Showing posts with label Special. Show all posts
Showing posts with label Special. Show all posts

Friday, July 18, 2025

గాలిలో ఊగిసలాడే దీపంలా Thandel Bujji Thalli Song Lyrics

తండేల్ మూవీ నుంచి బుజ్జి తల్లి అనే పాటను హీరో-హీరోయిన్ల (నాగ చైతన్య, సాయి పల్లవి) మధ్య మనసుకు హత్తుకునే విధంగా చిత్రీకరించారు. ప్రేమికుల మధ్య ఉన్న బంధాన్ని చాటేలా సాగే ఈ పాట సాగుతుంది...

దేవిశ్రీప్రసాద్‌ స్వరపరచిన ఈ మెలోడీ గీతాన్ని శ్రీమణి రచించగా, జావేద్‌ అలీ ఆలపించారు. బాధలో ఉన్న ప్రియురాలిని కథానాయకుడు ఓదార్చే నేపథ్యంలో ఈ పాట సాగింది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: చందూ మొండేటి.

https://suryaa.com/suryaa-images/cinema-telugu/bigimage/bujjithalli_9886.gif 

 లిరిక్స్ ఇక్కడ చూడండి.

పల్లవి :
గాలిలో  ఊగిసలాడే దీపంలా 
ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం 
నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా 
చీకటి కమ్మెను నీ కబురందక నాలోకం 

సుడిగాలిలో పడి పడి లేచే 
పడవల్లే తడబడుతున్నా ..

నీ కోసం వేచుందే నా ప్రాణం 
ఓ బుజ్జితల్లి
నా కోసం ఓ మాటైనా మాటాడే 
నా బుజ్జి తల్లి ..

చరణం -1 

నీరు లేని చేపల్లే 
తారలేని నింగల్లే 
జీవమేది నాలోన నువ్వు మాటలాడందే 

మళ్ళీ యాళకొస్తానే 
కాళ్ళా యేళ్ళ పడతానే 
లెంపలేసుకుంటానే 
ఇంక నిన్ను యిడిపోనే 

ఉప్పు నీటి ముప్పుని కూడా 
గొప్పగా దాటే గట్టోణ్ణే 
నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే 

నీ కోసం వేచుందే నా ప్రాణం 
ఓ బుజ్జితల్లి
నా కోసం ఓ మాటైనా మాటాడే 
నా బుజ్జి తల్లి 

చరణం -2 

ఇన్నినాళ్ళ మన దూరం 
తియ్యనైన ఓ విరహం 
చేదులాగ మారిందే అందిరాక నీ గారం 

దేన్ని కానుకియ్యాలే 
యెట్లా బుజ్జగించాలే 
బెట్టు నువ్వు దించేలా లంచమేటి కావాలే 

గాలివాన జాడేలేదే రవ్వంతైనా నా చుట్టూ 
ఐనా మునిగిపోతున్నానే దారే చూపెట్టు 

నీ కోసం వేచుందే నా ప్రాణం 
ఓ బుజ్జితల్లి
నా కోసం ఓ మాటైనా మాటాడే 
నా బుజ్జి తల్లి ..


 

Saturday, February 15, 2014

హైదరాబాదు బిర్యానీ @ ప్యారడైజ్

http://www.thehindu.com/multimedia/dynamic/01102/HY03BIRYANI01_1102730g.jpgహైదరాబాదు బిర్యానీ రుచి చూడాలంటే.. ఆ హోటల్ కు వెళ్లాల్సిందే. 1953వ సంవత్సరంలో సికింద్రాబాదులో ‘ప్యారడైజ్ టాకీస్’ పేరిట సినిమా థియేటర్ ఉండేది. సినిమా హాలుకు అనుబంధంగా చాయ్, సమోసా, బిస్కట్ అమ్మే చిన్న టీ దుకాణం ఉండేది. ఇరాన్ నుంచి వలస వచ్చిన హుస్సేన్ హిమ్మతీ దాన్ని నడిపేవారు. కాలానుక్రమంలో ప్యారడైజ్ టాకీస్ కనుమరుగైపోయింది. కానీ, హుస్సేన్ హిమ్మతీ టీ స్టాల్ మాత్రం మెల్లగా ఎదగటం మొదలుపెట్టింది. ప్రారంభంలో 10 మందికి పని కల్పించిన ఆ టీ స్టాల్ ప్రస్తుతం.. 800 మందికి పైగా ఉద్యోగాలు కల్పించిన ప్యారడైజ్ హోటల్ గా ఎదిగింది. హుస్సేన్ తర్వాత ఆయన కొడుకులు అలీ హిమ్మతీ, డాక్టర్ ఖాజీం హిమ్మతీలు ప్యారడైజ్ హోటల్ కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కేలా హోటల్ ను తీర్చిదిద్దారు. జంట నగరాల్లో ఇప్పుడు మొత్తం 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్యారడైజ్ హోటళ్లు విస్తరించాయి. సికింద్రాబాదులోని ఈ హోటల్ నుంచి బిర్యానీ పార్శిల్స్ దుబాయ్, ముంబై, చెన్నై నగరాలకు విమానాల్లో వెళ్తుంటాయి.

కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ హైదరాబాదు నగర పర్యటనలో ప్యారడైజ్ బిర్యానీ రుచి చూశారంటే.. ఈ బిర్యానీ ఎంత ప్రసిద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఎంపీలు ప్రియాదత్, జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, దివంగత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి, మర్రి చెన్నారెడ్డి.. ఇలా చాలా మంది ప్రముఖులు తమ బిర్యానీని ఆప్యాయంగా ఆరగించినట్లు ఖజీం హిమ్మతీ చెప్పారు.

ప్రస్తుతం సికింద్రాబాదు ప్యారడైజ్ తో పాటు హైదరాబాదులో ఆరు ప్యారడైజ్ హోటళ్లున్నాయి. హైటెక్ సిటీ, మాసబ్ ట్యాంక్, ఎన్టీఆర్ గార్డెన్స్, కూకట్ పల్లి, బేగంపేటల్లో ఇవి రుచికరమైన బిర్యానీని నగర వాసులకు అందిస్తున్నారు. త్వరలో దిల్ సుఖ్ నగర్, నాంపల్లి, ఎర్రగడ్డ ప్రాంతాల్లో హోటళ్లు ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు.

Saturday, February 8, 2014

ఒక్క జీమెయిల్ ఐడి తో ఎన్నో చేయోచ్చు ... ఇలా!

నెట్టింట్లో ఏది చేయాలన్నా... గూగుల్‌ గుమ్మం దాటాల్సిందే. అందుకు జీమెయిల్‌ ఎకౌంట్‌ గేట్‌పాస్‌. మెయిళ్లు పంపుతాం. గూగుల్‌ ప్లస్‌కి అనుసంధానం అవుతాం. యూట్యూబ్‌లోకి వెళతాం. ఇంకా చెప్పాలంటే.. గూగుల్‌ డ్రైవ్‌ని వాడుకుంటాం. ఇదంతా తెలిసిందే. జీమెయిల్‌ ఐడీతో ఇంకా చాలానే చేయవచ్చు. డ్రైవ్‌లో బ్యాక్‌అప్‌ చేసుకున్న మ్యూజిక్‌ ట్రాక్స్‌ని అక్కడే వినొచ్చు. మీ ప్రింటర్‌కి అనుసంధానమై ఎక్కడి నుంచైనా ప్రింట్‌లు ఇవ్వొచ్చు. యూట్యూబ్‌ ఛానల్‌ని నిర్వహించొచ్చు. ఇంకా చాలానే చేవయచ్చు. అవేంటో వివరంగా తెలుసుకుందాం!
అక్కడే వినొచ్చు
గూగుల్‌ డ్రైవ్‌ అంటే క్లౌడ్‌ స్టోరేజ్‌ సర్వీసని... దాంట్లో అందిస్తున్న ఉచిత స్పేస్‌లో డాక్యుమెంట్‌లు, ప్రజంటేషన్స్‌, స్ప్రెడ్‌షీట్‌లు, ఫొటోలు... భద్రం చేసుకోవచ్చనీ.. వాటిని గూగుల్‌ డాక్స్‌తో ఎప్పుడైనా ఎడిట్‌ చేసుకోవచ్చనీ తెలుసా? అలాగే దాంట్లోకి మీకు ఇష్టమైన పాటల్ని అప్‌లోడ్‌ చేసుకుని వినొచ్చని తెలుసా? అందుకో థర్డ్‌పార్టీ సర్వీసు ఉంది. అయితే, గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌లో www.drivetunes.orgసైట్‌ని ఓపెన్‌ చేయండి. జీమెయిల్‌తో లాగిన్‌ అయ్యి Acceptచేయాలి. దీంతో గూగుల్‌ డ్రైవ్‌లో అప్‌లోడ్‌ చేసిన అన్ని పాటలు జాబితాగా కనిపిస్తాయి. ఎప్పుడైనా... ఎక్కడైనా మీ మ్యూజిక్‌ లైబ్రరీని వినొచ్చు. ఎంపీ3, ఎంపీ4 ఫైల్స్‌ని సపోర్ట్‌ చేస్తుంది. నెట్‌ కనెక్షన్‌ ఉన్న ఏ సిస్టంలోనైనా ట్రాక్స్‌ని వినొచ్చు. ఒకవేళ మొబైల్‌లో వినాలనుకుంటే? అందుకు తగిన ఆప్స్‌ ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వాడుతున్నట్లయితే CloudAround Lite Music Playerఆప్‌ని వాడొచ్చు. గూగుల్‌ డ్రైవ్‌తో పాటు డ్రాప్‌బాక్స్‌, బాక్స్‌, షుగర్‌సింక్‌, స్కైడ్రైవ్‌, అమెజాన్‌ ఎస్‌3... క్లౌడ్‌స్టోరేజ్‌లను సపోర్ట్‌ చేస్తుంది. అంటే ఆయా క్లౌడ్‌స్టోరేజ్‌ల్లో భద్రం చేసుకున్న మ్యూజిక్‌ ట్రాక్స్‌ని వినొచ్చన్నమాట. http://goo.gl/XcSefO
* యాపిల్‌ యూజర్లు CloudBeats Liteఆప్‌ని వాడొచ్చు. http://goo.gl/swqm3b
ప్రింట్‌ తీసుకోండి
మీకు తెలుసా? ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఇంట్లోని ప్రింటర్‌ని యాక్సెస్‌ చేయవచ్చు. అందుకు గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ని వాడాలి. జీమెయిల్‌తో లాగిన్‌ అయ్యి ఇంట్లోని ప్రింటర్‌కి ప్రింట్‌ ఇవ్వొచ్చు. ముందుగా ఇంట్లోని ప్రింటర్‌, పీసీ ఆన్‌లో ఉండాలి. ఇప్పుడు బ్రౌజర్‌ని ఓపెన్‌ చేసి 'సెట్టింగ్స్‌'లోకి వెళ్లాలి. వచ్చిన ట్యాబ్‌ విండోలోని Show Advanced Settings మెనూలోని Google Cloud Printఆప్షన్ని ఎంపిక చేసుకోవాలి. 'మేనేజ్‌'పైన క్లిక్‌ చేసి 'యాడ్‌ ప్రింటర్‌'తో వాడుతున్న ప్రింటర్‌ని జత చేయాలి. ఇక ఎక్కడినుంచైనా ప్రింట్‌ ఇవ్వాలనుకుంటే క్రోమ్‌ బ్రౌజర్‌లోని 'ప్రింట్‌'పై క్లిక్‌ చేసి Destination->Change ద్వారా రిమోట్‌ ప్రింటర్‌ని సెలెక్ట్‌ చేసుకుని ప్రింట్‌ ఇవ్వాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే... బ్రౌజర్‌లోని కంటెంట్‌ని మాత్రమే ఇలా ప్రింట్‌ తీసుకోగలరు. సిస్టం సాఫ్ట్‌వేర్‌ల నుంచి ప్రింట్‌ ఇవ్వలేరు. ఒకవేళ వర్డ్‌ డాక్యుమెంట్స్‌ని ప్రింట్‌ తీసుకోవాల్సివస్తే 'గూగుల్‌ డాక్స్‌'లోకి అప్‌లోడ్‌ చేసుకుని 'ఆఫీస్‌' ఫైల్స్‌ని ప్రింట్‌ తీసుకోవచ్చు.
* ఇదే సౌకర్యాన్ని మొబైల్‌ నుంచి కూడా వాడుకోవచ్చు. అందుకు తగిన ఆప్‌ Cloud Print. కావాలంటే http://goo.gl/zTXCCrలింక్‌లోకి వెళ్లండి.
* ఐఫోన్‌ యూజర్లకు PrintCentral Proప్రత్యేకం. http://goo.gl/1klH2D
కాంటాక్ట్‌లు కావాలా?
మొబైల్‌లో ఎన్నో కాంటాక్ట్‌లను సేవ్‌ చేస్తుంటాం. అనుకోకుండా మొబైల్‌ పోయినా... కొత్త మొబైల్‌కి అప్‌డేట్‌ అవ్వాల్సివచ్చినా... కాంటాక్ట్‌లను మేనేజ్‌ చేసుకోవడం కొంచెం క్లిష్టమైన ప్రక్రియే. కానీ, జీమెయిల్‌లోని 'కాంటాక్ట్‌'లతో చిటికెలో మొబైల్‌లోకి సింక్‌ చేయవచ్చు. అందుకు జీమెయిల్‌ హోం పేజీలోని ఎడమవైపు కనిపించే Gmail పక్కన బాణం గుర్తుపై క్లిక్‌ చేసి 'కాంటాక్ట్‌'ను ఎంపిక చేసుకోవాలి. ఇక మొబైల్‌లోని అన్ని కాంటాక్ట్‌లను మాన్యువల్‌గా అడ్రస్‌బుక్‌లో యాడ్‌ చేయవచ్చు. ఒకవేళ CSV, vCardఫైల్‌ ఉన్నట్లయితే కాంటాక్ట్‌ ట్యాబ్‌లోని 'మోర్‌'పైన క్లిక్‌ చేసి ఇంపోర్ట్‌ చేసుకోవచ్చు. మొత్తం కాంటాక్ట్‌లను అడ్రస్‌బుక్‌లో పొందుపరిచాక 'మోర్‌'లోని Exportపై క్లిక్‌ చేసి CSV, vCardఫార్మెట్‌ల్లో సేవ్‌ సేవ్‌ చేయవచ్చు. ఇక ఎప్పుడైనా మొబైల్‌లోకి కాంటాక్ట్‌లను సింక్‌ చేసుకోవాలంటే గూగుల్‌ ఎకౌంట్‌తో మొబైల్‌లోకి లాగిన్‌ అవ్వగానే మొత్తం కాంటాక్ట్‌లు సింక్‌ అవుతాయి. ఆండ్రాయిడ్‌, బ్లాక్‌బెర్రీ, ఐఓఎస్‌, విండోస్‌ ఫోన్‌... వాడేది ఏ ఫ్లాట్‌ఫాం అయినా కాంటాక్ట్‌లను సింక్‌ చేయవచ్చు.
మీదే ఛానల్‌
మీకున్న క్రియేటివ్‌ స్కీల్స్‌తో యూట్యూబ్‌లో ఓ ఛానల్‌ ఓపెన్‌ చేయవచ్చు. అందుకో వెబ్‌ కెమెరా, మైక్రోఫోన్‌ ఉంటే చాలు. జీమెయిల్‌ ఐడీనే గేట్‌పాస్‌గా చేసుకుని ఛానల్‌ని ప్రారంభించొచ్చు. యూట్యూబ్‌ హోం పేజీలోని 'మై ఛానల్స్‌'లోకి వెళ్లి ఛానల్‌ పేరు ఎంటర్‌ చేయాలి. 'అప్‌లోడ్‌'పై క్లిక్‌ చేసి రికార్డ్‌ చేసిన వీడియోలు అప్‌లోడ్‌ చేసి షేర్‌ చేయవచ్చు. ఒకవేళ వెబ్‌ కెమెరాతో రికార్డ్‌ చేయాలనుకుంటే Webcam Capture లోని 'రికార్డ్‌'పై క్లిక్‌ చేయాలి. రికార్డింగ్‌ పూర్తయ్యాక ప్రివ్యూ చూసి పబ్లిష్‌ చేయాలి. 'వీడియో మేనేజర్‌' విభాగంలోకి వెళ్లి వీడియోల సెట్టింగ్స్‌ని మార్చుకోవచ్చు. ఇతరుల కంట పడకూడదు అనుకుంటే 'ప్రైవేట్‌'గా సెట్‌ చేయాలి. 'వీడియో ఎడిటర్‌' ద్వారా యూట్యూబ్‌లోనే వీడియోలను ఎడిట్‌ చేసుకునే వీలుంది. ఇక సిస్టంలోని వీడియో ఫైల్స్‌ని పబ్లిష్‌ చేయాలంటే డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ పద్ధతిలో అప్‌లోడ్‌ చేయవచ్చు.
దేనికి ఎంత?
వాడుతున్న జీమెయిల్‌లో ఎంత స్పేస్‌ని అందిస్తున్నారో ఎప్పుడైనా విశ్లేషించారా? జీమెయిల్‌, గూగుల్‌ డ్రైవ్‌, గూగుల్‌ ప్లస్‌ సర్వీసులు ఎంతెంత మెమొరీ తీసుకున్నాయో చెక్‌ చేశారా? అదేమంత క్లిష్టమైన ప్రక్రియేం కాదు. మొత్తం 15 జీబీ ఉచితంగా అందిస్తున్నారు. వాడకం ఎలా ఉందో చూడాలంటే జీమెయిల్‌ పేజీ కిందిభాగంలో ఎడమవైపు పరిశీలిస్తే కనిపిస్తుంది. ఉదాహరణకు 2.21 GB (14%) of 15 GB used అని కనిపిస్తూ కిందే Manageఆప్షన్‌ ఉంటుంది. మరింత వివరంగా ఏయే సర్వీసు ఎంతెంత మెమొరీ ఖర్చు అయ్యిందో తెలుసుకోవాలంటే 'మేనేజ్‌'పై క్లిక్‌ చేయండి. ఛార్ట్‌ ద్వారా మెమొరీ వాడకాన్ని చూడొచ్చు. మరింత స్పేస్‌ కావాలనుకుంటే ప్రీమియం ఎకౌంట్‌ని కొనుగోలు చేయవచ్చు.
ఆప్‌తో బ్యాక్‌అప్‌
ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ మొబైల్‌ వాడుతున్నట్లయితే Google + ఆప్‌తో ఫొటోలు, వీడియోలను బ్యాక్‌అప్‌ చేయవచ్చు. ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేశాక 'సెట్టింగ్స్‌'లోకి వెళ్లి Auto Backup ఆప్షన్ని ఎనేబుల్‌ చేయాలి. http://goo.gl/Fzd76T
* యాపిల్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి పొందండి. http://goo.gl/3qu9l4
మరికొన్ని...
* జీమెయిల్‌లోని సెర్చ్‌ ద్వారా కావాల్సిన మెయిల్స్‌ని వెతకడం తెలిసిందే. మరింత నిశితంగా మెయిల్స్‌ ద్వారా వచ్చిన ఎటాచ్‌మెంట్‌ ఫైల్స్‌ని వెతకొచ్చని తెలుసా? అందుకు సెర్చ్‌ కీవర్డ్స్‌ ఉన్నాయి. ఉదాహరణకు మెయిల్‌ ఎటాచ్‌మెంట్స్‌లో 10ఎంబీ కంటే ఎక్కువ మెమొరీ తీసుకున్న మెయిల్స్‌ని వెతకాలంటే? సెర్చ్‌బాక్స్‌లో size:10m అని టైప్‌ చేసి ఎంటర్‌ చేస్తే చాలు. ఇదే 10 ఎంబీ సైజు ఉన్న ఎటాచ్‌మెంట్‌ ఫైల్స్‌ 6 నెలల ముందువి కావాలంటే? older_thanకీవర్డ్‌ వాడొచ్చు. ఉదాహరణకు ఇలా... size:10m older_than:6m
* సాఫ్ట్‌వేర్‌ల్లో మాదిరిగానే జీమెయిల్‌లోనూ షార్ట్‌కట్‌ మీటలు వాడుతున్నారా? అదెలా? అనేది మీ సమాధానం అయితే... మెయిల్‌లో వాడుకునేందుకు బోల్డన్ని షార్ట్‌కట్‌లు ఉన్నాయి. ఉదాహరణకు మెయిల్‌కి రిప్త్లె ఇవ్వాలంటే కీబోర్డ్‌లోని Rనొక్కితే సరి. మెయిల్‌లో ఏదైనా లింక్‌ని ఇన్‌సర్ట్‌ చేయాలంటే? సింపుల్‌గా Ctrl+Kనొక్కితే సరి. ఇలా జీమెయిల్‌లో వాడుకోదగిన షార్ట్‌కట్‌ మీటల్ని తెలుసుకునేందుకు Shift+?నొక్కండి. మొత్తం జాబితా కనిపిస్తుంది. వాటి ఆధారంగా జీమెయిల్‌లోని పనుల్ని చిటికెలో చక్కబెట్టేయవచ్చు.
* ఇన్‌బాక్స్‌లోనే సోషల్‌ నెట్‌వర్క్‌ అప్‌డేట్స్‌ని మరింత స్మార్ట్‌ చూసేందుకు క్రోమ్‌ వెబ్‌ స్టోర్‌ నుంచి PowerInboxఆప్‌ని వాడొచ్చు. క్రోమ్‌కి జత చేయగానే ఆప్‌లాంచర్‌లో కనిపిస్తుంది. రన్‌ చేసి ప్రత్యేక మెనూ, టూల్‌బార్‌తో సోషల్‌లైఫ్‌ని మరింత సులువుగా మేనేజ్‌ చేయవచ్చు. ఆప్‌ కోసం http://goo.gl/SMZ1hdలింక్‌లోకి వెళ్లండి.
ఆఫ్‌లైన్‌లోనూ...
విమానంలో వెళ్తున్నప్పుడో... రైలు ప్రయాణంలోనో కొన్నిసార్లు ఎలాంటి నెట్‌వర్క్‌ కనెక్షన్‌ అందుబాటులో ఉండదు. అలాంటి సందర్భాల్లో ఆఫ్‌లైన్‌లో జీమెయిల్‌ని యాక్సెస్‌ చేసి పని చేయవచ్చు. అందుకో చిట్కా ఉంది. మీరు క్రోమ్‌ బ్రౌజర్‌ని వాడుతున్నట్లయితే 'క్రోమ్‌ వెబ్‌ స్టోర్‌' నుంచి Gmail Offline ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. సిస్టంలో అనుకునేరు. క్రోమ్‌ బ్రౌజర్‌లోనే! అందుకు http://goo.gl/xn0fhy లింక్‌లోకి వెళ్లండి. 'యాడ్‌'పైన క్లిక్‌ చేసి ఆప్‌ని క్రోమ్‌లో ఇన్‌స్టాల్‌ చేయాలి. యాప్‌లాంచర్‌లో వచ్చిన లోగోపై క్లిక్‌ చేసి Allow offline mail ఆప్షన్ని చెక్‌ చేసి Continue క్లిక్‌ చేయాలి. ఇక నెట్‌ కనెక్షన్‌ లేకున్నా మెయిల్స్‌ని యాక్సెస్‌ చేయవచ్చు.

Thursday, January 30, 2014

మహాత్మా! నీవు మరోసారి జన్మించవూ

బుద్దుడు, ఏసుక్రీస్తు లాగా మహాత్మాగాంధీ కూడా చరిత్ర లో చిరస్థాయిగా నిలిచిపోతారని భారతదేశ ఆఖరి బ్రిటిషు వైస్రాయి లూయీస్ మౌంట్ బాటన్ అన్నారు. ఈ యుగంలో జన్మించిన మహాత్ములలో ప్రప్రధమంగా పేర్కొనవలసిన మహనీయుడు గాంధీజీ. నేడు ఆయన బోధనలు కేవలం మనదేశంలోనే గాక ప్రపంచమంతా వ్యాప్తి చెందాయి. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ గాంధీజీ గురించి ఇలా అన్నారు. "రక్త మాంసాలతో నిండివున్న ఇలాంటి వ్యక్తి ఒకప్పుడు భూమి మీద నడిచారు అంటే రాబోయే తరాల వారు నమ్మలేరు అని."
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 1869 అక్టోబరు 2 వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని పోర్ బందర్ లో జన్మించారు. గాంధీజీ చిన్నతనం నుండి అధ్యాత్మిక చింతన గలిగిన నాయకుడయ్యారు. చిన్నతనంలో తనకు ఆటలాడుకోవటం కన్నా ఒంటరిగా చాలా దూరం నడవటం అంటే ఇష్టంగా ఇండేదని చెప్పేవారు. గాంధీజీ 13 సం|| ల వయస్సు లో కస్తూరిబాతో వివాహం జరిగింది. 1888 లో న్యాయశాస్త్రం అభ్యసించడానికిగాను లండన్ వెళ్ళారు. విద్యార్ధిగా ఉన్న రెండున్నర సంవత్సరాలలో ఫ్రెంచి, లాటిన్, రోమన్ భాషలను భౌతిక శాస్త్రాలను ఆయన పూర్తి చేశారు.
భారతదేశం తిరిగి వచ్చాక న్యాయవాదిగా తొలిసారిగా ముంబాయి కోర్టులో తన వృత్తిని చేపట్టారు. ఆ తరువాత కొద్దికానానికి ఒక ధనవంతుడైన వ్యాపారస్తుని కేసు వాదించడంకోసం దక్షిణాఫ్రికా వెళ్ళి 21సం|| అక్కడే ఉండిపోయారు. అక్కడే ఉండగా ఆయన జీవితంలో చేదు అనుభవాలు ఎదురై సమస్త చరిత్రనే మార్చివేయడానికి పుట్టిన మహామనిషిగా మార్చివేశాయి. భారతీయుల ఆత్మగౌరవం కాపాడే విధంగా దక్షిణాఫ్రికాలో చేపట్టిన శాసనోల్లంఘణోద్యమం విజయం సాధించింది. 40 సం|| వయస్సులో భారతదేశానికి తిరిగి వచ్చి భారతదేశ సమస్యలు పూర్తిగా తెలుసుకున్నారు. దానిలో నిజాయితీ,సత్యం, బ్రహ్మచర్య, పేదరికం ఇతరులకు సేవచేయటం అనే లక్ష్యాలతో అహ్మాదాబాదు సమీపంలో సభర్మతి దగ్గర ఆశ్రమం స్థాపించారు.
1919లో బ్రిటీషు సైనిక అధికారి జనరల్ డైయర్ నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరపడం జలియన్ వాలా బాగ్ మారణ కాండ గాంధీజీ భారత రాజకీయాల్లోకి ప్రవేశించడానికి కారణ భూతులయ్యాయి. బ్రిటీషు వారు భారత దేశం వదలి వెళ్ళేదాకా తన ఉద్యమం కొనసాగించారు. సహాయ నిరాకరణ వల్లే మనకు స్వాతంత్ర్యం సిద్దిస్తుందని ప్రచారం చేశారు. పలు బహిరంగ సభల్లో బ్రిటిషు వారి వస్త్రాలను బహిష్కరించమని పిలుపు నిచ్చారు. దండి ఉప్పు సత్యాగ్రహం చేపట్టి శాసనోల్లంఘనోద్యమం లేవనెత్తి ఆయన కూడా 60 వేల మందితో పాటు అరెస్టయ్యారు. భారత దేశం భిన్నమతాలకు, కులాలకు, సంస్కృతులకు ఆలవాలమైంది. భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి గాంధీజీ ఎన్నో ప్రయత్నాలు చేసి సఫలీకృతులయ్యరు. 1947 ఆగస్టు 15వ దేదీన భారతదేశానికి స్వాతంత్రయం సిద్దింపచేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు.
గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమం కైరా సత్యాగ్రహం, రౌలత్ సత్యాగ్రహం, నిరాకరణోద్యమం, శాసనోల్లంఘనం, బార్డోలి సత్యాగ్రహం, సైమన్ కమీషన్ రాకను బహిష్కరించడం, ఉప్పుసత్యాగ్రహం, దండి యాత్ర, క్విట్ ఇండియా ఉద్యమం, లండన్లో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావడం ఆయన అవిశ్రాంత పోరాటానికి నిదర్శనాలు. ఆయన చరిత్రలో మరుపురాని సంఘటనలు.
స్వాతంత్ర్యం సిద్దించిన తరువాత హిందూ-ముస్లింల మధ్యన చెలరేగిన హింసాకాండను ఆపి శాంతిని నెలకొల్పడానికై కలకత్తాలో నిరాహారదీక్షను సాగించారు. అదే విధంగా ఉత్తర పంజాబు, బెంగాల్ లలో జరుగుతున్న హింసాత్మక చర్యలు ఆపుచేయడానికి ఆమరణనిరాహార దీక్ష చేపట్టారు. 1948 జనవరి 30 వ తేదీన ఒక మతోన్మాది కాల్పులకు ఆయన జీవితాన్ని అర్పించారు.
గాంధీజీ ఒక సత్యానికి ప్రతినిధి అని నెహ్రు అన్నారు. అంతే కాకుండా మన జీవితాల నుండి వెలుగు వెళ్ళిపోయింది. ఎటు చూసినా అంధకారం అలుముకుంది. మన ప్రియతమ నాయకుడు బాపు మనదేశానికి తండ్రి అని చెప్పుకున్న గాంధీజీ మనకు ఇక లేరు, అని దుఃఖించారు. ఆయన జీవితం ఒక సత్య - ప్రేమ సందేశం వంటిది. అటువంటి మహనీయుడు కొన్ని శతాబ్దాలవరకు జన్మించడేమో అని అంటే అతిశయోక్తి కాదు. గాంధీజీ జీవితం ఆయన బోధనలు అనోన్యమైన ఆయన నాయకత్వం ఆయన మరణం యావత్ జాతిపై చెరగని ముద్రవేసింది. ఈ సందర్భంలో ప్రతి రోజు ఆయన చేసే ప్రార్దనా గీతంతో ఈ వ్యాసాన్ని ముగిద్దాం.
రఘుపతి రాఘవ రాజారం - పతితపావన సీతారం
ఈశ్వర అల్లా తేరేనాం  - సబ్ కో సన్మతిదే భగవాన్
ఆయన పేరిట నిర్మించిన రాజ్ ఘాట్ లోని సమాధిని ఎంతో మంది విదేశీ ప్రముఖులు సందర్శించి, శ్రద్దాంజలి ఘటిస్తున్నరు. భారతీయులకు స్మారక చిహ్నంగా పర్యాటక కేంద్రంగా నిలిచిపోయింది.
లండన్ లో చదివేరోజుల్లో గాంధీజీ తొలిసారిగా భగవద్గీతను చదివారు. గీతా సందేశం ఆయన మనస్సులో అతుక్కుపోయింది. క్రమ శిక్షణతో నిరాడంబరంగా జీవించడం అలవాటు చేసుకున్నారు. గాంధీజీ జాతీయోద్యమంతో పాటు సాంఘిక సమస్యల పట్ల కూడా తన కృషిని కేంద్రీకరించారు. దేశం లోని లక్షలాది చేనేత పనివారి జీవితాలు ఆర్ధికంగా స్వయం సమృద్ది సాధించడానికి కృషి చేశారు. గ్రామీణ చేతి వృత్తులను ప్రోత్సహించేవారు. భారతదేశం లోని గ్రామాలు స్వయం పోషకత్వం చెందినప్పుడే దేశం ఆర్ధికంగా పరిపుష్టి చెందగలదని గాంధీజీ అనేవారు. దేశానికి గ్రామాలు ఆయువు పట్టు అని గాంధీజీ విశ్వాసం.
‘కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ మాలడై తిరుగుతేనేమి?’ అని ప్రజలు గాంధీజీ గురించి పాటలు పాడుకున్నారు. గాంధీజీ పట్ల కోట్లాది భారతీయులకు పూజ్య భావం ఏర్పడినందువల్ల ఆయన ‘జాతి పితగా’ బాపూజీ ప్రజలచే పిలువబడినారు.

గాంధీజీ సూక్తులు:

  1. చదవడం వలన ప్రయోజనమేమంటే నలుమూలల నుంచి వచ్చే విఙ్ఞానాన్ని పొందడం, దాన్నుంచి గుణ పాఠాలు తీసుకోవడం.
  2. ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వహించుకుంటూ వుంటే హక్కులను పొందుటకు అర్హులవుతారు.
  3. నియమ బద్ద జీవితానికి కోర్కెలను జయించటం మొదటి మెట్టు అవుతుంది.
  4. ఆచరించటం కష్టమని మూలసూత్రాలను విడిచి పెట్టకూడదు. ఓర్పుతో వాటిని ఆచరించాలి.
  5. తనకు తాను తృప్తి పడే మానవుడు ఇక ఎదగడు
  6. దుర్బల బాధల అనుభవం నిజాయితీకి ఒరిపిడిరాయి.
  7. భయం వలన పొందే ఆధిపత్యం కంటే అభిమానంతో లభించే ఆధిపత్యం ఎన్నో రెట్లు ఉత్తమమైనది
  8. లేని గొప్పదనం ఉందని చెబితే ఉన్న గొప్పదనం కాస్తా ఊడిపోతుంది.
  9. స్వార్ధ త్యాగం, కృతనిశ్చయం, వినయ విశ్వాసాల వల్ల ఆత్మబలం చేకూరగలదు.
  10. మానవుల ఆవేశాలు వేగంగా పరుగెత్తుతాయి. వీటిని అదుపులో పెట్టడానికి ఎంతో సహన శక్తి అవసరం.
ఈ వ్యాసం నిజ ప్రచురణ : APallround.com

Sunday, January 26, 2014

స్థంబించిన జీమెయిల్ - ఫన్నీ ట్వీట్ చేసిన యాహూ

నిన్న ఒక్కసారిగా జీమెయిల్ సేవలు ప్రపంచవ్యాప్తంగా స్తంబించాయి. ఒక్కసారిగా జీమెయిల్ సేవలు ఆగిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా దాని యూజర్లు ఉలిక్కిపడ్డారు.
పిల్లికి చెలగాటం- ఎలుకకు ప్రాణసంకటం అన్నట్లు యాహు తన ట్విట్టర్ లో జీమెయిల్ స్క్రీన్ షాట్ తీసి షేర్ చేసింది.
ఇలా చేసిన షేర్ ట్విట్టర్ వీక్షకులకు సరదాని పంచింది. దాని ట్వీట్ట్ ను దాదాపు 15oo మంది ah, snap అంటూ ఫన్నీగా షేర్ చేసుకున్నారు. ఇకపోతే క్రితనెలలో యాహు మెయిల్ కూడా స్థంబించడం దానికి అది క్షమాపణ చెప్పడం తెలిసిందే !

Friday, January 24, 2014

మాయంకానున్న ఫేస్ బుక్ ??

వాషింగ్టన్: నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తున్న సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ కనుమరుగుకానుందా? మరెంతోకాలం మనుగడ సాగించలేదా? అంటే అమెరికాలో ఓ సర్వే అవుననే చెబుతోంది.

2015-2017 నాటికి ఫేస్ బుక్ 80 శాతం మంది తన ఖాతాదారుల్ని కోల్పోతుందని ప్రిన్స్ టన్ యూనివర్సిటీ విద్యార్థుల జరిపిన సర్వేలో  వెల్లడైంది.  పేస్ బుక్ వాడకం దారుల సంఖ్య రానురాను అదే రీతిలో పతనమవుతుందని ఆ సర్వే పేర్కింది. ఫేస్ బుక్ మరెంతో కాలం మనుగడ సాగించలేదని, క్రమేణా వాడకం దారులు పూర్తిగా తగ్గి కనుమరుగవుతుందని వెల్లడించింది. దీనికి పలు ఉదాహరణలను, కారణాలను తెలియజేసింది. ఫేస్ బుక్ లో ప్రస్తుతం 119 కోట్లమంది ఖాతాదారులున్నారు.
Source: Sakshi.com

Wednesday, January 1, 2014

రిజిస్టేషన్ లేకుండానే ఉచితంగా నెట్ ద్వారా ప్రపంచమంతా SMSలు పంపండి ఇలా ...

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

 క్రీంది వెబ్సైట్ ద్వారా మీరు ప్రపంచమంతా లు పంపవచ్చు. ఏ విధమైన రిజిస్టేషన్ చేసుకోనవసరం లేదు.

లింక్ : http://uthsms.net//index.php?on=null

Friday, November 22, 2013

[ॐ] ఓంకారం అంటే?

 “ఆన్ని మంత్రాలోకి శక్తివంతమైన ఏకాక్షర మంత్రం ‘ఓం;’. దినినే ప్రణవమని అంటారు. మంత్రోచారణం జీవునికి, పరమాత్మ అనుగ్రహాన్ని సులభతరం చేసే సాధనం. ఉదాహరణకు బిడ్డ తన తల్లిని ‘అమ్మా’ అని పిలువగానే, ఆ తల్లి ఎన్ని పనులతో సతమతమవుతున్న;;ప్పటికి ఆప్యాయంగా ఆ బిడ్దను గుండెకు హత్తుకుంటుంది కదా! అలాగే సకల దేవత్తముర్తులు, మంత్రోచ్చారణతో మనం మననం చేయగానే మన పట్ల ప్రసన్నులవుతున్నారు.
హిందూ ధర్మంలో చాలా కీలకమైన అంశం ఓంకారం. కాబట్టి ఆదిలోనే దానినందిస్తున్నాము. ఓంకారమంటే బ్రహ్మవిద్య.
ఓం అనే పదాన్ని తీసుకుంటే, ఇది ఒక పదమా ? లేక అక్షరమా ? లేక వాక్యమా ? భాషలో అచ్చులు, హల్లులు కలిసి ఉంటాయి. కొన్ని హల్లులు అచ్చులు కలిసి అర్థాన్ని ఇవ్వగలిగితే పదం అని అంటాం. 'గోవు' ఇది కొన్ని అక్షరాల కలయిక,ఆ కలయిక ద్వారా ఒక అర్థాన్ని ఇవ్వగల శక్తి దానిలో ఏర్పడింది, కనుక పదం అని అంటాం. అలానే కొన్ని పదములు కలిసి మన సంశయాలను తీర్చగలిగినట్లుగా అర్థం ఇవ్వగలిగితే దాన్ని వాక్యం అని అంటాం. 'గోవు పాలు ఇచ్చును' ఇలా కొన్ని వాక్యాలు కలిసి మనకు గోవు ఏమి చేస్తుంది అనే సంశయాన్ని తీర్చి, ఒక అర్థాన్ని ఇస్తుంది కనక అది ఒక వాక్యం అని అంటాం. 'ఓం' అనేది అక్షరమా ? 'ఓం ఇత్యేకాక్షరం' అంటుంది వేదం. అంటే ఓం అనేది ఒక అక్షరం. భగవద్గీతలో భగవానుడు 'ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామ్ అనుస్మరన్'  అని చెబుతాడు. ఓం అనేది ఒక అక్షరం, ఇది బ్రహ్మ, ఇది వేదం.  ఏం చెబుతుంది అది ? 'మామ్ అనుస్మరన్' నన్ను తలవాలి అని చెప్పాడు. ఇది స్వతంత్రంగా అర్థాన్ని ఇవ్వ గలదు కనక దీన్ని ఒక పదం అని కూడా అనవచ్చు. ఇది కొన్ని అక్షరముల కూర్పు కూడా. అవి 'అ','ఉ' మరియూ 'మ్' అనే అక్షరాలు. ఈ మూడు అక్షరాలు కలిసి ఒక పదం అయ్యింది. మామూలుగా కొన్ని అక్షరాలు కలిసి పదం అయ్యి ఒక అర్థాన్ని ఇస్తాయి, కానీ ఒక్కో అక్షరాన్ని విడదీస్తే ఏమి అర్థాన్ని ఇవ్వవు. ఇక్కడ ఓంకారంలో ఉన్న 'అ','ఉ' మరియూ 'మ్' అనే అక్షరాలు ఒక్కోటి విడి విడి అర్థాన్ని ఇవ్వగలవు. అట్లా అకారం స్వతంత్రంగా ఒక అర్థాన్ని చెప్పగలదు, ఉకారం స్వతంత్రంగా ఒక అర్థాన్ని చెప్పగలదు, మకారం స్వతంత్రంగా ఒక అర్థాన్ని చెప్పగలదు. కనుక ఇవి మూడు పదాలు అని కూడా చెప్పవచ్చు. ఇలా మూడు పదాలు కలిసిన ఓంకారం ఒక స్వతంత్ర అర్థాన్ని ఇవ్వగలదు, మన సంశయాలను తీర్చగలదు కనక వాక్యం అని చెప్పవచ్చు. అందుకే ఓంకారాన్ని ఒక అక్షరం అని చెప్పవచ్చు, ఒక పదం అని చెప్పవచ్చు లేదా ఒక వాక్యం అని చెప్పవచ్చు. ఓంకారంలో ఉన్న 'అ','ఉ' మరియూ 'మ్' అనే అక్షరాలు ఒక్కోటి ఏం అర్థాన్ని ఇస్తాయో తెలుసుకోవాలి, పదంగా ఏం అర్థాన్ని ఇస్తాయో తెలుసుకోవాలి అట్లా వాక్యంగా కలిసి ఏం అర్థాన్ని ఇస్తాయో కూడా తెలుసుకోవాలి.  
  ‘అసలు మంత్రం అంటే ఏమిటి?’ అన్న సందేహం కొంత మందికి కలుగవచ్చు.
మననాత్ త్రాయతే
ఇతి మంత్ర: అని అన్నారు. అంటే మననం చేయడం వలన రక్షించేది అని అర్ధం, అటువంటి మహా శక్తివంతమైన మంత్రాలను మన ౠషులు, తమ అమోఘ తపశ్శక్తితో, భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలు.
‘ఐం’, ‘శ్రీం’, ‘హ్రీం’, ‘క్లీం’ అనే బీజాక్షరాలను అయా దేవతల పేర్లతో కలిపి జపించినపుడు శక్తివంతములైన మహా మంత్రాలవుతున్నాయి. మన్ ఇష్టదేవతను ప్రసన్నం చేసుకోవడమే మంత్రంలక్ష్యం. ఈ మంత్రాలు మూడు విధాలు.  క్షుద్రంతో ఉచ్చాటన చేసే తామస మంత్రాలు, యుద్ధంలో గెలుపు కోసం చేసే రాజలమంత్రాలు, ఆధ్యాత్మిక సాధనకై జపించే సాత్వికమంత్రాలు, చంధోబద్దంగా ఉన్నవి ‘ౠక్కులూ గద్యాత్మకంగా ఉన్న మంత్రాలు ‘యజస్సులూ.
ఇక అన్ని మంత్రాలకు ముందు ‘ఓం’ కారాన్ని చేర్చి జపిస్తాం. ఎందుకంటే ‘ఓం’ కారం లేని మంత్రం ఫలవంతం కాదు. అలాంటి మంత్రం ప్రాణవయువులేని నిర్జీవశరీరం వంటిది. ఈ ఓంకారం ఆ సర్వేశ్వరుని మంచి ఓక జ్యోతిగా ప్రారంభమై, అందునుంచి ఒక నాదం ధ్వనించింది. ఆ ధ్వనే ‘ఓంకారం’.  ‘ఓం’ నుంచి వేదరాశులే ఉద్భవించాయి. ౠగ్వేదంనుండి ‘ఆకారం, యజుర్వేదం నుండి ‘ఊకారం, సామవేదం నుండి ‘మాకారం కలసి ‘ఓంకారం’ ఏర్పడిందని ౠషివాక్కు.
సకలవేదరూపం ఓంకారం.”

Thursday, November 14, 2013

బాలల దినోత్సవం ,Children's Day



ప్రతి సంవత్సరం నవంబరు 14న బాలల దినోత్సవం జరుపుకుంటాము. భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుంది.భారత తపాళా శాఖ ప్రతి సంవత్సరం ఈ రోజు తపాలా బిళ్ళను విడుదల చేస్తుంది.ఈ బాలల దినోత్సవం నాడు ప్రతి పాఠశాలలోనూ ప్రత్యేకంగా వేడుకలను నిర్వహిస్తారు.అందరూ అనుభవించే బాల్యం.. భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు. అటువంటివారి పేరిట బాలల దినోత్సవం వేడుకను నిర్వహించటం వారిలో నూతనోత్తేజాన్ని...ఈ సందర్భంగా చిన్నారులకు వివిధ రకాల పోటీలు, సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలల్లో ఉండే నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పాఠశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి.

పేద, నిరుపేద కుటుంబాలకు చెందిన కొంతమంది చిన్నారులు అతి చిన్న వయసులోనే పలకా బలపం పట్టాల్సిన చేతులతో తట్ట, పార పట్టి పనులకు వెళ్లడం ప్రతినిత్యం మనం చూస్తునే ఉన్నాం. దీనికి ఆ తల్లి దండ్రుల్లో ఉన్న నిరక్షరాస్యత కొంత కారణమైతే ఆ కుటుంబాలు ఆర్ధిక స్ధితి గతులు మరో కారణంగా చెప్పవచ్చు. మారుమూల గ్రామాల్లో ముఖ్యంగా యాదవ, మత్య్సకార ఇతర కులాలకు చెందిన చిన్నారులను బడికి పంపకుండా పనుల్లో పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతేకాకుండా పిల్లలకు మూడో సంవత్సరం రాగానే బుడి బుడి నడకలతోనే మోయలేని పుస్తకాల మోతతో పట్టణాల్లో, మండల కేంద్రాల్లోను ఆ పిల్లలు బాల్యం మోయలేని భారంగా మారుస్తున్నారు. నేటి బాలలే రేపటి పౌరులని ప్రకటనలు గుప్పిస్తున్న నేతలు, అధికారులు ఇళ్లల్లో ఎక్కువగా పనులలో బాలలే కనిపిస్తున్నా ఏ ఒక్కరికీ అది తప్పుగాను, చట్టవిరుద్దంగాను కనిపించకపోవడం పలువురికి ఆశ్చర్యం కల్గిస్తుంది.

ఒకసారి బాలల దినోత్సవం చరిత్రను మననం చేసుకుందాం. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని నవంబర్ 20న అధికారికంగా జరుపుకుంటుంటారు. అయితే 1959కి ముందు అక్టోబర్ నెలలో బాలల దినోత్సవాన్ని జరుపుకునేవారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన ప్రకారం బాలల దినోత్సవాన్ని మొదటిసారిగా 1954లో ప్రపంచమంతటా నిర్వహించారు.1959 నవంబర్ 20న బాలల హక్కుల ప్రకటనను ఐరాస సర్వసభ్య సభ రూపొందించిన సందర్భంగా బాలల దినోత్సవాన్ని ప్రపంచ మంతటా జరుపుకోవాలని నిర్ణయించారు. 1989లో పిల్లల హక్కులపై నవంబర్ 14న ఓ బిల్లును ఐరాస ఆమోదించింది. ఈ బిల్లును ఆమోదిస్తూ 191 దేశాలు సంతకాలు పెట్టాయి కూడా.పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని పంచుకోవడాన్ని, పరస్పర అవగాహనను పెంచుకోవడాన్ని ప్రోత్సహించేందుకు గాను ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ బాలల దినోత్సవానికి రూపకల్పన చేసింది. ప్రపంచమంతటా పిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకోసం పలు చర్యలు చేపట్టడం ఈ దినోత్సవం లక్ష్యం.



నవంబర్‌ 14 భారతీయ బాలలకు ఎంతో ఇష్టమైన రోజు. ప్రభుత్వం అధికారికంగా వారికోసం కేటాయించిన ఒక్కగానొక్క రోజది. అయితే బాలల దినోత్సవాన్ని మనలాగా ప్రపంచదేశాలన్నీ అదే రోజున జరుపుకోవు. ఒక్కో దేశం ఒక్కో రోజున జరుపుకుంటుంది. చైనాలో జూన్‌ 1వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. శుభాకాంక్షలు చెప్పుకుని పాఠశాలల్లో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోజు పాఠశాలలు తెరిచివున్నా తరగతులు జరగవు. మన పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో నవంబర్‌ 20వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఆరోజున పాఠశాలలు మామూలుగానే నడుస్తాయి. టీవీలు, రేడియోల్లో మాత్రం ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తారు. జపాన్‌లో మే 5న జరుపుకుంటారు. ఆరోజున మగపిల్లలున్న వారు చేప ఆకారంలో వున్న గాలిపటాలను ఎగురవేస్తారు. అంతేకాక యుద్ధవీరుల బొమ్మలతో కొలువు ఏర్పాటుచేస్తారు. ఆరోజు జాతీయ సెలవుదినంగా కూడా ప్రకటిస్తారు. దక్షిణ కొరియాలో మే 5వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఆరోజున ఇక్కడ పిల్లలకోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. వారు ఎప్పుడూ గుర్తుంచుకునేలా పెద్దలు పిల్లలకోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఎక్కడికైనా బయటకు తీసుకెళతారు. పోలాండ్‌లో జూన్‌ 1న బాలల దినోత్సవం చేసుకుంటారు. ఆరోజున స్కూళ్లల్లోనే రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. పార్కుల్లో, వినోద కేంద్రాలలో పిల్లలకోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. శ్రీలంకలో అక్టోబర్‌ 1 అంటే పండుగే. పెద్దలు తప్పనిసరిగా వారిని బయటకు తీసుకెళతారు. ఇళ్లల్లో వారికోసం ప్రత్యేకంగా స్వీట్లు చేస్తారు. ఇవేకాక వివిధ దేశాలలో బాలలదినోత్సవాలను ఒక్కోరోజు జరుపుకుంటున్నారు.

Children's Day in India:

మనకు చాలా మంది దేశ నాయకులుండగా జవహర్‌లాల్‌ నెహ్రూ పుట్టినరోజునే బాలల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటావో తెలుసా... పిల్లలంటే ఆయనకు చాలా చాలా ప్రేమ కాబట్టి! నెహ్రూ మన దేశానికి మొదటి ప్రధానమంత్రి. ఆ పదవిలో ఉండేవారికి ఎన్నో బాధ్యతలుంటాయి. తీరిక అస్సలే ఉండదు. కానీ ఆయన మాత్రం అంత పని వత్తిడిలోనూ ఎలాగోలా వీలు చేసుకొని పిల్లలతో మాట్లాడేవారు. పిల్లలంతా ఆయన్ని ప్రేమగా 'చాచా' అని పిలిచేవారు. నెహ్రూ గురించి ......

నెహ్రూ పూర్వీకులు కాశ్మీర్‌ నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరపడ్డారు. వారి కుటుంబం ఢిల్లీలో ఒక కాలువ ఒడ్డున ఉండేది. హిందీలో కాలువను 'నెహర్‌' అంటారు. అలా వారికి నెహ్రూ అనే పేరు ఇంటిపేరుగా మారింది. నిజానికి వారి ఇంటి పేరు 'కౌల్‌'.
* నెహ్రూ తల్లిదండ్రులు స్వరూపరాణి, వోతీలాల్‌. అలహాబాద్‌లో పేరు పొందిన న్యాయవాది వోతీలాల్‌ చాచాకు ఇద్దరు చెల్లెళ్లు... విజయలక్ష్మి, కృష్ణ. నెహ్రూ అలహాబాద్‌లో స్కూల్‌కి వెళ్లి చదివింది తక్కువ. ఇంటి దగ్గరకే మాష్టార్లు వచ్చి కొడుక్కి పాఠాలు చెప్పేలా ఏర్పాటుచేశారు వోతీలాల్‌. ఒక విదేశీ టీచర్‌ నెహ్రూకు సైన్సు, ఇంగ్లిష్‌ పాఠాలు బోధించేవారు. చాచాకు ఇష్టమైన సబ్జెక్టులు కూడా అవే. కొడుకు కోసం వోతీలాల్‌ ఇంట్లోనే సైన్సు ప్రయోగశాలను ఏర్పాటుచేశారు. 15 ఏళ్లపుడు నెహ్రూ చదువుకోసం ఇంగ్లండ్‌ వెళ్లారు. అక్కడ ఎనిమిదేళ్లు చదువుకొని న్యాయశాస్త్రంలో పట్టాతో స్వదేశం వచ్చారు. నెహ్రూకు 27వ ఏట కమల కౌల్‌తో వివాహమయింది.
* నెహ్రూకు ఒకే ఒక్క కుమార్తె. ఆమే ఇందిరాగాంధీ. స్వాతంత్య్రం కోసం నెహ్రూ పోరాటం చేసినపుడు ఆంగ్లేయులు ఆయన్ని ఎన్నోసార్లు జైల్లో పెట్టారు. దాంతో తన ముద్దుల కుమార్తె ఇందిరకు ఆయన ఎప్పుడూ దూరంగానే ఉండాల్సివచ్చేది. అందుకు నెహ్రూ ఎంతో బాధపడేవారు. ఇందిర తన దగ్గరే ఉంటే ఏమేం చెప్పాలనుకునేవారో వాటన్నిటినీ ఉత్తరాల్లో రాసేవారు. ఇందిర ఆ ఉత్తరాల్ని చదివి భద్రపరిచి తండ్రి చెప్పినట్టే నడుచుకునేవారు. ఆ ఉత్తరాల్ని 'Letters from a father to his daughter' పేరుతో పుస్తకంగా ముద్రించారు. అంటే మీరూ చదవొచ్చన్నమాట.
* నెహ్రూ కోటుపై ఎర్ర గులాబీ చూశారుగా! అది పెట్టుకోవడం ఆయనకు ఎలా అలవాటైందంటే... ఒకరోజు మీలాంటి ఓ చిన్నారి ఆయనకు గులాబీని బహుమతిగా ఇస్తే కోటుకు పెట్టుకున్నారు. అదిచూసి ఆనందంతో నవ్విన చిన్నారీ అరవిరిసిన గులాబీ ఆయనకు ఒక్కలాగే కన్పించాయట. తనకు అంత ఇష్టమైన పిల్లలగుర్తుగా ఆ తర్వాత నుంచి రోజూ కోటుపై గులాబీ పెట్టుకోవడం ఆయనకు అలవాటైందని చెబుతుంటారు. సెలవు రోజుల్లో నెహ్రూ పిల్లల్ని తన నివాసానికి పిలిచి మిఠాయిలు పంచేవారు. కబుర్లు చెప్పేవారు. పిల్లలు చాచాకు ఇష్టమైన గులాబీలను బహుమతిగా ఇచ్చేవారు.
* ఓసారి జపాన్‌కు చెందిన బాలలు ఏనుగు కావాలని చాచాకు ఉత్తరం రాశారు. వెంటనే ఆయన వారికొక ఏనుగును పంపించి, 'భారతదేశంలోని పిల్లలందరి తరఫునా మీకు ఈ కానుకను పంపిస్తున్నా' అని ఉత్తరం రాస్తే వారెంతో సంతోషించారట. ఆ ఏనుగు రెండు దేశాల మధ్య స్నేహాన్ని పెంచింది.
* పిల్లలంతా బడికి వెళ్లాలనేది చాచా కోరిక. ఓసారి బాలల సినిమా చూసిన చాచా అందులో నటించిన ఏడేళ్ల పాపాయిని మెచ్చుకుంటూ షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు. అయితే ఆ పాపకి తిరిగి 'థ్యాంక్స్‌' చెప్పడం కూడా రాలేదు. దాంతో చాచాకు సందేహం వచ్చి 'పాపను బడికి పంపడం లేదా' అని వాళ్ల అమ్మను అడిగారు. లేదని చెప్పేసరికి, ఆమెను కోప్పడి, పాపను వెంటనే బడిలో చేర్పించమని చెప్పారు.
* ఓసారి ఢిల్లీలో స్కూల్‌ పిల్లలు ఎగ్జిబిషన్‌ ఏర్పాటుచేశారు. ప్రధాని నెహ్రూని కూడా ఆహ్వానించారు. ఆయన అక్కడ ఒక ఆట కూడా ఆడారు. గోడపైన తోకలేని ఏనుగు బొమ్మను అతికించారు పిల్లలు. దాన్ని దూరం నుంచి చూశాక కళ్లు మూసుకొని కాగితపు తోకను ఏనుగు బొమ్మకు అంటించాలి... అదీ గేమ్‌. నెహ్రూ కూడా గంతలు కట్టుకొని తోక అతికించడానికి ప్రయత్నించారు. కానీ అంగుళం దూరంలో అంటించారు. ఆ గేమ్‌ ఆడినందుకు అక్కడున్న పిల్లాడు రెండు అణాలు ఫీజు అడిగితే నెహ్రూ ముందు ఆశ్చర్యపోయినా, తరవాత సరదాగా నవ్వేశారట. తన సహాయకులనడిగి డబ్బు ఇప్పించుకొని ఫీజు చెల్లించారట.
ఇలా పిల్లలతో చాచాకు ఉన్న అనుబంధం గురించి ఎన్ని విషయాలైనా చెప్పుకోవచ్చు. పిల్లలకు ఎంతో ఇష్టమైన, పిల్లలంటే ప్రాణమైన నెహ్రూ 1964లో కన్నుమూశారు. చిన్నారులపట్ల ఆయనకున్న ప్రేమానురాగాలను గుర్తుచేసుకోవడానికి ఆ సంవత్సరం నుంచి ఆయన పుట్టినరోజైన నవంబరు 14ను బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
మీకందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు...
Thanks to the author of original Article:  http://daycelebrations.blogspot.in/2010/04/childrens-day.html
His Website: Dr.seshagirirao-MBBS

Sunday, November 3, 2013

రాజకీయ దీపావళి!

తపాజువ్వల్లా ఉద్యమిస్తున్న ప్రజలు
ఎటువెళతారో తెలీని సిసింద్రీల్ల గోడమీదపిల్లి నాయకులు
తాటాకు టపాకాయల్లా ఇరుప్రాంతాల కాంగ్రెస్ నాయకులు
అప్పుడప్పుడూ నోరువిప్పే మతాబుల్లంటి తెలంగాణా నాయకులు.
ఎప్పుడు పేలుతుందో తెలీని బాంబుల్లా దిగ్విజయ్ వ్యాఖ్యలు..
తుస్సుమన్న చిచ్చుబుడ్డిలా
అంధ్రలో ఇప్పుడు ఉన్న దీపావళి ఇది...

Saturday, November 2, 2013

చీకటి వెలుగుల రంగేళీ..దీపావళి

'చీకటి వెలుగుల రంగేళీ.. జీవితమే ఒక దీపావళి'...అని తెలుగు సినిమా కవి రాసింది. ఆనంద ఉత్సహాలతో జాతి, కుల, మత, వర్గ విబేధాలను విస్మరించి,సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల 'దీపావళి'. చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా దీపావళిని జరుపుకుంటారని పురాణాలు చెబుతుంటాయి. అశ్వయుజ మాసంలో ఈ పండుగ వస్తుంది. మొదటి రోజు నరకచతుర్దశి, రెండో రోజు దీపావళి అమవాస్య, మూడోది బలి పౌడ్యమి అని జరుపుకుంటుంటారు. దీపావళి పండుగను ఎందుకు జరుపుకొంటారు అనడానికి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలో రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని ప్రచారం ఉంది. దీపం జ్యోతి పరమ్ బ్రహ్మ దీపం సర్వతమోపహమ్ దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమ్మోస్తుతే అగ్ని కాంతిని, తేజస్సునీ, రక్షణనీ, ఆరోగ్యాన్నీ, ధైర్యాన్నీ అందిస్తుందని, దోషాలను తొలగిస్తుందని పండితులు చెబుతుంటారు. దీపావళి పర్వదినంలో దీపం పెట్టడం, లక్ష్మీదేవిని పూజించడం చేస్తుంటారు. దీపావళి పండుగను దీపోత్సవం అని కూడా అంటారు. పశ్చిమ బెంగాల్ లో దీపావళి రోజున శివ సహితముంగా కాళీ పూజలు నిర్వహిస్తుంటారు. ఈ పండుగ నాడు అమావాస్య చీకట్లు తొలగిపోవుటకు కాకరపువ్వొత్తులు, టపాకాయలు, చిచ్చుబుడ్లు, మతాబులు కాల్చి పండుగను జరుపుకుంటుంటారు. ఈ దీపావళి పండుగ రోజున ప్రతి ఇంటిని దీపాలతో అలంకరిస్తుంటారు. కొందరు లక్ష్మీ పూజను చేస్తారు. 
Source: Prajasaksti 

Saturday, September 28, 2013

' గాన కోకిల ' @ 85

గానకోకిల లతా మంగేష్కర్ 85వ ఏట ప్రవేశించారు. శనివారం ఆమె జన్మదినం. బాలీవుడ్ సహా పలు ప్రాంతీయ బాషా చిత్రాల్లో దశాబ్దాల పాటు గానం చేసిన లత భారత సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. జన్మదినం సందర్భంగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
దాదాపు ఏడు దశాబ్దాలపాటు హిందీ సినీపరిశ్రమలో గాయనిగా లతామంగేష్కర్‌ వెలుగొందుతున్నారు. 1929, సెప్టెంబరు 28న జన్మించిన ఈ గానకోకిల.. 1942 నుంచి సినీ కళా ప్రయాణం ఆరంభమైంది. 'మహల్' అనే చిత్రంలో 'ఆయెగా ఆయెగా ఆయెగా ఆనేవాలా' అనే పాటతో తన గానాన్ని వినిపించారు. ఆమెను ‘నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా’ పిలిచేవారు. దాదాపు 36 భాషల్లో వెయ్యికు పైగా సినిమాలకు ఆమె  ఆలపించారు. క్లాసికల్‌ నుంచి రొమాంటిక్‌ వరకు, గజల్స్‌ నుంచి భజనల వరకు అన్ని రకాల గేయాలు ఆమె ఆలపించి సరికొత్త రికార్డును సృష్టించారు.
ఈమె సోదరి ఆషా భోంస్లే. లతాకు భారత ప్రభుత్వం 'భారతరత్న' పురస్కారం ఇచ్చి సత్కరించింది. హిందీ సినీపాటల గాయని అంటే మొదట లతా పేరే స్ఫురణకొస్తుంది. హిందీపాటలపై, హిందీ సినీ జగత్తుపై ఆమె వేసిన ముద్ర అలాంటిది. 1948 నుంచి 1978 వరకు 30,000 పాటలు పాడిన ఏకైక గాయినిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకుంది. తెలుగులో సంతానం (నిదురపోరా తమ్ముడా, సుసర్ల దక్షిణామూర్తి), ఆఖరి పోరాటం (తెల్లచీరకు, ఇళయ రాజా) మొదలైన సినిమా పాటలు పాడారు.

Sunday, September 22, 2013

100 సంవత్సరాల భారతీయ సినిమా ఉత్సవాలు...




సౌత్ ఇండియా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చేత తలపెట్టిన 100 సంవత్సరాల భారతీయ సినిమా ఉత్సవాలు సెప్టెంబర్ 21 నుండి 24వ తేదీ వరకు చెన్నై లోని నెహ్రు ఇండోర్ స్టేడియం లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవాలను నిన్న జయలలిత ప్రారంభించారు. ఒక్కోరోజు ఒక్కోభాషకు  పండుగలా పండుగలా కేటాయించగా మొదటిరోజు తమిళ చలనచిత్ర పండుగ జరిగింది . 
అసలు 3.5.2013 నాటికే  భారత చలనచిత్రరంగం పుట్టి 100 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. తొలిసినిమా ఇప్పుడే మొగ్గవేసింది. అప్పట్లో ఆ మొగ్గ... పెరిగి ఇంత పెద్ద పుష్పంగా మారి.. తుమ్మెదలను ఆస్వాదించే తీయదనాన్ని ఇస్తుందని ఆనాడు ఎవ్వరూ ఊహించి ఉండరు. అమెరికాలో ఫీచర్‌ ఫిల్ములు తయారైన 1912లోనే మన దేశంలోనూ తొలి కథాచిత్ర నిర్మాణం ప్రారంభమైంది. ఈ నూరేళ్ళ కాలగతిలో 1,268 మూకీలు, వివిధ భాషల్లో దాదాపు 44 వేల టాకీల అనుభవం భారతీయ సినిమా ఘనచరిత్ర. ఇవాళ అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానం, ఖండాంతరాలు దాటిన అతి పెద్ద ప్రేక్షక వర్గమూ మనదే! హాలీవుడ్‌ చిత్రాలకు సైతం మనది.
 సినిమా పుట్టుపూర్వోత్తరాలను కాసేపు గుర్తుచేసుకుందాం....
లూయీ లూమియర్‌ సోదరులు : మొట్టమొదటి సినిమా నిర్మాతలు లూయీ లూమియర్‌, ఆగస్ట్‌ లూమియర్‌ సోదరులు. 1895లో పారిస్‌లోని ఒక హోటల్‌లో సినిమాటోగ్రాఫ్‌ ప్రదర్శన జరిగింది. అంతవరకు నిశ్చలనంగా ఉన్న బొమ్మలు మొట్టమొదటిసారిగా తెరపై కదలనారం భించాయి. 1903లో ప్రపంచంలో తొలి మూకీకథా చిత్రంగా ఎడ్విన్‌ పోర్టర్‌ అనే నిర్మాత కదిలే మూకీ బొమ్మలకి ఒక కథ అల్లి.. 'ది గ్రేట్‌ ట్రయిన్‌ రోబరి' అనే మూకీ చిత్రాన్ని నిర్మించారు. భారతదేశంలో బొంబాయిలోని వాట్సన్‌ హోటల్‌లో 1896, జులై 7వ తేదీన లూమియర్‌ బ్రదర్స్‌ నిర్మించిన సజీవ సినామాటోగ్రాఫ్‌ చిత్రాలు 'ఎంట్రీ ఆఫ్‌ సినిమాటోగ్రాఫ్‌, అరైవల్‌ ఆఫ్‌ ట్రయిన్‌- చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. బొంబాయితో పాటుగా కలకత్తాలోని స్టార్‌ థియేటర్‌లో కూడా ఈ ప్రదర్శనలు వేయడంతో భారత చలనచిత్ర చరిత్ర సినీ ప్రస్థానానికి బాటలు వేయడం జరిగింది. అప్పట్లో అరైవల్‌ ఆఫ్‌ ట్రయిన్‌- చిత్రం ప్రదర్శిస్తుంటే.. రైలు మీదుగా వస్తున్నందని జనాలంతా పారిపోయేవారట. వారికి నచ్చజెప్పి మళ్ళీ తీసుకురావడానికి చాలా సమయం పట్టేది.
భారతీయ కథతో భారతీయ సంస్కృతితో నిజమైన తొలి భారతీయ సినిమాగా, ఆయన నిర్మించిన తొలి మూకీ కథా చిత్రం 'రాజా హరిశ్చంద్ర'. 1913 మే 3న బొంబాయిలోని కారొనేషన్‌ సినిమాటోగ్రాఫ్‌ థియేటర్‌లో విడుదలైంది. భారతీయ సినిమాకు శాశ్వత చిరునామా యిచ్చి చరిత్రకెక్కిన కళాకోవిదుడు దాదాసాహెబ్‌ ఫాల్కే. ఆయన తదంతరం సినిమా రంగంలో విశిష్ట సేవలందించిన వారికి ఆయన పేరుమీద అవార్డులు ఇవ్వడం ఆరంభించారు.
1927 అక్టోబర్‌ 6న 'ది జాబ్‌ సింగర్‌' అనే శబ్ద చిత్రం వచ్చింది. వార్నర్‌ బ్రదర్స్‌, న్యూయార్క్‌లో ప్రదర్శించబడ్డ ఈ చిత్రంలో తొలిసారిగా తెరమీద నుంచి మాటలు విని నివ్వెరపడి, ఆనందపడి, హర్షధ్వానాలతో సినిమా ప్రకియకు స్వాగతం పలికారు.
ఆ రోజుల్లోనే బొంబాయికి చెందిన అబ్దులలీ యూసఫలీ సినీ ప్రదర్శకుడిగా ముఖ్యపాత్ర పోషించారు. ఓ డేరాలో సంచార సినీ ప్రదర్శనల్ని ప్రారంభించారు. ఎక్కడికిపడితే అక్కడకు మోసుకుపోగల తన బయోస్కోప్‌ సామగ్రితో ఇతర దేశాలకూ వెళ్ళారు. చివరకు 1908లో భారత్‌కు వచ్చి, ఇక్కడా సంచార సినీ ప్రదర్శనలిచ్చారు. ఆట వస్తువు లాంటి బయోస్కోప్‌ను పరిశ్రమస్థాయికి తెచ్చారు.

దక్షిణ భారతావనికి వస్తే, కోయంబత్తూరుకు చెందిన రైల్వే ఉద్యోగి సామి విన్సెంట్‌ సినిమా మీద ప్రేమతో ఉద్యోగాన్ని కూడా వదిలేసి, 1905 నుంచి దక్షిణాదిన ఊరూరా తిరుగుతూ చిత్ర ప్రదర్శనలు నిర్వహించారు. అలాగే, మద్రాసు ఫోటోగ్రాఫర్‌గా స్థిరపడ్డ తెలుగుబిడ్డ రఘుపతి వెంకయ్యనాయుడు విదేశాల నుంచి సామగ్రి తెప్పించి, 1909-12 మధ్యలో ప్రముఖ సినీ ప్రదర్శకుడిగా ఎదిగారు. విదేశాలకూ తన ప్రదర్శనలను విస్తరించారు.  

కళా రూపంగా సినిమా ఆవిర్భవించిన ఆ ఆరంభ దినాల్లో ఇప్పటిలాగా ప్రదర్శనలకు లైసెన్సు తీసుకోవాల్సిన అవసరమూ లేదు. అలాగే, విద్యుచ్ఛక్తితో కూడా పని లేదు. మెగ్నీషియమ్‌ దీపాల సాయంతో ఫిల్మును తెరపై చూపేవారు. ఈ సినీ ప్రదర్శనలు, వాటికన్నా ముందే దేశంలోకొచ్చిన గ్రామ్‌ఫోన్‌, ముద్రణాలయ వసతులు కలసి కొత్త పరిణామానికి దోహదపడ్డాయి. సాంప్రదాయ భారత సమాజంలో మార్పు వచ్చింది. ఈ ప్రదర్శనలకు క్రమంతప్పక వచ్చే ప్రేక్షక వర్గం తయారైంది.
     1895లో పారిస్‌లోని ఒక హోటల్‌లో లూమియర్‌ బ్రదర్స్‌ ఏర్పాటు చేసిన సినిమా టోగ్రఫీ తొలి ప్రదర్శన అయితే తెలుగులో నాగార్జున నటించిన గ్రీకువీరుడు చిత్రం నేపథ్యం కూడా పారిస్‌ కావడం విశేషం. అప్పటి తరం మిగలక పోయినా... వారు పండిం చిన పంటను ఆస్వాదించ డానికి మరిన్ని తరాలు ఇటువంటి సినిమా ఉత్సవాలను చేసుకుంటూనే ఉంటాయి.

Saturday, September 7, 2013

స్వామీ వివేకానంద

Picture
          స్వామీ వివేకానంద (జనవరి 12, 1863 - జూలై 4, 1902), (బెంగాలీలో 'షామీ బిబేకానందో') ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాధుడు. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.
   

      భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండుల లో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి అతనికి కలదు. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్త్వమును షికాగో లో జరిగిన ప్రపంచ మత జాతర (పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్)లో 1893 లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు.
    తిరిగి భారత దేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ముప్పై ఏళ్ళ వయసు లోనే మరణించాడు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా ప్రకటించింది.


బాల్యం:-

    నరేంద్ర నాధుడు కలకత్తాలో ఒక ఉన్నత కుటుంబానికి చెందిన విశ్వనాధ్ దత్తా మరియు భువనేశ్వరి దేవి దంపతులకు జన్మించాడు. చిన్నప్పటి నుంచే ధ్యానం చేసేవాడు. బాలుడిగా ఉన్నపుడు నరేంద్రుడు చాలా ఉల్లాసంగా, చిలిపిగా ఉండేవాడు. సన్యాసుల పట్ల యోగుల పట్ల అమితమైన ప్రేమను కనబరిచేవాడు. వారు ఏదడిగినా సరే లేదనకుండా ఇచ్చేసేవాడు. పుట్టగానే పువ్వు పరిమళిస్తిందన్నట్లుగా చిన్నప్పటీ నుంచే అతనికి నిస్వార్థ గుణం, మరియు ఔదార్య గుణాలు అలవడ్డాయి.

    నరేంద్రుడు ఆటలలోనూ, చదువులో కూడా ముందుండేవాడు. ఏకసంథాగ్రాహి. పాఠాన్ని ఒకసారి చదివితే మొత్తం గుర్తుంచుకునేవాడు. అతని జ్ఞాపకశక్తి అమోఘమైనది. 1880 కల్లా మెట్రిక్యులేషన్ పరీక్ష మరియు ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణుడై కళాశాలలో చేరాడు. రోజు రోజుకూ అతని జ్ఞాన తృష్ణ అధికంకాసాగింది. దైవం గురించి తెలుసుకోవాలని పరమ ఆసక్తితో ఉండేవాడు. చరిత్ర మరియు సైన్సు తోపాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా ఔపోసన పట్టాడు. అలా చదువులో ముందుకెళుతున్న కొద్దీ అతని మదిలో అనుమానాలు, సందేహాలు, అస్పష్టత ఎక్కువ కాసాగినాయి. అలా మూఢ నమ్మకాలన్నింటినీ విడిచిపెట్టినప్పటికీ సత్యాన్ని మాత్రం కనుగొనలేకపోయాడు.

    నరేంద్రుడు తనకు వచ్చిన సందేహాలన్నీ అనేక పండితుల ముందు వెలిబుచ్చాడు. వారంతా వాదనలలో ఆరితేరిన వారు. కానీ వారి వాదనలేవీ నరేంద్రుడిని సంతృప్తిపరచలేకపోయాయి. వారు ఆలోచిస్తున్న మార్గం కూడా వివేకానందుడికి నచ్చలేదు. అందునా వారెవరికీ భగవంతునితో ప్రత్యక్ష అనుభవం లేదు.

రామకృష్ణ పరమహంసతో పరిచయం:-

    రామకృష్ణ పరమహంస కాళికాదేవి ఆలయంలో పూజారి. ఆయన పండితుడు కాదు కానీ గొప్ప భక్తుడు. అతను భగవంతుని కనుగొనిఉన్నాడని జనాలు చెప్పుకుంటుండగా నరేంద్రుడు విన్నాడు. ఎవరైనా పండితులు ఆయన దగ్గరకు వెళితే వారు ఆయనకు శిష్యులు కావలసిందే. ఒకసారి నరేంద్రుడు తన మిత్రులతో కలిసి ఆయనను కలవడానికి దక్షిణేశ్వర్ వెళ్ళాడు. రామకృష్ణ పరమహంస తన శిష్యులతోపాటు కూర్చుని ఉన్నారు. భగవంతుని గురించిన సంభాషణలో మునిగిపోయి ఉన్నారు. నరేంద్రుడు తన స్నేహితులతోపాటు ఒక మూలన కూర్చుని వారి సంభాషణను ఆలకించసాగాడు. ఒక్కసారిగా రామకృష్ణ పరమహంస దృష్టి నరేంద్రుడి మీదకు మళ్ళింది. ఆయన మనసులో కొద్దిపాటి కల్లోలం మొదలైంది. ఆయన సంభ్రమానికి గురయ్యారు. ఏవేవో ఆలోచనలు ఆయనను చుట్టుముట్టాయి.పాతజ్ఞాపకాలేవో ఆయనను తట్టిలేపుతున్నట్లుగా ఉంది. కొద్ది సేపు అలాగే విశ్చలంగా ఉన్నాడు. నరేంద్రుడు ఆకర్షణీయమైన రూపం, మెరుస్తున్న కళ్ళు ఆయనను ఆశ్చర్యానికి గురి చేశాయి. నువ్వు పాడగలవా? అని నరేంద్రుడిని ప్రశ్నించాడు. అప్పుడు నరేంద్రుడు తమ మృధు మధురమైన కంఠంతో రెండు బెంగాలీ పాటలు గానం చేశాడు. ఆయన ఆ పాటలు వినగానే అదోవిధమైన తాదాత్మ్యత ("ట్రాన్స్") లోకి వెళ్ళిపోయాడు. కొద్ది సేపటి తరువాత నరేంద్రుడిని తన గదికి తీసుకువెళ్ళాడు. చిన్నగా నరేంద్రుడి భుజం మీద తట్టి, ఆయనతో ఇలా అన్నాడు. ఇంత ఆలస్యమైందేమి? ఇన్ని రోజులుగా నీ కోసం చూసి చూసి అలసి పోతున్నాను. నా అనుభావలన్నింటినీ ఒక సరైన వ్యక్తితో పంచుకోవాలనుకున్నాను. నీవు సామాన్యుడవు కావు. సాక్షాత్తు భువికి దిగివచ్చిన దైవ స్వరూపుడవు. నీ గురించి నేనెంతగా తపించానో తెలుసా? అంటూ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు.

    ఆయన ప్రవర్తన నరేంద్రుడికి వింతగా తోచింది. ఆయనకు పిచ్చేమే అనుకున్నాడు. నీవు మళ్ళీ తిరిగి వప్పుడు తప్పించుకుందామా అని చూస్తున్న నరేంద్రుడు అందుకు సరే అన్నాడు. ఆయన బోధన పూర్తయ్యాక మీరు భగవంతుని చూశారా? అని ప్రశ్నించాడు. అవును చూశాను నేను నిన్ను చూసిన విధంగానే, ఆయనతో మాట్లాడాను కూడా, అవసరమైతే నీకు కూడా చూపించగలను. కానీ భగవంతుని చూడాలని ఎవరు తపించిపోతున్నారు? అన్నాడాయన. ఇప్పటి దాకా ఎవరూ తాము భగవంతుని చూశామని చెప్పలేదు, కానీ ఈయన మాత్రం నేను భగవంతుని చూశానని చెప్తున్నాడు. ఎలా నమ్మడం?, ఇతను మతి తప్పి మాట్లాడుతుండవచ్చు. కానీ సరైన అవగాహన లేనిదే ఏ అభిప్రాయం ఏర్పరుచుకోకూడదు అని మనసులో అనుకున్నాడు నరేంద్రుడు.

    ఒక నెల రోజులు గడిచాయి. నరేంద్రుడు ఒక్కడే దక్షిణేశ్వర్ కు వెళ్ళాడు. రామకృష్ణులవారు మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నారు. నరేంద్రుని చూడగానే ఆయన చాలా సంతోషించారు. మంచం మీద కూర్చోమన్నారు. అలాగే ధ్యానంలోకి వెళ్ళి ఆయన కాలును నరేంద్రుడి ఒడిలో ఉంచారు.మరుక్షణం నరేంద్రుడికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆయనకేదో అయిపోతున్నట్లుగా అనిపించసాగింది. నన్నేమి చేస్తున్నావు? నా తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు. నేను మళ్ళీ వారి దగ్గరకు వెళ్ళాలి. అని అరిచాడు. రామకృష్ణుల వారు చిరునవ్వు నవ్వుతూ ఈరోజుకిది చాలు అని చెప్పి తన కాలును వెనక్కి తీసేసుకున్నారు. నరేంద్రుడు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. రోజులు గడిచేకొద్దీ ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులయ్యారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు.

    నరేంద్రుడి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి రామకృష్ణులవారికి ఎంతో సమయం పట్టలేదు. కాళికా దేవి ఆయనకు మార్గనిర్దేశం కూడా చేస్తుంది. కానీ నరేంద్రుడు మాత్రం ఆయనను పరీక్షించేవరకూ గురువుగా నిర్ణయించుకోకూడదనుకున్నాడు. భగవంతుని గురించి తెలుసుకోవాలంటే స్త్రీల గురించి ధనం గురించి వ్యామోహాన్ని విడనాడాలని చెప్పేవాడు. నరేంద్రుడు ఆయనకు ప్రియతమ శిష్యుడు. అలాగని నరేంద్రుడు చెప్పిన అన్ని విషయాలతో ఆయన ఏకీభవించేవాడు కాదు. విగ్రహారాధన చేసేవారిని నరేంద్రుడు బాగా విమర్శించేవాడు. అద్వైతాన్ని కూడా వ్యతిరేఖించాడు. అలౌకిక అనుభవాల మీద అంతగా నమ్మకం లేదు. నేనే బ్రహ్మను నేనే శివుణ్ణి అనేలాంటి వాక్యాలేవీ అతనిని అంతగా ప్రభావితం చేసేవి కావు. కానీ ఎప్పటికప్పుడు రామకృష్ణులవారు నరేంద్రుని సరైన మార్గంలోకి తీసుకువచ్చేవాడు.

తండ్రి మరణం:-

    నరేంద్రుడు నెమ్మదిగా ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం తగ్గి సన్యాసం వైపు మొగ్గు చూపడం ప్రారంభించాడు. అది అతని తల్లిదండ్రులకు తెలియవచ్చింది. అప్పుడు అతను బియ్యే పరీక్షకు తయారవుతున్నాడు. 1884లో బియ్యే పాసయ్యాడు. అతని స్నేహితుడొకడు పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీలో నరేంద్రుడు పాట పాడుతుండగా తెలిసింది పిడుగు లాంటి వార్త. తండ్రి మరణించాడని. వెనువెంటనే ఆకుటుంబాన్ని పేదరికం ఆవరించింది. అప్పులిచ్చిన వాళ్ళు వేధించడం మొదలుపెట్టారు. కొద్దిమంది న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. నరేంద్రుడు ఉద్యోగం కోసం కాళ్ళరిగేలా తిరిగాడు. బట్టలు మాసిపోయి చిరిగిపోయాయి. రోజుకొకపూట భోజనం దొరకడం కూడా గగనమైపోతుంది. చాలారోజులు ఆయన పస్తులుండి తల్లికి, చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు తిండి పెట్టేవాడు. వారితో తను స్నేహితులతో కలిసి తిన్నట్లు అబద్దం చెప్పేవాడు. కొన్నిసార్లు ఆకలితో కళ్ళు తిరిగి వీధిలో పడిపోయేవాడు. ఇంత దురదృష్టం తనను వెన్నాడుతున్నా ఎన్నడూ భగవంతుని మీద విశ్వాసం కోల్పోలేదు. నీవు కాళికా దేవికి మరియు సాటి ప్రజలకు సేవ చేయాల్సిన వాడివ, నీవు ధైర్యంగా ఉండాలి అంటూ రామకృష్ణుల వారు ఓదార్చేవారు.

    తరువాత నరేంద్రుడు కొద్దిరోజులపాటు విద్యాసాగర్ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు. ఇప్పుడు కుటుంబానికి కనీసం తినడానికి తిండైనా దొరుకుతున్నది. బోధకుడిగా పనిచేస్తూనే తన న్యాయ విద్యను కొనసాగించాడు. గురువుగారి ఆరోగ్యం క్షీణించింది. ఆయనకు గొంతు క్యాన్సర్ సోకింది. నరేంద్రుడు తన ఉద్యోగం, చదువు రెండు మానేసి గురు శుశ్రూషలో మునిగిపోయాడు. రామకృష్ణులవారికి మరణం సమీపిస్తోంది. చివరి రోజున ఆయన నరేంద్రుడిని పిలిచి అలా మృదువుగా తాకాడు. ఆయన ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ నరేంద్రుడికి ధారపోసి ఇలా అన్నాడు. నరేన్! నీవు ఇప్పుడు సర్వశక్తిమంతుడవు. వీళ్ళంతా నా బిడ్డలవంటి వారు. వీరిని చూసుకోవాల్సిన భాద్యత నీదే అన్నాడు. నరేంద్రుడి హృదయం బాధతో నిండిపోయింది. గదిలోకి బయటకు వెళ్ళిపోయి చిన్నపిల్లవాడిలా దుఖించడం మొదలుపెట్టాడు. రామకృష్ణులవారు చనిపోయిన తరువాత ఆయన శిష్యులందరూ కలిసి బరనగూర్‌లోమి ఒక అద్దె ఇంట్లో నివాసం ప్రారంభించారు. ఆ ఇల్లు చాలా పాతది అయినప్పటికీ నగరం యొక్క రణగొణ ధ్వనులకు చాలా దూరంగా గంగానది ఒడ్డున ఉండేది. అక్కడినుండి రామకృష్ణుల వారి సమాధి చాలా దగ్గరగా ఉండేది. అక్కడే రామకృష్ణ మఠం స్థాపించడం జరిగింది. అక్కడున్న యువసన్యాసులకు రెండే లక్ష్యాలు ఉండేవి. ప్రజలకు సేవ చేయడం , ముక్తిని సాధించడం. కొద్ది మంది యువకులు తమ కుటుంబాల్ని వదిలిపెట్టి సన్యాసులు గా మారారు. నరేంద్రుడు కూడా సన్యాసిగా మారి ఆ మఠానికి నాయకుడయ్యాడు. ఆ యువ సన్యాసులు తిండి, బట్ట గురించి పెద్దగా ఆలోచించేవారు కాదు. ఉపవాసం ఉన్నపుడు కూడా తమ చదువును ధ్యానాన్ని నిర్లక్ష్యం చేసేవారు కాదు. నరేంద్రుడు వారికి సంస్కృతాన్ని బోధించేవాడు. అక్కడికి విచ్చేసే సందర్శకులకి గురువుగారి బోధనలను విడమరిచి చెప్పేవాడు.

వివేకానందుడిగా మార్పు:-

    నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందుడిగా మారాడు. భారతదేశం అతని గృహమైంది. ఇక్కడి ప్రజలు అతని సోదర, సోదరీమణులయ్యారు. దురదృష్టవంతులైన తన సోదరుల కన్నీళ్ళు తుడవడం అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించే పని. దేశమంతా పర్యటించాడు. తనకున్న ఆస్తి అంతా ఒక కాషాయ వస్త్రము, ఒక కమండలము, శిష్యగణం మాత్రమే. ఈ పర్యటనలో అతను ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. దారి మద్యలో గుడిసెల్లోనూ, సత్రాలలోనూ నివసించేవాడు, కటిక నేలమీదనే నిద్రించేవాడు. అనేక మంది సాధువుల సాంగత్యంలో గడిపాడు. ఆధ్యాత్మిక చర్చలతో, పవిత్ర కార్యాల గురించిన చర్చలతో సమయం గడిపేవాడు. చాలా దూరం కాలినడకనే నడిచేవాడు. ఎవరైనా దయ తలిస్తే ఏదైనా వాహనంలో ఎక్కేవాడు. ఆళ్వార్ దగ్గర కొద్ది మంది ముస్లింలు కూడా ఆయనకు శిష్యులయారు. ఎవరైనా రైలు ప్రయాణానికి టిక్కెట్టు కొనిస్తేనే రైలులో ప్రయాణం చేసేవాడు. చాలాసార్లు తన దగ్గర డబ్బులేక పస్తుండాల్సి వచ్చేది.

    మైసూరులో స్వామికి దివాను శేషాద్రి అయ్యర్ మరియు మైసూరు మహారాజా వారితో పరిచయం ఏర్పడింది. పండితుల సభలో స్వామీజీ సంస్కృతం లో చేసిన ప్రసంగం మహారాజా వారిని ముగ్ధుల్ని చేసింది. భారతదేశం వివిధ మతాల మరియు వివిధ తత్వాల సమ్మేళనం. పాశ్చాత్యులు సైన్సులో మంచి పురోగతి సాధించారు. ఈ రెండు కలిస్తే మానవజాతి మంచి పురోగతిని సాధించగలదు. కాబట్టి నేను అమెరికా వెళ్ళి అక్కడ వేదాంతాన్ని వ్యాప్తి చెయ్యాలనుకుంటున్నాను అని స్వామీజీ మైసూరు మహారాజాతో అన్నాడు. అయితే ఆ ఖర్చులన్నీ నేనే భరిస్తానన్నాడు. మాహారాజా. స్వామీజీ ఆయనకు కృతజ్ఞతలు తెలిపి సమయం వచ్చినపుడు తప్పకుండా ఆయన సహాయం తీసుకుంటానని చెప్పి సెలవు తీసుకున్నాడు.

    తరువాత స్వామీజీ భాస్కర సేతుపతి పరిపాలిస్తున్న రామనాడును సందర్శించాడు. అక్కడి రాజు స్వామీజీని మిక్కిలి గౌరవించాడు. మీరు అమెరికాలో జరగబోవు సర్వ మత సమ్మేళనానికి తప్పకుండా హాజరవాలి. అందుకయ్యే ఖర్చంతా నేను భరిస్తాను అన్నాడు. దానిని గురించి తప్పకుండా ఆలోచిస్తానని ఆయనకు మాట ఇచ్చి అక్కడి నుంచి రామేశ్వరానికి వెళ్ళి చివరకు కన్యాకుమారి చేరుకున్నాడు. కొద్ది దూరం ఈదుకుంటూ వెళ్ళి ఒక రాయి మీద కూర్చున్నాడు. పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ భారతదేశపు ఆధ్యాత్మిక విలువల్ని వారికి వివరించడం తన ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నాడు. తరువాత స్వదేశానికి తిరిగి వచ్చి నిదురపోతున్న భారతజాతిని మేల్కొలపాలనుకున్నాడు. అతని ప్రయాణానికి ఖర్చుల నిమిత్తం దేశం నలుమూలల నుంచీ విరాళాలు వచ్చి పడ్డాయి. కానీ అతడు మాత్రం తన ప్రయాణానికి ఎంత కావాలో అంతే స్వీకరించాడు. మిగిలిన ధనాన్ని దాతలకు తిరిగి ఇచ్చివేశాడు. అతను ఎక్కిన నౌక బొంబాయి తీరం నుంచి 1893, మే 31వ తేదీన బయలు దేరింది.

విదేశాలలో:-
    జులై నెలలో స్వామీజీ చికాగో నగరానికి చేరుకున్నాడు. దారిలో ఆయన కొలంబో, సింగపూర్, హాంకాంగ్, టోక్యో వంటి ఓడరేవు లను కూడా సందర్శించాడు. అక్కడ తాను వెళుతున్న ప్రపంచ సర్వమత సమ్మేళనాన్ని గురించి వాకబు చేశాడు. అప్పటికి ఆ సదస్సుకు మూడు నెలల వ్యవధి ఉంది. చికాగో నగరం చాలా ఖరీదయిన నగరం కావడంతో స్వామీజీ బోస్టన్ నగరానికి వెళ్ళాడు. దారి మద్యలో ఒక మహిళ స్వామికి పరిచయం అయింది. ఆయనతో కొద్ది సేపు మాట్లాడగానే ఆమెకు ఆయన గొప్పతనమేమిటో అర్థం అయింది. ఆయన సామాన్యుడు కాదని తెలిసి కొద్ది రోజులు ఆమె ఇంటిలో బస చేయమని కోరింది. స్వామీజీ అందుకు అంగీకరించాడు. అప్పుడప్పుడు చుట్టుపక్కల జరిగే చిన్న సభలలో ఉపన్యసించేవాడు. వీటిలో ప్రధానంగా భారతీయ సంస్కృతి మరియు హిందూ ధర్మం ప్రధాన అంశాలుగా ఉండేవి. నెమ్మదిగా చాలామంది పండితులు ఆయనకు మిత్రులయ్యారు. వారిలో ఒకరు జాన్ హెన్రీ రైట్. అతడు హార్వర్డ్ విశ్వవిద్యాలయం లో గ్రీకు విభాగంలో ఆచార్యుడు. సమ్మేళనానికి హాజరయ్యే సభ్యులంతా నిర్వాహకులకు పరిచయపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కానీ స్వామీజీ తన పరిచయ పత్రాన్ని ఎక్కడో పోగొట్టుకున్నాడు. అప్పుడు రైట్ పరిచయ పత్రాన్ని రాశాడు. ఆ పత్రంలో స్వామీజీ చాలా మంది ప్రొఫెసర్ల కన్నా మంచి పరిజ్ఞానం కలవాడని రాసి పంపించాడు.[1] స్వామీజీ చికాగోకు తిరిగి వచ్చాడు. సదస్సు 1893, సెప్టెంబర్ 11న ప్రారంభమైంది. దేశవిదేశాల నుంచి వచ్చిన వేలాది మంది ప్రతినిధులు అక్కడ చేరారు. వివేకానంద వారందరిలోకెల్లా చిన్నవాడు. అతను మాట్లాడే వంతు వచ్చేసరికి గుండె వేగం హెచ్చింది. అందరు సభ్యుల దగ్గరా ఉన్నట్లు ఆయన దగ్గర ముందుగా తయారు చేసిన ఉపన్యాసం లేదు. అతని ప్రసంగాన్ని చివరలో ఉంచమని అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశాడు. ఉపన్యసించడానికి ముందు గురువైన రామకృష్ణులవారినీ, సరస్వతీ దేవిని మనస్పూర్తిగా ప్రార్థించాడు.
అమెరికా దేశపు ప్రియ సహోదరులారా! అని స్వామీజీ తన మృధు మధుర కంఠస్వరంతో అనగానే సభ మూడు నిమిషాలపాటు చప్పట్లతో దద్దరిల్లింది.శబ్దం ఆగిన తరువాత తన ప్రసంగాన్ని ఆరంభించాడు. [2] అక్కడున్న ప్రతీ ప్రతినిధి స్వామీజీ ప్రసంగాన్ని ప్రశంసించారు. వార్తాపత్రికలు ఆయన వ్యాసాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. అక్కడి ప్రజలకు ఆయన ఆరాధ్యుడయ్యాడు. ఆయన మాట్లాడడానికి లేచాడంటే చాలు, చెవులు చిల్లులుపడే శబ్దంతో చప్పట్లు దద్దరిల్లేవి. కొన్ని సంస్థలు సభ జరుగుతున్నపుడు మద్యలోనే తమ సంస్థకు ఆహ్వానించేవి.అనతి కాలంలోనే స్వామీజీకి ప్రపంచ ప్రఖ్యాతి లభించింది. ఎక్కడికి వెళ్ళినా స్వామీజీ తన ప్రసంగంలో భారతదేశపు విలువల్ని చాలా సేపు వివరించేవాడు. చరిత్ర అయినా, సామాజిక శాస్త్రం అయినా, తత్వశాస్త్రం అయినా, సాహిత్యమైనా ఎటువంటి తడబాటు లేకుండా ఉపన్యసించేవాడు.కొత్త అవతారం,హిందూ మతాన్ని చక్కగా తెలుపగల నైపుణ్యం, వికాసవంతమైన వ్యక్తిత్వం,ఈ మూడు గుణాలతో ఆయన అందరి హృదయాలను గెలవగలిగాడు.వాదనలలో ఆయనను గెలవగలిగిన వారు లేరు.ఆయన ఆంగ్ల నైపుణ్యం అపారం. అటువంటి మనీషి యుగానికి ఒకరే పుడతారు.ఆయనను సజీవంగా చూస్తూ ఆయన బోధనలను వినడం నిజంగా మనం చేసుకున్న పుణ్యం అని ఒక పత్రిక వ్యాఖ్యానించింది.

    స్వామీజీ కృషి వల్ల ఒక్క అమెరికాలోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ భారతదేశం పట్ల గౌరవం ఏర్పడింది. ఆయన ఎక్కడ ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళినా జనం గుమికూడి ఎంతో ఓపికగా ఎదురుచూసేవారు. ఉపన్యాసం అయిపోయిన తరువాత ఆయన్ని తమ ఇళ్ళకు ఆహ్వానించి ఆదరించేవారు. ఇంగ్లాండు నుంచి కూడా ఆయనకు ఆహ్వానం లభించింది. ఆయనకు అక్కడ ఘనస్వాగతం లభించింది. వార్తాపత్రికలు ఆయనను ఘనతను, వాగ్ధాటిని శ్లాఘించాయి. ఎంతోమంది ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యులు సిస్టర్ నివేదిత గా మార్పు చెందిన మార్గరెట్ నోబుల్. తరువాత ఆమె భారతదేశానికి వచ్చి ఇక్కడే ఉండిపోవడం జరిగింది.

    నాలుగు సంవత్సరాల పాటు విదేశీ పర్యటన తరువాత స్వామీజీ తిరిగి భారతదేశానికి విచ్చేశాడు. ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన కీర్తి దశదిశలా వ్యాపించిపోయింది. జనవరి 15, 1897 ఆయన కొలంబోలో దిగగానే ఆయనకు చక్రవర్తికి లభించినంత స్వాగతం లభించింది. మద్రాసుకు చేరుకొనేటప్పటికి ఆయన అభిమానులు రథం మీద లాగుతూ ఊరేగించారు.లెక్కలేనన్ని పూలమాలలు, సందేశాలు లభించాయి. ఎక్కడికి వెళ్ళినా తమ గురువు చెప్పిన సందేశాన్ని వ్యాప్తి చేశాడు.ఆయన దగ్గరకు మార్గదర్శకత్వం కోసం వచ్చేవారికి ఆధ్యాత్మిక విలువల యొక్క ప్రాధాన్యాన్ని బోధించేవాడు. అదే స్పూర్తితో, లక్ష్యంతో1897 లో రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు. తరువాత రెండు సంవత్సరాలలో గంగానది ఒడ్డున గల బేలూర్ వద్ద స్థలాన్ని కొని మఠం కోసం భవనాల్ని నిర్మించాడు.

ముఖ్య సూత్రములు తత్త్వములు:-

వివేకానందుడు గొప్ప తాత్వికుడు. అతని ముఖ్య బోధనల ప్రకారం అద్వైత వేదంతము తత్త్వ శాస్త్రములో నే కాకుండా , సామాజికంగా రాజకీయంగా కూడా ఉపయోగ పడుతుంది. రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో 'జీవుడే దేవుడు' అనేది అతని మంత్రముగా మారింది. 'దరిద్ర నారాయణ సేవ' (పేదవారి సేవ తో భగవంతుని సేవ) అనే పదాన్ని ప్రతిపాదించాడు. "విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనము మనని గొప్ప వారని తక్కువ వారని ఎలా అనుకుంటాము?" అనే ప్రశ్న తనకు తాను వేసుకుని ఈ తేడాలన్నీ మోక్షము సమయములో కలిగే దివ్యజ్యోతి లో కలిసి పోతాయని తెలుసుకున్నాడు. అప్పుడు పుట్టే ప్రేమ నుండి, తమలోని బ్రహ్మాన్ని తెలుసుకోలేని మనుష్యులను ఆదుకునే సత్ప్రవర్తన పుడుతుంది.అందరు తనవార నుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వానికి చెందిన వ్యక్తి వివేకానందుడు. వ్యక్తిగత మోక్షము పై వ్యామోహము ను కూడా వదిలివేసి, ఇతరులను బంధవిముక్తులను చెయ్యడమే మనిషికి జ్ఞానోదయము అని నమ్మిన మనిషి. రామకృష్ణా మిషన్ (రామకృష్ణా మఠము)ను "వ్యక్తి మోక్షమునకు, ప్రపంచ హితమునకు"(आत्मनॊ मोक्षार्थम् जगद्धिताय च) అనే నినాదము మీద స్థాపించాడు.
సిద్ధాంతాలు, పిడివాదాలు, సంప్రదాయాలు, దేవాలయాలు మున్నగువాటిని గురించి ఆలోచించకు. మనిషి హృదయంలో దీపిస్తూన్న ఆత్మ వస్తువుతో సరిపోల్చితే అవి ఎందుకూ కొరగావు. ఆ వస్తువే ఆధ్యాత్మిక శక్తి. మొదట ఈ శక్తిని సముపార్జించండి. ఇతర ధర్మాలను నిందించవద్దు. ప్రతి మతంలోను, ప్రతి సిద్ధాంతంలోను, ఎంతోకొంత మంచి వుంటుంది.సోదర ప్రేమ గురించి ప్రసంగాలుమాని, ఆ ప్రేమను కార్యరూపంలో ప్రదర్శించండి.త్యాగ, సాక్షాత్కారాలను పొందినవాడే ప్రపంచంలోని సర్వమతాలలోని ఏకత్వాన్ని దర్శించగలడు. వ్యర్థ వాదాలకు ఆస్కారం లేదని గ్రహింపగలడు. అపుడే మానవాళికి సహాయం చేయగలడు. వాస్తవానికి అన్ని మతాలు ఒకే సనాతన ధర్మంయొక్క అంశాలు.

మరణం:-

అవిశ్రాంతంగా పని చేయడం వలన స్వామి ఆరోగ్యం దెబ్బతిన్నది. అమెరికాలోని ఆయన శిష్యుల అభ్యర్థన మేరకు మరల అక్కడికి వెళ్ళాడు. ప్యారిస్ లోని సర్వమత సమావేశాలలో పాల్గొని తిరిగి స్వదేశానికి వచ్చాడు. రాన రానూ అంతర్ముఖుడయ్యాడు. శరీరమైతే బలహీనంగా తయారయ్యింది కానీ ఆయన ఆత్మ,మనసు మాత్రం చాలా చురుగ్గా వ్యవహరించేవి. జులై 4, 1902న యధావిధిగా ఆయన రోజూవారీ కార్యక్రమాలు నిర్వర్తించుకున్నాడు. శిష్యులకు బోధనలు చేశాడు. భోంచేసిన తరువాత కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాడు. కొద్ది సేపటి తరువాత ఆయనకు చిన్న వణుకు లాంటిదేదో కలిగింది. తనను చూడడానికి వచ్చిన వారితోనూ, శిష్యులతోనూ చాలా ఉల్లసంగా నవ్విస్తూ గడిపాడు. రాత్రి 9 గంటల సమయంలో ఆయనఅలసిపోయినట్లుగా కనిపించాడు. చేతులలో సన్నగా వణుకు ప్రారంభమైంది.చిన్నగా అరిచి లేచి కూర్చున్నాడు. దీర్ఘంగా శ్వాస పీల్చి నెమ్మదిగా శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. ఆయన శిష్యులు తల్లితండ్రులను కోల్పోయిన అనాథలవలే దుఖించారు.

Picture
Picture

Sunday, July 28, 2013

కోల్గేట్ సెన్సిటివ్ టూత్ పేస్ట్ సాంపిల్ ఉచితంగా పొందండి ఇలా




కోల్గేట్ సెన్సిటివ్ ప్రో రిలీఫ్ టూత్ పేస్ట్ సాంపిల్ పేకెట్ మీ ఇంటికే ఉచితంగా పంపించే ఆఫర్ ఇస్తోంది పామోలివ్ కంపెనీ..దీనికి మీరు చెయ్యవవల్సింది మీ అడ్రస్ SMS ద్వారా పంపడమే!

ఈ ఆఫర్ ఈ నెలాఖరువరకూ మత్రమే ఉంటుంది.. కనుక త్వరపడండి..

మీరు చేయవల్సిన విధానం:
1.  18002082020 టోల్ ఫ్రీ నంబర్ కు  మిస్ కాల్ ఇవ్వండి.
2. మీకు ఓ SMS వస్తుంది.
2. అందులోని నంబర్ కు మీ అడ్రస్ ఇచ్చిన ఫార్మాట్లో SMS చేయండి.
4. తిరిగి మీకో SMS వస్తుంది - మీ సాంపిల్ త్వరలో మీకు అందుతుందని.
అంతే!!
*మీరు పంపే  SMS కు దాదాపు 3 రూపాయిల వరకూ చార్జి అయ్యే అవకాశం ఉంది.

Saturday, July 13, 2013

మరో ప్రపంచ వింత భోపాల్‌ తాజ్‌మహల్‌

తాజ్‌మహల్‌ పేరుచెప్పగానే మనకు ఆగ్రాలో షాజహాన్‌ నిర్మించిన తాజ్‌మహల్‌ గుర్తొస్తుంది. ముంతాజ్‌ ప్రేమకు గుర్తుగా ఆయన నిర్మించిన కట్టడం ప్రపంచ వింతల్లో చోటు సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే... అరుుతే, అచ్చం అలాగే కాకపోరుునా మనదేశంలో మరో తాజ్‌మహల్‌ కూడా వుంది! ఇది మీకు ఆశ్చర్యమనిపించినా... అక్షరాలా నిజం. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో వున్న ‘తాజ్‌మహల్‌ నెం.2’ విశేషాలు... ఈవారం ‘విహారి’...

ఆగ్రాలో ఉన్న అందమైన కట్టడం తాజ్‌మహల్‌ ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా నిలిచి పేరు తెచ్చుకుంది. ఈ అద్భుత కట్టడం గురించి అందరికీ తెలిసిందే. కానీ మన దేశంలో మరో తాజ్‌మహల్‌ కూడా ఉందన్న విషయం చాలా మందికి తెలియదు ఈ తాజ్‌మహల్‌ భోపాల్‌లో ఉండడం విశేషం. ఒకప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద రాజప్రాసాదంగా పేరుగాంచిన ఈ అద్భుత చారిత్రక కట్టడం ఇది.భోపాల్‌ రాజ్యాన్ని పరిపాలించిన 11వ పరిపాలకురాలు నవాబ్‌ షాజహాన్‌ బేగమ్‌ ఎన్నో అందమైన కట్టడాలను నిర్మించారు.1868 నుంచి 1901 వరకు ఆమె భోపాల్‌ను పరిపాలించి నిర్మించిన కట్టడాల్లో తాజ్‌మహల్‌ కూడా ఒకటి. ఈ తాజ్‌మహల్‌ భోపాల్‌లోని అతిపెద్దదైన మసీదు తాజ్‌-ఉల్‌-మజీద్‌ పక్కన నిర్మితమైంది.

రాజప్రాసాదంగా...
షాజహాన్‌ తన ప్రియురాలి కోసం తాజ్‌మహల్‌ను కట్టించాడు. కానీ భోపాల్‌లోని తాజ్‌మహల్‌ బేగమ్‌ నివాసంగా రూపుదిద్దుకుంది. ఆ కాలంలో 70 లక్షల రూపాయలతో దీన్ని నిర్మించారు. 1871 నుంచి 1884 వరకు 13 సంవత్సరాల కాలంలో ఈ చారిత్రక కట్టడం రూపుదిద్దుకుంది. ఆ కాలంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన రాజప్రాసాదంగా దీన్ని నిర్మించడం విశేషం. మొదట దీన్ని రాజ్‌మహల్‌ పేరుతో పిలిచేవారు. ఆ తర్వాత భోపాల్‌లో నివసించిన బ్రిటీష్‌ పరిపాలకులు దీని నిర్మాణాన్ని చూసి ఎంతో ముగ్ధులయ్యారు. దీని ఆర్కిటెక్చర్‌ పనితనం వారికి బాగా నచ్చి ఈ కట్టడాన్ని కూడా తాజ్‌మహల్‌గా పిలిచారు. ఇక భోపాల్‌ తాజ్‌మహల్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత బేగమ్‌ జష్న్‌-ఎ-తాజ్‌మహల్‌ పేరిట మూడు సంవత్సరాల పాటు వేడుకలను నిర్వహించారు.

స్వాతంత్య్రానంతరం
1947లో స్వాతంత్య్రం వచ్చి... దేశవిభజన జరిగిన తరువాత నవాబ్‌ హమీదుల్లా ఖాన్‌ సింధీ కాందిశీకులను ఈ ప్యాలెస్‌లో నివసించేందుకు ఏర్పాట్లు చేశారు. వారు తాజ్‌మహల్‌లో నాలుగు సంవత్సరాలపాటు నివసిం చారు. ఆ తర్వాత భోపాల్‌లోని బైరాఘర్‌కు తమ నివాసాన్ని మార్చారు. ఈ కాలంలో ఈ రాజప్రాసాదం కొంత దెబ్బతిన్నది. ఆ తర్వాత పలువురు భోపాల్‌ రాజవంశీకులు ఈ రాజప్రాసాదంలో నివసించి క్రమక్రమంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. 2008లో ఈ రాజమహల్‌లోని పలు భవనాలు కూలిపోయాయి. 2005లో భోపాల్‌ తాజ్‌హమల్‌ను మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర చారిత్రక వారసత్వ సంపదగా ప్రకటించింది.

అధ్బుత నిర్మాణశైలి
భోపాల్‌ తాజ్‌మహల్‌ను వివిధ రకాల శిల్పకళాపనితనంతో అందంగా నిర్మించారు. బ్రిటీష్‌, ఫ్రెంచ్‌, మొఘల్‌, అరబిక్‌, హిందూ వాస్తు నిర్మాణ పద్ధతులతో దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ ప్యాలెస్‌లో 120 గదులను నిర్మించారు. ఇందులో శీష్‌మహల్‌ (అద్దాల ప్యాలెస్‌), అతి పెద్దదైన సావన్‌ బడో పెవిలియన్‌ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఏడు అంతస్తుల భవనం ఇక్కడ చూడదగినది. భోపాల్‌ తాజ్‌మహల్‌పై పరిశోధన చేసిన హుస్సేన్‌ (75) ఈ కట్టడంపై ప్రత్యేకంగా ‘ద రాయల్‌ జర్నీ ఆఫ్‌ భోపాల్‌’ అనే పుస్తకాన్ని రాశారు.

భోపాల్‌లోనే అతిపెద్ద ప్యాలెస్‌గా దీన్ని ఆయన అభివర్ణించారు. ఇక భోపాల్‌ తాజ్‌మహల్‌ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. దేశ, విదేశాలకు చెందిన వేలాది మంది పర్యాటకులు ప్రతి ఏటా ఈ కట్టడాన్ని తిలకిస్తున్నారు. ఈ కట్టడం అందాలకు వారు మంత్రముగ్ధులవుతున్నారు. భోపాల్‌ తాజ్‌మహల్‌ అందాలు వర్ణనాతీతం. ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజప్రాసాదంగా నిర్మించిన ఈ కట్టడం వివిధ వాస్తు నిర్మాణ శైలులకు అద్దం పడుతోంది. ఈ కట్టడంలోని వివిధ భవనాలు ఎంతో అందంగా తీర్చిదిద్దారు.

తాజ్‌ పరిరక్షణకు...
ఇక భోపాల్‌ తాజ్‌ను పరిరక్షించేందుకు గత కొన్ని సంవత్సరాలుగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వమిస్తున్న సవితా రాజె కొంతకాలం క్రితం ప్యారిస్‌లోని స్కూల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ డీన్‌ సెర్జ్‌ సాంటెల్లిని ప్రత్యేకంగా భోపాల్‌కు ఆహ్వానించారు. సెర్జ్‌ సాంటెల్లి తాజ్‌మహల్‌లోని పలు భవన సముదాయాలను పరి రక్షించేందుకు కృషిచేస్తున్నారు. ఆయన స్వయంగా ఈ ప్యాలెస్‌ను ప్రపంచంలోని అందమైన ప్యాలెస్‌లలో ఒకదానిగా అభివర్ణించడం విశేషం.
Source:  సూర్య దినపత్రిక