Saturday, November 17, 2012

"నిరీక్షణ" లఘు చిత్రం విశేషాలు కధాంశం


నిరీక్షణ ఒక తండ్రి కథ. కొడుకు పుడితే ప్లస్, కూతురు పుడితే మైనస్ అనుకునే రోజుల్లో పుట్టి పెరిగిన ఎంతో మంది తండ్రుల కథ. బిడ్డ పుట్టిన క్షణం నుండి ఆ బిడ్డ భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ, ఆ బిడ్డ రేపు కు బంగారు నగిషీలు అద్దేందుకు తన జీవితం లోని ప్రతి క్షణాన్ని హారతి కర్పూరం లా చేసే తండ్రుల వ్యధ.
మాధవరావు కు తన కొడుకు  దీపక్ అంటే ప్రాణం. కూతురు దివ్య అంటే చిన్నచూపు లేకపోయినా ఆయన జీవితానికి కేంద్ర బిందువు కొడుకు దీపక్. దీపక్ పుట్టిన క్షణం నుండి ఆయన జీవితంగా మారిపోయాడు. తన కొడుక్కు ప్రతి క్షణం బెస్ట్ ఇవ్వాలని ఆయన తపన. ఆయన ఏ పండక్కు బట్టలు కొన్నదో గుర్తు లేదు కాని కొడుక్కు మాత్రం లేటెస్ట్ ఫాషన్ ప్రకారం బట్టలు కొనాల్సిందే. దీపక్ బట్టలు కొన్నాకే ఇంట్లో ఎవరికైనా బట్టలైనా పండగైనా. తన తాహతుకు ఎక్కువ అయినా ఊర్లోని మంచి స్కూల్ లోనే కొడుకు ను చదివించేందుకు తపన పడతాడు. దీపక్ ను ఇంజనీర్ చేసేందుకు జీవితమంతా డబ్బు ఆదా చేసి, అమెరికా లో చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని ఇంటిని సైతం తాకట్టు పెట్టిన తండ్రి అతను. అలాంటి కొడుకు అమెరికా లో బాగా చదివి, రేపో మాపో తిరిగి వస్తాడని వెయ్యి కళ్ళలో ఎదురుచూస్తున్న ఆ తల్లి తండ్రులకు అక్కడి ముష్కరుల ధన దాహానికి తన కొడుకు బలి అయ్యాడని తెలుస్తే ఆ తండ్రి గుండె ఎలా తట్టుకుంటుంది? కంటిపాప లా చూసుకొని పెంచిన కొడుకు చేతికి అంది వచ్చాడని ఆనందపడ్డ ఆ తండ్రికి తనయుడు చేజారిపోయాడు అన్న నిజాన్ని ఎలా ఎదుర్కున్నాడు? మరణించిన కొడుకు శవం కూడా వారం తర్వాత కాని తిరిగి రాకపోతే….కన్న కొడుకు ను కడసారి చూసేందుకు కూడా నిరీక్షించాల్సిన పరిస్థితులలో ఆ తల్లి తండ్రుల గుండెకోత కు అంతమెక్కడ? చేసిన అప్పులు తీర్చేంత వరకు శవాన్ని కదలనివ్వమని అప్పులవాళ్ళు ఇంటి మీదకు వస్తే, బిడ్డ అకాల మరణం తాను కట్టుకున్న ఆశల సౌధాలు కూల్చేస్తే ఆ తండ్రి మానసిక పరిస్థితి ఏంటి? ఆ సంఘటన మాధవరావు జీవితాన్ని ఎలా మార్చేసింది? కొడుకే జీవితం అనుకున్న ఆయన కొడుకు తర్వాత జీవితాన్ని అంగీకరించగలిగాడా? రాని కొడుకు కోసం ఆయన నిరీక్షణ కు అర్థమేది?మనం టీ వీ లలో పేపర్ లలో చూసే వార్తలలో అతి సాధారణమైన వార్తలు  అమెరికా లో ఆంధ్ర విద్యార్ధి మృతి…ఆస్ట్రేలియా లో ఇండియన్ స్టూడెంట్ ను కాల్చి చంపినా ముష్కరులు….  ఇలాంటివే…..పిల్లలను ఎన్నో కలలతో…బంగారు భవిష్యత్తు ఇవ్వాలని అప్పులు చేసి, తల తాకట్టు పెట్టి విదేశాలకు పంపే తల్లితండ్రులు తమ బిడ్డలు కళ్ళముందే రాలిపోతుంటే, వారిని చివరి చూపు చూసేందుకు కూడా వారం, పది రోజులు ఎదురు చూడాల్సి వస్తుంటే వాళ్ళ బాధ గురించి ఆలోచిస్తున్నపుడు వచ్చిన ఆలోచన ఈ కథ.  బిడ్డ పుట్టిన క్షణమే డాక్టర్ చెయ్యలా, ఇంజనీర్ గా చూడాలా అని తల్లితండ్రుల ఆలోచనలు మొదలు అయ్యే రోజులలో, ఏమి అవ్వాలో నిర్ణయించుకునే ముందే బిడ్డ కలలు కూడా తామే కనే తల్లితండ్రుల జీవితాలలో బిడ్డలు లేని కలలు రోజు వెక్కిరిస్తుంటే….ఆ వ్యధ కు తెరరూపం ఇవ్వాలనే ఆలోచనే ఈ నిరీక్షణ.మా ఆలోచన మీకు నచ్చిందా? ఈ ప్రయత్నం లో మాకు చేయూత ఇవ్వాలని అనుకుంటున్నారా?మీకు మా ధన్యవాదాలు. సినిమా అంటే ప్రాణం గా భావించే కొంతమంది కలిసి చేస్తున్న ప్రయత్నం ఇది. కాని ఈ ప్రయత్నానికి ఇంకెంతో మంది చేయూత అవసరం. ముందుకు వెళ్ళమనే ఒక ప్రోత్సాహం కావచ్చు…కథ చెప్పడం లో, సినిమా తీయడం లో మీరు  ఏ విభాగం లోనైనా  నిష్ణాతులు అయితే మీ మార్గదర్శనం   కావచ్చు… మీ చేయూత కావచ్చు…జీరో బడ్జెట్ తో చేస్తున్న ఈ షార్ట్ ఫిలిం కు ఆర్ధిక సాయం కావచ్చు..మా ప్రయత్నం మరో పదిమంది కి చెప్పి జనం లోకి తీసుకుపోయే తోడ్పాటు కావచ్చు…మంచి మనసు తో చేస్తున్న  మా  ప్రయత్నానికి మీరు చేయూతనందించాలని అనిపిస్తే మాకు కబురు పెట్టండి. మేము మీ పిలుపు కోసం ఎదురు చూస్తుంటాము.

నటులుకావలెను : మా ఈ లఘు చిత్రం లో నటించేందుకు శిక్షణ పొందిన, నాటక రంగం, టీ వీ   లేదా చలన చిత్రరంగం లో అనుభవం ఉన్న నటులు కావలెను. 25 – 40 + ఉన్న నటులు 3 ,4 కావలెను. ఈ అర్హతలు మీకు ఉన్నాయని మీ భావిస్తే లేదా ఈ అర్హతలు ఉన్న వారు మీకు తెలుస్తే మాకు కబురు చెయ్యగలరు.మా ఈమెయిలు ఐడి –  khaderbad@gmail.com       లేదా కాల్ చెయ్యండి 9980422500


లింక్ : here


No comments:

Post a Comment