Tuesday, December 27, 2011

‘టీ’తో ఆరోగ్యం


కాలక్షేపానికో, తలనొప్పిగా ఉందనో స్నేహితులకు కంపెనీ ఇవ్వడానికో టీ తాగడం మామూలే. ఎవరూ తోడులేకున్నా ఒంటరిగానే రోజుకు ఐదారు లేదా అంతకుమించి ఎక్కువ కప్పుల టీ తాగేవారున్నారు. ఇన్నిసార్లు తాగకపోయినా రోజుకు రెండు మూడు సార్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్యశాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. టీవల్ల అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని, అనేక ఉపయోగాలున్నాయని వారంటున్నారు.
హెర్బల్ టీ, లెమన్ టీ, హనీ టీ, ఆరంజ్ టీ, యాపిల్, హనీ టీ, ఐస్డ్ టీ, అల్లం టీ ఇలా అనేక రకాల టీలను తయారుచేసుకోవచ్చు. టీలో పాలు, చక్కెరకు బదులుగా తేనె, నిమ్మకాయ రసం వేసుకుని ఆగితే ఆరోగ్యానికి చాలా మంచిది.
శ గ్రీన్ టీని తరచుగా తాగితే రక్తనాళాలు గట్టిపడటం, ధమనులు మూసుకుపోవడం లాంటి సమస్యలురావు. శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది. క్యాన్సర్ కణాలు నిర్మూలితం అవుతాయి. లివర్ వ్యాధులు, వేడి చేయడవల్ల శరీరంలో కలిగే మంటలు లాంటి వ్యాధులు టీవల్ల తగ్గుతాయి.
శ టీలో ఉన్న ఆరోగ్య లక్షణాలు తరగిపోకుండా ఉండాలంటే బ్లాక్ టీలో నిమ్మరసం కానీ, తేనె కానీ వేసుకుని తాగాలని వైద్యులు చెబుతున్నారు.
శ స్థూలకాయులు, బరువు ఎక్కువ ఉన్నవారు పాలు, చక్కెర లేని బ్లాక్‌టీ కాని, లెమన్‌టీ కాని తాగడం వల్ల బరువు తగ్గుతారు. టీవల్ల శారీరక అందం కూడా ఇనుమడిస్తుంది. చర్మానికి, జుట్టుకుకూడా టీ రక్షణనిస్తుంది.
శ నోటి దుర్వాసనతో బాధపడేవారు రోజుకు రెండు, మూడుసార్లు హెర్బల్ టీ తాగడంవల్ల ఆ రుగ్మత నుంచి బయటపడగలుగుతారు.
శ గ్రీన్ టీ మరుగుతున్నపుడు ముఖానికి ఆవిరిపడితే చర్మంపై ఉన్న సూక్ష్మ రంధ్రాలు మూసుకుపోకుండా ఉంటాయి. ముఖం కాంతివంతమవుతుంది.
శ అన్నవాహిక సంబంధ వ్యాధులు, గ్యాస్టిక్ సమస్యలు, అండాశయ వ్యాధులు, చర్మవ్యాధులు, చర్మ క్యాన్సర్ లాంటి రుగ్మతలు టీ వల్ల తగ్గుతాయి. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం, మెదడును చురుకుగా చేయడం లాంటి లక్షణాలుకూడా టీకి ఉన్నాయి.
శ శారీరకంగా, మానసికంగా అలసిపోయినపుడు దాని ప్రభావం ముఖంపై ఉంటుంది. రెండు, మూడు గ్రీన్ టీ బ్యాగులను అర లీటరు నీటిలో మరిగించి చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లటి టీ ద్రవాన్ని ముఖంపై చల్లుకుంటే అలసట తగ్గుతుంది.
శ రోజుకు రెండు, మూడు కప్పులు గ్రీన్ టీ తాగితే అధిక బరువు తగ్గుతారు.
శ గొంతు నొప్పి, అనారోగ్య కారణంవల్ల జీర్ణశక్తి తగ్గినపుడు ఒక టీ స్పూన్ మిరియాల పొడిని ఒక కప్పు నీటిలో మరిగించి తాగితే ఆ బాధలు తగ్గుతాయి.
శ విరేచనాలు అయినపుడు వచ్చే నీరసానికి, ఉదరానికి సంబంధించిన బాధలు ఒత్తిడి, ఆందోళన, జలుబు, తలనొప్పులను అల్లం టీ తగ్గిస్తుంది. అంతేకాక ఊపిరి పీల్చుకోవడం కష్టమైనపుడు, నోరు పిడక కట్టుకుపోయినపుడు ఒక స్పూన్ అల్లం ముద్దను ఒక కప్పు నీటిలో మరిగించి తాగితే ఉపశమనం కలుగుతుంది.
శ మూడు కప్పుల నీటిలో రెండు టీ బ్యాగ్స్ వేసి మరిగించి చల్లారిన తర్వాత సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తర్వాత ఆ ద్రవాన్ని కళ్ళకు, ముఖానికి, మెడకు రాసుకోవాలి. అయిదు పది నిముషాల తర్వాత చల్లని నీటితో ముఖం కడగాలి. ఇలా వారం రోజులు చేస్తే ముఖంపై ఉన్న మడతలు, మచ్చలు పోతాయి.
శ షాంపుతో స్నానం చేశాక టీ డికాక్షన్‌ను తలకు పట్టిస్తే జుట్టు మెరుస్తూ ఉంటుంది. టీ డికాక్షన్‌లో వెనిగర్ కలిపి జట్టుకు రాస్తే కండిషనర్‌లా పనిచేస్తుంది.
శ సౌందర్య సాధనాల తయారీలో గ్రీన్ టీ ఆకులను, వేళ్ళను వాడతారు. టీ ట్రీ ఆయిల్‌ను కూడా కాస్మెటిక్స్ తయారీలో వాడతారు. -పి.జోత్న్సకుమారి ఆంధ్రభూమి నుండి

1 comment: