Thursday, July 31, 2025

పంట చేల గట్ల మీద నడవాలి (పాలగుమ్మి విశ్వనాథం)

 పాలగుమ్మి విశ్వనాథం గారు రచించి, స్వరపరచి గానం చేసిన పాట మనకోసం

 పంట చేల గట్ల మీద నడవాలి
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి
మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి

ఒయ్యారి నడకలతో సెలయేరు,
ఆ ఏరు దాటితే మా ఊరు!
ఊరి మధ్య కోవెలా, కోనేరు
ఒకసారి చూస్తిరా, తిరిగి పోలేరు!
ఊరి మధ్య కోవెలా, కోనేరు
ఒకసారి చూస్తిరా వదిలి పోలేరు!

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి


చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి
మనసువిప్పి మాట్లాడే మనుషులు కలవాలి
ఒకరొకరు ఆప్యాయతలొలకబొయ్యాలి
ఆగలేక నా కన్నులు చెమ్మగిల్లాలి

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
జ్ఞాపకాల బరువు తో తిరిగి రావాలి

పచ్చని పచ్చిక పైన మేను వాల్చాలి
పైరగాలి వచ్చి నన్ను కౌగిలించాలి
ఏరు దాటి తోట తోపు తిరగాలి
ఎవరెవరో వచ్చి నన్ను పలకరించాలి

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి 

 


 

 

Friday, July 25, 2025

అప్పు చేసి పప్పుకూడు చేయిస్తున్న బ్యాంకులు

 LOANS FOR GOVERNMENT EMPLOYEES WITH BAD CREDIT - QUICK

ఒకప్పుడు పండుగో పబ్బమో వస్తే షాపింగ్‌కి వెళ్లేవారు. ఇప్పుడు ఏమీ తోచకపోతే షాపింగ్‌కి వెళ్లిపోతున్నారు. 35 ఏళ్లలోపు యువత ఏటా ఫ్యాషన్, లైఫ్‌స్టైల్‌ వస్తువుల మీద పెడుతున్న ఖర్చు లక్షల కోట్లలో ఉంటోందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. మరో నివేదిక ప్రకారం- కేవలం దుస్తులు, యాక్సెసరీస్‌ మీదే ఏడాదికి రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టేవారు అనేక మంది ఉన్నారు మన దేశంలో. ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ రిపోర్ట్‌ చెబుతున్న విషయమూ ఆందోళనకరంగానే ఉంది. 5 నుంచి 10శాతం మధ్యతరగతి భారతీయులు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారట. వీరిలో 67శాతం వ్యక్తిగత రుణాలు తీసుకుని మరీ ఖర్చు పెట్టుకున్నారట. వడ్డీ ఎక్కువగా ఉండే ఈ రుణాలను ప్రాణాల మీదికి వస్తే తప్ప తీసుకోకూడదంటారు నిపుణులు. కానీ బ్యాంకులు ఫోన్‌ చేసి మరీ జీరో ప్రాసెసింగ్‌ ఫీజు అని చెబుతోంటే... తీసుకుని కోరుకున్న వస్తువు కొనేసుకుంటే పోలా... అనుకుంటున్నారు వినియోగదారులు.

కొనేటప్పుడు డోపమైన్‌ హర్మోన్‌ ప్రభావం సంతోషాన్నిస్తుంది కానీ బిల్లు కట్టేటప్పుడో? డబ్బులన్నీ అయిపోతే నెల గడిచేదెలా అన్న ఆలోచన ఒత్తిడిని పెంచి కార్టిసోల్‌ హార్మోన్‌ విడుదలకు కారణమవుతుంది. పలు అనారోగ్యాలకు అది దారితీస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే అనవసరమైన ఖర్చులు చేసి చేజేతులా అనారోగ్యాలను ఆహ్వానించడం అన్నమాట. జీతం... జీవితం రెండూ ఒకటే! చేజారిపోయేవరకూ రెండిటి విలువా తెలీదు. అప్పు పేరుతో తప్పు చేయడం మానేద్దాం. ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అన్నారు పెద్దలు.

ఆ వినాశకాలాన్ని విలాసాలతో కొని తెచ్చుకోవద్దు. 

Friday, July 18, 2025

గాలిలో ఊగిసలాడే దీపంలా Thandel Bujji Thalli Song Lyrics

తండేల్ మూవీ నుంచి బుజ్జి తల్లి అనే పాటను హీరో-హీరోయిన్ల (నాగ చైతన్య, సాయి పల్లవి) మధ్య మనసుకు హత్తుకునే విధంగా చిత్రీకరించారు. ప్రేమికుల మధ్య ఉన్న బంధాన్ని చాటేలా సాగే ఈ పాట సాగుతుంది...

దేవిశ్రీప్రసాద్‌ స్వరపరచిన ఈ మెలోడీ గీతాన్ని శ్రీమణి రచించగా, జావేద్‌ అలీ ఆలపించారు. బాధలో ఉన్న ప్రియురాలిని కథానాయకుడు ఓదార్చే నేపథ్యంలో ఈ పాట సాగింది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: చందూ మొండేటి.

https://suryaa.com/suryaa-images/cinema-telugu/bigimage/bujjithalli_9886.gif 

 లిరిక్స్ ఇక్కడ చూడండి.

పల్లవి :
గాలిలో  ఊగిసలాడే దీపంలా 
ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం 
నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా 
చీకటి కమ్మెను నీ కబురందక నాలోకం 

సుడిగాలిలో పడి పడి లేచే 
పడవల్లే తడబడుతున్నా ..

నీ కోసం వేచుందే నా ప్రాణం 
ఓ బుజ్జితల్లి
నా కోసం ఓ మాటైనా మాటాడే 
నా బుజ్జి తల్లి ..

చరణం -1 

నీరు లేని చేపల్లే 
తారలేని నింగల్లే 
జీవమేది నాలోన నువ్వు మాటలాడందే 

మళ్ళీ యాళకొస్తానే 
కాళ్ళా యేళ్ళ పడతానే 
లెంపలేసుకుంటానే 
ఇంక నిన్ను యిడిపోనే 

ఉప్పు నీటి ముప్పుని కూడా 
గొప్పగా దాటే గట్టోణ్ణే 
నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే 

నీ కోసం వేచుందే నా ప్రాణం 
ఓ బుజ్జితల్లి
నా కోసం ఓ మాటైనా మాటాడే 
నా బుజ్జి తల్లి 

చరణం -2 

ఇన్నినాళ్ళ మన దూరం 
తియ్యనైన ఓ విరహం 
చేదులాగ మారిందే అందిరాక నీ గారం 

దేన్ని కానుకియ్యాలే 
యెట్లా బుజ్జగించాలే 
బెట్టు నువ్వు దించేలా లంచమేటి కావాలే 

గాలివాన జాడేలేదే రవ్వంతైనా నా చుట్టూ 
ఐనా మునిగిపోతున్నానే దారే చూపెట్టు 

నీ కోసం వేచుందే నా ప్రాణం 
ఓ బుజ్జితల్లి
నా కోసం ఓ మాటైనా మాటాడే 
నా బుజ్జి తల్లి ..


 

Wednesday, July 9, 2025

అరుదైన ఆత్మహత్య by Avasarala Ramakrishna Rao

 అవసరాల రామకృష్ణారావుగారు 1966 లో రాసిన కథ ఇది. ఉపన్యాసాలు, ఉపదేశాలు, నినాదాలు, ప్రవచనాలు లేకుండా అతి సరళంగా, సూటిగా సాగిన స్త్రీవాద కథ. సమాజాన్ని అంగీకరించకుండా, స్త్రీ జాతిని గౌరవించకుండా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనుకునే ఒక మగ మహానుభావుడికి ఎదురైన ఆత్మహత్యా సదృశమైన సంఘటనలు..!! 

Link to Read Full Story: Click Here


 

Tuesday, July 8, 2025

తెలుగు నా భాష

తీయనైన భాష తేనెలొలుకు భాష 

త్రిజన్మోహనమైన భాష 

త్రిలింగమున శోభించు భాష 

మైత్రీభావాల మధురమైన భాష 

నిరంతరం నాతోనే ఉండి 

నన్ను నన్నుగా ఉన్నతంగా ఆలోచింపచేసింది 

ఔన్నత్యం చాటేది 

ప్రసన్నమైన కిన్నెరసానిలా 

అందమైన వాగులా 

వంకలా 

వయ్యారంగా 

పాటై 

పదమై 

పద్యమై 

పరవశమై 

 పలికించేదీ అమ్మ భాష 

Monday, July 7, 2025

నేటి రాజకీయాలు .. ఒక్క ముక్క (చిత్రం) లో

 నేను ఎన్నికయ్యాక .. నేను పూర్తి శాఖాహారిగా మారిపోతాను