి చదివింది తక్కువ. ఇంటి దగ్గరకే మాష్టార్లు వచ్చి కొడుక్కి పాఠాలు చెప్పేలా ఏర్పాటుచేశారు వోతీలాల్. ఒక విదేశీ టీచర్ నెహ్రూకు సైన్సు, ఇంగ్లిష్ పాఠాలు బోధించేవారు. చాచాకు ఇష్టమైన సబ్జెక్టులు కూడా అవే. కొడుకు కోసం వోతీలాల్ ఇంట్లోనే సైన్సు ప్రయోగశాలను ఏర్పాటుచేశారు. 15 ఏళ్లపుడు నెహ్రూ చదువుకోసం ఇంగ్లండ్ వెళ్లారు. అక్కడ ఎనిమిదేళ్లు చదువుకొని న్యాయశాస్త్రంలో పట్టాతో స్వదేశం వచ్చారు. నెహ్రూకు 27వ ఏట కమల కౌల్‌తో వివాహమయింది.
* నెహ్రూకు ఒకే ఒక్క కుమార్తె. ఆమే ఇందిరాగాంధీ. స్వాతంత్య్రం కోసం నెహ్రూ పోరాటం చేసినపుడు ఆంగ్లేయులు ఆయన్ని ఎన్నోసార్లు జైల్లో పెట్టారు. దాంతో తన ముద్దుల కుమార్తె ఇందిరకు ఆయన ఎప్పుడూ దూరంగానే ఉండాల్సివచ్చేది. అందుకు నెహ్రూ ఎంతో బాధపడేవారు. ఇందిర తన దగ్గరే ఉంటే ఏమేం చెప్పాలనుకునేవారో వాటన్నిటినీ ఉత్తరాల్లో రాసేవారు. ఇందిర ఆ ఉత్తరాల్ని చదివి భద్రపరిచి తండ్రి చెప్పినట్టే నడుచుకునేవారు. ఆ ఉత్తరాల్ని 'Letters from a father to his daughter' పేరుతో పుస్తకంగా ముద్రించారు. అంటే మీరూ చదవొచ్చన్నమాట.
* నెహ్రూ కోటుపై ఎర్ర గులాబీ చూశారుగా! అది పెట్టుకోవడం ఆయనకు ఎలా అలవాటైందంటే... ఒకరోజు మీలాంటి ఓ చిన్నారి ఆయనకు గులాబీని బహుమతిగా ఇస్తే కోటుకు పెట్టుకున్నారు. అదిచూసి ఆనందంతో నవ్విన చిన్నారీ అరవిరిసిన గులాబీ ఆయనకు ఒక్కలాగే కన్పించాయట. తనకు అంత ఇష్టమైన పిల్లలగుర్తుగా ఆ తర్వాత నుంచి రోజూ కోటుపై గులాబీ పెట్టుకోవడం ఆయనకు అలవాటైందని చెబుతుంటారు. సెలవు రోజుల్లో నెహ్రూ పిల్లల్ని తన నివాసానికి పిలిచి మిఠాయిలు పంచేవారు. కబుర్లు చెప్పేవారు. పిల్లలు చాచాకు ఇష్టమైన గులాబీలను బహుమతిగా ఇచ్చేవారు.
* ఓసారి జపాన్‌కు చెందిన బాలలు ఏనుగు కావాలని చాచాకు ఉత్తరం రాశారు. వెంటనే ఆయన వారికొక ఏనుగును పంపించి, 'భారతదేశంలోని పిల్లలందరి తరఫునా మీకు ఈ కానుకను పంపిస్తున్నా' అని ఉత్తరం రాస్తే వారెంతో సంతోషించారట. ఆ ఏనుగు రెండు దేశాల మధ్య స్నేహాన్ని పెంచింది.
* పిల్లలంతా బడికి వెళ్లాలనేది చాచా కోరిక. ఓసారి బాలల సినిమా చూసిన చాచా అందులో నటించిన ఏడేళ్ల పాపాయిని మెచ్చుకుంటూ షేక్‌హ్యాండ్ ఇచ్చారు. అయితే ఆ పాపకి తిరిగి 'థ్యాంక్స్' చెప్పడం కూడా రాలేదు. దాంతో చాచాకు సందేహం వచ్చి 'పాపను బడికి పంపడం లేదా' అని వాళ్ల అమ్మను అడిగారు. లేదని చెప్పేసరికి, ఆమెను కోప్పడి, పాపను వెంటనే బడిలో చేర్పించమని చెప్పారు.
* ఓసారి ఢిల్లీలో స్కూల్ పిల్లలు ఎగ్జిబిషన్ ఏర్పాటుచేశారు. ప్రధాని నెహ్రూని కూడా ఆహ్వానించారు. ఆయన అక్కడ ఒక ఆట కూడా ఆడారు. గోడపైన తోకలేని ఏనుగు బొమ్మను అతికించారు పిల్లలు. దాన్ని దూరం నుంచి చూశాక కళ్లు మూసుకొని కాగితపు తోకను ఏనుగు బొమ్మకు అంటించాలి... అదీ గేమ్. నెహ్రూ కూడా గంతలు కట్టుకొని తోక అతికించడానికి ప్రయత్నించారు. కానీ అంగుళం దూరంలో అంటించారు. ఆ గేమ్ ఆడినందుకు అక్కడున్న పిల్లాడు రెండు అణాలు ఫీజు అడిగితే నెహ్రూ ముందు ఆశ్చర్యపోయినా, తరవాత సరదాగా నవ్వేశారట. తన సహాయకులనడిగి డబ్బు ఇప్పించుకొని ఫీజు చెల్లించారట.
ఇలా పిల్లలతో చాచాకు ఉన్న అనుబంధం గురించి ఎన్ని విషయాలైనా చెప్పుకోవచ్చు. పిల్లలకు ఎంతో ఇష్టమైన, పిల్లలంటే ప్రాణమైన నెహ్రూ 1964లో కన్నుమూశారు. చిన్నారులపట్ల ఆయనకున్న ప్రేమానురాగాలను గుర్తుచేసుకోవడానికి ఆ సంవత్సరం నుంచి ఆయన పుట్టినరోజైన నవంబరు 14ను బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
మీకందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు...
Thanks to the author of original Article: http://daycelebrations.blogspot.in/2010/04/childrens-day.html
His Website: Dr.seshagirirao-MBBS
Sunday, November 3, 2013
రాజకీయ దీపావళి!
తపాజువ్వల్లా ఉద్యమిస్తున్న ప్రజలు
ఎటువెళతారో తెలీని సిసింద్రీల్ల గోడమీదపిల్లి నాయకులు
తాటాకు టపాకాయల్లా ఇరుప్రాంతాల కాంగ్రెస్ నాయకులు
అప్పుడప్పుడూ నోరువిప్పే మతాబుల్లంటి తెలంగాణా నాయకులు.
ఎప్పుడు పేలుతుందో తెలీని బాంబుల్లా దిగ్విజయ్ వ్యాఖ్యలు..
తుస్సుమన్న చిచ్చుబుడ్డిలా
అంధ్రలో ఇప్పుడు ఉన్న దీపావళి ఇది...

Saturday, November 2, 2013
చీకటి వెలుగుల రంగేళీ..దీపావళి
'చీకటి వెలుగుల రంగేళీ.. జీవితమే ఒక దీపావళి'...అని
తెలుగు సినిమా కవి రాసింది. ఆనంద ఉత్సహాలతో జాతి, కుల, మత, వర్గ విబేధాలను
విస్మరించి,సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల 'దీపావళి'. చెడుపై
మంచి విజయం సాధించినందుకు గుర్తుగా దీపావళిని జరుపుకుంటారని పురాణాలు
చెబుతుంటాయి.
అశ్వయుజ మాసంలో ఈ పండుగ వస్తుంది. మొదటి రోజు నరకచతుర్దశి, రెండో రోజు
దీపావళి అమవాస్య, మూడోది బలి పౌడ్యమి అని జరుపుకుంటుంటారు. దీపావళి పండుగను
ఎందుకు జరుపుకొంటారు అనడానికి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో
ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలో రావణుడిని
సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు
ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని ప్రచారం ఉంది.
దీపం జ్యోతి పరమ్ బ్రహ్మ
దీపం సర్వతమోపహమ్
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమ్మోస్తుతే
అగ్ని కాంతిని, తేజస్సునీ, రక్షణనీ, ఆరోగ్యాన్నీ, ధైర్యాన్నీ అందిస్తుందని,
దోషాలను తొలగిస్తుందని పండితులు చెబుతుంటారు. దీపావళి పర్వదినంలో దీపం
పెట్టడం, లక్ష్మీదేవిని పూజించడం చేస్తుంటారు.
దీపావళి పండుగను దీపోత్సవం అని కూడా అంటారు. పశ్చిమ బెంగాల్ లో దీపావళి
రోజున శివ సహితముంగా కాళీ పూజలు నిర్వహిస్తుంటారు. ఈ పండుగ నాడు అమావాస్య
చీకట్లు తొలగిపోవుటకు కాకరపువ్వొత్తులు, టపాకాయలు, చిచ్చుబుడ్లు, మతాబులు
కాల్చి పండుగను జరుపుకుంటుంటారు. ఈ దీపావళి పండుగ రోజున ప్రతి ఇంటిని
దీపాలతో అలంకరిస్తుంటారు. కొందరు లక్ష్మీ పూజను చేస్తారు.
Source: Prajasaksti
Thursday, October 3, 2013
రేపట్నుంచి 2జి నెట్ రేట్లను పెంచిన ఎయిర్ టెల్
ఎయిర్ టెల్ 2జి నెలవారీ ప్యాక్ ల ధరలను రేపట్నుంచి భారీగా పెంచనుంది. Rs.125/- గా ఉన్న 1 జిబి ప్యాక్ ధర Rs.155/- గా, Rs.198/- గా ఉన్న అన్ లిమిటెడ్ ప్యాక్ ధర Rs.256/- గా పెంచనుంది. మిగతా రేట్ల వివరాలు :
Rs.16/- ---80MB ( 3Days)
Rs.25/- --- 125MB ( 5 days)
Rs.75/- --- 300MB (15 days)
Rs.198 --- 2GB ( 30 days)
స్మార్ట్ ఫోన్ కష్టమర్లు 3జి ఎక్కువగా ఉపయోగించేలా చేయడానికే ఈ ధర పెంచబోతున్నదని భావించవచ్చు.

Saturday, September 28, 2013
' గాన కోకిల ' @ 85
గానకోకిల లతా మంగేష్కర్ 85వ ఏట ప్రవేశించారు. శనివారం ఆమె జన్మదినం.
బాలీవుడ్ సహా పలు ప్రాంతీయ బాషా చిత్రాల్లో దశాబ్దాల పాటు గానం చేసిన లత
భారత సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. జన్మదినం
సందర్భంగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
దాదాపు ఏడు దశాబ్దాలపాటు హిందీ సినీపరిశ్రమలో గాయనిగా లతామంగేష్కర్ వెలుగొందుతున్నారు. 1929, సెప్టెంబరు 28న జన్మించిన ఈ గానకోకిల.. 1942 నుంచి సినీ కళా ప్రయాణం ఆరంభమైంది. 'మహల్' అనే చిత్రంలో 'ఆయెగా ఆయెగా ఆయెగా ఆనేవాలా' అనే పాటతో తన గానాన్ని వినిపించారు. ఆమెను ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’ పిలిచేవారు. దాదాపు 36 భాషల్లో వెయ్యికు పైగా సినిమాలకు ఆమె ఆలపించారు. క్లాసికల్ నుంచి రొమాంటిక్ వరకు, గజల్స్ నుంచి భజనల వరకు అన్ని రకాల గేయాలు ఆమె ఆలపించి సరికొత్త రికార్డును సృష్టించారు.
ఈమె సోదరి ఆషా భోంస్లే. లతాకు భారత ప్రభుత్వం 'భారతరత్న' పురస్కారం ఇచ్చి సత్కరించింది. హిందీ సినీపాటల గాయని అంటే మొదట లతా పేరే స్ఫురణకొస్తుంది. హిందీపాటలపై, హిందీ సినీ జగత్తుపై ఆమె వేసిన ముద్ర అలాంటిది. 1948 నుంచి 1978 వరకు 30,000 పాటలు పాడిన ఏకైక గాయినిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకుంది. తెలుగులో సంతానం (నిదురపోరా తమ్ముడా, సుసర్ల దక్షిణామూర్తి), ఆఖరి పోరాటం (తెల్లచీరకు, ఇళయ రాజా) మొదలైన సినిమా పాటలు పాడారు.

Sunday, September 22, 2013
100 సంవత్సరాల భారతీయ సినిమా ఉత్సవాలు...
సౌత్ ఇండియా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చేత తలపెట్టిన 100 సంవత్సరాల భారతీయ సినిమా ఉత్సవాలు సెప్టెంబర్ 21 నుండి 24వ తేదీ వరకు చెన్నై లోని నెహ్రు ఇండోర్ స్టేడియం లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవాలను నిన్న జయలలిత ప్రారంభించారు. ఒక్కోరోజు ఒక్కోభాషకు పండుగలా పండుగలా కేటాయించగా మొదటిరోజు తమిళ చలనచిత్ర పండుగ జరిగింది .
అసలు 3.5.2013 నాటికే భారత చలనచిత్రరంగం పుట్టి 100 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. తొలిసినిమా ఇప్పుడే మొగ్గవేసింది. అప్పట్లో ఆ మొగ్గ... పెరిగి ఇంత పెద్ద పుష్పంగా మారి.. తుమ్మెదలను ఆస్వాదించే తీయదనాన్ని ఇస్తుందని ఆనాడు ఎవ్వరూ ఊహించి ఉండరు. అమెరికాలో ఫీచర్ ఫిల్ములు తయారైన 1912లోనే మన దేశంలోనూ తొలి కథాచిత్ర నిర్మాణం ప్రారంభమైంది. ఈ నూరేళ్ళ కాలగతిలో 1,268 మూకీలు, వివిధ భాషల్లో దాదాపు 44 వేల టాకీల అనుభవం భారతీయ సినిమా ఘనచరిత్ర. ఇవాళ అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానం, ఖండాంతరాలు దాటిన అతి పెద్ద ప్రేక్షక వర్గమూ మనదే! హాలీవుడ్ చిత్రాలకు సైతం మనది.
సినిమా పుట్టుపూర్వోత్తరాలను కాసేపు గుర్తుచేసుకుందాం....
లూయీ లూమియర్ సోదరులు : మొట్టమొదటి సినిమా నిర్మాతలు లూయీ లూమియర్, ఆగస్ట్ లూమియర్ సోదరులు. 1895లో పారిస్‌లోని ఒక హోటల్‌లో సినిమాటోగ్రాఫ్ ప్రదర్శన జరిగింది. అంతవరకు నిశ్చలనంగా ఉన్న బొమ్మలు మొట్టమొదటిసారిగా తెరపై కదలనారం భించాయి. 1903లో ప్రపంచంలో తొలి మూకీకథా చిత్రంగా ఎడ్విన్ పోర్టర్ అనే నిర్మాత కదిలే మూకీ బొమ్మలకి ఒక కథ అల్లి.. 'ది గ్రేట్ ట్రయిన్ రోబరి' అనే మూకీ చిత్రాన్ని నిర్మించారు. భారతదేశంలో బొంబాయిలోని వాట్సన్ హోటల్‌లో 1896, జులై 7వ తేదీన లూమియర్ బ్రదర్స్ నిర్మించిన సజీవ సినామాటోగ్రాఫ్ చిత్రాలు 'ఎంట్రీ ఆఫ్ సినిమాటోగ్రాఫ్, అరైవల్ ఆఫ్ ట్రయిన్- చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. బొంబాయితో పాటుగా కలకత్తాలోని స్టార్ థియేటర్‌లో కూడా ఈ ప్రదర్శనలు వేయడంతో భారత చలనచిత్ర చరిత్ర సినీ ప్రస్థానానికి బాటలు వేయడం జరిగింది. అప్పట్లో అరైవల్ ఆఫ్ ట్రయిన్- చిత్రం ప్రదర్శిస్తుంటే.. రైలు మీదుగా వస్తున్నందని జనాలంతా పారిపోయేవారట. వారికి నచ్చజెప్పి మళ్ళీ తీసుకురావడానికి చాలా సమయం పట్టేది.
భారతీయ కథతో భారతీయ సంస్కృతితో నిజమైన తొలి భారతీయ సినిమాగా, ఆయన నిర్మించిన తొలి మూకీ కథా చిత్రం 'రాజా హరిశ్చంద్ర'. 1913 మే 3న బొంబాయిలోని కారొనేషన్ సినిమాటోగ్రాఫ్ థియేటర్‌లో విడుదలైంది. భారతీయ సినిమాకు శాశ్వత చిరునామా యిచ్చి చరిత్రకెక్కిన కళాకోవిదుడు దాదాసాహెబ్ ఫాల్కే. ఆయన తదంతరం సినిమా రంగంలో విశిష్ట సేవలందించిన వారికి ఆయన పేరుమీద అవార్డులు ఇవ్వడం ఆరంభించారు.
1927 అక్టోబర్ 6న 'ది జాబ్ సింగర్' అనే శబ్ద చిత్రం వచ్చింది. వార్నర్ బ్రదర్స్, న్యూయార్క్‌లో ప్రదర్శించబడ్డ ఈ చిత్రంలో తొలిసారిగా తెరమీద నుంచి మాటలు విని నివ్వెరపడి, ఆనందపడి, హర్షధ్వానాలతో సినిమా ప్రకియకు స్వాగతం పలికారు.
ఆ రోజుల్లోనే బొంబాయికి చెందిన అబ్దులలీ యూసఫలీ సినీ ప్రదర్శకుడిగా ముఖ్యపాత్ర పోషించారు. ఓ డేరాలో సంచార సినీ ప్రదర్శనల్ని ప్రారంభించారు. ఎక్కడికిపడితే అక్కడకు మోసుకుపోగల తన బయోస్కోప్ సామగ్రితో ఇతర దేశాలకూ వెళ్ళారు. చివరకు 1908లో భారత్‌కు వచ్చి, ఇక్కడా సంచార సినీ ప్రదర్శనలిచ్చారు. ఆట వస్తువు లాంటి బయోస్కోప్‌ను పరిశ్రమస్థాయికి తెచ్చారు.
దక్షిణ భారతావనికి వస్తే, కోయంబత్తూరుకు చెందిన రైల్వే ఉద్యోగి సామి విన్సెంట్ సినిమా మీద ప్రేమతో ఉద్యోగాన్ని కూడా వదిలేసి, 1905 నుంచి దక్షిణాదిన ఊరూరా తిరుగుతూ చిత్ర ప్రదర్శనలు నిర్వహించారు. అలాగే, మద్రాసు ఫోటోగ్రాఫర్‌గా స్థిరపడ్డ తెలుగుబిడ్డ రఘుపతి వెంకయ్యనాయుడు విదేశాల నుంచి సామగ్రి తెప్పించి, 1909-12 మధ్యలో ప్రముఖ సినీ ప్రదర్శకుడిగా ఎదిగారు. విదేశాలకూ తన ప్రదర్శనలను విస్తరించారు.
కళా రూపంగా సినిమా ఆవిర్భవించిన ఆ ఆరంభ దినాల్లో ఇప్పటిలాగా ప్రదర్శనలకు లైసెన్సు తీసుకోవాల్సిన అవసరమూ లేదు. అలాగే, విద్యుచ్ఛక్తితో కూడా పని లేదు. మెగ్నీషియమ్ దీపాల సాయంతో ఫిల్మును తెరపై చూపేవారు. ఈ సినీ ప్రదర్శనలు, వాటికన్నా ముందే దేశంలోకొచ్చిన గ్రామ్‌ఫోన్, ముద్రణాలయ వసతులు కలసి కొత్త పరిణామానికి దోహదపడ్డాయి. సాంప్రదాయ భారత సమాజంలో మార్పు వచ్చింది. ఈ ప్రదర్శనలకు క్రమంతప్పక వచ్చే ప్రేక్షక వర్గం తయారైంది.
1895లో పారిస్‌లోని ఒక హోటల్‌లో లూమియర్ బ్రదర్స్ ఏర్పాటు చేసిన సినిమా టోగ్రఫీ తొలి ప్రదర్శన అయితే తెలుగులో నాగార్జున నటించిన గ్రీకువీరుడు చిత్రం నేపథ్యం కూడా పారిస్ కావడం విశేషం. అప్పటి తరం మిగలక పోయినా... వారు పండిం చిన పంటను ఆస్వాదించ డానికి మరిన్ని తరాలు ఇటువంటి సినిమా ఉత్సవాలను చేసుకుంటూనే ఉంటాయి.
Saturday, September 21, 2013
విచిత్ర మలుపులు తిరుగుతున్న పార్టీల పొత్తులూ ఎత్తులూ
రాజకీయాల్లో శాశ్వత మిత్రులూ శత్రువులూ ఉండరనేది నిజం! ఇది మరోసారి ఋజువు కాబోతోంది. నిన్న మొన్నటి వరకూ ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకున్న పక్షాలు ఒకటి కాబోతున్నాయి.. ఇది రాష్ట్ర రాజకీయాలను మరో కీలక మలుపు తిప్పడం ఖాయంగా కనిపిస్తోంది.
డిల్లీలో చంద్రబాబు బీజేపీ నేతలను కలవడంవెనక చాలా మంత్రాంగం నడిచిందని చంద్రబాబు భవిష్య రాజకీయ అవసరం దృష్ట్యా బీజేపీతో కలవడం తప్పదని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో మోడీ వ్యాఖ్యలు, మోడీపై తెదేపా అగ్ర నాయకుల ప్రశంసలు భవిష్యత్ లో NDA తో మరలా కలిసినడిచేందుకు ఎప్పటినుంచో బాబు ఆడుతున్న వ్యాహంగా తేలుతుంది. జగన్ ను బయటికి రాకుండా కాంగ్రెస్ తో బాబు చేతులు కలిపిన విషయం కూడా నిజమేనని పరిశీలకులు అంటున్నారు. ఇంతకాలం జగన్ జైలు నుంచి బయటికి రాకపోవడానికి చంద్రబాబు కారణమేనని, బాబు తమతో చేతులు కలుపుతాడని ఆశించి కాంగ్రెస్ ఆయనచెప్పినట్లు నడచుకుందనీ కానీఇప్పుడు కాంగ్రెస్ బాబు రాబోయే ఎన్నికల అనంతరం తమతో చేతులు కలపడని తెలిసి జగన్ ను బయటికి రాకుండా ఆపలేమని బాబుకు చెప్పినట్లు పొగట్టా .. జగన్ ఎలాగో బయటికి వస్తాడుకనుక తను ఇక కాంగ్రెస్ కు మద్దతు పలికే అవసరంలేదని బాబు భావించినట్లు చెపుతున్నారు.
అలాగే తెలంగాణా ఇచ్చిన సందర్భంలోనూ కాంగ్రెస్ బాబునే ఇరకాటంలో పెట్టదలచిందని ఈ విషయాన్ని ఆయన గమనించే రెండు ప్రాంతాల్లో పార్టీ దెబ్బతినకుండా కాపాడుకోగలిగారనీ ఇకపై తెలుగుదేశం మరింత పుంజుకోవడం ఖాయమని తెలుగుదేశంతోపాటూ , కాంగ్రెస్ కూడా భావించిందని తెలుస్తోంది. తెలుగుదేశాన్ని దెబ్బకొట్టలంటే అది జగన్ తోనే సాధ్యమని ,ఎలాగో జగన్ ఎన్నికల తర్వాత తమకే సపోర్ట్ చేస్తాడు కనుక అతన్ని బయటికి తీసుకువచ్చే సమయం ఇదేనని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డి క్రొత్తపార్టీ పెడతారనే ఊహాగానాలు సోనియాను కలవరపెడుతున్నాయని చెపుతున్నారు. అటు తెలంగాణలో కేసీయార్ , ఇటు సీమాంధ్రలో జగన్ తనకు ప్రస్తుతానికి చాలునని ఆదిశగానే అడుగులు వేయాలని సోనియా ఇప్పటికే పార్టీ పరిశీలకులకు స్పష్టంచేసినట్లు ఉహాగానాలు వస్తున్నాయి. తెలంగాణాపై వెనకడుగు వెయ్యకూడదని , అలాచేస్తే తెదేపా కే లాభమని కాంగ్రెస్ భావించినట్లు తెలుస్తోంది
ఇటు YSRCP కూడా చంద్రబాబును బూచిగా చూపి కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు పావులు కదుపుతోందని తెలుస్తోంది. జగన్ బయటికి వస్తున్నారన్న సమాచారం కాంగ్రెస్ నుండి వచ్చిందని కనుక కాంగ్రెస్ పై మెతక వైఖరితో ఉండాలని YSRCP నాయకులకు ఇప్పటికే సందేశాలు వెళ్ళాయని కొందరు భావిస్తున్నారు. మొన్న ఆ పార్టీ సమావేశంలో జగన్ ఓదార్పు యాత్రకు కూడా రోడ్ మ్యాప్ చేసారని, ఇటీవల సాక్షి పత్రిక , చానల్ లో తెదేపా,బీజేపీలనే దుమోత్తిపోస్తున్నారని వారు ఉదాహరణలు చూపుతున్నారు. తెలంగాణ ఏర్పాటుకు YSRCP పచ్చజెండా ఊపినట్లేనని విమర్శకులు చెపుతున్నారు.
మరి ఈ రాజకీయ క్రీడలలో చివరకు ఎవరు విజేతలో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే!

Saturday, September 7, 2013
స్వామీ వివేకానంద
స్వామీ వివేకానంద (జనవరి 12, 1863 - జూలై 4, 1902), (బెంగాలీలో 'షామీ
బిబేకానందో') ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర
నాధుడు. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో
సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ
తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం
వ్యవస్థాపకుడు.
భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండుల లో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి అతనికి కలదు. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్త్వమును షికాగో లో జరిగిన ప్రపంచ మత జాతర (పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్)లో 1893 లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు.
తిరిగి భారత దేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ముప్పై ఏళ్ళ వయసు లోనే మరణించాడు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా ప్రకటించింది.
బాల్యం:-
నరేంద్ర నాధుడు కలకత్తాలో ఒక ఉన్నత కుటుంబానికి చెందిన విశ్వనాధ్ దత్తా మరియు భువనేశ్వరి దేవి దంపతులకు జన్మించాడు. చిన్నప్పటి నుంచే ధ్యానం చేసేవాడు. బాలుడిగా ఉన్నపుడు నరేంద్రుడు చాలా ఉల్లాసంగా, చిలిపిగా ఉండేవాడు. సన్యాసుల పట్ల యోగుల పట్ల అమితమైన ప్రేమను కనబరిచేవాడు. వారు ఏదడిగినా సరే లేదనకుండా ఇచ్చేసేవాడు. పుట్టగానే పువ్వు పరిమళిస్తిందన్నట్లుగా చిన్నప్పటీ నుంచే అతనికి నిస్వార్థ గుణం, మరియు ఔదార్య గుణాలు అలవడ్డాయి.
నరేంద్రుడు ఆటలలోనూ, చదువులో కూడా ముందుండేవాడు. ఏకసంథాగ్రాహి. పాఠాన్ని ఒకసారి చదివితే మొత్తం గుర్తుంచుకునేవాడు. అతని జ్ఞాపకశక్తి అమోఘమైనది. 1880 కల్లా మెట్రిక్యులేషన్ పరీక్ష మరియు ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణుడై కళాశాలలో చేరాడు. రోజు రోజుకూ అతని జ్ఞాన తృష్ణ అధికంకాసాగింది. దైవం గురించి తెలుసుకోవాలని పరమ ఆసక్తితో ఉండేవాడు. చరిత్ర మరియు సైన్సు తోపాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా ఔపోసన పట్టాడు. అలా చదువులో ముందుకెళుతున్న కొద్దీ అతని మదిలో అనుమానాలు, సందేహాలు, అస్పష్టత ఎక్కువ కాసాగినాయి. అలా మూఢ నమ్మకాలన్నింటినీ విడిచిపెట్టినప్పటికీ సత్యాన్ని మాత్రం కనుగొనలేకపోయాడు.
నరేంద్రుడు తనకు వచ్చిన సందేహాలన్నీ అనేక పండితుల ముందు వెలిబుచ్చాడు. వారంతా వాదనలలో ఆరితేరిన వారు. కానీ వారి వాదనలేవీ నరేంద్రుడిని సంతృప్తిపరచలేకపోయాయి. వారు ఆలోచిస్తున్న మార్గం కూడా వివేకానందుడికి నచ్చలేదు. అందునా వారెవరికీ భగవంతునితో ప్రత్యక్ష అనుభవం లేదు.
రామకృష్ణ పరమహంసతో పరిచయం:-
రామకృష్ణ పరమహంస కాళికాదేవి ఆలయంలో పూజారి. ఆయన పండితుడు కాదు కానీ గొప్ప భక్తుడు. అతను భగవంతుని కనుగొనిఉన్నాడని జనాలు చెప్పుకుంటుండగా నరేంద్రుడు విన్నాడు. ఎవరైనా పండితులు ఆయన దగ్గరకు వెళితే వారు ఆయనకు శిష్యులు కావలసిందే. ఒకసారి నరేంద్రుడు తన మిత్రులతో కలిసి ఆయనను కలవడానికి దక్షిణేశ్వర్ వెళ్ళాడు. రామకృష్ణ పరమహంస తన శిష్యులతోపాటు కూర్చుని ఉన్నారు. భగవంతుని గురించిన సంభాషణలో మునిగిపోయి ఉన్నారు. నరేంద్రుడు తన స్నేహితులతోపాటు ఒక మూలన కూర్చుని వారి సంభాషణను ఆలకించసాగాడు. ఒక్కసారిగా రామకృష్ణ పరమహంస దృష్టి నరేంద్రుడి మీదకు మళ్ళింది. ఆయన మనసులో కొద్దిపాటి కల్లోలం మొదలైంది. ఆయన సంభ్రమానికి గురయ్యారు. ఏవేవో ఆలోచనలు ఆయనను చుట్టుముట్టాయి.పాతజ్ఞాపకాలేవో ఆయనను తట్టిలేపుతున్నట్లుగా ఉంది. కొద్ది సేపు అలాగే విశ్చలంగా ఉన్నాడు. నరేంద్రుడు ఆకర్షణీయమైన రూపం, మెరుస్తున్న కళ్ళు ఆయనను ఆశ్చర్యానికి గురి చేశాయి. నువ్వు పాడగలవా? అని నరేంద్రుడిని ప్రశ్నించాడు. అప్పుడు నరేంద్రుడు తమ మృధు మధురమైన కంఠంతో రెండు బెంగాలీ పాటలు గానం చేశాడు. ఆయన ఆ పాటలు వినగానే అదోవిధమైన తాదాత్మ్యత ("ట్రాన్స్") లోకి వెళ్ళిపోయాడు. కొద్ది సేపటి తరువాత నరేంద్రుడిని తన గదికి తీసుకువెళ్ళాడు. చిన్నగా నరేంద్రుడి భుజం మీద తట్టి, ఆయనతో ఇలా అన్నాడు. ఇంత ఆలస్యమైందేమి? ఇన్ని రోజులుగా నీ కోసం చూసి చూసి అలసి పోతున్నాను. నా అనుభావలన్నింటినీ ఒక సరైన వ్యక్తితో పంచుకోవాలనుకున్నాను. నీవు సామాన్యుడవు కావు. సాక్షాత్తు భువికి దిగివచ్చిన దైవ స్వరూపుడవు. నీ గురించి నేనెంతగా తపించానో తెలుసా? అంటూ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు.
ఆయన ప్రవర్తన నరేంద్రుడికి వింతగా తోచింది. ఆయనకు పిచ్చేమే అనుకున్నాడు. నీవు మళ్ళీ తిరిగి వప్పుడు తప్పించుకుందామా అని చూస్తున్న నరేంద్రుడు అందుకు సరే అన్నాడు. ఆయన బోధన పూర్తయ్యాక మీరు భగవంతుని చూశారా? అని ప్రశ్నించాడు. అవును చూశాను నేను నిన్ను చూసిన విధంగానే, ఆయనతో మాట్లాడాను కూడా, అవసరమైతే నీకు కూడా చూపించగలను. కానీ భగవంతుని చూడాలని ఎవరు తపించిపోతున్నారు? అన్నాడాయన. ఇప్పటి దాకా ఎవరూ తాము భగవంతుని చూశామని చెప్పలేదు, కానీ ఈయన మాత్రం నేను భగవంతుని చూశానని చెప్తున్నాడు. ఎలా నమ్మడం?, ఇతను మతి తప్పి మాట్లాడుతుండవచ్చు. కానీ సరైన అవగాహన లేనిదే ఏ అభిప్రాయం ఏర్పరుచుకోకూడదు అని మనసులో అనుకున్నాడు నరేంద్రుడు.
ఒక నెల రోజులు గడిచాయి. నరేంద్రుడు ఒక్కడే దక్షిణేశ్వర్ కు వెళ్ళాడు. రామకృష్ణులవారు మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నారు. నరేంద్రుని చూడగానే ఆయన చాలా సంతోషించారు. మంచం మీద కూర్చోమన్నారు. అలాగే ధ్యానంలోకి వెళ్ళి ఆయన కాలును నరేంద్రుడి ఒడిలో ఉంచారు.మరుక్షణం నరేంద్రుడికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆయనకేదో అయిపోతున్నట్లుగా అనిపించసాగింది. నన్నేమి చేస్తున్నావు? నా తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు. నేను మళ్ళీ వారి దగ్గరకు వెళ్ళాలి. అని అరిచాడు. రామకృష్ణుల వారు చిరునవ్వు నవ్వుతూ ఈరోజుకిది చాలు అని చెప్పి తన కాలును వెనక్కి తీసేసుకున్నారు. నరేంద్రుడు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. రోజులు గడిచేకొద్దీ ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులయ్యారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు.
నరేంద్రుడి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి రామకృష్ణులవారికి ఎంతో సమయం పట్టలేదు. కాళికా దేవి ఆయనకు మార్గనిర్దేశం కూడా చేస్తుంది. కానీ నరేంద్రుడు మాత్రం ఆయనను పరీక్షించేవరకూ గురువుగా నిర్ణయించుకోకూడదనుకున్నాడు. భగవంతుని గురించి తెలుసుకోవాలంటే స్త్రీల గురించి ధనం గురించి వ్యామోహాన్ని విడనాడాలని చెప్పేవాడు. నరేంద్రుడు ఆయనకు ప్రియతమ శిష్యుడు. అలాగని నరేంద్రుడు చెప్పిన అన్ని విషయాలతో ఆయన ఏకీభవించేవాడు కాదు. విగ్రహారాధన చేసేవారిని నరేంద్రుడు బాగా విమర్శించేవాడు. అద్వైతాన్ని కూడా వ్యతిరేఖించాడు. అలౌకిక అనుభవాల మీద అంతగా నమ్మకం లేదు. నేనే బ్రహ్మను నేనే శివుణ్ణి అనేలాంటి వాక్యాలేవీ అతనిని అంతగా ప్రభావితం చేసేవి కావు. కానీ ఎప్పటికప్పుడు రామకృష్ణులవారు నరేంద్రుని సరైన మార్గంలోకి తీసుకువచ్చేవాడు.
తండ్రి మరణం:-
నరేంద్రుడు నెమ్మదిగా ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం తగ్గి సన్యాసం వైపు మొగ్గు చూపడం ప్రారంభించాడు. అది అతని తల్లిదండ్రులకు తెలియవచ్చింది. అప్పుడు అతను బియ్యే పరీక్షకు తయారవుతున్నాడు. 1884లో బియ్యే పాసయ్యాడు. అతని స్నేహితుడొకడు పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీలో నరేంద్రుడు పాట పాడుతుండగా తెలిసింది పిడుగు లాంటి వార్త. తండ్రి మరణించాడని. వెనువెంటనే ఆకుటుంబాన్ని పేదరికం ఆవరించింది. అప్పులిచ్చిన వాళ్ళు వేధించడం మొదలుపెట్టారు. కొద్దిమంది న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. నరేంద్రుడు ఉద్యోగం కోసం కాళ్ళరిగేలా తిరిగాడు. బట్టలు మాసిపోయి చిరిగిపోయాయి. రోజుకొకపూట భోజనం దొరకడం కూడా గగనమైపోతుంది. చాలారోజులు ఆయన పస్తులుండి తల్లికి, చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు తిండి పెట్టేవాడు. వారితో తను స్నేహితులతో కలిసి తిన్నట్లు అబద్దం చెప్పేవాడు. కొన్నిసార్లు ఆకలితో కళ్ళు తిరిగి వీధిలో పడిపోయేవాడు. ఇంత దురదృష్టం తనను వెన్నాడుతున్నా ఎన్నడూ భగవంతుని మీద విశ్వాసం కోల్పోలేదు. నీవు కాళికా దేవికి మరియు సాటి ప్రజలకు సేవ చేయాల్సిన వాడివ, నీవు ధైర్యంగా ఉండాలి అంటూ రామకృష్ణుల వారు ఓదార్చేవారు.
తరువాత నరేంద్రుడు కొద్దిరోజులపాటు విద్యాసాగర్ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు. ఇప్పుడు కుటుంబానికి కనీసం తినడానికి తిండైనా దొరుకుతున్నది. బోధకుడిగా పనిచేస్తూనే తన న్యాయ విద్యను కొనసాగించాడు. గురువుగారి ఆరోగ్యం క్షీణించింది. ఆయనకు గొంతు క్యాన్సర్ సోకింది. నరేంద్రుడు తన ఉద్యోగం, చదువు రెండు మానేసి గురు శుశ్రూషలో మునిగిపోయాడు. రామకృష్ణులవారికి మరణం సమీపిస్తోంది. చివరి రోజున ఆయన నరేంద్రుడిని పిలిచి అలా మృదువుగా తాకాడు. ఆయన ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ నరేంద్రుడికి ధారపోసి ఇలా అన్నాడు. నరేన్! నీవు ఇప్పుడు సర్వశక్తిమంతుడవు. వీళ్ళంతా నా బిడ్డలవంటి వారు. వీరిని చూసుకోవాల్సిన భాద్యత నీదే అన్నాడు. నరేంద్రుడి హృదయం బాధతో నిండిపోయింది. గదిలోకి బయటకు వెళ్ళిపోయి చిన్నపిల్లవాడిలా దుఖించడం మొదలుపెట్టాడు. రామకృష్ణులవారు చనిపోయిన తరువాత ఆయన శిష్యులందరూ కలిసి బరనగూర్‌లోమి ఒక అద్దె ఇంట్లో నివాసం ప్రారంభించారు. ఆ ఇల్లు చాలా పాతది అయినప్పటికీ నగరం యొక్క రణగొణ ధ్వనులకు చాలా దూరంగా గంగానది ఒడ్డున ఉండేది. అక్కడినుండి రామకృష్ణుల వారి సమాధి చాలా దగ్గరగా ఉండేది. అక్కడే రామకృష్ణ మఠం స్థాపించడం జరిగింది. అక్కడున్న యువసన్యాసులకు రెండే లక్ష్యాలు ఉండేవి. ప్రజలకు సేవ చేయడం , ముక్తిని సాధించడం. కొద్ది మంది యువకులు తమ కుటుంబాల్ని వదిలిపెట్టి సన్యాసులు గా మారారు. నరేంద్రుడు కూడా సన్యాసిగా మారి ఆ మఠానికి నాయకుడయ్యాడు. ఆ యువ సన్యాసులు తిండి, బట్ట గురించి పెద్దగా ఆలోచించేవారు కాదు. ఉపవాసం ఉన్నపుడు కూడా తమ చదువును ధ్యానాన్ని నిర్లక్ష్యం చేసేవారు కాదు. నరేంద్రుడు వారికి సంస్కృతాన్ని బోధించేవాడు. అక్కడికి విచ్చేసే సందర్శకులకి గురువుగారి బోధనలను విడమరిచి చెప్పేవాడు.
వివేకానందుడిగా మార్పు:-
నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందుడిగా మారాడు. భారతదేశం అతని గృహమైంది. ఇక్కడి ప్రజలు అతని సోదర, సోదరీమణులయ్యారు. దురదృష్టవంతులైన తన సోదరుల కన్నీళ్ళు తుడవడం అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించే పని. దేశమంతా పర్యటించాడు. తనకున్న ఆస్తి అంతా ఒక కాషాయ వస్త్రము, ఒక కమండలము, శిష్యగణం మాత్రమే. ఈ పర్యటనలో అతను ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. దారి మద్యలో గుడిసెల్లోనూ, సత్రాలలోనూ నివసించేవాడు, కటిక నేలమీదనే నిద్రించేవాడు. అనేక మంది సాధువుల సాంగత్యంలో గడిపాడు. ఆధ్యాత్మిక చర్చలతో, పవిత్ర కార్యాల గురించిన చర్చలతో సమయం గడిపేవాడు. చాలా దూరం కాలినడకనే నడిచేవాడు. ఎవరైనా దయ తలిస్తే ఏదైనా వాహనంలో ఎక్కేవాడు. ఆళ్వార్ దగ్గర కొద్ది మంది ముస్లింలు కూడా ఆయనకు శిష్యులయారు. ఎవరైనా రైలు ప్రయాణానికి టిక్కెట్టు కొనిస్తేనే రైలులో ప్రయాణం చేసేవాడు. చాలాసార్లు తన దగ్గర డబ్బులేక పస్తుండాల్సి వచ్చేది.
మైసూరులో స్వామికి దివాను శేషాద్రి అయ్యర్ మరియు మైసూరు మహారాజా వారితో పరిచయం ఏర్పడింది. పండితుల సభలో స్వామీజీ సంస్కృతం లో చేసిన ప్రసంగం మహారాజా వారిని ముగ్ధుల్ని చేసింది. భారతదేశం వివిధ మతాల మరియు వివిధ తత్వాల సమ్మేళనం. పాశ్చాత్యులు సైన్సులో మంచి పురోగతి సాధించారు. ఈ రెండు కలిస్తే మానవజాతి మంచి పురోగతిని సాధించగలదు. కాబట్టి నేను అమెరికా వెళ్ళి అక్కడ వేదాంతాన్ని వ్యాప్తి చెయ్యాలనుకుంటున్నాను అని స్వామీజీ మైసూరు మహారాజాతో అన్నాడు. అయితే ఆ ఖర్చులన్నీ నేనే భరిస్తానన్నాడు. మాహారాజా. స్వామీజీ ఆయనకు కృతజ్ఞతలు తెలిపి సమయం వచ్చినపుడు తప్పకుండా ఆయన సహాయం తీసుకుంటానని చెప్పి సెలవు తీసుకున్నాడు.
తరువాత స్వామీజీ భాస్కర సేతుపతి పరిపాలిస్తున్న రామనాడును సందర్శించాడు. అక్కడి రాజు స్వామీజీని మిక్కిలి గౌరవించాడు. మీరు అమెరికాలో జరగబోవు సర్వ మత సమ్మేళనానికి తప్పకుండా హాజరవాలి. అందుకయ్యే ఖర్చంతా నేను భరిస్తాను అన్నాడు. దానిని గురించి తప్పకుండా ఆలోచిస్తానని ఆయనకు మాట ఇచ్చి అక్కడి నుంచి రామేశ్వరానికి వెళ్ళి చివరకు కన్యాకుమారి చేరుకున్నాడు. కొద్ది దూరం ఈదుకుంటూ వెళ్ళి ఒక రాయి మీద కూర్చున్నాడు. పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ భారతదేశపు ఆధ్యాత్మిక విలువల్ని వారికి వివరించడం తన ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నాడు. తరువాత స్వదేశానికి తిరిగి వచ్చి నిదురపోతున్న భారతజాతిని మేల్కొలపాలనుకున్నాడు. అతని ప్రయాణానికి ఖర్చుల నిమిత్తం దేశం నలుమూలల నుంచీ విరాళాలు వచ్చి పడ్డాయి. కానీ అతడు మాత్రం తన ప్రయాణానికి ఎంత కావాలో అంతే స్వీకరించాడు. మిగిలిన ధనాన్ని దాతలకు తిరిగి ఇచ్చివేశాడు. అతను ఎక్కిన నౌక బొంబాయి తీరం నుంచి 1893, మే 31వ తేదీన బయలు దేరింది.
విదేశాలలో:-
జులై నెలలో స్వామీజీ చికాగో నగరానికి చేరుకున్నాడు. దారిలో ఆయన కొలంబో, సింగపూర్, హాంకాంగ్, టోక్యో వంటి ఓడరేవు లను కూడా సందర్శించాడు. అక్కడ తాను వెళుతున్న ప్రపంచ సర్వమత సమ్మేళనాన్ని గురించి వాకబు చేశాడు. అప్పటికి ఆ సదస్సుకు మూడు నెలల వ్యవధి ఉంది. చికాగో నగరం చాలా ఖరీదయిన నగరం కావడంతో స్వామీజీ బోస్టన్ నగరానికి వెళ్ళాడు. దారి మద్యలో ఒక మహిళ స్వామికి పరిచయం అయింది. ఆయనతో కొద్ది సేపు మాట్లాడగానే ఆమెకు ఆయన గొప్పతనమేమిటో అర్థం అయింది. ఆయన సామాన్యుడు కాదని తెలిసి కొద్ది రోజులు ఆమె ఇంటిలో బస చేయమని కోరింది. స్వామీజీ అందుకు అంగీకరించాడు. అప్పుడప్పుడు చుట్టుపక్కల జరిగే చిన్న సభలలో ఉపన్యసించేవాడు. వీటిలో ప్రధానంగా భారతీయ సంస్కృతి మరియు హిందూ ధర్మం ప్రధాన అంశాలుగా ఉండేవి. నెమ్మదిగా చాలామంది పండితులు ఆయనకు మిత్రులయ్యారు. వారిలో ఒకరు జాన్ హెన్రీ రైట్. అతడు హార్వర్డ్ విశ్వవిద్యాలయం లో గ్రీకు విభాగంలో ఆచార్యుడు. సమ్మేళనానికి హాజరయ్యే సభ్యులంతా నిర్వాహకులకు పరిచయపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కానీ స్వామీజీ తన పరిచయ పత్రాన్ని ఎక్కడో పోగొట్టుకున్నాడు. అప్పుడు రైట్ పరిచయ పత్రాన్ని రాశాడు. ఆ పత్రంలో స్వామీజీ చాలా మంది ప్రొఫెసర్ల కన్నా మంచి పరిజ్ఞానం కలవాడని రాసి పంపించాడు.[1] స్వామీజీ చికాగోకు తిరిగి వచ్చాడు. సదస్సు 1893, సెప్టెంబర్ 11న ప్రారంభమైంది. దేశవిదేశాల నుంచి వచ్చిన వేలాది మంది ప్రతినిధులు అక్కడ చేరారు. వివేకానంద వారందరిలోకెల్లా చిన్నవాడు. అతను మాట్లాడే వంతు వచ్చేసరికి గుండె వేగం హెచ్చింది. అందరు సభ్యుల దగ్గరా ఉన్నట్లు ఆయన దగ్గర ముందుగా తయారు చేసిన ఉపన్యాసం లేదు. అతని ప్రసంగాన్ని చివరలో ఉంచమని అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశాడు. ఉపన్యసించడానికి ముందు గురువైన రామకృష్ణులవారినీ, సరస్వతీ దేవిని మనస్పూర్తిగా ప్రార్థించాడు.
అమెరికా దేశపు ప్రియ సహోదరులారా! అని స్వామీజీ తన మృధు మధుర కంఠస్వరంతో అనగానే సభ మూడు నిమిషాలపాటు చప్పట్లతో దద్దరిల్లింది.శబ్దం ఆగిన తరువాత తన ప్రసంగాన్ని ఆరంభించాడు. [2] అక్కడున్న ప్రతీ ప్రతినిధి స్వామీజీ ప్రసంగాన్ని ప్రశంసించారు. వార్తాపత్రికలు ఆయన వ్యాసాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. అక్కడి ప్రజలకు ఆయన ఆరాధ్యుడయ్యాడు. ఆయన మాట్లాడడానికి లేచాడంటే చాలు, చెవులు చిల్లులుపడే శబ్దంతో చప్పట్లు దద్దరిల్లేవి. కొన్ని సంస్థలు సభ జరుగుతున్నపుడు మద్యలోనే తమ సంస్థకు ఆహ్వానించేవి.అనతి కాలంలోనే స్వామీజీకి ప్రపంచ ప్రఖ్యాతి లభించింది. ఎక్కడికి వెళ్ళినా స్వామీజీ తన ప్రసంగంలో భారతదేశపు విలువల్ని చాలా సేపు వివరించేవాడు. చరిత్ర అయినా, సామాజిక శాస్త్రం అయినా, తత్వశాస్త్రం అయినా, సాహిత్యమైనా ఎటువంటి తడబాటు లేకుండా ఉపన్యసించేవాడు.కొత్త అవతారం,హిందూ మతాన్ని చక్కగా తెలుపగల నైపుణ్యం, వికాసవంతమైన వ్యక్తిత్వం,ఈ మూడు గుణాలతో ఆయన అందరి హృదయాలను గెలవగలిగాడు.వాదనలలో ఆయనను గెలవగలిగిన వారు లేరు.ఆయన ఆంగ్ల నైపుణ్యం అపారం. అటువంటి మనీషి యుగానికి ఒకరే పుడతారు.ఆయనను సజీవంగా చూస్తూ ఆయన బోధనలను వినడం నిజంగా మనం చేసుకున్న పుణ్యం అని ఒక పత్రిక వ్యాఖ్యానించింది.
స్వామీజీ కృషి వల్ల ఒక్క అమెరికాలోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ భారతదేశం పట్ల గౌరవం ఏర్పడింది. ఆయన ఎక్కడ ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళినా జనం గుమికూడి ఎంతో ఓపికగా ఎదురుచూసేవారు. ఉపన్యాసం అయిపోయిన తరువాత ఆయన్ని తమ ఇళ్ళకు ఆహ్వానించి ఆదరించేవారు. ఇంగ్లాండు నుంచి కూడా ఆయనకు ఆహ్వానం లభించింది. ఆయనకు అక్కడ ఘనస్వాగతం లభించింది. వార్తాపత్రికలు ఆయనను ఘనతను, వాగ్ధాటిని శ్లాఘించాయి. ఎంతోమంది ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యులు సిస్టర్ నివేదిత గా మార్పు చెందిన మార్గరెట్ నోబుల్. తరువాత ఆమె భారతదేశానికి వచ్చి ఇక్కడే ఉండిపోవడం జరిగింది.
నాలుగు సంవత్సరాల పాటు విదేశీ పర్యటన తరువాత స్వామీజీ తిరిగి భారతదేశానికి విచ్చేశాడు. ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన కీర్తి దశదిశలా వ్యాపించిపోయింది. జనవరి 15, 1897 ఆయన కొలంబోలో దిగగానే ఆయనకు చక్రవర్తికి లభించినంత స్వాగతం లభించింది. మద్రాసుకు చేరుకొనేటప్పటికి ఆయన అభిమానులు రథం మీద లాగుతూ ఊరేగించారు.లెక్కలేనన్ని పూలమాలలు, సందేశాలు లభించాయి. ఎక్కడికి వెళ్ళినా తమ గురువు చెప్పిన సందేశాన్ని వ్యాప్తి చేశాడు.ఆయన దగ్గరకు మార్గదర్శకత్వం కోసం వచ్చేవారికి ఆధ్యాత్మిక విలువల యొక్క ప్రాధాన్యాన్ని బోధించేవాడు. అదే స్పూర్తితో, లక్ష్యంతో1897 లో రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు. తరువాత రెండు సంవత్సరాలలో గంగానది ఒడ్డున గల బేలూర్ వద్ద స్థలాన్ని కొని మఠం కోసం భవనాల్ని నిర్మించాడు.
ముఖ్య సూత్రములు తత్త్వములు:-
వివేకానందుడు గొప్ప తాత్వికుడు. అతని ముఖ్య బోధనల ప్రకారం అద్వైత వేదంతము తత్త్వ శాస్త్రములో నే కాకుండా , సామాజికంగా రాజకీయంగా కూడా ఉపయోగ పడుతుంది. రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో 'జీవుడే దేవుడు' అనేది అతని మంత్రముగా మారింది. 'దరిద్ర నారాయణ సేవ' (పేదవారి సేవ తో భగవంతుని సేవ) అనే పదాన్ని ప్రతిపాదించాడు. "విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనము మనని గొప్ప వారని తక్కువ వారని ఎలా అనుకుంటాము?" అనే ప్రశ్న తనకు తాను వేసుకుని ఈ తేడాలన్నీ మోక్షము సమయములో కలిగే దివ్యజ్యోతి లో కలిసి పోతాయని తెలుసుకున్నాడు. అప్పుడు పుట్టే ప్రేమ నుండి, తమలోని బ్రహ్మాన్ని తెలుసుకోలేని మనుష్యులను ఆదుకునే సత్ప్రవర్తన పుడుతుంది.అందరు తనవార నుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వానికి చెందిన వ్యక్తి వివేకానందుడు. వ్యక్తిగత మోక్షము పై వ్యామోహము ను కూడా వదిలివేసి, ఇతరులను బంధవిముక్తులను చెయ్యడమే మనిషికి జ్ఞానోదయము అని నమ్మిన మనిషి. రామకృష్ణా మిషన్ (రామకృష్ణా మఠము)ను "వ్యక్తి మోక్షమునకు, ప్రపంచ హితమునకు"(आत्मनॊ मोक्षार्थम् जगद्धिताय च) అనే నినాదము మీద స్థాపించాడు.
సిద్ధాంతాలు, పిడివాదాలు, సంప్రదాయాలు, దేవాలయాలు మున్నగువాటిని గురించి ఆలోచించకు. మనిషి హృదయంలో దీపిస్తూన్న ఆత్మ వస్తువుతో సరిపోల్చితే అవి ఎందుకూ కొరగావు. ఆ వస్తువే ఆధ్యాత్మిక శక్తి. మొదట ఈ శక్తిని సముపార్జించండి. ఇతర ధర్మాలను నిందించవద్దు. ప్రతి మతంలోను, ప్రతి సిద్ధాంతంలోను, ఎంతోకొంత మంచి వుంటుంది.సోదర ప్రేమ గురించి ప్రసంగాలుమాని, ఆ ప్రేమను కార్యరూపంలో ప్రదర్శించండి.త్యాగ, సాక్షాత్కారాలను పొందినవాడే ప్రపంచంలోని సర్వమతాలలోని ఏకత్వాన్ని దర్శించగలడు. వ్యర్థ వాదాలకు ఆస్కారం లేదని గ్రహింపగలడు. అపుడే మానవాళికి సహాయం చేయగలడు. వాస్తవానికి అన్ని మతాలు ఒకే సనాతన ధర్మంయొక్క అంశాలు.
మరణం:-
అవిశ్రాంతంగా పని చేయడం వలన స్వామి ఆరోగ్యం దెబ్బతిన్నది. అమెరికాలోని ఆయన శిష్యుల అభ్యర్థన మేరకు మరల అక్కడికి వెళ్ళాడు. ప్యారిస్ లోని సర్వమత సమావేశాలలో పాల్గొని తిరిగి స్వదేశానికి వచ్చాడు. రాన రానూ అంతర్ముఖుడయ్యాడు. శరీరమైతే బలహీనంగా తయారయ్యింది కానీ ఆయన ఆత్మ,మనసు మాత్రం చాలా చురుగ్గా వ్యవహరించేవి. జులై 4, 1902న యధావిధిగా ఆయన రోజూవారీ కార్యక్రమాలు నిర్వర్తించుకున్నాడు. శిష్యులకు బోధనలు చేశాడు. భోంచేసిన తరువాత కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాడు. కొద్ది సేపటి తరువాత ఆయనకు చిన్న వణుకు లాంటిదేదో కలిగింది. తనను చూడడానికి వచ్చిన వారితోనూ, శిష్యులతోనూ చాలా ఉల్లసంగా నవ్విస్తూ గడిపాడు. రాత్రి 9 గంటల సమయంలో ఆయనఅలసిపోయినట్లుగా కనిపించాడు. చేతులలో సన్నగా వణుకు ప్రారంభమైంది.చిన్నగా అరిచి లేచి కూర్చున్నాడు. దీర్ఘంగా శ్వాస పీల్చి నెమ్మదిగా శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. ఆయన శిష్యులు తల్లితండ్రులను కోల్పోయిన అనాథలవలే దుఖించారు.

Saturday, August 31, 2013
హైదరాబాద్ ఉద్యోగుల్లో విభజన విద్వేషాలు
తెలంగాణ ప్రకటన తర్వాత హైదరాబాద్ లో పనిచేస్తున్న ఉద్యోగులు సీమాంధ్ర, తెలంగాణా సంఘాలుగా విడిపోయి ఒకరినొకరు దూషించుకుంటూ విధ్వేషాలు పెంచుకుంటున్నారు. ఇంతకాలం సోదరులుగా కలిసి పనిచేస్తూ ఒకరి కష్టాలను మరొకరు పంచుకుంటూ మెలిగిన వీరిమధ్య విద్వేషాలు మొదలయ్యాయి. వీటికి కారణం ఖచ్చితంగా రాష్ట్రాన్ని వేరుచేయడం మాత్రం కాదు. ఎందుకంటే ఆనాడు సకలజనులసమ్మె, ఇతర తెలణ్గాణా ఉధ్యమాలలో తెలంగాణా ఉద్యోగులకు జరిగినప్పుడూ సీమాంధ్ర ఉద్యోగులు ఏమాత్రం చలించలేదు. తెలంగాణా ప్రకటనలో అస్పష్టత,వివిధ రాజకీయ నాయకుల అసంబద్ద వ్యాఖ్యలూ ఇరుపక్షాలవారినీ రెచ్చగొడుతున్నాయి. చివరికి ప్రభుత్వం కూడా ఏ చర్యలూ తీసుకోకపోవడం ,సీయం కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకూ సమంజసమో తెలీడంలేదు.
తెలణ్గాణా, సీమాంధ్ర ఉద్యోగుల్లో పూర్తి విభేదాలు స్రుష్టించి వారిని కలిసి పనిచేయకుండా చేస్తే తెలంగాణా ఏర్పాటు మరింత సులభమౌతుందని ఇలా కొందరు ప్రవర్తిస్తున్నారని ఓ భావన కూడా ఉంది. ఏది ఏమైనా కేంద్రప్రభుత్వం ఆలశ్యం చేయకుండా తగు చర్యలు తీసుకోకుంటే ఇంకొన్ని కీలక విభాగాల్లోనూ విభజన సెగలు రగిలి రాష్ట్రం రావణకాష్టంగా మారబోతుందనడంలో సందేహం లేదు.

Friday, August 30, 2013
తెలంగాణాపై త్వరలో మరో అఖిలపక్షం?
రాస్ట్రంలో పరిస్థితులు నానాటికీ దిగజారుతుండడం, సీయం కూడా తరచూ ప్రతిఘటించడం, జగన్ దీక్ష నేపధ్యంలో కాంగ్రెస్ ఒక మెట్టు దిగివచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీమాంధ్ర కేంద్రమంత్రులూ రాజీనామాలకు సిద్దమవడంతో అటు బీజేపీ వైఖరిలోనూ మార్పు వస్తే తాము అవమాన పడడం ఖాయం అని కాంగ్రెస్ గ్రహించింది. కనుక తెలంగాణా విభజన ఖాయమన్న తమ అభిప్రాయం ఎలాగూ స్పష్టం చేసాము కనుక ప్రస్తుతం వివిధ పార్టీలు తమ తమ ఎజెండాలౌ, క్రొత్త రాష్ట్రానికి ఇవ్వవలసిన ప్యాకేజిలు, జలాల పంపిణీ వంటి సమస్యలపై తమ అభిప్రాయాలు,సూచనలతో ముందుకు రావాలని, దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయబోతున్నామన్న ప్రకటనను కాంగ్రెస్ సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకటన ద్వారా అటు తెలంగాణా వాదులనూ నొప్పించకుండా, సీమాంధ్ర పార్టీలను డిఫెన్స్ లో పడేయవచ్చన్న ఆలోచనతో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది.
అటు సీయం క్రొత్తపార్టీ పెట్టబోతున్నారన్న పుకార్లూ ఊపందుకోవడం కాంగ్రెస్ ను కలవర పెడుతున్నాయి. సీయంకు లొంగకుండా కనీసం జగన్ కు పేరురావాలని కాంగ్రెస్ ఆశిస్తుందని కొన్ని వర్గాలు అంటున్నాయి. కేంద్ర స్థాయిలో జగన్ దీక్ష విరమించాలని , అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేస్తామని ప్రకటించబోతున్నారని అనుకుంటున్నారు.
మరి ఈ ప్రకటన ఎలా చేస్తారో, దీని పర్యవసానాలు ఏమిటో వేచిచూడాలి!

Wednesday, August 28, 2013
ఇది కేవలం రూపాయి పతనమేనా?
నిజానికి ఇది రూపాయి విలువ తగ్గడం ఒక్కటే కాదు. మనం కొనే, దిగుమతి చేసుకొనే వస్తువుల ధరలపెరుగుదల! మా చిన్నప్పుడు అర్ధణాకే అవి వచ్చేవి , ఇవి వచ్చేవి అంటూ మన తాతలు చెబుతుంటారు... ఈ రూపాయి విలువవల్లనే అది సాధ్యం. ప్రస్తుతం సామాన్య మానవుడు మరింత బక్కచిక్కే రోజులు ముందున్నాయి.. దిగువ పట్టీలో స్వాతంత్యం నాటినుంచీ నేటివరకూ డాలర్ తో రూపాయి విలువను చూడండి..
నేదు రూపాయి మరింత దిగజారి 68.75 ప్రాంతంలో ఉంది.. రూపాయికి పట్టిన ఈ గతి చూసి ఆర్ధికవేత్తలు బుర్రలు పట్టుకుంటున్నారు.. మరి ఆర్ధిక రంగంలో అనుభవజ్ఞులైన ప్రధాని, ఆర్ధికమంత్రి ఏమి చేస్తున్నారో తెలీడంలేదు...

Tuesday, August 27, 2013
టిడిపీ ఎంపీలూ! చంద్రబాబుపై తిరుగుబాటు చేయండి లేదా మూసుకు కుర్చోండి!
ఒకవైపు చంద్రబాబు తెలంగాణాకు అనుకూలమేనని స్పష్టంగా చెపుతుంటే, తెలుగుదేశం లు మాత్రం డిల్లీ పార్లమెంటులో ఆందోళనల పేరుతో విలువైన సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మీరు ఆందోళన చేయదలిస్తే ముందు ఎందుకో చెప్పండి..సమక్యం కోసం అయితే ముందు మీ నాయకుడు చంద్రబాబు ఇంటిముందో, టిడిపి ఆఫీసు ముందో చేసుకోండి కానీ ఇలా దేశప్రజల సం అస్యలతో ఆడుకోవద్దు. ఇదే సామాన్య ప్రజలు ప్రస్తుతం అనుకుంటున్న మాటలు.
‘సభ’లో టీడీపీ వ్యూహం ఏంటీ?
ఓ వైపు రాష్ట్ర విభజన ప్రకటన.. మరోవైపు రగులుతున్న సీమాంధ్ర.. ఈ సిచ్యుయేషన్లో ఎలా ముందుకు వెళ్లాలో తేల్చని టిడిపి అధిష్టానానికి ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల రూపంలో మరో చిక్కు వచ్చి పడింది.. తెలంగాణా బిల్ వస్తే..అ నుసరించాల్సిన వైఖరి ఏంటనే ప్రశ్న తలెత్తడంతో.. పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయ్.
రాష్ట్ర విభజన ప్రకటనతో మూడురోజులు మౌనాన్ని ఆశ్రయించినా..సీమాంధ్రలో ప్రత్యర్ధి పార్టీనేతల రాజీనామాలతో టిడిపివారూ అదే బాట పట్టాల్సి వచ్చింది. సీమాంధ్ర హక్కులు, అవసరాలు గమనించకుండా ఏక పక్ష విభజన చేశారంటూ ఆందోళన బాట పట్టారు సీమాంధ్ర టిడిపి నేతలు. సమైక్య ఉద్యమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఐతే ఇదే సమయంలో తెలంగాణా టిడిపి నేతలు కూడా కేంద్రం ప్రత్యేకరాష్ట్రం ప్రకటించడంపై స్పందించారు. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటవడంతో.. తెలంగాణా బిల్ ఈ సెషన్స్ లోనే ప్రవేశపెట్టాలంటూ టిడిపి పార్లమెంటరీ బోర్డ్ నేత నామా నాగేశ్వర్రావ్ డిమాండ్ చేస్తున్నారు.
ఈ వైఖరే టిడిపికి కాస్త ఇబ్బందిగా మారిందని చెప్పాలి. ఇప్పటికే సీమాంధ్ర టిడిపి ఎంపీలు రాజీనామాలు చేయడంతో.. సభలో అనుసరించే వ్యూహంపై ఆందోళన, ఆసక్తి నెలకొన్నాయి. సభలో ఫ్లోర్ లీడర్ తెలంగాణా కోసం డిమాండ్ చేయడం.. సహచర ఎంపీలు సమైక్యనాదం అందుకోవడం పార్టీని చిక్కుల్లోకి నెడుతోంది.. ఓవైపు కేంద్ర హోంమంత్రి షిండే ఈ సమావేశాల్లో తెలంగాణా బిల్ ఉండదని చెప్తున్నా.. ఒకవేళ వస్తే ఎలా వ్యవహరించాలనేది పార్టీ అధిష్టానానికి ఇబ్బందికర పరిస్థితిని కలిగిస్తోంది. తెలంగాణా బిల్ కోసం డిమాండ్ చేసినా.. సీమాంధ్ర హక్కులు.. రాజధానికి భారీ నిధులు కేటాయించాలని కోరవచ్చనేది మధ్యేమార్గంగా టిడిపి ఎంచుకోవచ్చని తెలుస్తోంది
అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీ తన పొలిటికల్ మైలేజీ కోసమే రాష్ట్ర విభజన ప్రకటన చేసిందని టిడిపి సభలో ప్రస్తావించవచ్చని తెలుస్తోంది.. ఇరు ప్రాంతాల్లో లాభపడేందుకు కాంగ్రెస్ ఉద్యమాలను రెచ్చగొడుతుందని జాతీయస్థాయిలో ప్రచారం చేయాలని టిడిపి నిర్ణయించినట్లు తెలుస్తోంది

Tuesday, August 6, 2013
మెగా హీరోల సినిమాలను ఆపితే సహించేదిలేదు: చిరు యూత్
మెగా హీరోల సినిమాలను ఆపితే చూస్తూ ఊరుకోమని చిరంజీవి యూత్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామినాయుడు తీవ్రంగా హెచ్చరించారు. సినిమాలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఉద్యమకారుల పేరిట కొందరు తమ హీరోల కటౌట్లు తగలబెడుతున్నారనీ, దీనిని చూస్తూ ఊరుకోమనీ స్వామినాయుడు తీవ్రంగా హెచ్చరించారు. ఇలా స్వామినాయుడు ప్రకటించడం వెనుక మెగా ప్రొడ్యుసర్ అల్లు అరవింద్ హస్తం ఉందని కొందరు అంటున్నారు. మరి, దీని పట్ల సమైక్యాంధ్ర ఉద్యమకారులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.
కాగా విభజనకు చిరంజీవి అనుకూలమేనని ఆయన నిన్నటి ప్రకటన ద్వారా తెలుస్తోంది.
హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కానీ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలని అలాకని పక్షంలో ఢిల్లీ తరహాలోగానీ ఉంచాలని చిరంజీవి నిన్న డిల్లీలో పేర్కొన్నారు.

ధ్యాన నియమాలు
ప్రతిరోజు ౩౦-౪౦ నిమిషముల నేపు ధ్యానం చెయండి. వీలైనంతవరకు రోజుకు రెండి సార్లు ధ్యానం చెయండి. (ప్రోద్దున, సాయంత్రం)
మీ రోజువారి కార్యక్రమములలో ధ్యానం ఒక భాగంగా చేసుకోండి. మీకువీలైనే సమయములలో ధ్యానం చేసుకోండి. ఉదయం నెద్రలేచగానే కండ్లు రుద్దుకోని, పడక మీదగాని, కుర్చిలోగాని కూర్చోని ధ్యానం మొట్టమొదటి పనిగా పూర్తి చేయండి. ఎందువలనంటే ఒకసారి మీరు దైనందిక పనులలో పడితే ధ్యానం చేయటకు సమయము దొరకదు. ప్రతిసారి వాయిదా వేసుకొనుట అలవాటవుతుంది. అంతేకాకుండా ధ్యానం ఒక మానసిక క్రియ అయినందువల్ల మరియు ఆత్మలో పరమాత్మ చింతన చేయుటవల్ల దేనికి మడి, మైల అనే తతంగములు వర్తించవు. ఆది అంతా కేవలం శరీరమునకు మాత్రమే.
తూర్చు, ఉత్తర దిశలకు అభిముఖముగా కూర్చుని ధ్యానం చేయండి.
ప్రత్యకమైన ఆహార నియమములు ఏమిలేవు. ఆహారము తీసుకోనకుండా కాని, తేలికపాటి ఆహారము తీసుకున్నప్పతికి కాని, ధ్యానమునకు ఆవరోధము కాదు.
ధ్యానంలో దేనినైనా ఊహించడంగాని, అశించడంగాని, దేనిగురించి గాని ముందుగా అనుకోవడం గాని మొదలైనవి చేయకండి. ధ్యానం కేవల ధ్యానం కోసం మాత్రమే, రావలసిన ప్రయోజనాలు వాటికవే వస్తాయి.
ఓర్పు, పట్టుదల కలిగి ఉండండి. ఫలితములు రాత్రికి రాత్రే రావికదా! ధ్యానం మీ అంతర్ మనస్సులో పేరుకుపొయిన కర్మల ప్రతి అణువును శుద్ధి వస్తుంది. మరియు మెల్లమెల్లగా భొతిక, మానసిక, ఆధ్యాత్మిక సత్ పరిణామము వైపునకు దారితీస్తుంది.
ధ్యానమును ఎప్పుడూ విడువవద్దు. ఏ కారణము చేతనైన మీరు విడిచినట్లయిత్ మిమ్మల్ని మీరు అభివృద్ది చెసుకునే మంచి అవకాశాన్ని కోల్పోతారు. ధ్యానము కేవలం మానసిక ప్రక్రియ. మీసౌకర్యాన్ని అనుసరించి ఎప్పుడైనా, ఎక్కడెనా చేయవచ్చు.
ధ్యానం ప్రతిరోజు ఒకవిధంగా ఉండుదు. అది ఆరోజున మీ యొక్క శారీరిక మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. కావున ప్రతిరోజు ఒక ర్కమైన ధ్యానస్థితిని ఆశించకండి.
మీరు గనుక దీర్ఘ ప్రాణాయమాన్ని 3 నుంవి 5 నెమిషమ్లసేపు ధ్యానం ముందర చేసినట్లయిత్ ధ్యాన ఫలితము చక్కగా ఉంటుంది. ధ్యానము పూర్తి చేసిన తరువాత నెలపై వెల్లకిలా పడుకొని విశ్రాంతిగా శరీరమును, మనస్సును పది నిమిషముల సేపు ఉంచినట్లయిత్ (శవాసనం) ధ్యానములో కరిగిపోయిన కర్మలు అన్ని బయటకు పోయి మీరు హాయిగా ఉంటారు.
మీకు ధ్యాన సమయములో బయటకు వెళ్ళె కర్మల వల్ల తీవ్ర ఆలోచనలు గాని, ఆందోళనలు గాని ఎపుడైన ఏర్పడినట్లయిత్ మీరు విసుగుతో ధ్యానం నుంచి లేవవద్దు. అలాగే కనులు మూసుకొని దీర్ఘ ప్రాణాయామము చెసి తరువాత ధ్యానము చేయండి. అప్పు కూడా ధ్యానము చేయటకు వీలు కానట్లైత్ మౌన ధ్యానమును అవలభించండి. (యూనివర్సల్ మెడిటేషన్ - II)
ధ్యానములో కాని, ధ్యానము పూర్తి అయిన తరువాత కాని ఏవైనా ఆధ్యాత్మిక అనుభవములు కలిగినట్లైత్(ఉదా: దర్శనములు మెదలెనవి). ఆ విషయముల పట్ల తటస్థ వైఖరితో వుండి అవసమైనచో వాటిని సత్సంగములో మాత్రమే చర్చించవలెను. అందరి వ్యక్తుల వద్ద మనకు కలుగు అనుభవములను చర్చించరాదు. కాని ధ్యానము చేయటవలన మీరు పొందిన ప్రయోజనములు మాత్రము అందరికి తెలియ జేసినట్లైతే వారు కూడ ధ్యానము వైపు మళ్ళుటకు సహాయకారి అవుతుంది.
అంకితభావంతో ధ్యానం చేసేవారికి కొంతకాలం తరువాత ప్రారంభపురోజులలో అనుభవించిన మార్పులను ఇప్పుడు అనుభవించలేరు. కారణం ఏమంటే ధ్యానంలో మొదటి స్థితిపూర్తి అయిన తరువాత ధ్యాన ప్రభావము లోపలివైపునకు ప్రయాణింవి అనుభవాలు సూక్ష్మముగా ప్రోగవు తుంటాయి.
ధ్యానం మీ వ్యక్తిగత, సాంఘిక, ఆధ్యాత్మికంగా జీవితంలో అభివృద్ధిని కలుగజేస్తుంది.
ధ్యానం రోజువారి జీవితంలోని ఆందోళనలు, ఒత్తిడులను బయటకు పారద్రోలుటకు సహాయం జేస్తుంది.
ఎటువంటి ప్రతికూల వాతావరణంనైన ధైర్యంగా ఎదుర్కానగలిగే సమర్థతను ధ్యానం కలుగజెస్తుంది.
ఒక సంవత్సరం పాటు ధ్యాన సాధన చేసిన తరువాత మీరు ధ్యాన సమయమును ఒక గంట వరకు పోడిగించకొనవచ్చును.
క్రమం తప్పకుండా ధ్యానం చేయండి. మీరు ఒప్పుకొన్న లేక అప్పగించబడిన కౌటుంబిక, సామాజిక, వ్యవహారిక బాధ్యతలను (కర్మ యోగము) నిష్ఠతో పూర్తి చేయండి. అప్పుడు మీరు పరిణామాత్మకమైన మార్గముమైపు ప్రయాణిస్తున్నారని స్థిరముగా చెప్పవచ్చును. మరియు కాలాంతర ములో సుఖశాంతులను, ఆధ్యాత్మిక ఉన్నతిని పొందగలరు.
ధ్యానం మీకు, మీ కుటుంబానికి, సమాజానికి, దేశానికి, ప్రపంచానికి శాంతిని కలుగజేస్తుంది. దానితో పాటు మీ ఆధ్యాత్మిక ఉన్నతి సాధ్య మవుతుంది.
మీరు ధ్యానం చేస్తున్నందువల్ల ఎమైనా సత్ ఫలితములు పొందినట్లయిత్ దాపరికం లేకుండా, ఏమి ఆశించుకుండా ఇతరులకు అందించండి ఎందువల్ల అంటే జ్ఞానము అందరిది.
కృతజ్ఞతలు: http://universal-meditation.com &http://drsuresh-telugumeditation.blogspot.in
Sunday, August 4, 2013
తెలంగాణ వస్తే ఆంధ్రాకు,చెన్నైకు లాభం !
మరో ఆశక్తి కలిగించే అంశం - ఆంధ్రలో ఉన్న ప్రజలూ,నాయకులూ తెలంగాణా అభివృద్దికి ఆటంకంకలిగించాలనో,పోటీపడదామనో చెన్నై,బెంగళూరులపై దృష్టి పెడతారు. పైగా హైదరాబాద్ కన్నా పారిశ్రామికవేత్తలు రవాణా,వనరుల సౌలభ్యం దృస్ట్యా కోస్తా ప్రాంతం పైనే ఆకర్షితులయ్యే అవకాశం ఉంది.
ఏమైనా అభివృద్దిలో ఆంధ్రాప్రాంతం మరో గుజరాత్ ని తలపించవచ్చు.
Sunday, July 28, 2013
కోల్గేట్ సెన్సిటివ్ టూత్ పేస్ట్ సాంపిల్ ఉచితంగా పొందండి ఇలా
కోల్గేట్ సెన్సిటివ్ ప్రో రిలీఫ్ టూత్ పేస్ట్ సాంపిల్ పేకెట్ మీ ఇంటికే ఉచితంగా పంపించే ఆఫర్ ఇస్తోంది పామోలివ్ కంపెనీ..దీనికి మీరు చెయ్యవవల్సింది మీ అడ్రస్ SMS ద్వారా పంపడమే!
ఈ ఆఫర్ ఈ నెలాఖరువరకూ మత్రమే ఉంటుంది.. కనుక త్వరపడండి..

మీరు చేయవల్సిన విధానం:
1. 18002082020 టోల్ ఫ్రీ నంబర్ కు మిస్ కాల్ ఇవ్వండి.
2. మీకు ఓ SMS వస్తుంది.
2. అందులోని నంబర్ కు మీ అడ్రస్ ఇచ్చిన ఫార్మాట్లో SMS చేయండి.
4. తిరిగి మీకో SMS వస్తుంది - మీ సాంపిల్ త్వరలో మీకు అందుతుందని.
అంతే!!
*మీరు పంపే SMS కు దాదాపు 3 రూపాయిల వరకూ చార్జి అయ్యే అవకాశం ఉంది.
Monday, July 15, 2013
తెలంగాణాకు ప్యాకేజి ఇస్తే "అంధ్ర"కు తీరని నష్టం!అలోచించండి!!
తెలంగాణాకు ప్యాకేజి ఇవ్వడానికే కాంగ్రెస్ మొగ్గు చూపుతోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనీసం లక్షకోట్లతో ప్రత్యేక "అభివృద్ది" ప్యాకేజీ రానుందని అంచనా.
కాకపోతే ఈ ప్యాకేజి ప్రకటించడం ఖచ్చితంగా మిగతా ఆంధ్ర ప్రాంతాలకు ఇప్పుడేకాదు భవిష్యత్ లో తీరని అన్యాయమే అవుతుంది..
అదెలా అంటే ప్రస్తుతం ప్యాకేజి ఇవ్వడం వల్ల తెలంగాణా విభజన నినాదం పూర్తిగా అటకెక్కదు. కాకపోతే ఆ లక్షకోట్లతో ఆ ప్రాంతం అభివృద్ది పథంలో నడుస్తుంది.కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ తెలంగాణా ఇవ్వవల్సిన పరిస్థితి తప్పక వస్తుంది. బీజేపీ అధికారంలోకి రావడమో, లేక కాంగ్రెస్సే తిరిగి తెలంగాణా ఇవ్వాలని తలిస్తే ఆంధ్రా పరిస్తితి ఏమిటి. ఈ విషయం విజ్ఞులైనవాళ్ళంతా ఆలోచించాలి. తెలంగాణా ఇచ్చి ఆంధ్రాకు ప్యాకేజీ ఇవ్వడమో, లేక ఆ సమస్యను అలాగే ఉంచడమో చేస్తే మంచిదని నా అభిప్రాయం ! మీరేమంటారు?

Saturday, July 13, 2013
మరో ప్రపంచ వింత భోపాల్ తాజ్‌మహల్
తాజ్‌మహల్ పేరుచెప్పగానే మనకు ఆగ్రాలో షాజహాన్ నిర్మించిన తాజ్‌మహల్ గుర్తొస్తుంది. ముంతాజ్ ప్రేమకు గుర్తుగా ఆయన నిర్మించిన కట్టడం ప్రపంచ వింతల్లో చోటు సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే... అరుుతే, అచ్చం అలాగే కాకపోరుునా మనదేశంలో మరో తాజ్‌మహల్ కూడా వుంది! ఇది మీకు ఆశ్చర్యమనిపించినా... అక్షరాలా నిజం. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో వున్న ‘తాజ్‌మహల్ నెం.2’ విశేషాలు... ఈవారం ‘విహారి’...
ఆగ్రాలో ఉన్న అందమైన కట్టడం తాజ్‌మహల్ ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా నిలిచి పేరు తెచ్చుకుంది. ఈ అద్భుత కట్టడం గురించి అందరికీ తెలిసిందే. కానీ మన దేశంలో మరో తాజ్‌మహల్ కూడా ఉందన్న విషయం చాలా మందికి తెలియదు ఈ తాజ్‌మహల్ భోపాల్‌లో ఉండడం విశేషం. ఒకప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద రాజప్రాసాదంగా పేరుగాంచిన ఈ అద్భుత చారిత్రక కట్టడం ఇది.భోపాల్ రాజ్యాన్ని పరిపాలించిన 11వ పరిపాలకురాలు నవాబ్ షాజహాన్ బేగమ్ ఎన్నో అందమైన కట్టడాలను నిర్మించారు.1868 నుంచి 1901 వరకు ఆమె భోపాల్‌ను పరిపాలించి నిర్మించిన కట్టడాల్లో తాజ్‌మహల్ కూడా ఒకటి. ఈ తాజ్‌మహల్ భోపాల్‌లోని అతిపెద్దదైన మసీదు తాజ్-ఉల్-మజీద్ పక్కన నిర్మితమైంది.
రాజప్రాసాదంగా...
షాజహాన్ తన ప్రియురాలి కోసం తాజ్‌మహల్‌ను కట్టించాడు. కానీ భోపాల్‌లోని తాజ్‌మహల్ బేగమ్ నివాసంగా రూపుదిద్దుకుంది. ఆ కాలంలో 70 లక్షల రూపాయలతో దీన్ని నిర్మించారు. 1871 నుంచి 1884 వరకు 13 సంవత్సరాల కాలంలో ఈ చారిత్రక కట్టడం రూపుదిద్దుకుంది. ఆ కాలంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన రాజప్రాసాదంగా దీన్ని నిర్మించడం విశేషం. మొదట దీన్ని రాజ్‌మహల్ పేరుతో పిలిచేవారు. ఆ తర్వాత భోపాల్‌లో నివసించిన బ్రిటీష్ పరిపాలకులు దీని నిర్మాణాన్ని చూసి ఎంతో ముగ్ధులయ్యారు. దీని ఆర్కిటెక్చర్ పనితనం వారికి బాగా నచ్చి ఈ కట్టడాన్ని కూడా తాజ్‌మహల్‌గా పిలిచారు. ఇక భోపాల్ తాజ్‌మహల్ నిర్మాణం పూర్తయిన తర్వాత బేగమ్ జష్న్-ఎ-తాజ్‌మహల్ పేరిట మూడు సంవత్సరాల పాటు వేడుకలను నిర్వహించారు.
స్వాతంత్య్రానంతరం
1947లో స్వాతంత్య్రం వచ్చి... దేశవిభజన జరిగిన తరువాత నవాబ్ హమీదుల్లా ఖాన్ సింధీ కాందిశీకులను ఈ ప్యాలెస్‌లో నివసించేందుకు ఏర్పాట్లు చేశారు. వారు తాజ్‌మహల్‌లో నాలుగు సంవత్సరాలపాటు నివసిం చారు. ఆ తర్వాత భోపాల్‌లోని బైరాఘర్‌కు తమ నివాసాన్ని మార్చారు. ఈ కాలంలో ఈ రాజప్రాసాదం కొంత దెబ్బతిన్నది. ఆ తర్వాత పలువురు భోపాల్ రాజవంశీకులు ఈ రాజప్రాసాదంలో నివసించి క్రమక్రమంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. 2008లో ఈ రాజమహల్‌లోని పలు భవనాలు కూలిపోయాయి. 2005లో భోపాల్ తాజ్‌హమల్‌ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర చారిత్రక వారసత్వ సంపదగా ప్రకటించింది.
అధ్బుత నిర్మాణశైలి
భోపాల్ తాజ్‌మహల్‌ను వివిధ రకాల శిల్పకళాపనితనంతో అందంగా నిర్మించారు. బ్రిటీష్, ఫ్రెంచ్, మొఘల్, అరబిక్, హిందూ వాస్తు నిర్మాణ పద్ధతులతో దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ ప్యాలెస్‌లో 120 గదులను నిర్మించారు. ఇందులో శీష్‌మహల్ (అద్దాల ప్యాలెస్), అతి పెద్దదైన సావన్ బడో పెవిలియన్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఏడు అంతస్తుల భవనం ఇక్కడ చూడదగినది. భోపాల్ తాజ్‌మహల్‌పై పరిశోధన చేసిన హుస్సేన్ (75) ఈ కట్టడంపై ప్రత్యేకంగా ‘ద రాయల్ జర్నీ ఆఫ్ భోపాల్’ అనే పుస్తకాన్ని రాశారు.
భోపాల్‌లోనే అతిపెద్ద ప్యాలెస్‌గా దీన్ని ఆయన అభివర్ణించారు. ఇక భోపాల్ తాజ్‌మహల్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. దేశ, విదేశాలకు చెందిన వేలాది మంది పర్యాటకులు ప్రతి ఏటా ఈ కట్టడాన్ని తిలకిస్తున్నారు. ఈ కట్టడం అందాలకు వారు మంత్రముగ్ధులవుతున్నారు. భోపాల్ తాజ్‌మహల్ అందాలు వర్ణనాతీతం. ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజప్రాసాదంగా నిర్మించిన ఈ కట్టడం వివిధ వాస్తు నిర్మాణ శైలులకు అద్దం పడుతోంది. ఈ కట్టడంలోని వివిధ భవనాలు ఎంతో అందంగా తీర్చిదిద్దారు.
తాజ్ పరిరక్షణకు...
ఇక భోపాల్ తాజ్‌ను పరిరక్షించేందుకు గత కొన్ని సంవత్సరాలుగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వమిస్తున్న సవితా రాజె కొంతకాలం క్రితం ప్యారిస్‌లోని స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డీన్ సెర్జ్ సాంటెల్లిని ప్రత్యేకంగా భోపాల్‌కు ఆహ్వానించారు. సెర్జ్ సాంటెల్లి తాజ్‌మహల్‌లోని పలు భవన సముదాయాలను పరి రక్షించేందుకు కృషిచేస్తున్నారు. ఆయన స్వయంగా ఈ ప్యాలెస్‌ను ప్రపంచంలోని అందమైన ప్యాలెస్‌లలో ఒకదానిగా అభివర్ణించడం విశేషం.
Source: సూర్య దినపత్రిక

దిష్టిబొమ్మ: కథా-కమీషనూ
దిష్టిబొమ్మను ఆంగ్లంలో స్కేర్ క్రో అంటారు. స్కేర్ అంటే బెదిరించడం, క్రోఅంటే కాకి. దీనిని బట్టి కాకులను బెదరగొట్ట డానికి తయారు చేసుకున్న బొమ్మ ను స్కేర్క్రో లేక దిష్టిబొమ్మ అంటా రు. ముఖ్యం గా దిష్టి బొమ్మ మోసగించడానికి తయారు చేసుకున్న ఒక డెకారు. సాంప్రదాయకంగా ఇది మానవుని రూపం కలిగిన మనిషి బొమ్మ వలె ఉంటుంది. దీనిని కర్ర, వరిచెత్త వంటి వాటితో తయారు చేసి పాత బట్టలను తొడుగుతారు. ఈ విధంగా తయారు చేసుకున్న దిష్టిబొమ్మను రైతులు పొలాలలో కాకి, పిచ్చుక వంటి పక్షుల నుంచి పంటను రక్షించుకునేందుకు ఉంచుతారు. ఈ దిష్టిబొమ్మను చూసిన పక్షులు నిరుత్సాహానికి గురై కలవరం చెంది ఇక్కడ మనిషి కాపలా ఉన్నాడనే భయంతో పంట జోలికి రావు. ముఖ్యంగా రైతులు పంట పొట్ట దశకు వచ్చే సమయంలో ఈ దిష్టిబొమ్మలను ఏర్పాటు చేస్తారు.
From: Visalandhra , wiki
From: Visalandhra , wiki
Saturday, July 6, 2013
Monday, June 24, 2013
Subscribe to:
Posts (Atom)