Thursday, April 19, 2012

‘టైమ్’ ప్రభావశీల వ్యక్తుల జాబితాలో మమతకు స్థానం



పశ్చిమ బెంగాల్ ముఖ్యమంథ్రి మమతా బెనర్జీ అమెరికాకు చెందిన ‘టైమ్’ మ్యాగజైన్ ప్రచురించిన ప్రపంచంలోని వందమంది అత్యంత ప్రభావ శీలవ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరయిన ప్రముఖ ఇనె్వస్టర్ వారెన్ బఫెట్, పాకిస్తాన్‌కు తొలి ఆస్కార్ అవార్డును సాధించి పెట్టిన మహిళా దర్శకురాలు షమీమ్ ఒబైద్ చినాయ్, అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, ఫేస్‌బుక్ సిఓఓ షెరిల్ శాండ్‌బర్గ్ లాంటి స్ఫూర్తి ప్రదాతలు, ప్రపంచానే్న మార్చి వేసిన పలు రంగాలకు చెందిన ప్రముఖుల సరసన మమతా బెనర్జీకి స్థానం లభించింది. అభిమానులు ప్రేమగా ‘దీదీ’గా పిలిచే మమతా బెనర్జీని చంచలస్వభావురాలని, స్ట్రీట్‌ఫైటరని విమర్శకులు విమర్శిస్తారు కానీ, తాను పరిపూర్ణమైన రాజకీయవేత్తనని ఆమె నిరూపించుకున్నారని మ్యాగజైన్ వ్యాఖ్యానించింది. ప్రతి ఎన్నికలోను ఆమె ఓ వైపు తన పలుకుబడిని పెంచుకుంటూ మరో వైపు ప్రత్యర్థులను అడ్డుతొలగించుకుంటూ వచ్చారని పేర్కొంది. రాజకీయ చదరంగంలో ఎంతో తెలివిగా ఒక్కో ఎత్తు వేస్తూ, సొంత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మమత దేశ రాజకీయాల్లో మరింత ప్రధాన భూమికను పోషించనున్నారని కూడా ‘టైమ్’మ్యాగజైన్ ప్రశంసించింది.

No comments:

Post a Comment