Showing posts with label Politics. Show all posts
Showing posts with label Politics. Show all posts

Monday, July 7, 2025

నేటి రాజకీయాలు .. ఒక్క ముక్క (చిత్రం) లో

 నేను ఎన్నికయ్యాక .. నేను పూర్తి శాఖాహారిగా మారిపోతాను 


Saturday, September 21, 2013

విచిత్ర మలుపులు తిరుగుతున్న పార్టీల పొత్తులూ ఎత్తులూ

       రాజకీయాల్లో శాశ్వత మిత్రులూ శత్రువులూ ఉండరనేది నిజం! ఇది మరోసారి ఋజువు కాబోతోంది. నిన్న మొన్నటి వరకూ ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకున్న పక్షాలు ఒకటి కాబోతున్నాయి.. ఇది రాష్ట్ర రాజకీయాలను మరో కీలక మలుపు తిప్పడం ఖాయంగా కనిపిస్తోంది.
        డిల్లీలో చంద్రబాబు బీజేపీ నేతలను కలవడంవెనక చాలా మంత్రాంగం నడిచిందని చంద్రబాబు భవిష్య రాజకీయ  అవసరం దృష్ట్యా బీజేపీతో కలవడం తప్పదని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో మోడీ వ్యాఖ్యలు, మోడీపై తెదేపా అగ్ర నాయకుల ప్రశంసలు భవిష్యత్ లో  NDA తో మరలా కలిసినడిచేందుకు ఎప్పటినుంచో బాబు ఆడుతున్న వ్యాహంగా తేలుతుంది. జగన్ ను బయటికి రాకుండా కాంగ్రెస్ తో బాబు చేతులు కలిపిన విషయం కూడా నిజమేనని పరిశీలకులు అంటున్నారు. ఇంతకాలం జగన్ జైలు నుంచి బయటికి రాకపోవడానికి చంద్రబాబు కారణమేనని, బాబు తమతో చేతులు కలుపుతాడని ఆశించి కాంగ్రెస్ ఆయనచెప్పినట్లు నడచుకుందనీ కానీఇప్పుడు కాంగ్రెస్ బాబు రాబోయే ఎన్నికల అనంతరం తమతో చేతులు కలపడని తెలిసి జగన్ ను బయటికి రాకుండా ఆపలేమని బాబుకు చెప్పినట్లు పొగట్టా .. జగన్ ఎలాగో బయటికి వస్తాడుకనుక తను ఇక కాంగ్రెస్ కు మద్దతు పలికే అవసరంలేదని బాబు భావించినట్లు చెపుతున్నారు.
        అలాగే తెలంగాణా ఇచ్చిన సందర్భంలోనూ కాంగ్రెస్ బాబునే ఇరకాటంలో పెట్టదలచిందని ఈ విషయాన్ని ఆయన గమనించే రెండు ప్రాంతాల్లో పార్టీ దెబ్బతినకుండా కాపాడుకోగలిగారనీ ఇకపై తెలుగుదేశం మరింత పుంజుకోవడం ఖాయమని తెలుగుదేశంతోపాటూ , కాంగ్రెస్ కూడా భావించిందని తెలుస్తోంది. తెలుగుదేశాన్ని దెబ్బకొట్టలంటే అది జగన్ తోనే సాధ్యమని ,ఎలాగో జగన్ ఎన్నికల తర్వాత తమకే  సపోర్ట్ చేస్తాడు కనుక అతన్ని బయటికి తీసుకువచ్చే సమయం ఇదేనని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డి క్రొత్తపార్టీ పెడతారనే ఊహాగానాలు సోనియాను కలవరపెడుతున్నాయని చెపుతున్నారు. అటు తెలంగాణలో కేసీయార్ , ఇటు సీమాంధ్రలో జగన్ తనకు ప్రస్తుతానికి చాలునని ఆదిశగానే అడుగులు వేయాలని సోనియా ఇప్పటికే పార్టీ పరిశీలకులకు స్పష్టంచేసినట్లు ఉహాగానాలు వస్తున్నాయి. తెలంగాణాపై వెనకడుగు వెయ్యకూడదని , అలాచేస్తే తెదేపా కే లాభమని కాంగ్రెస్ భావించినట్లు తెలుస్తోంది
         ఇటు YSRCP కూడా చంద్రబాబును బూచిగా చూపి కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు పావులు కదుపుతోందని తెలుస్తోంది. జగన్ బయటికి వస్తున్నారన్న సమాచారం కాంగ్రెస్ నుండి వచ్చిందని కనుక కాంగ్రెస్ పై మెతక వైఖరితో ఉండాలని YSRCP  నాయకులకు ఇప్పటికే సందేశాలు వెళ్ళాయని కొందరు భావిస్తున్నారు. మొన్న ఆ పార్టీ సమావేశంలో జగన్ ఓదార్పు యాత్రకు కూడా రోడ్ మ్యాప్ చేసారని, ఇటీవల సాక్షి పత్రిక , చానల్ లో తెదేపా,బీజేపీలనే దుమోత్తిపోస్తున్నారని వారు ఉదాహరణలు చూపుతున్నారు. తెలంగాణ ఏర్పాటుకు YSRCP పచ్చజెండా ఊపినట్లేనని విమర్శకులు చెపుతున్నారు.
        మరి ఈ రాజకీయ క్రీడలలో చివరకు ఎవరు విజేతలో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే!

Saturday, August 31, 2013

హైదరాబాద్ ఉద్యోగుల్లో విభజన విద్వేషాలు

 తెలంగాణ ప్రకటన తర్వాత హైదరాబాద్ లో పనిచేస్తున్న ఉద్యోగులు సీమాంధ్ర, తెలంగాణా సంఘాలుగా విడిపోయి ఒకరినొకరు దూషించుకుంటూ విధ్వేషాలు పెంచుకుంటున్నారు. ఇంతకాలం సోదరులుగా కలిసి పనిచేస్తూ ఒకరి కష్టాలను మరొకరు పంచుకుంటూ మెలిగిన వీరిమధ్య విద్వేషాలు మొదలయ్యాయి. వీటికి కారణం ఖచ్చితంగా రాష్ట్రాన్ని వేరుచేయడం మాత్రం కాదు. ఎందుకంటే ఆనాడు సకలజనులసమ్మె, ఇతర తెలణ్గాణా ఉధ్యమాలలో తెలంగాణా ఉద్యోగులకు జరిగినప్పుడూ సీమాంధ్ర ఉద్యోగులు ఏమాత్రం చలించలేదు. తెలంగాణా ప్రకటనలో అస్పష్టత,వివిధ రాజకీయ నాయకుల అసంబద్ద వ్యాఖ్యలూ ఇరుపక్షాలవారినీ రెచ్చగొడుతున్నాయి. చివరికి ప్రభుత్వం కూడా ఏ చర్యలూ తీసుకోకపోవడం ,సీయం కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకూ సమంజసమో తెలీడంలేదు.
తెలణ్గాణా, సీమాంధ్ర ఉద్యోగుల్లో పూర్తి విభేదాలు స్రుష్టించి వారిని కలిసి పనిచేయకుండా చేస్తే తెలంగాణా ఏర్పాటు మరింత సులభమౌతుందని ఇలా కొందరు ప్రవర్తిస్తున్నారని ఓ భావన కూడా ఉంది. ఏది ఏమైనా కేంద్రప్రభుత్వం ఆలశ్యం చేయకుండా తగు చర్యలు తీసుకోకుంటే ఇంకొన్ని కీలక విభాగాల్లోనూ విభజన సెగలు రగిలి రాష్ట్రం రావణకాష్టంగా మారబోతుందనడంలో సందేహం లేదు.

Tuesday, August 27, 2013

టిడిపీ ఎంపీలూ! చంద్రబాబుపై తిరుగుబాటు చేయండి లేదా మూసుకు కుర్చోండి!

ఒకవైపు చంద్రబాబు తెలంగాణాకు అనుకూలమేనని స్పష్టంగా చెపుతుంటే, తెలుగుదేశం లు మాత్రం డిల్లీ పార్లమెంటులో ఆందోళనల పేరుతో విలువైన సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మీరు ఆందోళన చేయదలిస్తే ముందు ఎందుకో చెప్పండి..సమక్యం కోసం అయితే ముందు మీ నాయకుడు చంద్రబాబు ఇంటిముందో, టిడిపి ఆఫీసు ముందో చేసుకోండి కానీ ఇలా దేశప్రజల సం అస్యలతో ఆడుకోవద్దు. ఇదే సామాన్య ప్రజలు ప్రస్తుతం అనుకుంటున్న మాటలు.  

‘సభ’లో టీడీపీ వ్యూహం ఏంటీ?

chandra-babu

ఓ వైపు రాష్ట్ర విభజన ప్రకటన.. మరోవైపు రగులుతున్న సీమాంధ్ర.. ఈ సిచ్యుయేషన్లో ఎలా ముందుకు వెళ్లాలో తేల్చని టిడిపి అధిష్టానానికి ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల రూపంలో మరో చిక్కు వచ్చి పడింది.. తెలంగాణా బిల్ వస్తే..అ నుసరించాల్సిన వైఖరి ఏంటనే ప్రశ్న తలెత్తడంతో.. పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయ్.
రాష్ట్ర విభజన ప్రకటనతో మూడురోజులు మౌనాన్ని ఆశ్రయించినా..సీమాంధ్రలో ప్రత్యర్ధి పార్టీనేతల రాజీనామాలతో టిడిపివారూ అదే బాట పట్టాల్సి వచ్చింది. సీమాంధ్ర హక్కులు, అవసరాలు గమనించకుండా ఏక పక్ష విభజన చేశారంటూ ఆందోళన బాట పట్టారు సీమాంధ్ర టిడిపి నేతలు. సమైక్య ఉద్యమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఐతే ఇదే సమయంలో తెలంగాణా టిడిపి నేతలు కూడా కేంద్రం ప్రత్యేకరాష్ట్రం ప్రకటించడంపై స్పందించారు. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటవడంతో.. తెలంగాణా బిల్ ఈ సెషన్స్ లోనే ప్రవేశపెట్టాలంటూ టిడిపి పార్లమెంటరీ బోర్డ్ నేత నామా నాగేశ్వర్రావ్ డిమాండ్ చేస్తున్నారు.
ఈ వైఖరే టిడిపికి కాస్త ఇబ్బందిగా మారిందని చెప్పాలి. ఇప్పటికే సీమాంధ్ర టిడిపి ఎంపీలు రాజీనామాలు చేయడంతో.. సభలో అనుసరించే వ్యూహంపై ఆందోళన, ఆసక్తి నెలకొన్నాయి. సభలో ఫ్లోర్ లీడర్ తెలంగాణా కోసం డిమాండ్ చేయడం.. సహచర ఎంపీలు సమైక్యనాదం అందుకోవడం పార్టీని చిక్కుల్లోకి నెడుతోంది.. ఓవైపు కేంద్ర హోంమంత్రి షిండే ఈ సమావేశాల్లో తెలంగాణా బిల్ ఉండదని చెప్తున్నా.. ఒకవేళ వస్తే ఎలా వ్యవహరించాలనేది పార్టీ అధిష్టానానికి ఇబ్బందికర పరిస్థితిని కలిగిస్తోంది. తెలంగాణా బిల్ కోసం డిమాండ్ చేసినా.. సీమాంధ్ర హక్కులు.. రాజధానికి భారీ నిధులు కేటాయించాలని కోరవచ్చనేది మధ్యేమార్గంగా టిడిపి ఎంచుకోవచ్చని తెలుస్తోంది
అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీ తన పొలిటికల్ మైలేజీ కోసమే రాష్ట్ర విభజన ప్రకటన చేసిందని టిడిపి సభలో ప్రస్తావించవచ్చని తెలుస్తోంది.. ఇరు ప్రాంతాల్లో లాభపడేందుకు కాంగ్రెస్ ఉద్యమాలను రెచ్చగొడుతుందని జాతీయస్థాయిలో ప్రచారం చేయాలని టిడిపి నిర్ణయించినట్లు తెలుస్తోంది

Tuesday, August 6, 2013

మెగా హీరోల సినిమాలను ఆపితే సహించేదిలేదు: చిరు యూత్

మెగా హీరోల సినిమాలను ఆపితే చూస్తూ ఊరుకోమని చిరంజీవి యూత్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామినాయుడు తీవ్రంగా  హెచ్చరించారు. సినిమాలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఉద్యమకారుల పేరిట కొందరు తమ హీరోల కటౌట్లు తగలబెడుతున్నారనీ, దీనిని చూస్తూ ఊరుకోమనీ స్వామినాయుడు తీవ్రంగా హెచ్చరించారు. ఇలా స్వామినాయుడు ప్రకటించడం వెనుక మెగా ప్రొడ్యుసర్ అల్లు అరవింద్ హస్తం ఉందని కొందరు అంటున్నారు. మరి, దీని పట్ల సమైక్యాంధ్ర ఉద్యమకారులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.
కాగా విభజనకు చిరంజీవి అనుకూలమేనని ఆయన నిన్నటి ప్రకటన ద్వారా తెలుస్తోంది.
హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కానీ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలని అలాకని పక్షంలో ఢిల్లీ తరహాలోగానీ ఉంచాలని  చిరంజీవి నిన్న డిల్లీలో పేర్కొన్నారు.  

Monday, June 3, 2013

ఇక తెలుగుదేశం ఫ్లెక్సీల్లో లోకేష్

టిడిపి తరఫున రూపొందించే ఫ్లెక్సీలు, ప్రచార ప్రకటనల్లో నారా లోకేశ్ పొటోను చేర్చారు. టిడిపి అధికారి వెబ్‌సైట్‌లో ఫ్లెక్సీల కోసం ఉపయోగించాల్సిన నారా లోకేశ్ ఫోటోలను చేర్చారు. మొత్తం మూడు రకాల నిలువెత్తు ఫోటోలను పార్టీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ ఫోటోలను డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించాలని సూచించారు. నారా లోకేశ్ ఇప్పటి వరకు పార్టీలో చేరినట్టు ప్రకటించలేదు. లోకేశ్ పార్టీలో చేరుతున్నారా? అని విలేఖరులు చంద్రబాబును ప్రశ్నించగా, మీ అబ్బాయి కూడా చేరవచ్చు అంటూ చంద్రబాబు సమాధానం చెబుతున్నారు. లోకేశ్‌కు పార్టీలో ఏదైనా హోదా కల్పిస్తారా? అంటే అతని పనితీరు బట్టి పార్టీలో స్థానం ఉంటుందని, ఇది వారసత్వం కాదని చెబుతున్నారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పుట్టిన టిడిపిలో వారసునిగా లోకేశ్‌ను ప్రవేశ పెట్టడంపై మీడియా ప్రశ్నిస్తే, బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది వారసత్వం కాదని, ప్రతిభను బట్టి పనితీరును బట్టి అవకాశాలు ఉంటాయి దీన్ని వారసత్వంగా భావించవద్దు అనేది ఆయన వాదన. వారసత్వం కాదు అంటూనే టిడిపి అధికారిక వెబ్‌సైట్‌లో లోకేశ్‌కు వారసత్వ హోదా కల్పించారు. టిడిపి అధికారిక వెబ్‌సైట్‌లో ఎన్టీఆర్ కుటుంబం, చంద్రబాబు కుటుంబ సభ్యుల ఫోటోలు మాత్రమే ఉంటాయి. పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడైనా, ఎంత పెద్ద నాయకుడైనా వారి ఫోటోలు కనిపించవు. పార్టీ ప్రచారం కోసం నాయకులు రూపొందించే ప్లెక్సీలు, ప్రకటనల్లో ఉపయోగించుకోవడానికి ఆరుగురి ఫోటోలను పొందు పరిచారు. ఎన్టీరామారావు, చంద్రబాబు నాయుడు. హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, లోకేశ్‌ల ఫోటోలను పొందు పరిచారు. ఎన్టీఆర్‌వి ఏడు రకాల బొమ్మలు ఉండగా,చంద్రబాబువి 12 ఫోటులున్నాయి. పచ్చని పొలాన్ని దున్నుతున్న దున్నుతున్న బాబు, నాగిలి భుజాన వేసుకున్న ఫోటోలు వీటిలో ఉన్నాయి. ఇక బాలకృష్ణవి నాలుగు రకాల ఫోటలు ఉండగా, జూనియర్ ఎన్టీఆర్‌వి మూడు, లోకేశ్‌వి నిలువెత్తు ఫోటోలు 3 ఉన్నాయి. హరికృష్ణవి కూడా 2 ఉన్నాయి. రెండేళ్ల క్రితం గండిపేటలో జరిగిన మహానాడులో ప్లెక్సీలపై లోకేశ్ ఫోటోలను ఉపయోగించడంపై హరికృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపైబాబు స్పందిస్తూ ఒకరిద్దరు లోకేశ్ ఫోటోలను ఉపయోగించడం సరికాదని సున్నితంగా మందలించారు. ఇప్పుడు ఏకంగా పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లోనే లోకేశ్ ఫోటోలు ప్లెక్సీల కోసం ఎలాంటివి ఉపయోగించాలో సూచించడం విశేషం.

Thursday, May 30, 2013

రెంటికీ చెడిన రేవడి అయిన జూ.ఎన్టీయార్

hero-jr-ntr-need-advisors

బహుశా జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పు డు తెలుగు పద్యాలు ఏవీ చదువుకుని వుండకపోవచ్చు. లేదంటే, తన కోపమె తన శతృవు..తన శాంతమె తనకు రక్ష…అన్న నానుడి పట్టుబడి వుండేది. కనీసం తెలుగు మీడియంలోనైనా చదివి వుంటే, ఓర్చినమ్మకు తేటనీరు అన్న సామెతన్నా తెలిసి వుండేది. ఇలాంటి విషయాలు ఏవి తెలిసి వున్నా, ఇప్పడిలా కోరి తలకాయనొప్పులు తెచ్చుకునేవాడు కాదు.
జూనియర్ ఎన్టీఆర్ నిజానికి ఓ సక్సెస్ స్టోరీ. తండ్రి, ఓ కుటుంబం ఇలాంటి వాటికి దూరంగా తల్లితోడదే లోకంగా బతికాడు. భగవంతుడు అనుగ్రహించి, బాబాయిలకు సైతం పూర్తిగా రాని తాత అందాన్ని అందించాడు. ఆపై అనుకోకుండా నటవారసత్వం అందివచ్చింది. జనం జేజేలు పలికారు. కానీ అక్కడే జూనియర్ తో తేడా వచ్చింది. ఇదంతా తన అదృష్టం అనుకున్నట్లు కనిపించలేదు. తనకు తిరుగులేదన్న ధీమా పెంచుకున్నట్లు కనిపించింది.
గడచిన ఎన్నిక్లలో పార్టీ తరపున ప్రచారం చేయడం తెలుగుదేశానికి సీట్లు తెచ్చిపెట్టకపోయినా, జూనియర్ రాజకీయ కాంక్షకు బీజాలు వేసిందేమో? తనను తాను కాస్త ఎక్కువగానే ఊహించుకునేలా చేసిందేమో? బండి బాట మారిపోయింది. తెలుగుదేశం వారసత్వం తనకు కావాలన్న తపన పెరిగినట్లుంది. సినిమా రంగంలో కావచ్చు, రాజకీయరంగంలో కావచ్చు..రౌతు మనసు ఎరిగి పరిగెత్తే గుర్రాలే ఎక్కువ. మంచి సలహాలు, దారితప్పితే వచ్చితే ముప్పు విప్పి చెప్పేవారు తక్కువ. ఎన్టీఆర్ విషయంలో కూడా అదే జరిగివుండొచ్చు.నిన్ను మించిన వాడు లేడు జగాన..అని భజన చేసేవాళ్లు చేసి వుండొచ్చు. కానీ మన కాళ్ల కింద నేల ఏపాటి గట్టిది అన్న ఇంగిత జ్ఞానం మనకు వుండాలి.
పట్టుమని పది హిట్లు లేని తరుణంలో, తన కెరియర్, చరిష్మా, తన వ్వయహారాలు అన్నీ తన సినిమాలతో ముడిపడి వున్న తరుణంలో వాటిపైనే దృష్టి కేంద్రీకరించుకోవాల్సి వుంది. వయసు చూస్తే తక్కువ. కనీసం మరో పదో, ఇరవయ్యో సినిమాలు చేయాల్సి వుంది. హిట్లు కొట్టాల్సి వుంది. టాలీవుడ్ లో పోటీ సామాన్యంగా లేదు. ఇలాంటప్పుడు తన సర్వ శక్తులు, ఆలోచనలు పూర్తిగా అటే కేంద్రీకరించాల్సి వుంది. పైగా తనకంటూ ఓ వెన్ను దన్ను వుండాలి. అంది అందించగలవాళ్ల అభిమానాన్ని పొందే మార్గం చూసుకోవాలి. ఇవన్నీ మాని, ముఖ్యమంత్రిగా చిరకాలం పనిచేసి, తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో వున్నా కూడా పార్టీని బతికించుకుంటూ వస్తున్న అనుభవం కలిగిన చంద్రబాబుతో ఢీ కొనడం ఎంతవరకు అవసరం? అది ఏ మేరకు లాభమో, నష్టమో తెచ్చిపేడుతుందో జూనియర్ ఆలోచించారా? బాలకృష్ణకు స్వంత చరిష్మా లేకనే బావ పక్కన నిలిచారా? అసలు సినిమాల్లో స్వంత వ్యవహారాలు, రాజకీయాలు చొప్పించి ప్రయోజనమేమిటి? దమ్ము సినిమా ఎందుకు దెబ్బతింది. కథను తన చిత్తం వచ్చినట్లు, తన స్వంత వ్వవహారాల చుట్టూ తిప్పడం వల్లనే కదా? ఒక విధంగా జూనియర్ కూడా జగన్ లాంటి తొందరపాటునే ప్రదర్శించారనిపిస్తోంది. ఎన్ని అంతస్తులైనా ఒక్కొక్కటీ ఎక్కాల్సిందే. అమాంతం ఎగిరే అవకాశం అందరికీ రాదు. ఒక వేళ బాబు తెలుగుదేశం వారసత్య పగ్గాలను లోకేష్కు అందివ్వాలానే అనుకున్నారని అనుకుందాం. హరికృష్ణ తనయుడి గురించి ఆలోచించినట్లు, బాబు తన కొడుకు ఆలోచించడంలో తప్పులేదు. కానీ ఇక్కడ ఒకటే సమస్య ఎవరి బలం ఏమిటన్నది చూడాలి. బాబు బలం ఎక్కువ అని గమనించినపుడు తగ్గి వుండాలి. వేరే విధంగా ఆయన నుంచి లాభం పొందడానికి చూసుకోవాలి. కెరియర్ పరంగా, ఇంకేమైనా పదవుల పరంగా. అది ఒక్కటీ తప్ప..అన్న చందంగా, వారసత్వ పగ్గాలు ఆశించకుంటే, ఏదడిగినా ఇవ్వడానికి బాబుకు కూడా అభ్యంతరం వుండకపోవచ్చు. ఇవన్నీ ఆలోచించకుండా తొందరపడి పార్టీకి, పార్టీ నేతలకు దూరం కావడం అన్నది ఎన్టీఆర్ దుందుడుకు చర్య. అతగాడి అనుభవ రాహిత్యానికి అది ఉదాహరణ.
నిజానికి మహానాడుకు ఆహ్వానం రాలేదనే అనుకుందాం..అయినా వెళ్లి..హుందాగా పాల్లొని, మొన్న తాత సమాధి దగ్గర చెప్పిన మాటలేవో అక్కడే చెప్పి, కావాలంటే, ఆహ్వానం లేకపోయినా వచ్చానని చెప్పివుంటే, బంతి బాబు కొర్టులో పడివుండేది.
ఇప్పు డు బంతి ఎన్టీఆర్ కోర్టులో వుంది. ఇక మరే పిలుపు రాదు. పిలవకుండా వెళ్లడానికి అహం అడ్డువస్తుంది. దిగజారడని అనుకుంటారన్న ఆందోళన. చేతిలో వున్నది ఒకటి రెండు సినిమాలు. మొన్నటికి మొన్న దమ్ము సినిమా పరాజయానికి తెలుగుదేశం అభిమానుల ఎస్ఎమ్ఎస్ లు కూడా కారణం అన్న వార్తలు వినవచ్చాయి. యుద్ధం అన్నాక అలాగే వుంటుంది. భవిష్యత్ లో సినిమాలకు కూడా ఈ తరహా యుద్దాలు తప్పకపోవచ్చు. ఈ చిన్న వయసులో ఇన్ని తలకాయ నొప్పులు అవసరమా? రాజకీయాల్లో ఎంతయినా వేచి వుండాల్సిందే. బాబు సైతం ఎన్ని ఏళ్ల అనుభవం తరువాత ముఖ్యమంత్రి కాగలిగారు? అది మరిచిపోయి..’నేను కాబోయే సిఎమ్ ను’ అన్న భ్రమల్లో గడిపితే ఫలితం లభించదు.
జూనియర్ తండ్రి హరికృష్ణకు ఇటువంటి దుందుడుకు తనమే వుంది. అదే వారసత్వంగా జూనియర్ కు వచ్చినట్లుంది. కానీ తండ్రి రాజకీయాల్లో విఫలమైనట్లు, తానూ విఫలం కాకూడదనుకుంటే, జూనియర్ ఆలోచనా విధానం సమూలంగా మారాల్సి వుంది. అందుకు కావాల్సింది రెండు . ఒకటి సరైన సలహాదారులు. రెండు వాటిని తలకెక్కించుకునే యోచన.
Source:  http://24by7news.com/headlines/hero-jr-ntr-need-advisors/#.UadnsawV84I

Sunday, May 19, 2013

కేసీయార్ పై కాంగ్రెస్ అస్త్రం రఘునందన్ ?

మేము క్రితం పోస్టు ( మన రాష్ట్రంలో " కోదండరాం" తో కూడా అమలుచేసే అవకాశాలు...) లో చెప్పింది నిజమైందా? కానీ ఆ అస్త్రం కోదండరాం కాకుండా రఘునందన్ ని కాంగ్రెస్ ఎంచుకుందా? తెరాసా పతనానికి ,తెరాసాని ప్రజలు అసహ్యించుకొనేలా చేయడానికి కాంగ్రెస్ ఆపార్టీకే చందిన రఘునందన్ ని ఎంచుకుందా? దీనిలో చంద్రబాబు వ్యూహం కూడా ఉందా? మొన్న డిల్లీలో చంద్రబాబు కాంగ్రెస్ పెద్దలతో చర్చించి ఈ వ్యూహ రచన చేసారా/
అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు!  


 తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు కుటుంబంపై ఆరోపణల వర్షం కురిపించడం ద్వారా ఇతర పార్టీల నుండి వచ్చే నాయకులను నిలువరించడంతోబాటు, ఆయన దూకుడుకు కళ్ళెం వేసేందుకు రాజకీయ ప్రత్యర్థులు పకడ్బందీగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఎంపీలకు గాలమేస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ అధిష్టానం పక్కా వ్యూహంతో ఒక పద్ధతి ప్రకారం కెసిఆర్‌పై చేతికి మట్టి అంటకుండా కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.
టి.కాంగ్రెస్‌ ఎంపీలకు నాయకత్వం వహిస్తున్న కె.కేశవరావును అధిష్ఠానం చాలా కాలం పెద్దగా పట్టించుకోలేదు. వారం రోజుల క్రితం కేశవరావును ఢిల్లిd పిలిపించుకుని మరీ సోనియాగాంధీ ఆయనతో మాట్లాడారు. అనంతరం టి.కాంగ్రెస్‌ ఎంపీలు మౌన ముద్ర దాల్చడంతోపాటు తెరాసలో చేరే అంశాన్ని కూడా పక్కనబెట్టినట్లు కనిపిస్తోంది.
కెసిఆర్‌పై సీబీఐ విచారణకు కాంగ్రెస్‌ ఎత్తుగడ వేస్తోందన్న వాదనలు వినవస్తున్నాయి. అయితే తమపై వస్తున్న అపవాదులు రాకుండా ఆ పార్టీ నాయకులనే అస్త్రంగా ఉపయోగించు కుని కెసిఆర్‌ కుటుంబంపై ఆరోపణలు చేయడం ద్వారా సిబిఐ విచారణకు మార్గం సుగమం చేయాలని అధిష్ఠానం భావించడం వల్లే రఘునందన్‌రావు వ్యవహారం ప్రారంభమైన ట్లుగా వార్తలు వినవస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో చీలిక తెచ్చేందుకు కెసిఆర్‌ ప్రయోగించిన అస్త్రమైన కేశవరావునే తిరిగి అతనిపైనే తెలివిగా ప్రయోగించేలా కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని బ్రతికించడం, పార్టీ నాయకులను తెరాస వైపుకు వెళ్ళనీయకుండా అడ్డుకుంటే ప్రతిఫలంగా భవిష్యత్తులో ఒక పదవి ఇస్తామని సోనియా కేకేకు హామీనిచ్చినట్లు రాజకీయ వర్గాల్లో వినవస్తున్నది. అందులో భాగంగానే రఘునందన్‌రావు తెరమీదికొచ్చారని, కెసిఆర్‌ కుటుంబంపై ఆయన చేత ఆరోపణలు చేయించారనే ప్రచారం సాగుతోంది.
తెరాస శాసనసభాపక్షం నాయకుడు ఈటెల రాజేందర్‌ కూడా రఘునందన్‌రావు వెనక ముఖ్యమంత్రి హస్తముందని ఆరోపించారు. మెదక్‌ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షుడు కె.సత్యనారాయణ కూడా హరీష్‌రావుపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణల వెనక ప్రత్యర్థుల కుట్ర ఉందని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి రప్పించడంలో హరీష్‌రావుది అందెవేసిన చేయి. దీంతో ఆయన దూకుడుకు కళ్ళెం వేయాలనే ఆలోచనతోపాటు కెసిఆర్‌కు హరీష్‌రావుకు మధ్య విభేదాలు సృష్టించవచ్చని, కాంగ్రెస్‌ నాయకత్వం రఘును అస్త్రంగా వదిలినట్లు తెలుస్తోంది. పనిలో పనిగా ఈ వ్యవహారంలోకి మరో ఎంపీ విజయశాంతిని కూడా లాగే ప్రయత్నం చేసినట్లు స్పష్టమవుతోంది.
సిబిఐకి రఘునందన్‌రావుచే ఫిర్యాదు చేయించి అనంతరం కెసిఆర్‌పై సిబిఐ విచారణకు కేంద్రం ప్రయత్నించవచ్చని సమాచారం. సోనియా కేకేతో సమావేశమైన తర్వాతే ఈ ప్రణాళికకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తాను కూడా ఎంపీలతో సహా తెరాసలో చేరుతానని, తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నా ఇబ్బందేమీ లేదని, ఒకవేళ తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిన కేంద్ర మంత్రులపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఒకానొక దశలో అధిష్ఠానానికి ఎదురు తిరిగారు. అయితే తాజా పరిస్థితుల్లో ఆయన మౌనంగా ఉండడమే కాకుండా ఎంపీలు కూడా నోరు మెదపకపోవడం కాంగ్రెస్‌ వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. రఘునందన్‌రావుచే త్వరలో హైకోర్టులో కేసు వేయించడంతోపాటు సిబిఐకి కూడా ఫిర్యాదు చేయించి విచారణ చేయించేలా కాంగ్రెస్‌ పావులు కదుపుతున్నట్లు సమాచారం.
  మరి తెలంగాణా ప్రజలు , మేధావులు ఎలా ఆలోచిస్తారో వేచిచూడాలి ?
Some content from: Andhraprabha

Monday, May 13, 2013

కర్నాటక బిజెపి పతనంలో కాంగ్రెస్ పావు ఎడ్యురప్ప?

కర్నాటక ఎన్నికలలో విజయానికి సర్వ శక్తులూ ఒడ్డిన కాంగ్రెస్ ఎట్టకేలకు విజయం సాధించింది. కానీ ఆ విజయం వెనుక చాలానే వ్యూహాలు పన్నినట్లు అక్కడి మీడియా చెపుతోంది. దక్షిణ భారత దేశంలో తొలిసారి కర్నాటకలో పాగా వేసిన బీజేపీని యడ్యూరప్పతో కొత్త పార్టీ పెట్టించి, ఆ పార్టీని దెబ్బతీసిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికల్లో యడ్యూరప్ప పార్టీతో బీజేపీ మునిగిపోయిన విషయం తెలిసిందే.
కర్నాటక ఎన్నికలలో మొత్తం 3,12,16,708 ఓట్లు పోలయితే.. అందులో కాంగ్రెస్‌కు 1,14,10,737; బీజేపీకి 63, 32,595; యడ్యూరప్ప నేతృత్వంలో కేజీపీకి 30, 68348 ఓట్లు పోలయ్యాయి. అంటే యడ్యూరప్ప పార్టీని వీడి సొంత పార్టీ పెట్టకపోతే 94 లక్షల ఓట్లు బీజేపీకే వచ్చేవి. అప్పుడు శ్రీరాములు బీఎస్సార్‌పార్టీ, ఇండిపెండెంట్ల మద్దతు కీలమయ్యేవి. అంటే అప్పుడు కాంగ్రెస్‌-బీజేపీ అధికారపీఠానికి దగ్గరగా వచ్చేవి. దీన్ని బట్టి కర్నాటకలో యడ్యూరప్ప పార్టీ బీజేపీ కొంపముంచిందని, ఆ పార్టీ చీల్చిన ఓట్లే కాంగ్రెస్‌ను గెలిపించాయని స్పష్టమవుతోంది. చాలాకాలం పాటు బీజేపీలో ఉన్న శ్రీరాములు కూడా పార్టీ పెట్టడం బీజేపీకి నష్టం కలిగించిందని ఫలితాలు స్పష్టం చేశాయి.
ఇదే వ్యూహాన్ని మన రాష్ట్రంలో " కోదండరాం" తో కూడా అమలుచేసే అవకాశాలు ఉన్నట్లు కొన్ని తెలుగు పత్రికలూ చెపుతున్నాయి. చూద్దాం ఏమి జరుగుతోందో?

Saturday, December 29, 2012

తెరపైకి మళ్లీ మూడవ కూటమి

దేశంలో మళ్లీ మూడవ కూటమి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు జనతాదళ్‌(ఎస్‌) నేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ప్రకటించారు. దాంతో ఈ అంశపై చర్చకు తెరతీసినట్లైంది. మన దేశంలో మూడవ కూటమి ఏర్పడటం అంటే మాటలుకాదు. దానికి కాంగ్రెస్, బిజెపిలను వ్యతిరేకించడం ఒక్కటే సరిపోదు. భావసారూప్యతతోపాటు విధానపరమైన ఏకాభిప్రాయం కూడా కావాలి. 2009లో కూడా మూడవ కూటమి ఏర్పాటుకు వామపక్షాలతోపాటు దేవెగౌడ్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా కృషి చేసి విఫలమయ్యారు. మళ్లీ ఇప్పుడు కూడా దేవెగౌడ ఈ అంశం పట్ల ఆసక్తి చూపుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలు అవినీతి, అక్రమాలు, కుంభకోణాల్లో మునిగితేలుతున్నాయని, దీంతో ఆ పార్టీలపై ప్రజలు విసిగుచెందారని ఆయన చెప్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నది ఆయన అభిప్రాయం. మూడవ కూటమి ఏర్పాటుకు ఇదే మంచి సమయం అని ఆయన అన్నారు. 

దేవెగౌడ్ చెప్పినట్లు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యుపిఏ ప్రభుత్వం భారీ కుంభకోణాల ఊబిలో చిక్కుకుంది. దానికితోడు అన్ని ధరలు పెరిగిపోయాయి. పెట్రోల్, డీసెల్, గ్యాస్, రైలు ఛార్జీలు.......అన్నీ పెంచేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. యుపిఏ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిజెపి ప్రభుత్వం కూడా అందుకు భిన్నంగా ఏమీలేదు. బిజెపి అధికారంలో ఉన్న కర్ణాకట పరిస్థితి అందరికీ తెలిసిందే. గుజరాత్ లో మోడీ హవాతో మళ్లీ అధికారంలోకి వచ్చినప్పటికీ హిమాచల్ ప్రదేశ్ లో ఘోరంగా ఓడిపోయింది. ఇతర రాష్ట్రాలలో కూడా ఆ పార్టీ అంత బలంగా ఏమీలేదన్నది అందరికీ తెలిసిన విషయమే. ప్రధాని అభ్యర్థి విషయంలో ఆ పార్టీలోనూ, ఎన్ డిఏ కూటమిలోనూ అభిప్రాయభేదాలు ఉన్నాయి. ఈ పరిస్థితులలో ప్రజలు మూడవ ప్రత్యామ్నాయంవైపు చూస్తున్న మాట వాస్తవం. అయితే దేవెగౌడ్ గత చరిత్ర తెలిసినవారెవరూ ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయని అనుకోరు. బిజెపిని తీవ్రంగా వ్యతిరేకించిన దేవెగౌడ గతంలో తన కుమారుడు కుమారస్వామి బిజెపితో పొత్తు కుదుర్చుకుంటే రాజీపడ్డారు. ఆ తరువాత తన కుమారునికి మంత్రి పదవి కోసం మూడవ కూటమికి గుడ్‌బై చెప్పి యుపిఎకి మద్దతు పలికారు. అటువంటి నిలకడలేని రాజకీయ వేత్త ప్రయత్నాలు ఫలించే అవకాశాలు చాలా తక్కువ. అయితే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులలో వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలతో మూడవ కూటమి ఏర్పడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపై నడిపించడానికి చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నించిన్పటికీ ఫలితం దక్కలేదు. 

ఈ 'మూడవ' అనేదాన్లో మరో అంశం చర్చించవలసి ఉంది. కాంగ్రెస్, బిజెపియేతర పక్షాల కూటమి అనేది ఒకటైతే, వామపక్షాల ఆధ్వర్యంలో మూడవ ఫ్రంట్ అనేది మరొకటి వినస్తుంది. దీనినే విధాన ప్రత్యామ్నాయం అంటారు. వామపక్షాలు అంటే విధాన పరమైన అంశాలకు ప్రధాన్యత ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ దిశగా కూడా ప్రయత్నాలు జరిగే అవకాశాలు లేకపోలేదు. కాంగ్రెస్‌-బిజెపి యేతర పార్టీలను కలుపుకొని మూడవ కూటమి ఏర్పాటు చేసి, గత ప్రభుత్వాల విధానాలనే అవలంభించడం తమ ఉద్దేశం కాదని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. అలా కాకుండా కార్యక్రమ ఆధారిత విధాన ప్రత్యామ్నాయానికి తాము కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. సోషలిజంను అంగీకరించాలనే షరతు విధించకపోయినప్పటికీ వారు భూ సంస్కరణలు, ధరల అదుపు, తాగు నీరు, విద్య, వైద్యం ప్రైవేటీకరణ నిలుపుదల, గనులు, నీరు, భూములు, అడవుల లూటీ నిరోధం, శక్తివంతమైన లోక్‌పాల్‌ చట్టం, తదితర అంశాలతో పాటు, విదేశాంగ, ఆర్థిక విధానాలపై స్పష్టతతో కూడిన ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తారు. ఈ ప్రత్యామ్నాయ ప్రయత్నాలలో ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ క్రమంలో జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి, మూలాయం సింగ్ యాదవ్, నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్, మన రాష్ట్రం నుంచి వైఎస్ జగన్మోహన రెడ్డి, చంద్రబాబు ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. 

ఇదిలా ఉంటే, మన దేశంలో మూడవ ఫ్రంట్ కు అవకాశమేలేదని చెప్పేవారు కూడా చాలా మంది ఉన్నారు. గతకాల అనుభవాలే వారితో ఆ మాటలు అనిపిస్తున్నాయి. కేంద్రంలో కాంగ్రెసేతర, బిజెపియేతర ఫ్రంట్‌ ఏర్పడితే అది ఎంతో కాలం నిలవదని గతంలో ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ నిరూపించింది. యునైట్‌ ఫ్రంట్‌ ఆధ్వర్యంలోని ప్రభుత్వం రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాకుండా ఇద్దరు ప్రధాను(హెచ్‌.డి.దేవెగౌడ,ఐ.కె.గుజ్రాల్‌)లను మార్చింది. సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, వామపక్షాలు కలిసి ఏర్పాటు చేసిన 'పీపుల్స్‌ ఫ్రంట్‌' కూడా ఎంతోకాలం నిలవలేదు. ఈ నేపధ్యంలో 'భారత రాజకీయాల్లో మూడవ ఫ్రంట్‌ అత్యంత శాశ్వత ఎండమావి' అని ఏఐసిసి అధికార ప్రతినిధి మనీష్‌ తివారీ వ్యాఖ్యానించారు. మూడవ ఫ్రంట్‌కు అవకాశమే లేదన్న అభిప్రాయాన్ని జెడి-యు నేత శివానంద తివారీ వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల తరువాత ఏర్పడబోయే ప్రభుత్వాన్ని నిర్ణయించేది బిజెపి నేతృత్వంలోని కూటమి గాని, కాంగ్రెస్‌ పార్టీగాని అవుతుందని ఆయన అన్నారు. 

పార్టీల మధ్య విధానపరమైన సారూప్యత, ప్రజా సంక్షేమం పట్ల అంకితభావం, కలసి పనిచేయాలన్న బలమైన వాంఛలేకపోతే గత ఎన్నికల సమయంలో మన రాష్ట్రంలో ఏర్పడిన మహాకూటమిలా ఉంటుంది పరిస్థితి. ఆ మహాకూటమికి కాంగ్రెస్ ను ఓడించడమే ఏకైక లక్ష్యం. అంతకు మించిన భావసారూప్యత వాటిమధ్య ఏదీలేదు. అందుకే ఎన్నికలు ముగిసేవరకు కూడా ఆ మహాకూటమి నిలబడలేదు. రాజకీయ పార్టీల నిలకడ లేని వైఖరికి అది నిదర్శనం. ఆ మహాకూటమిని భవిష్యత్ లో అందరూ ఒక గుణపాఠంగా తీసుకోవలసిన అవసరం ఉంది.

Sunday, December 2, 2012

జగన్ను దగ్గర చేసుకోవాలని కాంగ్రెస్ ఆలోచిస్తుందా?

దేశంలో హేమాహేమీలనే పాదాక్రాంతం చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీనే సవాల్‌ చేసి, తన సత్తా చాటుతూ ఆ పార్టీని కళ్లు బైర్లు కమ్మి స్తున్న జగన్‌తో కాంగ్రెస్‌ పార్టీ జతకట్టేందుకు సిద్ధమవు తోందా? పాత విభేదాలు మరచి పోయేందుకు మానసికంగా తయారవు తోందా? జగన్‌ వస్తే కాంగ్రెస్‌ బలపడుతుందని భావిస్తోందా? బుజ్జగించి, తగిన హామీలిస్తే ఆయన తిరిగి పార్టీ గూటికి చేరుతారన్న విశ్వాసంతో ఉందా?.. శనివారం నాటి రాజకీయ పరిణామాలు పరిశీలిస్తే ఈ అనుమానం నిజమనించక మానదు.

దేశంలో మళ్లీ యుపీఏ అధికారంలోకి వచ్చేందుకు రాహుల్‌ చేస్తున్న కసరత్తులో భాగంగా కొంతమంది విశ్వసనీయులను నియమించుకుని, వారి ద్వారా సరైన అభ్యర్ధుల ఎంపికపై ఇప్పటినుంచే దృష్టి సారిస్తున్నారు. ఆ క్రమంలో శనివారం రాష్ట్రానికి పరిశీలకులుగా వచ్చిన జితేంద్ర దేశ్‌ ప్రభు, విశ్వజిత్‌ రాణే సీఎల్పీలో పార్టీ నేతలతో మంతనాలు జరిపారు. పార్టీ స్థితిగతులు, భవిష్యత్తుపై చర్చించారు. లోక్‌సభ-శాసనసభ ఎన్ని కలు ఒకేసారి నిర్వహించాలా? విడిగా నిర్వహించాలా? అని అభిప్రాయ సేకరణ నిర్వహించారు. మంత్రులు కాసు కృష్ణారెడ్డి, టిజి వెంకటేశ్‌, మహీధర్‌రెడ్డి, పితాని, డొక్కా, అహ్మదుల్లా, ఏరాసు, సీనియర్‌ ఎమ్మెల్యే జెసి దివాకర్‌రెడ్డి, విజయకుమార్‌ తదితరులు వారిని కలిసి, తమ అభి ప్రాయాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి కిరణ్‌, పీసీసీ చీఫ్‌ బొత్స కూడా వారితో చర్చించారు. ఆ తర్వాత బొత్స స్వయంగా ఎమ్మెల్యేలను వారి వద్దకు పంపించడం ప్రస్తావనార్హం.

ఇదిలాఉండగా... తన పార్టీని సవాల్‌ చేసి, బయటకు వెళ్లి రాష్ట్రంలో రాజకీయ ఉనికినే సవాల్‌ చేస్తున్న జగన్‌ను మచ్చిక చేసుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు ప్రారంభిస్తోందన్న సంకేతాలు పరిశీలకుల వ్యాఖ్యలతో స్పష్టమవుతున్నాయి. జగన్‌ తిరిగి పార్టీలోకి వస్తే పార్టీ బలపడుతుందన్న సూచనలు తమకు ఎక్కువ సంఖ్యలో వచ్చాయని, దానిపై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించారు. అసలు జగన్‌ పార్టీలోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయా? వస్తే ఎలా ఉంటుంది? అని తన వద్దకు వచ్చిన వారి వద్ద ఆరా తీశారు. జగన్‌ ఏ పరిస్థితిలో పార్టీ నుంచి బయటకు వెళ్లారు? రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఏమిటి? అని అడిగారు.

దానికి స్పందించిన కొందరు మంత్రులు జగన్‌ తిరిగి వస్తే బాగానే ఉంటుందని, పార్టీ బలపడుతుందని వారికి చెప్పారు. అయితే కొందరు మాత్రం జగన్‌ మనస్తత్వం ప్రకారం మళ్లీ పార్టీలోకి వచ్చే ప్రసక్తే ఉండదని, అంతగాకాకపోతే, 2014 ఎన్నికల తర్వాత తనకు సంఖ్యాబలం తగ్గితే అప్పుడు ముఖ్యమంత్రి పదవి ఇస్తే, తాను కేంద్రానికి మద్దతునిస్తానన్న షరతు పెట్టే అవకాశం లేకపోలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్‌ ఒకసారి అభిప్రాయానికి వస్తే దానిని మార్చుకోవడం కష్టమని చెప్పారు. తన కోసం ఎవరైనా దిగి రావల్సిందేనని, తనకంటే ఎవరూ గొప్ప కాదని, తానొక దైవాంశసంభూతిడినని, తనకు తప్ప మిగిలిన వారికి ఏమీ తెలియదన్న ధోరణి ఉన్న జగన్‌ దారికి వస్తారన్న నమ్మకం తమకు లేదని విశ్లేషించారు.

జగన్‌ ఎప్పుడు తనకు తాను రాహుల్‌గాంధీ కంటే ఎక్కువ గ్లామర్‌, జనబలం ఉన్న నేతగా ఊహించుకుంటారని, తనది సోనియాగాంధీ కంటే ఎక్కువ స్థాయి అన్న భావనతో పాటు, తనకేమి తక్కువ, తాను ఇంకొకరిపై ఎందుకు ఆధారపడాలన్న స్వతంత్ర భావనలు ఎక్కువగా ఉన్న జగన్‌ తిరిగి పార్టీలోకి వస్తారనుకోలేమని వివరించారు. జగన్‌ వస్తే మంచిదేనని అయితే ఆయన మనస్తత్వం తెలిసిన వారెవరూ తిరిగి వస్తారని అనుకోరని అభిప్రాయపడ్డారు. ఒకసారి ఒక నిర్ణయానికి వస్తే ఇక దానికే కట్టుబడి ఉంటారని, తన వద్దకు వస్తానని ఎవరైనా రాకపోతే ఇక ఆ తర్వాత వారు వచ్చినా మాట్లాడరని, అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వరని, ఇలాంటి మానసిక కోణాన్ని పార్టీ నాయకత్వం పరిగణనలోకి తీసుకుని, దానిపై ఒక నిర్ణయానికి వస్తే మంచిదని సూచించారు.

అయితే, కేంద్రానికి తన ఎంపీలు ఇచ్చి, రాష్ట్రం తనకు ఇవ్వాలన్న షరతు విధిస్తారని ఇంకొందరు వెల్లడించారు. జగన్‌ వస్తే పార్టీ బలపడేమాట నిజమయినప్పటికీ, మళ్లీ కొత్త గ్రూపులు తయారవుతాయని, ఇప్పటివరకూ జగన్‌ను వ్యతిరేకించిన వారి పరిస్థితి ఏమిటని మరికొందరు సందేహం వ్యక్తం చేశారు. జగన్‌ను తిరిగి తీసుకోవాలన్నది పార్టీ విధానమా? లేక కేవలం అభిప్రాయసేకరణ కోసమే అడుగుతున్నారా? వస్తే తీసుకుందామని భావిస్తున్నారా? అని ఒక మంత్రి సందేహం వ్యక్తం చేయగా, అది పార్టీ విధానం కాదని, మీలాంటి వారు ఇచ్చిన సలహాపై చేస్తున్న అభిప్రాయసేకరణ మాత్రమేనని పరిశీలకులు వివరణ ఇచ్చారు.

మాజీ మంత్రి జెసి దివాకర్‌రెడ్డి కూడా జగన్‌ తిరిగి పార్టీలోకి వచ్చే అవకాశాలు తక్కువేనని అభిప్రాయపడ్డారు. 2014 ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి, ఆయనపై ఉన్న కేసులు ఎత్తివేస్తే తప్ప పార్టీలోకి రాడని, అది సాధ్యమవుతుందా? అని వారిని ప్రశ్నించారు. కాగా కాసు కృష్ణారెడ్డి, వట్టి వసంతకుమార్‌, డొక్కా మాణిక్యవరప్రసాద్‌, ఏరాసు ప్రతాపరెడ్డి మాత్రం జగన్‌ను తిరిగి పార్టీలోకి వస్తే మంచిదేనన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. లోక్‌సభ-శాసనసభకు ఒే సారి ఎన్నికలు జరపాలన్న ఆలోచన పరిశీలకులు వ్యక్తం చేయగా, దానివల్ల రాష్ట్రంలో నష్టం ఎక్కువ జరుగుతుందని, విడిగానే నిర్వహిస్తే మేలని సూచించారు.

జెసి మాత్రం విడిగానే నిర్వహించాలని, ఈసారి పార్లమెంటుకు కొత్త వారిని ఎంపిక చేయాలని సూచించారు. ఇక తెలంగాణ అంశంపైనా పరిశీలకులు ఆరా తీశారు. తెలంగాణ ప్రకటిస్తే దాని ప్రభావం సీమాంధ్ర మీద ఎలా ఉంటుంది? ఇవ్వకపోతే తెలంగాణలో ఎలా ఉంటుందని అడిగారు. అయితే, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి, బోర్డు ఏర్పాటుచేస్తే సమస్యలు పరిష్కా రమవ ుతున్నాయని, ప్రజలు తెలంగాణతోపాటు అభివృద్ధినీ కోరుకుంటున్నారని చెప్పారు. పార్టీకి సంబంధించి ఎలాంటి సమస్యలు లేవని, ప్రభుత్వం మీదే ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ముగ్గురు మాత్రం కిరణ్‌ మీద ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీనియర్లను సమన్వయం చేసుకోవడం లేదని ఫిర్యాదు చేశారు.

Tuesday, November 20, 2012

మజ్లిస్‌ కటీఫ్‌పై ముందే సంకేతాలు?


మజ్లిస్‌ పార్టీ మద్దతు ఉపసంహరించుకోబోతున్నట్టు సర్కారుకు ముందుగానే సంకేతాలు అందాయా?
ఆ పార్టీ నేతలను శాంతిపజేసుకొని పొత్తును కొనసాగింపజేసేందుకు ముఖ్యమంత్రి తీవ్రంగా ప్రయత్నించారా?
మజ్లిస్‌ నేతలు వివిధ సందర్భాల్లో చేసిన విజ్ఞప్తులపై సర్కారు ఆగమేఘాలపై స్పందించిన తీరును చూస్తే అవుననే సమాధానం వస్తోంది. మజ్లిస్‌ నేతలను ప్రసన్నం చేసుకోవటానికి చాలా తంటాలు పడినట్టు స్పష్టమవుతోంది. మజ్లిస్‌ వివిధ సందర్భాల్లో పేర్కొన్న 41 కోర్కెలను సంబంధిత శాఖలకు పంపి వాటి పరిష్కారానికి ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేకంగా కృషి చేసింది. సంబంధిత దస్త్రాలను వెంటనే ముఖ్యమంత్రికి పంపాలంటూ ఆయా శాఖలకు పలు విడతలుగా లేఖలు పంపింది. రాజధానిలోని నిషేధిత భూములకు సంబంధించి తంటాలు పడి రూపొందించిన జాబితాను సర్కారు ఉపసంహరించుకోవడం ఇందులో భాగమే. ఇన్ని చేసినా అధికార పార్టీకి మజ్లిస్‌ దూరమయ్యింది.మజ్లిస్‌ నేతల డిమాండ్లపై ప్రభుత్వం ఇటీవల కాలంలో సత్వర చర్యలు చేపడుతూ వచ్చింది. వాటనిి పరిశీలించాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం వివిధ శాఖలకు సూచించటంతో పాటు తాజా పరిస్థితిని ముఖ్యమంత్రి తెలుసుకొంటూ వచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వివిధ శాఖలకు నవంబరు 7వ తేదీన, అంతకుముందు వెళ్లిన లేఖలు 'ఈనాడు'కు లభించాయి. రాజకీయ పార్టీలు ఇచ్చే వినతులను సీఎం కార్యాలయం సంబంధింత శాఖలకు పంపటం సాధారణమే అయినప్పటికీ మజ్లిస్‌ వినతులపై మాత్రం ప్రత్యేక దృష్టి కనబర్చింది. వినతులపై తాజా పరిస్థితిని సీఎం తెలుసుకోగోరుతున్నారని, దస్త్రాలను వెంటనే పంపాలని, దస్త్రం అవసరం లేకుంటే నోట్‌లను పంపాలని ఆయా శాఖలను తొందరపెట్టింది.నవంబరు 7వ తేదీ నాటి లేఖలో ప్రధానంగా 9 అంశాలను సీఎం కార్యాలయం పొందుపర్చింది. రిజిస్ట్రేషన్లను చేయకూడని భూముల జాబితా ఉపసంహరణ, ఖదీర్‌ను పెరోల్‌పై విడిచిపెట్టటం, పోలీసు కానిస్టేబుళ్ల ఎంపిక ఫలితాల విడుదల, దార్‌ సలాం విద్యా సంస్థకు 5 ఎకరాల భూమి అందజేత, ఎంఐఎం కార్యాలయానికి భూమి ఇవ్వటం, ఏసీ గార్డ్సులోని భూమి వ్యవహారాన్ని కొలిక్కి తేవటం, మైనారిటీ సంక్షేమానికి కమిషనరేట్‌ ఏర్పాటు, అమాయక యువతపై కేసుల ఉపసంహరణ ఈ జాబితాలో ఉన్నాయి. వీటిపై తాజా పరిస్థితిని నవంబరు 9వ తేదీలోగా తెలపాలని సీఎం కార్యాలయం ఆ లేఖలో పేర్కొంది. ఈ లేఖలో పేర్కొన్న నిషేధిత భూముల జాబితా ఉపసంహరణతో సహా కొన్నింటిపై ఆయా శాఖలు సానుకూలంగా స్పందించాయి. అంతకు ముందు సెప్టెంబరు 3వ తేదీన ముఖ్యమంత్రి కార్యాలయం పంపిన లేఖలో మరికొన్ని ముఖ్యమైన కొర్కెలు ఉన్నాయి. నోటరీపై కొనుగోలు చేసిన భూములకు ఒక సారి రిజిస్ట్రేషన్లను అనుమతించటం ఇందులో ఒకటి. మైనారిటీలకు ఉప ప్రణాళిక అమలు, రుణ మంజూరీకి ఆదాయ పరిమితి పెంపు, ఫిరోజ్‌ గాంధీ నగర్‌ భూముల క్రమబద్ధీకరణ వంటివి వాటిలో ఉన్నాయి. ఆగస్టు 17నాటి లేఖలో మొత్తం 41 అంశాలు ఉన్నాయి. 'నిర్దిష్ట గడువు ప్రాతిపదికన అత్యవసర చర్యలు అవసరం' అంటూ ఆనాటి లేఖలో సీఎం కార్యాలయం పేర్కొంది. ఒవైసీ ఆసుపత్రి అంశం, 2006 నాటి పాతనగరం ప్యాకేజి అమలు, మూసీ ఆధునికీకరణ, మెట్రోపాలిటన్‌ ముసాయిదా ప్రణాళికను నోటిఫై చేయకుండా ఉండటం, పాత నగరంలో కొత్తగా జూనియర్‌, డిగ్రీకాలేజీల ఏర్పాటు వంటివి వీటిలో ఉన్నాయి.
From :eenadu

Monday, August 6, 2012

జగన్- కాంగ్రెస్ దోస్తీ కటీఫ్ ?


jagan001
వైఎస్సార్సీపీ అధినేత జగన్‌మోహన్‌డ్డిని దారికి తెచ్చుకోవాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలకు ప్రస్తుతానికి బ్రేకులు పడినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కాంగ్రెస్‌లో తిరిగి చేరడం లేదా చేతులు కలపడం అనే రెండు ప్రతిపాదనలనూ జగన్ తిరస్కరించినట్టు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడొకరు తెలిపారు. జగన్‌ను దారికి తెచ్చుకునేందుకు తమ అధిష్ఠానం చేస్తున్న ప్రయత్నాల్లో ప్రతిష్టంభన ఏర్పడినట్టు కాంగ్రెస్ వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి. వ్యూహాత్మకంగా పరస్పరం సహకరించుకోవాలన్న జగన్ ప్రతిపాదనకు కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధంగా లేదని ఆ వర్గాలు చెబుతున్నాయి. విభేదాలు ఇంతదూరం వచ్చిన తర్వాత ఇప్పుడు కలిసినా అటు కాంగ్రెస్‌కు, ఇటు తమకూ ఎటువంటి ప్రయోజనం ఉండదని జగన్ భావిస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ఇద్దరం దెబ్బతింటామంటున్న జగన్!
ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము కాంగ్రెస్‌కు దగ్గరయితే వచ్చే ఎన్నికల్లో ఇద్దరమూ కలసి దెబ్బతింటామని జగన్ వాదిస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. పైగా కాంగ్రెస్‌కు తాము చేరువయిన మరుక్షణం సీమాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం బలమైన ప్రత్యామ్నాయం అయికూర్చుంటుందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లను పూర్తిగా తెలుగుదేశంకు అప్పగించినట్టవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అభివూపాయపడుతున్నారు. ‘2014 ఏప్రిల్‌లో జరిగే ఎన్నికల దాకా ఇరుపక్షాల మధ్య ఎటువంటి సంబంధమూ లేకపోవడమే మంచిది. ఆ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు మేము గెలుస్తామన్న నమ్మకం మాకుంది. మేము ఎన్‌డిఎను సమర్థించబోవడం లేదని ముందే చెప్పాం. మా విజయం కచ్చితంగా యూపీఏకే ఉపయోగపడుతుంది’ అని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్‌ను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ యూపీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ దీనినే వ్యూహాత్మక అవగాహనగా పేర్కొంటోంది. ఈ వ్యూహాత్మక అవగాహన పేరుతోనే తనపై జరుగుతున్న విచారణను సడలింపజేసుకోవాలని జగన్ భావిస్తున్నారు.

జగన్‌ను నమ్మలేమంటున్న కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ నాయకత్వం జగన్‌ను నమ్మడానికి సిద్ధంగా లేదని ఆ పార్టీ సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. జగన్ తనను తాను మరో శరద్ పవార్‌లాగా లేక మమతా బెనర్జీలాగా మల్చుకోవాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ‘శరద్ పవార్, మమతా బెనర్జీ ఎంత నమ్మకమైన సహచరులో ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. వారిని యూపీఏలో కొనసాగించుకోవడానికి మా పార్టీ ఎన్నో అవమానాలు దిగమింగాల్సి వస్తోంది. వారు ఏది అడిగితే అది చేయవలసి వస్తోంది. జగన్ వారికంటే కొరకరాని కొయ్య. 2014 తర్వాత వీరంతా మూడవ ఫ్రంటు లేవదీయరన్న గ్యారంటీ ఏముంది? అందువల్ల ఆయనను నమ్ముకుని కాంగ్రెస్ చేతులు కట్టుకుని కూర్చోలేదు’ అని అధిష్ఠానంతో సన్నిహితంగా ఉండే ఆ నాయకుడు చెప్పారు. కేసులు విచారణలకు సంబంధించి జగన్‌పై చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు.

జగన్ కలిసొస్తే తెలంగాణ వాయిదా!
జగన్ కలిసొస్తే తెలంగాణ సమస్యను వాయిదా వేయాలని పార్టీ అధిష్ఠానం ఇటీవల సమాలోచనలు జరిపిందని కూడా ఆయన అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ దూతలు కూడా తెలంగాణ సమస్యను ఇప్పుడప్పుడే తేల్చవలసిన అవసరం లేదని, తెలంగాణ సమస్యను పరిష్కరించకుండానే 2014 ఎన్నికల్లో తాము యూపీఏకు రాష్ట్రం నుంచి అవసరమైన మద్దతును కూడగడతామని ప్రతిపాదించినట్టు కాంగ్రెస్ నాయకుడు వివరించారు. ‘జగన్ కలసిరావడం లేదు. సీమాంవూధలో ఎటువంటి గ్యారంటీ లేదు. రాష్ట్రాన్ని పూర్తిగా వదిలేసుకోలేం. కనీసం తెలంగాణనయినా కాపాడుకోవాలి. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి సిద్ధమని టీఆస్ అధినేత కేసీఆర్ కూడా వివిధ సందర్భాల్లో బాహాటంగానే చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై ఇక ఏదో ఒకటి తేల్చకతప్పని పరిస్థితికి చేరుకుంది’ అని ఆయన వివరించారు.
( Courtesy from namastetelangana )

Friday, June 8, 2012

గెలుపు ఎలాగూ దక్కదని డబ్బు పంపిణీని నిలిపివేసిన టిడిపి, కాంగ్రెస్

అత్యంత కీలకంగా భావిస్తున్న ఉప ఎన్నికల్లో వారం రోజులుగా ఉధృతస్థాయిలో ప్రచారం చేస్తున్న అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు ఫలితాలపై స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఉప ఎన్నికల్లో నిధుల వరదను నిలిపివేశాయి. అధికార కాంగ్రెస్ అయితే అనుకున్న మొత్తంలో సగం నిధులకు కోత విధించింది. తెలుగుదేశం కూడా ఖర్చును తగ్గించినప్పటికీ, కాంగ్రెస్ కన్నా ఎక్కువే ఖర్చు పెడుతోంది. ఉప ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా ఉండొచ్చని మొదట్లో అనుకున్నారు. పోటీలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నందున ఎన్నికల్లో డబ్బును కూడా భారీగానే ఖర్చు పెట్టవచ్చని భావించారు. ముఖ్యంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు భారీ మొత్తంలోనే ఖర్చు పెట్టేందుకు మొదట్లో ప్రణాళికలు రూపొందించాయి. అనుకున్న మొత్తంలో ఇప్పటి వరకు సగం వరకు ఖర్చు పెట్టారు. మిగిలిన సగం ఖర్చు పెట్టాల్సిన ప్రస్తుత కీలక సమయంలో రెండు పార్టీలు నిలిపివేశాయి. ‘అవసరమైన’ నియోజకవర్గాల్లో మాత్రమే ఖర్చు పెట్టాలని నిర్ణయించాయి.
పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక లోక్‌సభ స్థానానికి 12న ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఫలితాలు ఏకపక్షంగా ఉండవన్న ఉద్దేశంతో రెండు ప్రధాన పార్టీలు భారీ మొత్తంలోనే ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నాయి. ఎంతెంత ఇస్తామన్న విషయాన్ని పోటీలో ఉన్న అభ్యర్థులకు కూడా తెలియజేశాయి. తొలి విడతలో రెండు పార్టీలు ధారాళంగానే ఖర్చుపెట్టాయి. కనీసం ఐదారు స్థానాలను గెలుచుకోగలమన్న నమ్మకంతో రెండు పార్టీలు మొదట్లో ఉన్నాయి. ఎప్పటికప్పుడు సర్వేలు జరిపిస్తూ తాజా పరిస్థితిని రెండు పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి. కొన్ని స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మధ్య వ్యత్యాసం రెండు, మూడు శాతం ఓట్లు మాత్రమే ఉన్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పర్యటనకు ముందు ఆ పార్టీలు తెప్పించుకున్న సర్వే నివేదికల్లో తేలింది. కొద్దిగా కష్ట పడితే మొదటి స్థానానికి చేరుకోవచ్చని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అనుకున్నాయి. అయితే విజయమ్మ పర్యటన తర్వాత ఆమె ప్రభావం ఎలా ఉందన్న దానిపై తాజాగా సర్వే నివేదికలను తెప్పించుకున్నాయి. గతంలో రెండు, మూడు శాతం ఓట్లు తేడా ఉన్న నియోజకవర్గాల్లో విజయమ్మ పర్యటన తర్వాత ఐదు నుంచి పది శాతం ఓట్లు తేడా ఉన్నట్టు తేలడంతో రెండు పార్టీల నాయకత్వాలు విస్తుపోయాయి. దీంతో పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ రెండు పార్టీలు ఆశలను క్రమంగా వదులుకుంటున్నాయి. ఈ పరిస్థితిలో భారీ మొత్తంలో ఖర్చు పెట్టడం దండగన్న అభిప్రాయానికి రెండు పార్టీలు వచ్చాయి. కాంగ్రెస్‌కు చెందిన కీలక నాయకుడు ఒకరు మూడు స్థానాల్లో తమకు గెలిచే అవకాశం ఉందని చెబుతూంటే, మరో ముఖ్య నాయకుడు ఐదారు స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. గెలుస్తామన్న స్ధానాల సంఖ్యను ఒక్కోటి తగ్గించుకుంటూ వస్తున్నాయి. క్రమంగా ఫలితాలపై అంచనాకు వస్తున్న పార్టీలు ఆచితూచి ఖర్చు పెడుతున్నాయి. గెలిచేందుకు ఏమాత్రం అవకాశం లేదనుకుంటున్న నియోజకవర్గాలకు నిధుల పంపిణీని పూర్తిగా నిలిపివేశాయి. దీంతో తమకు రెండో విడత నిధులు అందలేదంటూ పోటీలోని అభ్యర్థులు తమతమ నాయకత్వాలపై ఒత్తిడి తెస్తున్నారు. గెలిచేందుకు అవకాశం ఉందనుకుంటున్న నియోజకవర్గాల్లో మాత్రం రెండోవిడత నిధుల విడుదలకు సన్నాహాలు చేస్తున్నాయి.
మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా తిరుపతి
ఉప ఎన్నికలు జరుగుతున్న పద్దెనిమిది నియోజకవర్గాల్లో ఒక్క తిరుపతిని మాత్రం కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లో కన్నా ఈ నియోజకవర్గంలో నిధులన్ని కొద్ది ఉదారంగానే ఖర్చు పెడుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిది, ప్రతిపక్ష నేత చంద్రబాబుది కూడా చిత్తూరు జిల్లా కావడం, తిరుపతి నియోజకవర్గానికి నిన్నటి వరకు చిరంజీవి ప్రాతినిధ్యం వహించిన నేపథ్యంలో తిరుపతిలో గెలుపొందటడం ద్వారా ముగ్గురు ముఖ్య నేతలను దెబ్బ కొట్టవచ్చని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్, చిరంజీవి కూడా తిరుపతిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నియోజకవర్గంపై వారిద్దరూ ప్రత్యేక దృష్టి పెట్టారు. తిరుపతి నియోజకవర్గంలో గెలిచినట్లయితే జగన్‌ను, ప్రతిపక్ష నేత చంద్రబాబును దెబ్బతీసినట్టు అవుతుందని ముఖ్యమంత్రి కిరణ్ అనుకుంటున్నారు. ఇక చంద్రబాబు కూడా తన సొంత జిల్లాలోని నియోజకవర్గం అయినందున ఆయన కూడా ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించారు. తిరుపతిలో గెలుపొందినట్లయితే ముఖ్యమంత్రి కిరణ్‌ను నైతికంగా దెబ్బతీసినట్టు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.

This Article Source: Andhrabhoomi Daily.

Monday, May 28, 2012

CBI లో ఆంధ్రజ్యోతి సీక్రెట్ ఏజెంట్లు

ఈనాటి ఆంధ్రజ్యోతి పేపర్ చదివితే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది .CBI టీం లో ఎప్పటికప్పుడు   ఆంధ్రజ్యోతికి వార్తలు అందిoచే సీక్రెట్ ఏజెంట్ ఉండడం నిజంగా ఆ పత్రిక గొప్పతనం. నిన్న జగన్ ను CBI ఎలా విచారించిందీ  కళ్ళకు కట్టినట్లుగా వివరించింది ఈ పత్రిక . జగన్ ను నిమ్మగడ్డ కోప్పడ్డారనీ , జగన్ ఒక్క ఉదుటున లేచి కుర్చీ తోసేసాడని ఎంత గొప్పగా వర్ణించింది ! నాకు తెలిసీ దిల్ కుశ గెస్ట్ హౌసులో ఆంధ్రజ్యోతి స్పై కెమెరా అయినా పేటి ఉండాలి. ఇది నిజంగా CBI  వైఫల్యమే . దీన్ని బట్టి మన రాష్ట్రంలో సెక్యూరిటీ ఎంత చండాలంగా ఉందో చెప్పొచ్చు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాద్యత వహించాలి. జగన్ ఫైర్ అయిన విషయం CBI  కనీసం ఈరోజు కోర్టులో కూడా చెప్పుకోలేక సిగ్గు పడినట్లుంది .
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని ఈ సీక్రెట్ ఏజెంట్ ను పట్టుకోవాలి. అదేలాగంటారా? అదికూడా నేనే చెప్పాలా!
సరే .... ఆంధ్రజ్యోతి రామకృష్ణ ని బొక్కలో పడేసి నాలుగు కుమ్మితే సరి ... అంతా బయటికి వస్తుంది... లేకపోతె రేపు మిగతా మంత్రులను విచారించించే టప్పుడు డైరెక్ట్ గా లైవ్ టెలికాస్ట్  ఇచ్చినా ఇవ్వోచ్చు ఈ ప్రభుద్దుడు ...

Tuesday, May 22, 2012

ఆతిద్యం ఇచ్చిన వారిపైనే చిరు బుర్రులాడిన చిరు : ' అనంత 'లో చేదు అనుభవం




అనంతపురం, మే 21: ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం నగరంలో సోమవారం పర్యటించిన రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి చేదు అనుభవం ఎదురైంది. నగరంలో ఉదయం నుంచి నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న చిరంజీవి సాయంత్రం యువజన కాంగ్రెస్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ కోగటం విజయభాస్కరరెడ్డి ఇంటికి తేనీటి విందుకు వెళ్లారు. చిరంజీవితో పాటు మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్, ఎంపి అనంత వెంకట్రామిరెడ్డి, పార్టీ అభ్యర్థి ముర్షీదాబేగం ఉన్నారు.
ఇంటికి వచ్చిన అతిథులకు మర్యాద చేయాలన్న ఉద్దేశంతో కోగటం విజయభాస్కరరెడ్డి చిరంజీవి దగ్గరకు వెళ్లి టీ, స్నాక్స్ తీసుకు రమ్మంటారా అని అడిగారు. దీంతో కోపోద్రిక్తుడైన చిరంజీవి ‘‘యూజ్‌లెస్ ఫెలో.. ఇంకా టీ, స్నాక్స్ తీసుకురమ్మని అడుగుతావా, బుద్ది లేదా నీకు, వెంటనే తీసుకు రా ఫో’’ అంటూ గదమాయించారు. చిరంజీవి మాటలతో కోపంతో ఊగిపోయిన కోగటం విజయభాస్కరరెడ్డి ‘‘ఏయ్ బుద్ది లేదా నీకు, తల తిరుగుతోందా, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదా నీకు, ఇదేమైనా నీ ఇల్లు అనుకున్నావా’’ అంటూ ఫైర్ అయ్యాడు. ఇలా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకే శైలజానాథ్ మధ్యలో కల్పించుకున్నారు. ‘‘మీకు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదా, ఇలా అయితే ఎలా అంటూ’’ సుతిమెత్తగా చిరంజీవిని హెచ్చరించారు. కోగటం, శైలజానాథ్ మాటలతో మనస్థాపానికి గురైన చిరంజీవి అలిగి వెళ్లిపోతుండగా పార్టీ కార్యకర్తలు, నాయకులు బుజ్జగించారు. కోగటం చేతే టీ, స్నాక్స్ ఇప్పించారు. కోగటం తెచ్చి ఇచ్చిన టీ, స్నాక్స్‌ను చిరంజీవి అయిష్టంగానే స్వీకరించారు.
(చిత్రం) చిరుపైకి దూసుకెళ్తున్న డిసిసి కార్యదర్శి కోగటం విజయభాస్కర్‌రెడ్డిని సముదాయస్తున్న మంత్రి శైలజానాథ్


Source; andhrabhoomi

Saturday, May 19, 2012

'వైఎస్‌ ఒత్తిడి వల్లే ఆ సంతకాలు' తప్పించుకోడానికి మంత్రి సబిత పాట్లు

జగన్‌ ఆస్తుల కేసుతో పాటు, ఓఎంసి అక్రమాల కేసులో రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిని సీబీఐ రెండోమారు విచారించింది. శుక్రవారం నాడు సీబీఐ అధికారులు మంత్రి ఇంటికి వెళ్ళి దాదాపు గంటన్నరపాటు వివిధ అంశాలపైన, గనులశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో జారీ అయిన 9 జీవోల పైన ప్రశ్నించినట్లు తెలిసింది. జగన్‌ ఆస్తుల కేసులో కొన్ని సిమెంట్‌ కంపెనీలకు ఉదారంగా సున్నపుగనులు కట్టబెట్టడం, మరికొన్ని కంపెనీలకు అనుమతులు మంజూరు చేయడం వంటి వాటిపై అధికారులు తాజా ప్రశ్నా వళితో సిద్ధమై ఆమెను విచారించారు. అయితే గనుల శాఖ మంత్రి గా తన హయాంలో జారీ అయిన 9 జీవోలపైన తానకెప్పుడూ పూర్తిస్థాయిలో సమా చారం అందలేదని, కేవలం క్లుప్తమైన సమాచారం, అవగాహనతో మాత్రమే తాను సంతకం చేశానని చెప్పినట్లు తెలిసింది. జీవోలకు సంబంధించి ఫైల్‌ తన వద్దకు వచ్చేముందే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సదరు ఫైలుకు సం బంధించి ఫోన్‌లు వచ్చేవని, ఆ కారణంగానే తాను వాటి పై ఎక్కువ దృష్టి పెట్ట కుండా సంతకాలు చేశానని చెప్పినట్లు తెలిసింది. కాకపొతే ఆమె వివరణతో  సీబీఐ అధికారులు సంతృప్తి చెందలేదని తెలుస్తోంది . 
రాజకీయంగా చూస్తె సబితను కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ కూడా చేయబోదని ఊహించవచ్చు ఎందుకంటే జగన్ తో పాటూ కనీసం ఇద్దరు,ముగ్గురు మంత్రులనైనా ఈ స్కేముకు భాద్యులుగా చేస్తే కానీ తన మీద పడ్డ అపవాదును
 కాంగ్రెస్ తుడుపివేయలేదని కొందరి నేతల నమ్మకం.కనుక ఎప్పటికైనా జగన్ పంచనచేరే అనుమానం ఉన్న సబితతో 
పాటూ మరో ఒకరిద్దరిని .కాపాద  కూడదని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

మరోమారు విచారించే అవకాశం
కాగా ఈ కేసులో సబితా ఇంద్రారెడ్డిని మరోమారు ప్రశ్నించే అవకాశం ఉందని సీబీఐ వర్గాల ద్వారా తెలిసింది. తాజా విచారణలో ఆమె చెప్పిన సమాచారాన్ని, అంతకు ముందు తమకు అందిన సమాచారాన్ని క్రోడీకరిం చుకున్న అనంతరం మరోమారు విచారిస్తామని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

Wednesday, April 11, 2012

వైఎస్‌పై కాంగ్రెస్ 'డబుల్ గేమ్' :మంత్రుల్లో ముదురుతున్న విభేదాలు


కాంగ్రెస్‌లో ‘వైఎస్’ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. వైఎస్ మంత్రివర్గంలో పని చేసిన మంత్రులకు, నేరుగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో మంత్రులైన వారికి మధ్య వైఎస్ విషయంలో విభేదాలు స్పష్టంగా బయటపడుతున్నాయి.
దీంతో వైఎస్‌పట్ల కాంగ్రెస్ హైకమాండ్ ‘డబుల్ గేమ్’కు తెరతీయనుంది. వైఎస్‌ను కాంగ్రెస్ నాయకునిగా సొంతం చేసుకుంటూనే, మరోపక్క వైఎస్‌ను విమర్శించే వారిని ప్రోత్సహించాలన్న అభిప్రాయంతో ఉంది. కొంతమంది మంత్రులు వైఎస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతుండటంతో వైఎస్ మంత్రివర్గంలో కూడా పని చేసిన మంత్రులు ఇబ్బందుల్లో పడుతున్నారు. ఈ విషయంలో మంగళవారం కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి తమ అభిప్రాయాలు తెలియజేశారు.
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మంత్రులు రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, ధర్మాన ప్రసాదరావు, దుద్దిళ్ల శ్రీ్ధర్‌బాబు, సునీతాలక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. ముఖ్యంగా మంగళవారం ఒక టీవీ చానల్‌లో వైద్య ఆరోగ్య మంత్రి కొండ్రు మురళి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇదే విషయాన్ని కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. వైఎస్‌మీద అంత తీవ్రస్థాయిలో మంత్రి కొండ్రు మురళి ధ్వజమెత్తాల్సింది కాదని ముఖ్యమంత్రి కిరణ్ కూడా అభిప్రాయపడినట్టు తెలిసింది. మంత్రి కొండ్రు మురళి కూడా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. తాను వైఎస్‌మీద ఎటువంటి విమర్శలు చేయలేదని, ఎస్సీ, ఎస్టీలకు వైఎస్‌కన్నా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బాగా చేస్తున్నారని మాత్రమే చెప్పానని వివరించినట్టు తెలిసింది. ‘వైఎస్ విషయంలో పార్టీపరంగా ఒక విధానం తీసుకోవాలి. దాన్ని పార్టీ శ్రేణులకు తెలియజేయాలి. ఎవరిష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతుంటే మాకు ఇబ్బందిగా ఉంది. చివరకు పార్టీ కూడా చిక్కుల్లో పడుతుంది. వైఎస్‌ను కాంగ్రెస్ పార్టీ తనవాడిగా సొంతం చేసుకుంటుందా? లేదా? అన్న స్పష్టత ఇవ్వాలి’ అని మంత్రులు ముఖ్యమంత్రిని కోరినట్టు తెలిసింది. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘వైఎస్ ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే. ఈ విషయంలో మరో అభిప్రాయం లేదు. దీనిపై నేను మీడియాలో వివరణ ఇస్తాను’ అని అన్నట్టు తెలిసింది.
కాంగ్రెస్ డబుల్ గేమ్
ఇలావుండగా, వైఎస్ విషయంలో కాంగ్రెస్ డబుల్ గేమ్‌కు తెరతీయనుంది. వైఎస్‌ను పూర్తిగా సమర్ధించే పరిస్థితిలోగాని , అదేవిధంగా పూర్తిగా వ్యతిరేకించే స్థితిలోగాని కాంగ్రెస్ లేదు. ఇందులో ఏరకమైన నిర్ణయం తీసుకున్నా చిక్కుల్లో పడే పరిస్థితి ఉంది. ఒకపక్క రాష్ట్రంలో కొంతమంది కాంగ్రెస్ నేతలు వైఎస్‌ను తీవ్రంగా విమర్శిస్తుంటే, మరోపక్క కొంతమంది నేతలు వైఎస్‌ను విమర్శించేందుకు ఇష్టపడటం లేదు. ఇంకోపక్క హైకమాండ్‌కు చెందిన నాయకులు కొందరు వైఎస్‌ను ఇప్పటికీ పొగుతూండటం కాంగ్రెస్‌లోని ఆయన వ్యతిరేకులకు రుచించడం లేదు. కేంద్రమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇంచార్జి వీరప్పమొయిలీ రెండు రోజుల కిందట నగరానికి వచ్చినపుడు మీడియాతో మాట్లాడుతూ ‘వైఎస్ గొప్ప పాలనాదక్షుడు. ఆయన హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది’ అని ప్రశంసించారు.
వైఎస్ విషయంలో కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో అధికారికంగా ఒక నిర్ణయం తీసుకోవాలని నాయకత్వం నిర్ణయించింది. రెండుసార్లు కాంగ్రెస్‌ను రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చి, రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వైఎస్ పార్టీపరంగా మా నాయకుడే’ అని నాయకత్వం ప్రకటించాలని నిర్ణయించింది. వైఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ప్రకటనలు చేస్తే అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని చెప్పనుంది. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువ అని, పార్టీ నేతలు ఎవరిష్టం వచ్చినట్టు వారు మాట్లాడే భావ ప్రకటనా స్వేచ్ఛ ఎక్కువని సమర్థించుకోనుంది. ఇందుకు వైఎస్‌నే ఉదాహరణగా పేర్కోనున్నారు. కాంగ్రెస్ పార్టీ 1989నుంచి 1994వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్నపుడు ఎం చెన్నారెడ్డి, నేదురుమల్లి జననార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశారు. అప్పుడు అసమ్మతి నేతగా ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ముగ్గురు ముఖ్యమంత్రుల మీద బహిరంగంగా ధ్వజమెత్తేవారు. ఇపుడు వైఎస్ మీద విమర్శలు చేసే నేతలను ఇదే కారణం చూపి నాయకత్వం సమర్థించనుంది. అంటే వైఎస్ తమ నాయకుడే అని ఒక పక్కన చెబుతూనే, ఆయన్ని విమర్శించే నాయకుల్ని ఇంకోపక్క ప్రోత్సహించనుంది. దీనివల్ల వైఎస్ మంత్రివర్గంలో పని చేసిన ప్రస్తుత మంత్రులకు కొంత ఊరట లభిస్తుందని, వైఎస్‌ను విమర్శించడం లేదన్న అపవాదు వారిమీద రాకుండా ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Monday, April 9, 2012

"వైయస్సార్ కంగ్రెస్ గెలిస్తే తెలంగాణా వస్తుంది": కాంగ్రెస్ క్రొత్త వ్యూహం

రాబోయే ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం, ఎన్నికల ప్రచార వ్యూహాన్ని ఇప్పటినుంచే సిద్ధం చేస్తోంది. ఉప ఎన్నికలు జరగనున్న నియోజక వర్గాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వ పరంగా రకరకాల వరాలు ప్రకటిస్తూనే, రాజకీయంగా వైఎస్సార్ కాంగ్రెస్‌ను దెబ్బ తీసే వ్యూహానికి పదును పెడుతోంది. తమ ప్రాంతంలో ఉప ఎన్నికలు జరగనున్న తరుణంలో తెలంగాణ నాయకులు ప్రత్యేక రాష్ట్రం కోసం ఒత్తిడి చేయడం తమకు ఇబ్బందిగా ఉంటుందని సీమాంధ్ర నేతలు అంటున్నారు. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు జిల్లాలవారీగా నిర్వహించిన సమావేశాల్లో సీమాంధ్ర నేతలు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, తెలంగాణ నేతల దూకుడు తగ్గించాలని కోరారు. అయితే అదే తెలంగాణ అంశాన్ని ఉప ఎన్నికల్లో తమకు అనుకూలంగా మలచుకోవాలని ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు నిర్ణయించారు. సీమాంధ్ర ప్రాంతంలో పదిహేడు నియోజకవర్గాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు విజయావకాశాలు ఉండవచ్చునని భావిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం, తెలంగాణ అంశాన్ని బూచిగా చూపించి వైఎస్సార్ కాంగ్రెస్‌కు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించని పక్షంలో రాష్ట్ర విభజనకు అనుకూలంగా హైకమాండ్ నిర్ణయం తీసుకునే ప్రమాదం ఉంటుందని ప్రచారం చేయటం ద్వారా సీమాంధ్ర ప్రజల్లో ఉన్న సమైక్యాంధ్ర సెంటిమెంటును ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఉప ఎన్నికల ప్రచారంలో ఈ అంశం గురించే ప్రధానంగా ప్రస్తావించేలా కాంగ్రెస్ నేతలకు, పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ నాయకత్వం చెప్పనుంది. సమైక్యాంధ్ర కొనసాగాలంటే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాల్సిందిగా పెద్దఎత్తున ప్రచారం చేయాలని భావిస్తున్నారు. చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేశ్ ఇప్పటికే ఈ కోణంలో ప్రచారం ప్రారంభించారు. ఆదివారం తిరుపతిలో మాట్లాడుతూ, ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ గెలిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని వ్యాఖ్యానించారు.
ప్రత్యేక తెలంగాణ అంశం కాంగ్రెస్, టిడిపిలను ఇరకాటంలో పెట్టినంతగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పెట్టడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సీమాంథ్రకు మాత్రమే పరిమితమైన పార్టీగా భావిస్తున్నారు. తెలంగాణ వాదులు కూడా ప్రత్యేక రాష్ట్రం విషయంలో కాంగ్రెస్, టిడిపిలపై తెస్తున్నంతగా వైఎస్సార్ కాంగ్రెస్ మీద ఒత్తిడి తేవకపోవడం గమనార్హం.
తెలంగాణలో మాదిరిగానే సీమాంధ్రలోనూ కాంగ్రెస్ బలహీనంగా ఉందని హైకమాండ్ భావిస్తే, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ద్వారా తెలంగాణలోనైనా పార్టీని పటిష్టం చేయవచ్చుని అనుకునే ప్రమాదం ఉందని, దీనివల్ల సమైక్యాంధ్రనే కొనసాగించాలంటూ సీమాంధ్ర ప్రజలు చేపట్టిన ఉద్యమం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ నాయకులు ఉప ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. అదే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే తెలంగాణలో పార్టీ దెబ్బతిన్నా సీమాంధ్రలో పటిష్టంగా ఉందన్న ఉద్దేశంతో రాష్ట్ర విభజనకు హైకమాండ్ అంగీకరించక పోవచ్చని వారు ప్రచారం చేయనున్నారు.

Friday, April 6, 2012

ఆందోళన కలిగిస్తున్న మాల్దీవుల పరిణామాలు

హిందూ దూమహాసముద్ర ప్రాంతంపై మనదేశం ఎల్లప్పుడూ ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తూ వస్తున్న నేపథ్యంలో, ఆ ప్రాంతంలో చోటు చేసుకొనే పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేయడం సహజం. 2012లో మాల్దీవుల్లో అధికార మార్పిడి జరగడం అటువంటి పరిణామాల్లో ఒకటి! దేశంలో కొనసాగిన ప్రజాందోళనలు ఉధృతమై చివరకు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ పదవీత్యుతికి దారితీసాయి. 2008లో జరిగిన ఎన్నికల్లో దేశాధ్యక్ష పదవికి ఎన్నికయిన ఆయన ఎట్టకేలకు ప్రభుత్వ బాధ్యతలను ఉపాధ్యక్షుడు మహమ్మద్ వాహీద్ హసన్‌కు అప్పగించి, ఈ ఏడాది ఫిబ్రవరి 7న పదవినుంచి వైదొలగాడు. ఇటు భౌగోళికంగా లేదా జాతి పరంగా మాల్దీవులు అరబ్ ప్రపంచంలో భాగం కాదు. కానీ 2010లో ఉత్తర ఆఫ్రికా దేశాలైన లిబియా, ఈజిప్ట్, యెమెన్, ట్యునీసియా, మొరాకోదేశాల్లో చెలరేగిన ఉద్యమాల మాదిరి ఆందోళనలే ఇక్కడ కూడా చోటు చేసుకోవడం గమనార్హం. అప్పటి అధ్యక్షుడు నషీద్ పదవినుంచి తప్పుకోవడానికి ముందు చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే..అరబ్ దేశాల ఆందోళనల ప్రభావం ఇక్కడ ఉన్నదని ఎవరికైనా అవగతం కాక మానదు. ఉత్తర ఆఫ్రికా దేశాల మాదిరిగానే మాల్దీవుల్లో కూడా కొన్ని దశాబ్దాలుగా పురాతన శైలి నిరంకుశాధికారం కొనసాగింది. అయితే అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం దీవుల్లోని పౌర సమాజాల్లోని ‘ప్రజాబలం’ నిరంకుశ పాలనకు చరమగీతం పలికింది. ముఖ్యంగా రాజకీయ హక్కులు, పౌరులకే అధికారం అప్పగించడం, ప్రజాస్వామ్యబద్ధమైన పాలన అవసరాన్ని ప్రజలు నొక్కి చెబుతూ ఆందోళనలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం వాటిని ఉక్కుపాదంతో అణచివేయాలని చూసినమాట వాస్తవం.
అయితే మాల్దీవుల్లో చోటు చేసుకున్న పరిణామాలను చాలా జాగ్రత్తగా, నిరంతరం పరిశీలించాల్సిన అవసరం ఉంది. మాల్దీవుల్లో అధికార మార్పిడికి కేవలం అరబ్ ఉద్యమాలు హిందూ మహాసముద్రం ప్రాంతంలోకి చొచ్చుకొని రావడమే కారణమన్న కోణంలో ఈ పరిశీలన కొనసాగాలి. కేవలం మూడు నెలలకు ముందు భారత్‌కు పొరుగు దేశంలో చోటు చేసుకున్న అతిపెద్ద పరిణామం..మనదేశ ప్రజల మనోఫలకాలపై గాఢమైన ముద్రను వేయలేకపోయింది. మరోమాటలో చెప్పాలంటే భారతీయులు ఈ సంఘటనను ఎప్పుడో మరచిపోయారు! దీనికి అంతటి ప్రాధాన్యత ఇవ్వకపోవడమే అందుకు కారణం.
తన పదవీత్యుతి తర్వాత అధ్యక్షుడు నషీద్ విలేకర్లతో మాట్లాడుతూ..పోలీసులు, సైన్యం వత్తిడి వల్లనే తప్పనిసరి పరిస్థితుల్లో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పారు. భారత్ పరంగా ఆలోచిస్తే, మాల్దీవుల్లో చోటు చేసుకున్న పరిణామాలు కేవలం ఆ దేశ అంతర్గత వ్యవహారం. కానీ బయటి శక్తులు మాల్దీవుల్లో తమ పలుకుబడిని విస్తరించుకోవడానికి, అక్కడ తిష్ఠవేయడానికి చేసే యత్నాల్లో భాగంగానే ఈ మొత్తం నాటకాన్ని రక్తి కట్టించాయా? అనే ప్రశే్న మనకు ఆందోళన కలిగించే అంశం. భౌగోళికంగా అత్యంత సమీపంలో ఉన్న మాల్దీవులతో సహజంగానే భారత్ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోంది. అన్ని సందర్భాల్లో కూడా మనదేశం, మాల్దీవులతో స్నేహం విషయంలో ప్రత్యేకతను కనబరుస్తూనే వచ్చింది. వివిధ దేశాల్లో చోటు చేసుకున్న అరబ్ ఉద్యమాలను భారత్ ఎల్లప్పుడూ, ఆయా దేశాల అంతర్గత వ్యవహారంగా పరిగణిస్తూ వచ్చింది. అయితే అరబ్ ఉద్యమాల పుణ్యమాని ఆయా దేశాల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలతో సంబంధాలు నెరపే విషయంలో భారత్ కొరుకుడు పడని సమస్యను ఎదుర్కొంటున్నది. నియంతల కబంధ హస్తాలనుంచి తమ దేశాలకు విముక్తిని కలిగించిన తర్వాత, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో విజయం సాధించిన ఆయా పార్టీల వారు అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటికీ, వారిలో సెక్యులర్ భావాలు లేకపోవడం భారత్ ఆందోళనకు కారణం! ముఖ్యంగా అవి ఇస్లామిక్ సిద్ధాంతాలకు అనుగుణంగా..అంటే సలాఫి-వాహబీ ఛాందసవాదం వైపుకు మొగ్గు చూపుతుండటం భారత్‌కు ఇబ్బంది కారకమవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మనదేశం వంటి సెక్యులర్ దేశాల్లో, బహుళ సంస్కృతులు పరిఢవిల్లుతున్నాయి. విభిన్న మతాలవారు సహజీవనం కొనసాగిస్తున్న సమాజం మనది. ఈ నేపథ్యంలో, భారత్ వంటి ప్రజాస్వామిక దేశాల్లోని కొన్ని ఇస్లామిక్ వర్గాలు, జిహాదీ సంస్థలు చేస్తున్న దుష్ప్రచార ప్రభావానికి తేలిగ్గా లోబడే అవకాశాలు మెండు. ముఖ్యంగా పాకిస్థాన్ వంటి దేశాల్లోని కోవర్ట్ ఇంటెలిజెన్స్ సంస్థల సహాయంతో జిహాదీ సంస్థలు చేసే ఆగడాలతో మనదేశం ఎంతో సతమతమవుతున్నది! అందువల్ల ప్రస్తుతం అరబ్ దేశాల్లో చోటు చేసుకున్న ఉద్యమాల అనంతరం ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న వాతావరణం భారత్‌కు ఏమాత్రం సానుకూలం కాదు! అటువంటి పరిస్థితుల్లో, మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్ పదవీత్యుతుడు కావడానికి ముందు చోటు చేసుకున్న వివిధ ప్రజాందోళనలను ఎవరు పరీక్షిస్తారు? లేదా పట్టించుకునేదెవరు?
ఈ నేపథ్యంలో మాల్దీవుల్లో చోటు చేసుకున్న రాజకీయ అస్థిరత, పౌర ఉద్యమాలను..దక్షిణాసియా, హిందూ మహాసముద్రం ప్రాంతంలో వేగంగా విస్తరిస్తున్న రాడికల్ ఛాందసవాదం దృక్కోణంలో విస్తృత ప్రాతిపదికన పరిశీలించాల్సి ఉంది. భౌగోళికంగా మాల్దీవులు ఒంటరిగా, వ్యూహాత్మకంగా బాహ్య శక్తులు తేలిగ్గా ప్రవేశించి తిష్ఠవేసేందుకు అనువుగా ఉన్నాయి. దీనికి నిదర్శనంగా 1988లో జరిగిన సంఘటననే ఉదాహరణగా చెప్పవచ్చు. పీపుల్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళ్ ఈలం అనే తీవ్రవాద సంస్థకు చెందిన మిలిటెంట్లు, అప్పట్లో మాల్దీవుల ప్రభుత్వాన్ని పడగొట్టి, ద్వీపాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. మాల్దీవుల ప్రభుత్వం భారత్ సహాయాన్ని అర్థించింది. తక్షణమే భారత సైన్యానికి చెందిన పారాచూట్ బెటాలియన్‌ను అక్కడికి నాటి కేంద్ర ప్రభుత్వం పంపింది. దీనికి ఆపరేషన్ కాక్టస్‌గా పేరుపెట్టారు.
మరి అటువంటి ప్రయత్నాలు మళ్ళీ జరగకూడదనేంలేదు. పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ వంటి కోవర్ట్ సంస్థల మద్దతుతో రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు ఈ ద్వీపాలను తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించే అవకాశాలను కొట్టిపారేయలేం. నేరుగా ప్రభుత్వాన్ని పడగొట్టే చర్యల వల్ల, అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనాల్సి ఉంటుంది. అందువల్ల, ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి, దేశాన్ని ఆందోళనలతో అట్టుడికించడం ద్వారా,పాలక ప్రభుత్వాన్ని అధికారంనుంచి తప్పించవచ్చు. తర్వాత చట్టబద్ధంగా జరిగే ఎన్నికల్లో రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు అధికారాన్ని హస్తగతం చేసుకొనే విధంగా ప్రణాలిక సిద్ధం చేసి అమలు జరపవచ్చు.
నిజానికి హిందూ మహాసముద్రం, దక్షిణాసియా, తూర్పు ఆఫ్రికా, గల్ఫ్ దేశాలకు వాణిజ్యపరంగా ఎంతో ఉపయోగపడుతున్నది. అందువల్లనే ఈ మార్గంలో రవాణా నౌకల రద్దీ అధికంగా ఉంటోంది. అంతే కాదు ఈ సముద్ర తీరంలో చాలా చిన్న దేశాలు ఉండటం వ్యూహాత్మక ప్రాధాన్యతను మరింత విస్తృతం చేసింది. ముఖ్యంగా వాటిల్లో అందుబాటులో ఉండే వనరులు, భౌగోళిక కోణంలో కూడా ఆయా దేశాలు ఎంతో ప్రాముఖ్యతను కలిగివుండటం విశేషం. అరేబియా సముద్రం ఎగువ భాగంలో ముఖ్యంగా హార్న్ ఆఫ్ ఆఫ్రికా చుట్టుపక్కల ప్రాంతాలు, పూర్వకాలపు బార్బరీ తీర ప్రాంతం మాదిరిగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కేంద్ర స్థానాన్ని ఆక్రమించే సోమాలియా సముద్రపు దొంగలకు నిలయంగా మారిపోయింది. ప్రస్తుతం సోమాలియాలో ఏవిధమైన ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో అరాచకం తాండవిస్తోంది. అంతేకాదు అల్ సాహెబ్ జిహాదీ గ్రూపులు ఇక్కడ యదేచ్ఛగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.
ఇక్కడి సముద్రపు దొంగల స్థావరాలను సమూలంగా నాశనం చేయాలంటే.. పెద్ద ఎత్తున వాయు, భూతల దాడులు జరపాల్సి ఉంటుంది. ఇందుకు ఏ దేశానికి చెందిన ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు. సోమాలియాకు చెందిన ఈ మిలిటెంట్ గ్రూపులు అల్ ఖైదాకు అనుబంధంగా పనిచేస్తున్నాయి. వీటిని నియంత్రించేందుకు ఇప్పటి వరకు కేవలం ఇథియోపియా మాత్రమే ప్రయత్నించింది. ఈ యత్నాలు ఏవీ సఫలీకృతం కాలేదు సరికదా, ఈ సముద్రపు దొంగల సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి, అంతర్జాతీయ సహకారాన్ని పొందడంలో కూడా విఫలమయింది.
ఈ సోమాలీ పైరేట్లు ఇక ముందు..మరింత ఆధునిక సాయుధ సంపత్తిని సమకూర్చుకొని, సైనిక శిక్షణ పొందే రోజులు కూడా ఎంతో దూరంలోలేవు! ఇందుకు కోవర్ట్ ఏజెంట్లు లేదా అల్ ఖైదా, తాలిబన్ సంస్థలకు చెందిన జిహాదీలు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. ఫలితంగా అల్ షబాబ్ తూర్పు ఆఫ్రికా దేశాలకు చెందిన ప్రభుత్వాలకు మాత్రమే కాదు ఇతర ప్రాంతాలకు చెందిన దేశాలకు పెద్ద తలనొప్పిగా మారే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఇదే సమయంలో హిందూమహాసముద్ర ప్రాంతంలోని ద్వీప సమూహాలు పూర్తి స్థాయిలో ఇస్లామిక్ ఎమిరేట్స్‌గా మారిపోతాయని కూడా చెప్పడం సాధ్యం కాదు. ఇన్ని పరిణామాల నేపథ్యంలో భారత్ తన సమీప ప్రాంతాల విషయంలో చాలా జాగరూకతతో వ్యవహరించాలి. ప్రస్తుతం మాల్దీవుల్లో చోటు చేసుకున్న మార్పులు, భవిష్యత్ పరిణామాలకు సూచనగా అర్థం చేసుకోవాలి. అందుకు తగినవిధంగా భారత్ ఎప్పటికప్పుడు స్పందిస్తూ, వ్యూహాత్మకంగా మెలగగలిగితే హిందూ మహాసముద్రంలో, భారత్ తన ప్రయోజనాలను పరిరక్షించుకోగలుగుతుంది.

  • -శంకర్ రాయ్‌చౌధురి in Andhrabhoomi