వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఇటీవల రెండోసారి కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రిలో చేరారు. అయితే, తాను కరోనా నుంచి కోలుకున్నానని అంబటి రాంబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వైద్యుల సలహా పాటించి హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చికిత్స ముగించుకుని ఇవాళ గుంటూరు వచ్చానని వివరించారు. రెండోసారి ఇన్ఫెక్షన్ రావడం కొంత ఆందోళన కలిగించినా, మీ ఆశీస్సులతో విజయవంతంగా ఎదుర్కోగలిగానని తెలిపారు. త్వరలోనే మీ ముందుకు వస్తాను అంటూ ఉత్సాహం వ్యక్తం చేశారు.