Sunday, December 8, 2024

చందమామ కథలు: ఆస్తిపంపకం

 ఒక వర్తకుడికి అద్దరు కొడుకులు. పెద్దవాడు స్వార్ధపరుడు, చిన్నవాడు అమాయకుడు. తన అనంతరం చిన్నవాణ్ణి పెద్దవాడు మోసం చెయ్యవచ్చునని వర్తకుడు తన కున్నదంతా రెండు. మూటలలో పెట్టి, తాను చచ్చి పోబోతూ కొడుకులను పిలిచి, " అబ్బాయిలూ, నాకున్నది. యావత్తూ రెండు మూటలలో పెట్టి పడమటి గదిలో ఉంచాను. చెరొక మూటా తీసుకుని ఎవరి బతుకు వారు బతకండి." అన్నాడు.
వర్తకుడు పోయాడు. దినవారాలు రేపు పూర్తి అవుతాయనగా పెద్దవాడు రాత్రివేళ పడమటి గది ప్రవేశించి, రెండు మూటలూ విప్పి చూశాడు. ఒక మూటలో పై భాగంలో "వెండి నాణాలున్నాయి; కింది సగంలో మట్టి ఉండ లున్నాయి. రెండో మూటలో పై సగంలో మట్టి ఉండలూ, కింది నగంలో వెండి నాణాలూ ఉన్నాయి. ఇలా ఎందు కున్నాయో పెద్దవాడికి అర్ధం కాలేదు. అందుచేత వాడు వెండి నాణాలన్నీ ఒక మూటలో పోసి, రెండో దానిలో మట్టి ఉండలన్నీ పోసి, మర్నాడు తన తమ్ముడితో, " తమ్ముడూ, నాన్న చెరొక మూటా తీసుకోమన్నాడు. ఈ మూట నేను తీసుకుంటాను, అది నువు తీసుకో." అని తాను వెండి నాణాల మూట తీసుకుని, తమ్ముడికి మట్టి ఉండల మూట ఇచ్చాడు.
తరవాత రెండోవాడు మట్టి ఉండలు మూటలో ఎందు కున్నాయా అని ఒక ఉండను పగలగొట్ట చూస్తే అందులో బంగారు నాణెం ఉన్నది. వాడికి వచ్చినది బంగారు నాణాల మూట !
— అజ్జరపు హనుమంతరావు, బి.ఎస్సి,

No comments:

Post a Comment