Thursday, September 10, 2015

కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత అరెస్ట్

కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత అరెస్ట్బదులు డిపాజిట్ చెల్లిస్తే వాటిని విద్యార్థి చదువు అయిపోయిన తర్వాత వడ్డీతో సహా ఇస్తానని వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వలేదని బాధితులు సీసీఎస్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కేశవరెడ్డిని అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కేశవరెడ్డి విద్యాసంస్థల పేరిట అనేక విద్యా‌సంస్థ‌ల‌ను ప్రారంభించి ప్రముఖ విద్యావేత్తగా ఎదిగిన కేశవరెడ్డిని కొద్దిసేపటి క్రితం అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.800 కోట్ల మేర డిపాజిట్లు సేకరించిన కేశవరెడ్డి, విద్యార్థుల చదువు అయిపోయి గడువు తీరినా డిపాజిట్ సొమ్మును వెనక్కి ఇవ్వలేకపోయారు. దీనిపై బాధితులు సదరు విద్యాసంస్థల ముందు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కేశవరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 
కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. విద్యార్థులను చేర్చుకునే సమయంలో ఫీజుకు
ఇదిలావుండగా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి వాయిదాలు చెల్లించడంలోనూ కేశవరెడ్డి విఫలమయ్యారు. ఈ క్రమంలో ఆయన విద్యా సంస్థలకు చెందిన ఆస్తులను ఆయా బ్యాంకులు వేలానికి పెట్టాయని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న మీదటే కేశవరెడ్డి వద్ద డిపాజిట్లు చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలకు దిగిన‌ట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలోని నంద్యాలకు చెందిన కేశవరెడ్డి తన సొంతూరులో చిన్న బ‌డి పెట్టు‌కొని అంచెలంచెలుగా ఎదిగారు. ఫిర్యాదుల నేపథ్యంలో కేశవరెడ్దిని నేటి ఉదయం అదుపులోకి తీసుకున్న కర్నూలు పోలీసులు మరికాసేపట్లో ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. రిమాండ్ అనంతరం వారం రోజులపాటు కేశవరెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరనున్నట్లు తెలిసింది.
కాగా కేశవరెడ్డి తమ సంస్థలను విద్యార్థులతోపాటు నారాయణ, చైతన్య (చైనా గ్రూపు) సంస్థలకు విక్రయించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒప్పందం ఖరారైతే తమకు వచ్చే మొత్తం నుంచి బాకీలు తీర్చవచ్చని ఆయన భావిస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నకు డిపాజిటర్లు కంగారు పడాల్సిన అవసరం లేదని, వచ్చే యేడాది అందరి సొమ్ములు తిరిగి ఇచ్చేస్తానని ఆయన ధీమాగా చెబుతున్నారు.

No comments:

Post a Comment