|
Saturday, July 28, 2012
బొమ్మల కొండపల్లి!
బయటపడిన తివారీ అబద్దాలు: రోహిత్ కు తండ్రి ఇతడే
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పితృత్వ కేసులో రోహిత్ శేఖర్ విజయం సాధించారు. న్యాయం ఉజ్వలా శర్మ పక్షాన నిలిచింది. రోహిత్ తండ్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ గవర్నర్ నారాయణ్ దత్ తివారీయేనని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. దీనితో ఇన్నాళ్ళూ తివారీ చిప్పినవన్నీ అబద్దాలని తెలిసిపోయింది. ఇది నిజంగా మహిళలను అవమానించడమే. విడ్డూరమేమంటే తివారీపై చర్యకు కాంగ్రెస్ పార్టీకూడా సుముఖంగాలేదు. కాంగ్రెస్ కూడా ఇదంతా తివారీ ప్రయివేట్ వ్యవహారమని కొట్టి పారేసింది.
తండ్రి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రే కాకుండా ఒక రాష్ట్రానికి గవర్నర్ గా ఉండటంతో రోహిత్ శేఖర్ సుదీర్ఘంగానే పోరాడారు. అతనికి తల్లి ఉజ్వల శర్మ అండగా నిలిచారు. తీర్పు వెలువడిన తరువాత రోహిత్ మాట్లాడుతూ ఈ పోరాటంలో ఎన్నోసార్లు ఆత్మవిశ్వాసం కోల్పోయానని చెప్పారు. న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు తెలిపారు.
రోహిత్ శేఖర్ మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నాయకుడు షంషేర్ సింగ్ మనవడు. ఉజ్వల సింగ్ తో తివారీకి గల వివాహేతర సంబంధం వల్ల రోహిత్ పుట్టారు. తివారీ యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నప్పుడు ఉజ్వల సింగ్ తో సంబంధాలు ఏర్పడ్డాయి. వారి మధ్య ఏర్పడి శారీరక సంబంధం కారణంగా రోహిత్ జన్మించారు. రోహిత్ ని కుమారుడుగా అంగీకరించడానికి తివారీ నిరాకరించారు. దాంతో 2008లో రోహిత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రోహిత్ చిన్నప్పుడు తల్లి ఉజ్వల, తండ్రి తివారీతో ఉన్న ఫొటోను కోర్టుకు సమర్పించారు. రోహిత్ పిటిషన్ ను 2008 ఏప్రిల్ లో కోర్టు విచారణకు స్వీకరించింది. తివారీకి నోటీసులు పంపింది. గౌరవప్రదమైన కుటుంబానికి చెందిన ఉజ్వల తెగువతో తన వివాహేతర సంబంధాన్ని వెల్లడించి కుమారుడికి అండగా నిలిచారు. డిఎన్ఎ పరీక్షకు రోహిత్ శేఖర్ అంగీకరించారు. తివారీ మాత్రం అందుకు నిరాకరించారు. అంతేకాకుండా అడ్డదిడ్డంగా వాదించారు. ఈ కేసును నీరుగార్చేందుకు ఆయన చేయని ప్రయత్నంలేదు. అవేమీ ఫలించలేదు. న్యాయస్థానం ముందు అతని హొదా, వాదనలు నిలువలేదు. రోహిత్ వేసిన పిటిషన్ పై రాష్ట్ర గవర్నర్ గా ఉన్న తివారీ ముందు కోర్టు విచారణ పరిధిని ప్రశ్నించారు. ఆ తరువాత తాను ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నానని, రోహిత్ లక్నోలో పుట్టాడని, అందువల్ల ఢిల్లీలో విచారణ సరైంది కాదని వాదించారు.
రోహిత్ బయటపెట్టిన ఫొటోను సాక్ష్యంగా తివారి అంగీకరించలేదు. తాను తివారీకి పుట్టానని రోహిత్ వాదనని నిర్ధారించడానికి కర్త నమూనా ఇవ్వాలని కోర్టు తివారీని ఆదేశించింది. అయితే, తివారీ అందుకు ముందుకు రాకుండా తీవ్ర జాప్యం చేశారు. తివారీ స్వచ్ఛందంగా ముందుకు రాకపోతే బలవంతంగా రక్తం నమూనాను సేకరించవలసి వస్తుందని కూడా కోర్టు ఆదేశించింది. తివారీ రక్తం నమూనాను పోలీసుల సహకారంతో తీసుకోవడానికి ఓ కమిషనర్‌ను నియమించాలని రోహిత్ శేఖర్ కోర్టును కోరారు. ఈ కేసుకు సంబంధించి తమకు సమర్పించిన ఫొటోలపై వివరణ ఇవ్వాలని కోర్టు తివారీకి ఆదేశాలు జారీ చేసింది. వివరణ ఇవ్వలేకపోతే స్వయంగా కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తివారీ వివరణ ఇవ్వకపోవడం వల్లనే వివాదం తలెత్తుతోందని, వివరణ ఇస్తే వివాదం ముగుస్తుందని కోర్టు తెలిపింది. వివరణ ఇవ్వకపోతే మే 20న తివారీ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.
చివరకు సుప్రీం కోర్టు, హైకోర్టు ఆదేశాలతో తివారీ మే 29న డెహ్రాడూన్‌లోని తన నివాసంలో రక్త నమూనాలను ఇచ్చారు. ఎన్ డిఎ పరీక్షల నివేదికని బహిర్గతం చేయవద్దని తివారీ విజ్ఞప్తి చేశారు. అయితే ఆ నివేదికను బహిరంగ పరచాల్సిందేనని రోహిత్ శేఖర్, ఉజ్వల శర్మ కోరారు. హైదరాబాదుకు చెందిన డిఎన్ఎ ఫింగర్ ప్రింట్స్, డయాగ్నస్టిక్స్ కేంద్రం తివారీ, రోహిత్, ఉజ్వల శర్మల డిఎన్ఎ పరీక్షల నివేదికను ఇటీవల కోర్టుకు సమర్పించింది.
డీఎన్ఏ పరీక్షలను బహిర్గతం చేయవద్దంటూ తివారీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. రోహిత్ శేఖర్ తండ్రి ఎన్ డీ తివారీయేనని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. డీఎన్ఏ పరీక్షల నివేదికను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేవా ఖేత్రపాల్ శుక్రవారం విడుదల చేశారు. ఇద్దరి డీఎన్‌ఏలూ ఒక్కటే అని కోర్టు నిర్దారించింది. రోహిత్ శేఖర్ ఉజ్వల శర్మ, తివారీలకు కలిగిన సంతానమేనని కోర్టు తీర్పులో పేర్కొంది.

Friday, July 27, 2012
యువత చూపు..‘ఫ్యాషన్’ వైపు
ఒకప్పుడు అమ్మాయిలు జీన్‌ప్యాంట్లు, టీషర్టులు ధరిస్తే సమాజం అంగీకరించేది కాదు. కానీ, నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. యువతీ, యువకులు వర్థమాన ఫ్యాషన్ పోకడలను పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. గతంతో పోలిస్తే వేషధారణలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కేవలం నగరాలు, పట్టణాల్లోనే కాకుండా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ ఫ్యాషన్లు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంప్రదాయ కోర్సులైన ఇంజనీరింగ్, మెడిసిన్‌లకు దీటుగా ఫ్యాషన్ రంగం కూడా విద్యార్థులను తనవైపు ఆకర్షిస్తోంది. మిగతా కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులతో సమానంగా ఈ రంగంలోనూ ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉండడంతో ఇటీవలి కాలంలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులకు ఆదరణ పెరిగింది. గ్లామర్ ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని తహతహలాడే యువతకు చక్కటి అవకాశాలను ఇస్తూ వారిలోని సృజనాత్మకతను వెలికితీస్తున్నదిగా ఫ్యాషన్ రంగానికి ప్రాముఖ్యత ఉంది. అయితే, ఈ రంగంలో రాణించడానికి కఠోర శ్రమతో పాటు చక్కటి వ్యక్తిత్వం కూడా అవసరమని నిపుణులు సెలవిస్తున్నారు. నైపుణ్యాలే కీలకం ఫ్యాషన్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించాలని భావించే యువతకు సహజసిద్ధంగా వచ్చిన కౌశలాలతో పాటు అభ్యసించిన అంశాలపై మంచి పట్టు ఉండాలి. ఎప్పటికప్పుడు మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్‌లు, రంగుల కాంబినేషన్లపై అవగాహన, ఆకట్టుకునేలా గార్మెంట్స్ డిజైనింగ్ వంటిని ఇందులో ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. అకడమిక్స్‌లో పెద్దగా రాణించకపోయినప్పటికీ, చక్కటి ఆప్టిట్యూడ్, టాలెంట్‌లు ఉంటే ఈ రంగంలో రాటుదేలడం పెద్ద కష్టమేమీ కాదు. సంస్కృతీ, సంప్రదాయాలకు పెద్దపీట వేసే భారతదేశంలో సైతం కొనే్నళ్ళుగా ఫ్యాషన్ డిజైనింగ్ రంగానికి మంచి ఆదరణ లభిస్తోంది. డ్రాయింగ్, పెయింటింగ్, హోం సైన్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ వంటి విషయాల పట్ల ఆసక్తి కలిగిన విద్యార్థులు ఫ్యాషన్ రంగంలో కాస్త సులభంగా నిలదొక్కుకోగలరు. వీటితో పాటు కలర్ కాంబినేషన్లు, షేడ్స్, టెక్స్చర్లు, కొత్త డిజైన్లు, ప్యాటర్న్స్ వంటివాటిపై ఎక్కువ సాధన చేయాల్సి ఉంటుంది. కోర్సులు కాస్త ఖరీదే... ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు అభ్యసించాలంటే కాస్త ఖర్చుతో కూడుకున్న పనే. ఫీజులు సంస్థలను బట్టి మారుతుంటాయి. కనీసం ఏడాదికి రూ.60 వేల వరకు ఒక విద్యార్థికి వ్యయమవుతుంది. అయితే, కొన్ని ఫ్యాషన్ అకాడమీలు మెరిట్ ఆధారంగా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నాయి. వీటి ద్వారా ట్యూషన్ ఫీజు భారాన్ని తగ్గించుకునే వెసులుబాటు ఉంటుంది. ఉపాధి అవకాశాలు... ఇప్పుడిప్పుడే మన దేశంలో దూసుకుపోతున్న ఫ్యాషన్ రంగంలో వేలకొద్దీ అవకాశాలు అభ్యర్థుల కోసం సిద్ధంగా ఉన్నాయి. ఫ్యాషన్ డిజైన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు స్వయం ఉపాధి ద్వారా కూడా సంపాదించడానికి బోలెడు మార్గాలు ఉండడం మరో విశేషం. గార్మెంట్ స్టోర్ చైన్లు, టెక్స్‌టైల్ మిల్లులు, లెదర్ కంపెనీలు, బొటిక్‌లు, ఫ్యాషన్ షో ఆర్గనైజర్లు, జువెల్లరీ మాల్స్, మీడియా రంగాల్లో ఫ్యాషన్ డిజైనర్లకు మంచి అవకాశాలు ఉన్నాయి. నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనం ఇచ్చి మరీ నైపుణ్యం ఉన్న ఫ్యాషన్ డిజైనర్లను తీసుకుంటున్న సంస్థలున్నాయి. ఒకసారి ఈ రంగంలో పేరుప్రఖ్యాతులు సంపాదిస్తే ఇక వారి సంపాదనకు ఆకాశమే హద్దని చెప్పాలి. మన దేశానికి చెందిన ఎందరో ప్రముఖ డిజైనర్లు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. భారతీయ గార్మెంట్స్, డిజైనర్ శారీస్, టెక్స్‌టైల్స్‌లకు విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉండడం వీరికి కలిసొస్తోంది. రానున్న పదేళ్ళ కాలంలో భారతదేశంలో ఫ్యాషన్ డిజైనింగ్ పరిశ్రమ టర్నోవర్ వెయ్యికోట్ల రూపాయలకు చేరుకుంటుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. భవిత ఎలా ఉంటుంది... ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు పూర్తి చేసిన వారికి డిజైనర్ వేర్, ప్రొడక్షన్, ఫ్యాషన్ మార్కెటింగ్, ప్లానింగ్, కానె్సప్ట్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో తమ సత్తా చాటుకోవడానికి అవకాశం లభిస్తుంది. వీటితో పాటు ఫ్యాషన్ మీడియా, డిజైన్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ యాక్సెసరీ డిజైన్, క్వాలిటీ కంట్రోల్, బ్రాండ్ల ప్రమోషన్‌లోనూ పాలు పంచుకోవచ్చు. కాస్ట్యూమ్ డిజైనర్, ఫ్యాషన్ కన్సల్టెంట్, పర్సనల్ స్టైలిస్ట్, టెక్నికల్ డిజైనర్, గ్రాఫిక్ డిజైనర్, ప్యాటర్న్ మేకర్, ఫ్యాషన్ కోఆర్డినేటర్ వంటి అవకాశాలూ ఈ రంగంలో అభ్యర్థులను రారమ్మంటూ ఆహ్వానిస్తున్నాయి. మంచీచెడులు... కఠోర శ్రమతో పాటు ఆకట్టుకునే సృజనాత్మకత ఉంటేనే ఈ రంగంలో మనగలమని యువత గుర్తించాలి. ప్రాథమిక దశలో పేరొందిన ఫ్యాషన్ డిజైన్ సంస్థలో అసిస్టెంట్‌గా పనిచేసి అనుభవం సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆర్థిక స్థోమతను బట్టి సొంతంగా స్టూడియో నెలకొల్పడం ద్వారా సొంతంగా డిజైనింగ్ చేసుకోవచ్చు. ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తే గానీ ఇనె్వస్టర్ల చూపు పడదని గ్రహించాలి. ఎక్కడ అభ్యసించాలి... పాఠశాల విద్య పూరె్తైన తర్వాత కొన్ని కోర్సులు, ఇంటర్ పూర్తయిన తర్వాత మరికొన్ని కోర్సులను ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ టెక్నాలజీ సంస్థలు ఔత్సాహిలకు అందిస్తున్నాయి, జువెల్లరీ డిజైన్, నిట్‌వేర్ డిజైన్, ఫుట్‌వేర్ డిజైన్, లెదర్ డిజైన్‌లు స్పెషలైజేషన్‌లుగా ఈ కోర్సులుంటాయి. మరెన్నో డిప్లమా కోర్సులు కూడా పలు విద్యాసంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. కోర్సులను అందిస్తున్న పలు సంస్థల వివరాలు... * అపీజే ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్, మెహ్రాలీ బాదర్‌పూర్ రోడ్, న్యూఢిల్లీ. (www.appejay.edu) * నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్, పాల్దీ, అహ్మదాబాద్. (www.nid.edu) * నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, న్యూఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై, ఛండీఘర్, బెంగుళూరు. (www.niftindia.com) * పెరల్ అకాడమీ ఆఫ్ ఫ్యాషన్, న్యూఢిల్లీ. ( www.pearlacademy.com)
-ఠయ్యాల శశికాంత్,Andhrabhoomi.net
Saturday, July 21, 2012
పరమ పధానికి పవిత్ర మాసం రంజాన్
పవిత్రతే పరమపద సోపానంగా
ముస్లిం సోదరులు భావించే మాసం రంజాన్. పసిపిల్లల నుంచి పెద్దవారి వరకు
అందరి హృదయాలలో పవిత్రతని..
అంతకు మించిన భావనని నింపే మాసం ఇదే..
మానవాళికి ముక్తి మార్గాన్ని చూపించేందుకు
దైవం పంపిన పరమ పవిత్రమైన ''ఖురాన్'' గ్రంథం అవతరించిన మాసమిది.
అందునా మన భారతావనిలో
పరమత సహనానికీ ప్రతీకగా నిలచేలా
ఈ పండుగ జరుపుకోవటం ఆనవాయితీ....
రంజాన్ లేదా రమదాన్ ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం మతస్తులు ఆచరించే ఒక ఉపవాస దీక్షా వ్రతం మరియు ఇస్లామీయ కేలండర్‌లోని ఒక నెల పేరు నెలల క్రమంలో తొమ్మిదవది.పండుగ, పర్వదినం అంటే శుభవేళ, ఉత్సవ సమయం అని అర్థం. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తున్నాయి. పండుగ అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే.... దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది. పండుగ మానావాళికి హితాన్ని బోధిస్తుంది. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ సైతం ఇదే హితాన్ని మావవాళికి అందిస్తుంది. తెలుగు వారి మాదిరిగానే ముస్లింలు 'చాంధ్రమాన కేలండర్''ను అనుసరిస్తారు. చాంధ్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల రంజాన్. దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం. దివ్వ ఖురాన్ గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే. రంజాన్ మాసం.
ఆత్మ ప్రక్షాళనకు త్రికరణ శుద్ధితో ఉండే ఉపవాస వ్రతాన్నే ''రోజా'. ఈ ఉపవాసాల వలన మానవాళి చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం లభిస్తుంది. ఆకలి కోసం అలమటించే అన్నార్తుల బాధలను స్వయంగా అనుభవించడమే ఈ ఉపవాసాల ఉద్దేశం. దీనివల్ల ఉపవాసం ఉన్న వారిలో సాటివారిపట్ల సానుభూతితోపాటు దైవ చింతన కూడా కలుగుతుందని భావన. ఈ నెల రోజుల పాటు రాత్రి వేళ ''తరావీహ్'' నమాజును నిర్వహిస్తారు. ప్రతి వంద రూపాయలకు రెండున్నర రూపాయల చొప్పున పేదలకు ''జకాత్'' పేరుతో దానం చేస్తారు. ''ఫిత్రా'' రూపంలో పేదలకు గోధుమ పిండిని దానం చేస్తారు. జకాత్, ఫిత్రాల పేరుతో అన్నార్తులకు వితరణ చేయడం పుణ్యాన్నిస్తుంది. మహమ్మద్ ప్రవక్త బోధించిన నియామాలను అనుసరించి ప్రతి రోజూ సూర్యదోయంలో జరిపే ''సహరి'' నుంచి, సూర్యాస్తమం వరకు జరిపే ''ఇఫ్తార్'' వరకు మంచి నీళ్లను సైతం త్యజించి కఠోర ఉపవాస దీక్ష చేపడతారు. అతిధులు, అభ్యాతుల సాంగత్యంలో సహరీలు ఇఫ్తార్లు జరుపుకుంటారు. ఉపవాస వ్రతాలను ఆచరించడం వల్ల మనుషుల్లో వారి వారి దైనందిన జీవితాల్లో తప్పకుండా మార్పులు సంభవిస్తాయి. గతం కంటే వారు ఎంతో పవిత్రంగా, శాంతికాముకులుగా పరివర్తన చెందుతారు. రంజాన్ స్త్రీ, పురుషులందరూ ఉపవాస వ్రతాన్ని తప్పనిసరిగా పాటించాలని ఆదేశించిన భగవంతుడు చిన్న పిల్లలకు, వృద్ధులకు, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో స్త్రీలకు, వ్యాధిగ్రస్తులకు కొన్ని మినహాయింపులు ప్రసాదించాడు. వీరందరికీ ఉపవాస వ్రతం నుంచి మినహాయింపు ఉంది. కేవలం ఆహారం తీసుకోకపోవడమే ఉపవాస లక్షణం కాదు. ఆహారంతోపాటు వారు చెడు ప్రవర్తనకూ, చెడు చేష్టలకు కూడా దూరంగా ఉండాలి. ఈ లక్ష్యాన్ని ప్రతి సోదరుడూ గుర్తెరిగి దీక్ష వహిస్తాడు. కాబట్టి వారిలో దైవ భీతితో కూడిన నిస్వార్ధపర్వతం పెంపొంది ఆత్మ శుద్ధి చేసుకుని భగవంతుని దీవెనలు పొందుతారు.
నిష్ట నియమాలు
రంజాన్ మాసం ప్రారంభమైన నాటి నుంచి ముగిసేవరకూ ముస్లింలు పగలు నిష్టగా 'రోజా' ఉపవాస దీక్షలను పాటిస్తారు. కేవలం ఆహార పానీయాలను మానివేయడం మాత్రమే రోజా కాదు. నిష్టనియమాలతో కూడుకున్న జీవన విధానం అది. తెల్లవారుజామున భోజనం చేసిన తర్వాత ఉపవాసం ఉండే భక్తులు సాయంత్రం సూరా ్యస్తమయం తర్వాత దీక్షను విరమిస్తారు. తెల్లవారుజామున ఆహారం తీసుకోవడాన్ని'సవార్'అని సాయంత్రం ఉపవాస వ్రత దీక్ష విరమణలో తీసుకునే ఆహారాన్ని 'ఇఫ్తార్' అని అంటారు. అంటే రంజాన్ నెలలో ప్రతిరోజు సూర్యోదయం పూర్వం నుంచి సూర్యాస్తమయం వరకు సుమారు 13 గంటల పాటు కఠిన ఉపవాస దీక్షలు పాటిస్తారు. ఉపవాస దీక్ష పాటించేవారు అబద్దం ఆడకుండా, పరనిందకు పాల్పడకుండా గడపడంతో పాటు, శారీ రక, మానసిక వాంఛలకు దూరంగా, నిగ్రహంతో వుంటూ ఆసాంతం దైవచింతనతో గడుపుతూ వుంటారు. ఈ ఉపవాస దీక్ష లక్ష్యం మనిషిలో దైవభీతి. దేవుడిపట్ల నమ్మకం మొదలైన మహత్తరమైన సుగుణాలున పెంపొందిం పజేయడమే! దీనిని ఖురాన్ 'తఖ్వా' అని అంటుంది.
ఉపవాస నిధి
రంజాన్ మాసంలో ఉపవాసదీక్షలను పూర్తి నెల రోజుల పాటు పాటించడం అనేది వయోజనులైన స్త్రీ పురుషులం దరికీ విధిగా నిర్ణయించబడింది. అయితే వృద్ధులు, పిల్లలు, వ్యాధిగ్రస్తులు, ప్రయాణంలో ఉన్నవారు ఈ విధి నుంచి మినహాయింపబడ్డారు. దివ్వఖురాన్ ఉపవాస విధిని గురించి, రంజాన్ నెలలో విధిగా నెలంతా ఉపవాసం పాటించాలి. అయితే ఎవరైనా ప్రయాణంలో వుంటెె వ్యాధిగ్రస్తులయితే వారు ఆ ఉపవాసాలను వేరే రోజులలో పూర్తి చేయాలి. దేవుడు మీకు సౌలభ్యం కలుగజేయాలని భావిస్తూ ఉన్నాడు కానీ, మిమ్మలను ఇబ్బందులలో పడవేయాలని అనుకోవడం లేదు అని పేర్కొంది. రంజాన్ అనగా ఉపవాస దీక్షలు మాత్రమే కాదు మనిషిలోని చెడు భావనల్ని, ఆధర్మాన్ని ద్వేషాన్ని రూపుమాపేది. ఈ మాసంలో పేదవాడికి ఒక పూట నీవు ఆహారం పెడితే నీకు ఆ అల్లా వేయి పూటలు ప్రసాదిస్తాడు.
గల్ఫ్‌లో రంజాన్
భారతదేశంలో ముస్లింలు రాత్రి నిద్రపోయి తెల్లవారి నాలుగు గంటలకు లేచి సహర్ చేస్తారు. గల్ఫ్ దేశాల్లో రాత్రంతా తింటూ తెల్లవారు జామున సమాజ్ చదివి పడుకుంటారు. రంజాన్ నెల మొత్తం రెస్టారెంట్లు రోజంతా మూసివేస్తారు. బహిరంగంగా తినకూడదని, తాగకూడదని హెచ్చరికలుంటాయి. దుబాయిలోని ఏకైక హిందూ దేవాలయమైన కృష్ణ మందిరంలో భక్తులకు ప్రసాదాన్ని రంజాన్ నెలలో ఇఫ్తార్ వేళల తర్వాతే ఇస్తారు. అరబ్బులు గల్ఫ్‌లోని అన్ని మసీదులలో రంజాన్ సందర్భంగా పౌష్టికాహారాన్ని నెల రోజుల పాటు ఉచితంగా సరఫరా చేస్తారు. బహిరంగంగా తింటూ కనిపిస్తే శిక్ష తప్పదు.మసీదుల ముందు బిక్షాటన చేసే వారికి కాకుండా ప్రభుత్వం ఆమోదం పొందిన చారిటీలకు మాత్రమే జకాత్ సొమ్మును ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ బిచ్చగాళ్ల బెెడద విపరీతంగా ఉంటుంది. భారత్, బంగ్లాదేశ్, ఇరాన్, యెమన్ దేశాలలో ఇది మరీనూ... అందుకే మక్కా, మదీనా పుణ్యక్షేత్రాలలో ప్రత్యేక వాహనాలలో బిచ్చగాళ్ల నిర్మూలన దళాలు 24 గంటలూ పనిచేస్తాయి. స్వదేశానికి వెళ్లడానికి విమానం టిక్కెట్లకు డబ్బు లేకుండా జైళ్లలో మగ్గుతున్న భారతీయులకు మతంతో నిమిత్తం లేకుండా తమ జాకత్ సొమ్ముతో విమాన టిక్కెట్లను అనేకమంది అరబ్బులు అందించడం విశేషం.
ఏతేకాఫ్
ఈ విధంగా అత్యంత నిష్టనియమాలతో ఉపవాస దీక్షలతో గడిపే ముస్లింలు రాత్రింబవళ్లు నమాజులో లీనమై ఉంటారు. సాధారణంగా ముస్లింలు ప్రతిరోజు ఐదుసార్లు నమాజు చేయడం అందరికీ తెలిసిందే! వీటికి తోడు రంజాన్ నెలలో ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. ఈ నెలలో సాయం సంధ్యవేళలో (ఇఫా) ఫర్జ్ నమాజ్ తర్వాత అదనంగా ఇరవై రకాల తరావీహ్ నమాజ్ చేస్తారు. ఇది నెలంతా నిర్వహిస్తారు. రంజాన్ నెల 21వ రోజు నుంచి చివరి వరకూ ఒక ప్రత్యేకత వుంది. 'ఏతెకాఫ్', ఏతెకాఫ్ అంటే ఒకరకమైన తపోనిష్ట. దీనిని పాటించదలచినవారు మసీదులోనే ఒక ప్రక్క డేరాలా ఒక తెరను కట్టుకుని అక్కడ దైవధ్యానం, ప్రార్థనలు, ఖురాన్ పారాయణం చేయ డంలో నిమగ్నమై ఉంటారు. ఈ సమయంలో ఏతెకాఫ్ ఉన్న వారు బలమైన కారణం ఉంటే తప్ప మస్జిద్ వదిలి బయటకు పోకూడదు.
షబ్ ఎ ఖద్ర్
రంజాన్ నెలలోని 27వ తేదీన షబ్ ఎ ఖద్ర్ జరుపుకుంటారు. దివ్యఖురాన్ ఈ రోజుకే అవతరించిందని భావించే ముస్లిం సోదరులు ఆ రోజు రాత్రి జాగరణ చేసి ప్రార్ధనలు చేస్తూ గడుపుతారు. ఆ రాత్రి భక్తితో కఠోర దీక్షతో ప్రార్థనలు చేసేవారికి 83 సంవత్సరాల పాటు ప్రార్థనలు చేసిన ఫలితం దక్కుతుందనే నమ్మకం వుంది. ఆ రాత్రి చేసే ప్రార్థనల వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని భావిస్తాం.
జకాత్
రంజాన్ నెలలో మరొక విశేషం అత్యధిక దానధర్మాలు చేయడం. సంపాదనాపరులైనవారు. సంపన్నులైనవారు రంజాన్ నెలలో జాకత్ ఆచరించాలని ఖురాన్ భోధిస్తోంది. ఆస్తిలో నుంచి నిర్ణీత మొత్తంను పేదలకు దానం చేయడాన్ని జకాత్ అంటారు. దీనిని పేద ఆర్థిక హక్కుగా పేర్కొంటారు. దీని ప్రకారం ప్రతి ధనికుడు సంవత్సరాం తంలో మిగిలిన తన సపంద నుంచి రెండున్న శాతం చొప్పున ధర, వస్తు, కనకాలను ఏవైనా నిరుపేదలకు దానంగా ఇస్తారు. పేదవారు కూడా అందరితో పాటు పండుగను జరుపుకొనడానికి, సంతోషంలో పాలుపంచుకునేందుకు ఈ జకాత్ ఉపయోగపడుతుంది.
ఫిత్రా
జకాత్ తో పాటు ఫిత్రా దానానికి రంజాన్ నెలలో ఎంతో ప్రాముఖ్యత వుంది. మూడుపూటల తిండికి, ఒంటినిండా బట్టకు నోచుకోని పేదవారు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి అభాగ్యులకు, పేదవారికి పండుగ సందర్భంలో దానం చేయాలని ఇస్లాం మతం ఉద్భోధిస్తుంది. దీనినే 'ఫిత్రాదానం' అని పిలుస్తారు. ఉపవాసవ్రతాలు విజయవంతంగా ముగిసినందుకు దేవుడి పట్ల కృతజ్ఞతగా... పేదలకు ఈ ఫిత్రాదానం విధిగా అందజేస్తారు. ఈ ఫిత్రాదానంలో 50 గ్రాముల తక్కువ రెండు కిలోల గోధుమలను గానీ, దానికి సమానమైన ఇతర ఆహార ధాన్యా లను గానీ, ధనాన్ని గాని పంచిపెట్టాలి. ఈ దానం కుటుంబంలోని సభ్యులందరి తరపున పేదలకు అందజేయాలి. దీనివలన సర్వపాపాలు హరించబడి, పుణ్యం దక్కుతుందనే నమ్మకం ఉంది.దైవ ప్రవక్త ఫిత్రాధానాన్ని విధిగా నిర్ణయించడానికి కారణం ఉపవాస వ్రత నియమాన్ని పాటించే సమయంలో హృదయంలో కలిగే చెడు తలంపు లు, ఆలోచనలు, నోటినుంచి వెలువడే అసత్యాలు, పనికిమాలిన మాటలు ఫిత్రాదానం వల్ల క్షమించ బడతాయి. అని మహామ్మద్ అనుచరుడు అబ్దుల్లా బిన్ మసూద్ తెలిపాడు.
షవ్వాల్
ఈ విధంగా రంజాన్ నెల అంతా పవిత్ర కార్యక్రమాలతో ముగుస్తూనే... 'షవ్వాల్' నెలవంక ప్రత్యక్షమవుతుంది. ఈ నెలవంక దర్శనమిస్తూనే ముస్లిం సోదరులు ఉపవాసవ్రతాన్ని విరమించి... మరుసటి రోజు రంజాన్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో, సంతోషానందాలతో జరుపుకుంటారు. షవ్వాల్ నెలవంక మొదటి రోజున జరుపుకునే రంజాన్ పండుగను ఈదుల్‌ఫితర్ అని అంటారు.
ఈద్‌ముబారక్
ఈ పండుగను పేద, ధనిక తేడా లేకుండా అత్యంత భక్తి ప్రవత్తులతో జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి పండుగ నమాజును ఊరిబయట నిర్ణీత ప్రదేశాలైన ఈద్‌గాహ్‌లలో చేస్తారు. అనంతరం ఒకరికొకరు ఈద్‌ముబార్(శుభాకాంక్షలు) తెలుపుకుంటారు. ఈ నమాజ్ కోసము వెళ్లడానికి ఒకదారి, రావడానికి ఇంకొక దారిలో రావలెెను.
ఇఫ్తార్ విందు
ఈ నెలలో జరిగే విందులో ఆత్మీయత సహృద్భావాలు ప్రసుష్ఠమవుతాయి. పరస్పర ధోరణికి, విశాల ఆలోచనా దృక్పథానికి ఇవి నిదర్శనం.ఈ విధంగా పవిత్ర ఆరాధనలకు ధార్మిక చింతనకూ, దైవభీతికి, క్రమశిక్షణకూ, దాతృత్వానికి రంజాన్ నెల ఆలవాలం అవుతుంది. మనిషి సత్ఫ్రవర్తన దిశలో సాగడానికి మహమ్మద్ ప్రవక్త బోధించిన మార్గాన్ని రంజాన్ సుగమం చేస్తుంది.
రంజాన్ పండుగ విశిష్టత
వివేకపు ద్వారాలు తెరచి సౌహార్ధ సమభావాల్ని పంచాలనే దైవ ఆదేశాన్ని పాటించడానికి అమలిన హృదయాలతో ఒకరికొకరు సహయపడాలి. ఇందుకు సామూహిక శక్తి అవసరం. ఈ శక్తిని కలిగించేది నమాజ్ దుష్టచింతనల్ని. దురాగతాల్ని, కుహనా సంస్కారాన్ని నమాజ్ ఎదుర్కొగలదు. సత్ప్రవర్తనను నేర్పించగలదు. సత్ప్రవర్తనగల వ్యక్తి సర్వేశ్వరుని దృష్టిలో అందరికన్నా మిన్న (ఖురాన్ 49:13) ఈద్‌ను శ్రామికుని వేతనం లభించే రోజు అని ఖురాన్ విస్పష్టం చేసింది. నెల రోజులు కఠోరవ్రతం పాటించినవారి శ్రమకు పరిపూర్ణ ప్రతిఫలం ఈ రోజే లభిస్తుందని విశ్వాసం. పర్వదినాన ఉదయం స్నానపానాదులు ముగించుకుని వస్త్రాలు ధరించి సుగంధం పన్నీరు పూసుకుని తక్బీర్ పఠిస్తూ ఈద్‌గాహ్ చేరుకుంటారు. అక్కడ ప్రార్థన చేస్తారు. ఇహ్‌దినస్సిరాత్ ముస్తఖీమ్ (మాకు సన్మార్గాన్ని చూపు). సమస్త మానవాళి హృదయాల్ని సద్బుద్ధితో నింపాలని కోరుతారు. ఈద్‌గాహ్‌లో నమాజ్ పూర్తి అయిన అనంతరం అక్కడ సమావేశమైన వారిలో వీలైనంత ఎక్కువ మందిని కలిసి సుహృద్భావంతో చేతులు కలుపుతారు. హృదయాలు సన్నిహితమవుతాయి. సద్గుణాల పరిమళం పరిఢవిల్లుతుంది. ఈద్ ముబారక్ తెలియజేసుకుంటారు. అనంతరం ముస్లిమేతర సోదరుల్ని ఇంటికి ఆహ్వానిస్తారు. అమితానందంతో పరస్పరం ఆలింగనం చేసుకుంటారు. విందు ఆరగిస్తారు. ఈద్‌విలాప్ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ మతసామరస్యానికి, పరస్పర సదవగాహనకు, సమైక్యతకు ప్రతీకలు. మతసహనం మానవలోకానికి మణికిరీటంగా భావిస్తే, మనిషి మనిషిగా జీవిస్తే భగవంతునికి ఎనలేని హర్షం. ప్రతి వ్యక్తి నిస్వార్ధ సేవ చేస్తే జీవితంలోని వాస్తవిక ఆనందం బోధపడుతుంది. ఇతరుల శ్రేయం కోసం జీవిస్తే అది విరాటజీవనంలో పదార్పణమవుతుంది. అప్పుడే సర్వేశ్వురుడు మన జీవితాలకు సాఫల్యం సమకూరుస్తాడు. తన హృదయ వైశాల్యాన్ని ప్రతి వ్యక్తీ లోకానికి చాటినప్పుడే జన్మకు సార్ధకత, సంపూర్ణత. అది డబ్బు గడించడం వల్ల రాదు. కోరికలు నెరవేర్చుకోవడం వల్ల ఒనగూడదు. ఇది అనంత జీవిత సత్యం. పర్వదినాల సారాంశం.
పవిత్ర భావనల రోజా
ఉపవాసదీక్ష అంటే కేవలం అన్నపానీయాలకే కాకుండా చాలా విషయాలకు వర్తిస్తుంది. అల్లా నిషేధించిన చెడుమాటలను నోటితో పలకకూడదు. చెడుమాటలు చెవులతో వినరాదు. చెడును కళ్ళతో చూడొద్దు. ఏ పనులైతే అల్లాకు నచ్చవో చేతులద్వారా వాటిని చేయకూడదు. వెళ్ళరాని చోట్లకు వెళ్ళకూడదన్న నియమాలు కూడా ఉన్నాయి. రోజా పాటిస్తున్న సమయంలో పవిత్ర భావాలతో ఉండటమే కాకుండా, ఎక్కువ సమయం దైవప్రార్థనలో గడపాలి. ఇస్లాంమత చివరి ప్రవక్త మహమ్మద్ సల్లెల్లాహు అలైహివసల్లం నమాజ్, రోజాలను స్థాపించారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ముస్లిం నడవాలి.
- మహమ్మద్ ఇస్మాయిల్ హుస్సేన్, పిసిసి మైనారిటీవిభాగం రాష్ట్ర కన్వీనర్,
వరల్డ్ హ ూ్యమన్ రెట్స్ ప్రొటెక్షన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు.
Tuesday, July 17, 2012
లక్ష్మీపేట కథ ఇక ఇంతేనా?
|
Thursday, July 5, 2012
కాలం
కాలం నా డైరీలొని కాగితాలు కావు
కాలం నా హృదయంలో నిలిచిపోయే భావాలూ
కాలం నాలో జ్ఞానం పెంచే అనుభవాలు
కాలం నా పెదువులపై మెరిసే చిరునవ్వులు
కాలం నా కంటి నుండి జారే చిరు చినుకులు
కాలం నా చుట్టూ మనషుల ప్రేమ ద్వేషాలు
కాలం పెరిగే నా వయసు
కాలం కరిగే జీవితం
Original post :http://venkatmails.com/%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B0%82/

క్షమించు నేస్తం!
క్షమించు నేస్తం!
తప్పు నాది కాదు -
ఎప్పుడో వెళ్ళిపోయిన రైలుబండికి
ఇప్పుడు టికెట్ అడుగుతున్నావు నువ్వు!
అయినా పట్టాలలా పడి వుండాలనుకుంటున్నావు!
రైలుతో నువ్వు సాగేదెలా ?
అప్పటికీ నువ్వు లేచి కదుల్తావేమోనని
సిగ్నల్ లైటు గిలగిలా కొట్టుకుంది
మరి లాభంలేక నీరసించి యిప్పుడే ఆరిపోయింది.
గమనించావో లేదో,
మనం మనుష్యులం.
హమేషా కాలంతో ముందుకు సాగటం
మన కవష్యం!
రేపటి హిస్టరీలోకి నీ పేరు కావాలనంటే
ఏదో ఓ తంటా పడి యిరికించేద్దును
కానీ గజనీ మహమ్మదుతోనో
బహమనీ సుల్తానులతోనో
యుద్ధానికి రమ్మంటే -
నేనేమై పోవాలి ?
Source : http://venkatmails.com/%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%AE%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B1%81-%E0%B0%A8%E0%B1%87%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%82/

Monday, July 2, 2012
గృహిణులు.. కొన్ని జాగ్రత్తలు
వంటిల్లే ఒక ప్రత్యేక ప్రపంచం. నిరంతరం వంటింటిలో సంచరించే ఇల్లాలు ఎన్నో మెళకువలు, జాగ్రత్తలు తీసుకుంటేనే గానీ వంట పని పూర్తికాదు.
గ్యాస్‌స్టౌవ్‌తో ప్రతిరోజూ అవసరమే. జాగ్రత్తగా ఉపయోగించాలి. గ్యాస్ సిమ్‌లో సరిగా వెలుగుతుందో లేదో చెక్ చేసుకుని వంట మొదలుపెట్టండి. రిపేరులో ఉన్న స్టౌవ్‌ని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బాగు చేయించుకోవటమో లేదా కొత్త స్టవ్ కొనుక్కోవడమో చెయ్యాలి. వంటిల్లు వెలుతురుగా ఉండేలా చూసుకోవాలి. అలాగే, ప్రెషర్ కుక్కర్‌ను శుభ్రపరచడానికి గట్టి పదార్థాలను వాడరాదు. వాటిమీద చారలు పడతాయి. అందుకని మెత్తని వాషింగ్ క్రీమ్‌లనే వాడాలి. ప్రెషర్ కుక్కర్‌ను క్లీన్‌చేసేముందు దానిని వేడి చెయ్యండి. పైభాగాన్ని అమ్మోనియా, కింద భాగంలో మరుగుతున్న నీరు ఉంచండి. ఇలా కొద్దిసేపు తర్వాత చల్లార్చి చన్నీళ్ళతో కడిగేయాలి. ఇందువల్ల కుక్కర్ పూర్తిగా శుభ్రపడటమే కాకుండా తళతళలాడిపోతుంది. వేడినీళ్ళతో వాషింగ్ సోడా ఉపయోగించి, స్టెయిన్‌లెస్ స్టీలు పాత్రలు శుభ్రపరచవచ్చు. సిల్వర్ పాత్రలు కూడా ఇలాగే శుభ్రపరచుకోవచ్చు. కొయ్య పాత్రలను శుభ్రపరచడానికి ఆలివ్ నూనెలో ముంచిన మెత్తని ఊలు గుడ్డతో రుద్దితే మరకలు పోతాయి. గాజు పాత్రలను శుభ్రపరచడానికి టూత్‌పేస్టుని వాడవచ్చు. అది మెత్తగా, సున్నితంగా ఉంటుంది. దానిలో ఉన్న రసాయనిక పదార్థాలు గాజును శుభ్రపరుస్తాయి. తర్వాత నీళ్ళతో కడిగేస్తే గాజు పాత్రలు మెరిసిపోతాయి. కొయ్యగాని, దంతంగాని, చైనా హేండిల్సున్న పాత్రలను నీళ్ళల్లో తడపకూడదు. అల్యూమినియం పాత్రలను శుభ్రపరచటానికి వెనిగర్ చుక్కలు వేసిన నీటిలో నానబెట్టి, ఆ తర్వాత శుభ్రమైన నీళ్ళతో కడిగేయాలి. చేతులను వంట చేసేటప్పుడు మధ్య మధ్యలో కడిగేసుకుంటుంటే ఏ వంటకానికి ఆ వంటకం ప్రత్యేకంగా చేసే వీలుంటుంది. అన్నీ ఒక్కసారి చేసేయడం వలన పదార్థాల రుచులు మారతాయి.
-హిమజా రమణ ( Andhrabhoomi Daily )

Subscribe to:
Posts (Atom)