Monday, August 8, 2016

పుష్కర హడావుడి ఆంధ్రప్రదేశ్ లోనే ఎందుకు ఎక్కువ?


అదేమిటో కానీ,ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పనులుచేసి వార్తల్లోకి ఎక్కాలంటే కేవలం ఆది ఆంధ్ర ప్రదేశ్ కు మాత్రమే సాద్యం. అన్ని పనులు అలాగే ఉంటాయి కానీ ప్రస్తుతం పుష్కరాల ప్రహసనం నడుస్తుంది కాబట్టి ఈ విషయం మాత్రం చూద్దాం.
గత సంవత్సరం గోదావరి పుష్కరాలు అయ్యాయి. అందులో రాజమండ్రిలో 30 మంది దుర్మరణం పాలయ్యారు, గోదావరి నది రాజమండ్రిలో పుట్టి సముద్రంలో కలిసేది కాదు. ఎక్కడో మహారాష్ట్ర లో నాసిక్ లో పుట్టి తెలంగాణా గుండా ప్రవహించి చివరకు రాజమండ్రి వద్ద సముద్రంలో కలుస్తుంది కానీ వేరే ప్రాంతాల్లో ఎక్కడ లేని ప్రాణ నష్టం కేవలం రాజమండ్రిలో మాత్రమే ఎందుకు జరిగింది అని మాత్రం అడక్కండి ఎందుకంటే ఆది అంతే… ఇప్పుడు కృష్ణ పుష్కరాలు ముందునుండే ఆలయాలు కూల్చివేత గొడవలు మొదలయ్యాయి. కృష్ణ నది కూడా విజయవాడ లో పుట్టి సముద్రంలో కలవదు, ఆది కూడా మహారాష్ట్ర, మహాబలేశ్వర్ లో పుట్టి తెలంగాణా మీదుగా ప్రవహించి చివరికి తలగడ దీవి వద్ద సముద్రంలో కలుస్తుంది. మరి పుష్కరాలు మహారాష్ట్రలో, తెలంగాణాలో కూడా జరుపుతారు కానీ దానికోసం ఉన్న ఆలయాలు, అడ్డొచ్చాయని కట్టడాలు కూల్చేయడమ్ లేదే మరి కేవలం విజయవాడ లో మాత్రమే ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ఆంధ్ర పాలకులు ఏం చేసినా కూడా వెరైటీ ఉండాలిగా మరి.

temples demolition in the name of Krishna pushkaralu in vijayawada కృష్ణ పుష్కరాల పనుల పేరుతో వెనకేసుకున్న వాడికి వెనకేసుకున్నంత…

మహారాష్ట్ర లో పూణే ముంబై లాంటి పట్టణాలు ఎంత అభివృద్ది చెందినా కూడా, ఇప్పటికీ రాజులకోటలు మాత్రం బద్రంగా కాపాడుతూ ఉంటారు ఆది వారి గొప్పదనం కావచ్చు లేదా మన ఆంద్ర పాలకుల దృష్టిలో పిచ్చితనం కావచ్చు. పుష్కరాలు అన్న విషయం మిగతా ప్రాంతాల వారికి తెలియక కాదు, కానీ వాళ్ళు ప్రతీ విషయాన్ని వ్యాపార దృష్టితో చూడరు, దేనికి ఎంత ప్రచారం చెయ్యాలో అంతవరకే కేటాయిస్తారు. పుష్కరాలు అనేవి 12 ఏళ్లకు ఓ సారి వస్తాయి, ఇప్పుడు వచ్చేవి మొదటివి కావు అలా అని చివరివి కాదు, అవి ప్రతి పన్నెండు సంవత్సరాలకు వస్తూనే ఉంటాయి. మరెందుకు ఇంత హడావిడి అంటారా?? ఇవి ఒక్క రాజకీయ బినామీలకు మాత్రమే మొదటి పుష్కరాలు, డబ్బు సంపాదించుకునే అవకాశం ఉన్న చివరిపుష్కరాలు. పుష్కరాలలో మునిగిన వాడికి మునిగినంత పుణ్యం, పుష్కరాల పనుల పేరుతో వెనకేసుకున్న వాడికి వెనకేసుకున్నంత.
– శేఖర్ బాబు
సోర్స్: http://www.telugupunch.com/telugu/temples-demolition-in-the-name-of-krishna-pushkaralu-in-vijayawada/

Sunday, July 31, 2016

హైదరాబాద్‌ విమానాశ్రయ ప్రాంగణంలో రెండో గోదాము ఏర్పాటు చేస్తున్న అమెజాన్

వెబ్‌సైట్‌లో వినియోగాదారుల కొనుగోళ్లకు అనుగుణంగా వారికి వస్తువులను బట్వాడా ఉంచేందుకు కీలకమైన ప్రదేశాల్లో అమెజాన్‌ గోదాములను (ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాలు) ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 21 గోదాములు కలిగిన అమెజాన్‌ రానున్న పండుగల సీజన్‌ను దృష్టి పెట్టుకుని మరో 6 గోదాములను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా హరయాణలోని సోనిపట్‌లో 2,00,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన గోదామును ప్రారంభించింది. ఇది కంపెనీకి 22వ గోదాము అవుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో రెండో గోదామును ఏర్పాటు చేస్తోంది. జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రాంగణంలో దీన్ని సిద్ధం చేస్తున్నారని, నెల రోజుల్లో ఈ గోదామును ప్రారంభించే వీలుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ గోదాముపై అమెజాన్‌ ఏ మేరకు పెట్టుబడి పెడుతోంది, ఎంతమందికి ఉపాధి లభించే విషయాలను మాత్రం వెల్లడించలేదు.

గత ఏడాది జూన్‌లో దేశంలోనే అతిపెద్ద గోదామును హైదరాబాద్‌కు సమీపంలోని కొత్తూరు (మహబూబ్‌ నగర్‌ జిల్లా)లో ఏర్పాటు చేసింది. 2,80,000 చదరపు అడుగుల్లో దీన్ని అభివృద్ధి చేసింది. తాజాగా విమానాశ్రయ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న గోదాము ఇంతకంటే పెద్దదని తెలుస్తోంది. భౌగోళికంగా హైదరాబాద్‌ కేంద్రంలో ఉండడం, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లో ఇ-కామర్స్‌ విక్రయాలు ఆకర్షణీయంగా పెరుగుతుండడం, పన్నుపరమైన వెసులుబాటు వంటి సానుకూల అంశాల కారణంగా ఇప్పటికే ఒక గోదాము ఉన్నప్పటికీ.. అమెజాన్‌ రెండో ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గోదాములతోపాటు హైదరాబాద్‌లోని గచ్చీబౌలిలో 10 ఎకరాల్లో అమెజాన్‌ ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈఏడాది మార్చిలో దీని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2019 నాటికి ఇది సిద్ధం అవుతుందని భావిస్తున్నారు. భారత్‌లో అమెజాన్‌కు ఇది అతిపెద్ద ప్రాంగణం అవడమే కాక అమెరికాకు వెలుపలు ఉన్న అతిపెద్ద ప్రాంగణం కూడా ఇదే అవుతుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. అమెజాన్‌ బ్యాక్‌ ఆఫీస్‌ కార్యకలాపాలను ఈ కేంద్రం ద్వారా నిర్వహిస్తారు. అనేక నిపుణుల బృందాలు ఇక్కడ పని చేస్తాయి.

హోదాపై తెలుగుదేశం కార్యాచరణ ఏమిటో తేలేది నేడే


hoda
ప్రత్యేక హోదా అంశంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధమవుతోన్నది, అందులో భాగంగా ఆదివారం పార్టీ ఎంపీల సమావేశం నిర్వహించనున్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవడం ఒక్కటే పరిష్కారమని ముఖమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ఎమ్‌పిల సమావేశ తీరుతెన్నులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, ఆ వ్యూహాన్ని అమలు చేయాలన్నదే ముఖ్యమంత్రి ముందున్న ప్రశ్న. కేంద్రంతో సత్సంబంధాలకు విఘాతం కలుగకుండా అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీలేకుండా పోరాటం చేయాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఎమ్‌పిలపై చంద్రబాబు గుర్రుగా ఉన్నారు. గతరెండ్రోజులుగా పార్లమెంట్‌లో ఎమ్‌పిల ప్రవర్తనాశైలి ఆయన్ను మెప్పించలేక పోయింది. శుక్రవారమైతే ప్రత్యేకంగా టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి మరీ ఎమ్‌పిల్ని తిట్టిపోశారు. ఇది బయటకు పొక్కకుండా ఎమ్‌పిలు చేసిన ప్రయత్నం ఫలించలేదు. పైగా ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ మిత్రపక్షం బిజెపి వైఖరిపై చంద్రబాబు తన అసమ్మతి ప్రకటించారు. ఈ దశలో జరుగుతున్న ఎమ్‌పిల సమావేశం పార్టీతో పాటు పొత్తుపై కూడా దిశానిర్దేశం చేసేదిగా ఉంటుందని అంచనాలేస్తున్నారు. కొందరైతే హోదాపై మాటమార్చిన బిజెపితో తెగతెంపుల రీతిలోనే తెలుగుదేశం వ్యవహరించే విధంగా ఈ సమావేశంలో చంద్రబాబు ఎమ్‌పిలకు సూచనలిస్తారని భావిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తెగతెంపులంత ఆషామాషీకాదు. ప్రభుత్వంలో భాగస్వామిగా లేనిపక్షంలోచంద్రబాబుకు కూడా మోడి అపాయింట్‌మెంట్‌ దొరికే అవకాశాల్లేవు. అదీకాక మంత్రి సుజ నాచౌదరిపై ఆర్ధిక ఆరోపణలున్నాయి. మంత్రి పదవి నుంచి వైదొలిగితే అవి ఆయన్ను చుట్టుముడతాయి. దీంతో ఆయన తరపున చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి వచ్చే అవకాశముంది. హోదా విషయంలో తెలుగుదేశం వైఖరి సందిగ్ధంలో పడింది. అటు మిత్రపక్షాన్ని ఒప్పించలేక అలాగని తానొవ్వలేక తీవ్రంగా సతమతమౌతుంది. పార్లమెంట్‌ సమావేశాల్లో తన వైఖరి ద్వారా ప్రజల విశ్వాసాన్ని పునరుద్దరించుకోవడం ఇప్పుడాపార్టీకి అత్యవసరం. గత రెండేళ్ళుగా చంద్రబాబు భవిష్యత్‌ పట్ల ఆశలు చూపుతూ ప్రజల్ని నమ్మించగలిగారు. కేంద్రం నుంచి సాయమందుతుందన్న భ్రమల్లో పెట్టారు. ఇప్పుడాయకు కూడా భ్రమలు తొలగిపోయాయి. హోదా కాదు ఆఖరకు పోలవరానిక్కూడా నిధులిచ్చే అవకాశాల్లేవని తేలిపోయింది. దీనికి రాష్ట్ర ప్రజలు చంద్రబాబునే బాధ్యులుగా భావించే అవకాశముంది. ముందునుంచి కేంద్రంపై ఒత్తిడి తేవడంలో రాష్ట్రం విఫలమైందన్న ప్రచారం ఇప్పటికే మొదలైంది. పైగా విపక్షాలు దీన్ని వీలైనంతగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాయి. ఈ దశలో ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో ఎమ్‌పిల వ్యవహారశైలిని ప్రతిఒక్కరు నిశితంగా గమనించనున్నారు. విభజనకు ముందు కాంగీయుల అసమర్ధతను రాష్ట్ర ప్రజలు ఛీదరించుకున్నారు. వారిలో ఏ ఒక్కరికి తిరిగి పోటీ చేసే ధైర్యం కలగలేదు. పోటీ చేసిన కొందరు డిపాజిట్లు సైతం కోల్పోయారు. ఆ స్థాయిలో ప్రజలు వారిపై కక్షతీర్చుకున్నారు. కాగా ఇప్పుడు తెలుగుదేశం ఎమ్‌పిల వ్యవహారశైలిని కూడా ప్రజలు తదేకంగా వీక్షించి వారి పట్ల ఓ అభిప్రాయాన్నేర్పర్చుకోనున్నారు. ఇందుకనుగుణంగానే బిజెపికి పూర్తిగా దూరం కాకుండా అలాగని దగ్గరగా ఉన్నట్లు కనిపించకుండా అంశాల ప్రాతిపదికన వ్యవహరించాలంటూ ఎమ్‌పిలకు చంద్రబాబు సూచించే అవకాశాలున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Friday, June 17, 2016

తెలుగుదేశం రాజకీయ విశ్లేషకులు నరసింహారావు

బయట తిరిగే మూర్ఖుల కన్నా ముసుగేసుకుని మాట్లాడే మేధావులే సమాజానికి ప్రమాదకరం. సాధారణ రాజకీయనాయకులు చెప్పే మాటలను ప్రజలు కొద్దిమేర మాత్రమే విశ్వసిస్తుంటారు. కానీ మేధావులు, సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులు చెబితే చాలా మంది జనం నిజమే కాబోలు అని నమ్మేస్తుంటారు. అందుకే చంద్రబాబు కొందరు మేధావులకు, కొందరు సీనియర్ జర్నలిస్టులకు ముసుగేసి సమాజం మీదకు వదులుతుంటారు. అలాంటి వారెవరన్నది జనం కూడా ఈ మధ్య బాగానే గుర్తిస్తున్నారు.
గౌరవనీయులైన రాజకీయ విశ్లేషకులు నరసింహారావు టీవీ చర్చాకార్యక్రమాల్లో చేస్తున్న వాదన చూస్తే కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. టీడీపీ నాయకుల కంటే ధీటుగా ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ, చంద్రబాబును ఆయన వెనకేసుకొస్తున్న తీరు చాలా దూకుడుగా ఉంటోంది. బుధవారం ఒక టీవీ చర్చాకార్యక్రమంలో పాల్గొన్న ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తేశారు. రుణమాఫీ విషయంలో వైసీపీ నేతలు అన్నీ అబద్దాలు మాట్లాడుతున్నారంటూ అదే చర్చలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ కంటే ఎక్కువగా వాదించారు. చంద్రబాబు లక్షా 45 వేల కోట్ల అవినీతి చేశారంటూ ఎలా చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీపై పత్రికల్లో వచ్చిన కథనాలు కూడా అవాస్తవాలని ఆరోపించారు.
విజయవాడలో జరిగిన వైసీపీ విస్తృతస్తాయి సమావేశం చాలా దారుణంగా జరిగిందని, నిరాశపరిచిందని తేల్చేశారు. ప్రతిపక్షం గొంతును చంద్రబాబు నొక్కడం లేదని జగనే తన పార్టీలోని ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారని అచ్చం టీడీపీ నాయకుల తరహాలోనే మాట్లాడారు. జగన్‌ కూడా సీపీఐ నారాయణ లాగా ప్రభుత్వాన్ని విమర్శించడం తగదని చెప్పారు. ఒక దశలో చర్చలో పాల్గొన్న ఇతర పార్టీల నాయకులు నరసింహారావు తీరును తప్పుపట్టారు. ఒక విశ్లేషకుడిగా మాట్లాడితే బాగుంటుందని, టీడీపీకి వత్తాసు పలకడం సరికాదని హితవు పలికారు. ఇలా వన్‌సైడ్ మాట్లాడడం మానుకోవాలని నరసింహారావుకు వైసీపీ నేత ధర్మశ్రీ సూచించారు.
సాధారణంగా జర్నలిస్టులు, విశ్లేషకులు, మేధావులు ప్రభుత్వ లోటుపాట్లను ఎత్తిచూపుతుంటారు. అలా కాకుండా నరసింహారావు చంద్రబాబును ఆకాశానికెత్తి ప్రతిపక్షాలను విమర్శించడం చూస్తుంటే ఈయన పచ్చ కండువా కప్పుకోవడం ఒక్కటే మిగిలిందన్న భావన వ్యక్తమవుతోంది.. నరసింహారావు ఇప్పుడే కాదు.. 2014 ఎన్నికల సమయంలో మనోవిశ్లేషకుడినంటూ టీడీపీ అనుకూల పత్రికలో కనీవినీ ఎరుగని రీతిలో జగన్‌ ఉన్మాది, జగన్ సైకో అంటూ ఎడిటోరియల్స్ కూడా రాశారు. ఇలాంటి వారి వల్లే ఏపీలో రాజకీయ విశ్లేషకులపై జనంలో నమ్మకం తగ్గుతోందన్న భావన వ్యక్తమవుతోంది.
 

Tuesday, June 7, 2016

జగన్ "చెప్పుల" కామెంట్ చెయ్యడానికి స్ఫూర్తి ఇదేనా?

అనంతపురం జిల్లాలో జగన్ ఇప్పటికే నాలుగు విడతల్లో రైతు భరోసా యాత్ర చేశారు. కానీ ఆ నాలుగు విడతలు సాదాసీదాగానే సాగాయి. రైతులను పరామర్శించడం, అక్కడక్కడరోడ్‌ షోలు చేయడంతో నాలుగు విడతలు సాగిపోయాయి. కానీ ఐదో విడత అనంత రైతు భరోసా యాత్ర అందుకు పూర్తి భిన్నంగానే సాగింది. నాలుగు విడతల్లో కంటే ఎక్కువగానే స్పందన వచ్చింది. ఎమ్మెల్యేలు ఫిరాయిస్తుండడం, అందులోనూ కేవలం ఓకే ఎమ్మెల్యే మిగిలిన జిల్లాలో జగన్‌ యాత్రకు ఈస్థాయి స్పందన రావడాన్ని లోతుగా పరిశీలించాల్సిందేన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎమ్మెల్యే ఫిరాయించిన కదిరిలో జరిగిన సభకు జనం పోటెత్తడం చూసి వైసీపీ శ్రేణులు సంబరపడుతున్నాయి. అదే సమయంలో పట్టణప్రాంతాల్లో వైసీపీ బలహీనంగా ఉందన్న భావన కూడా ఉండేది. కానీ ఎస్పీ కార్యాలయం ముందు జగన్‌ నిర్వహించిన ధర్నాకు వేలాదిగా తరలిరావడం గమనించిదగ్గ పరిణామలే. జగన్ రావడానికి గంట ముందు అడ్డుకుంటామంటూ టీడీపీ కార్యకర్తలు హడావుడి చేశారు. కానీ జగన్ వచ్చే సమయానికి ఒక్కసారిగా వేలాది జనం, వైసీపీకార్యకర్తలు రోడ్ల మీదకు రావడంతో అధికార పార్టీ శ్రేణులు ఆ ప్రాంతంలో కనిపించలేదు. అయితే గత నాలుగు విడతలతో పోలిస్తే ఐదో విడతలో స్పందన అధికమవడానికి ప్రధానంగా రెండుకారణాలు వినిపిస్తున్నాయి.
రెండేళ్లు పూర్తయినా అనుకున్నస్థాయిలో రాజధాని నిర్మాణం గానీ, ఇతర అభివృద్ది కార్యక్రమాలుగానీ ముందుకు సాగకపోవడం వల్ల ప్రభుత్వంపై ప్రజల్లో భ్రమలు తొలుగుతున్నాయా అన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. రెండవది జగన్‌ చెప్పుల కామెంట్స్‌ను టీడీపీ బాగా ఎక్కువ చేసి చూపడం కూడా వైసీపీకి కలిసొచ్చిందన్న భావన వ్యక్తమవుతోంది. చంద్రబాబుపై వ్యాఖ్యలకు నిరసనగా జగన్ యాత్రను అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించడంతో జనంలో రైతు భరోసా యాత్రపై ఒక విధమైన ఆసక్తి పెరిగింది. మీడియాలోనూ నెగిటివ్‌గానైనా జగన్‌ యాత్రకు కవరేజ్ బాగా పెరిగింది. యాత్రను అడ్డుకుంటామన్న టీడీపీ పిలుపుతో వైసీపీ శ్రేణులు, పార్టీ అభిమానులు కూడా పోటాపోటీగా యాత్రకు తరలివచ్చారు. ఒక విధంగా చెప్పుల వ్యాఖ్యలపై టీడీపీ అతిస్పందన వల్ల అప్పటి వరకు పాసివ్ మోడ్‌లో ఉన్న వైసీపీ శ్రేణులు కూడా కదిలివచ్చేలా చేసిందంటున్నారు. ఒకవేళ జగన్ చెప్పుల వ్యాఖ్యలకు చంద్రబాబు నుంచి చోటా లీడర్ వరకు ఈ రేంజ్‌లో అతిగా స్పందించి ఉండకపోతే జగన్ యాత్రపై ఇంతస్థాయిలో చర్చ కూడా జరిగేది కాదంటున్నారు. మొత్తం మీద వైసీపీ బలహీనంగా ఉందనుకున్న జిల్లాలో జనం ఈ స్థాయిలో కదలిరావడం ఆ పార్టీకి బూస్ట్‌లాంటిదే.
Click here to Read:http://teluguglobal.com/jagan-anantapur-meeting-success/

సత్యానాదెండ్లకు చంద్రబాబే స్పూర్తి అట !

చంద్రబాబు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు అన్ని ఇజాలకన్నా టూరిజమే గొప్పదని, చరిత్ర చదువుకోవడం వృధా అని చెప్పినపుడు కొందరు ఆశ్చర్యపోయారు… మరికొందరు నవ్వుకున్నారు. కానీ ఆయన చెప్పింది నిజమే. చరిత్ర తెలియడంవల్ల చాలా కష్ట, నష్టాలుంటాయని ఆయన భావించింది నిజమే.
ఉదాహరణకు నావల్లే సత్యానాదెండ్ల మైక్రోసాఫ్ట్‌ సీఇఓ అయ్యాడు. నా ఇన్‌స్పిరేషన్‌తోనే ఐటీ రంగంలో నేను సాధిస్తున్న విజయాల స్ఫూర్తితోనే ఆయన ఐటీవైపు వెళ్లాడు అని ఈమధ్య చంద్రబాబు ఊదరగొడుతున్నాడు.
చరిత్రలోకి వెళితే ఈయన ముఖ్యమంత్రి కాకముందే సత్యానాదెండ్ల మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగి. 1995 ఆగష్టులో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు 1992లో మైక్రోసాఫ్ట్‌లో జాయిన్‌ అయిన సత్యానాదెండ్లకు ఏవిధంగా స్ఫూర్తినిచ్చాడో తలగింజుకున్నా అర్ధంకాదు. చంద్రబాబు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సాధించిన అద్భుతాలను చూసి సత్యానాదెండ్ల సివిల్ సర్వీస్‌వైపు కాకుండా ఇంజనీరింగ్‌ మీద దృష్టిపెట్టి 1988లోనే ఎలా ఇంజనీరింగ్‌వైపు వెళ్లాడో, 1990లోనే అమెరికావెళ్లి ఎలా ఎంఎస్‌ చేసాడో తల బద్దలు కొట్టుకున్నా అర్ధం కాదు. అందుకే చంద్రబాబుకు గతం అన్నా, చరిత్ర అన్నా ఇష్టం లేదు.
నావల్లే హైదరాబాద్‌ ప్రపంచ పటంలో గుర్తింపుపొందిందని, ఐటీ కంపెనీలు తనను చూసే హైదరాబాద్‌కు వురుకులు పరుగులు పెట్టాయని అప్పుడూ..ఇప్పుడూ.. ఎప్పుడూ చెప్పే చంద్రబాబు ఈ రెండేళ్లనుంచి ఆంధ్రాకు ఒక కంపెనీకూడా ఎందుకు రాలేదో చెప్పడు. అదేమంటే భజన బృందాలు ఐటీ మంత్రి పల్లె రఘనాథరెడ్డి ఫెయిల్యూర్‌గా చిత్రీకరిస్తాయి. ఇది నిజంగా ఐటీ మంత్రి ఫెయిల్యూరే అయితే గతంలో హైదరాబాద్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు వచ్చిన ఐటీ సక్సెస్‌కూడా అప్పటి ఐటీ మంత్రికి చెందాలికదా..! ఏదైనా సక్సెస్‌ అయితే తన ఖాతాలోకి, ఫెయిల్యూర్‌ అయితే ఇతరుల ఖాతాలోకి. అంతేనా?
Source: http://teluguglobal.com/chandrababu-comments-on-satya-nadella/

Thursday, May 26, 2016

సమంత కాబోయే భర్త నితినా? నాగ చైతన్యా?



సమంత ‘ఏం మాయ చేసిం’దో ఏమో కానీ.. టాలీవుడ్‌లో ఓ యంగ్ హీరో ఇప్పుడు ఆమె కొంగుపట్టుకుని తిరుగుతున్నాడట. ఈ విషయాన్ని సమంతయే స్వయంగా బటయపెట్టింది. తమ ప్రేమ విషయం పెద్దలకు కూడా తెలుసని, తమ పెళ్లికి వాళ్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఇక పప్పన్నం పెట్టించడమే లేటని చెప్పుకొచ్చింది సమంత. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానని, అప్పుడు విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటానని సమంత చెబుతోంది. తనకి కాబోయే భర్తది చాలా మంచి మనసని, ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తాడని... అతనిలో ఉన్న ఆ మంచి గుణం తనకి బాగా నచ్చిందంటోంది. నాగచైతన్యతో కెరీర్ స్టార్ట్ చేసిన సమంత... ప్రస్తుతం నితిన్‌తో నటిస్తోంది. తనతో పనిచేసిన యువ కథానాయకుడినే ప్రేమపెళ్లి చేసుకుంటానని సమంత చెబుతుండడంతో... ఆ యంగ్ హీరో ఎవరయి ఉంటారు? అంటూ టాలీవుడ్ సినీ జనాలు గుసగుసలాడుతున్నారు.

Wednesday, May 25, 2016

స్మార్ట్ సిటీల రెండో జాబితాలో వరంగల్‌కు చోటు

కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీల రెండో జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి వరంగల్‌కు చోటు లభించింది. 13 నగరాల పేర్లతో కూడిన స్మార్ట్ సిటీల రెండో జాబితాను మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు విడుదల చేశారు. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన లక్నో మొదటి స్థానంలో నిలవగా, తెలంగాణకు చెందిన వరంగల్ 9వ స్థానంలో నిలిచింది. వీటితో పాటు ధర్మశాల, చండీగడ్, రాయ్ పూర్, న్యూ టౌన్ కోల్‌కత్తా, భగల్పూర్, పనాజీ, పోర్ట్ బ్లెయిర్, రాంచీ, ఇంఫాల్, అగర్తల, ఫరీదాబాద్‌లు ఉన్నాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఈ 13 సిటీల్లో 9కి పైగా 25 శాతం స్మార్ట్ సిటీ హోదా అర్హతను సాధించాయని తెలిపారు. స్మార్ట్ సిటీస్ పథకానికి కేంద్రం నుంచి నిధులు ఇస్తున్నామని పేర్కొన్నారు. వంద ఆకర్షణీయమైన నగరాల్లో భాగంగా ఇప్పటికే 98 నగరాలను గుర్తించామన్నారు.
13 more cities get smart city tag
స్మార్ట్ సిటీల్లో మౌలిక వసతులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ నిధులను వెచ్చిస్తామన్నారు. రాష్ట్రాలతో సంప్రదించిన తర్వాతే కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు వెంకయ్య తెలిపారు. గతంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకూ అనే నినాదం ఉండేదని, ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ నినాదం చేపడుతున్నామన్నారు. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన తొలి జాబితాలో 12 రాష్ట్రాలకు చెందిన నగరాలతో పాటు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన నగరాలను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తొలి విడతలో విడదల చేసిన స్మార్ట్ జాబితాలో ఒక్క పాయింట్ తేడాతో వరంగల్ అవకాశాన్ని కోల్పోయింది. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ స్మార్ట్ సిటీ పథకం కింద ఐదేళ్ల గాను రూ. 48వేల కోట్లను ఖర్చు చేయనున్నారు.

Read more at: http://telugu.oneindia.com/news/telangana/13-more-cities-get-smart-city-tag-178038.html?utm_source=spikeD&utm_medium=PR&utm_campaign=adgebra
 

Saturday, January 23, 2016

Best service center now in East and west godavari

మీ ఇంట్లోని ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు పాడైందా......?😦😳😓
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యుత్తమ సర్వీస్ అందించే

http://www.bestservicecenter.in/request-a-service లో

రిజిస్టర్ చేసుకోండి,

లేదా 93 94 94 24 24 కు

కాల్ చేయండి