Monday, September 22, 2025

సంస్కృత సూక్తులు - మూల శ్లోకాలు

 

సంస్కృత సూక్తులు - మూల శ్లోకాలు 
---------------------------------------

మనం తరుచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు తెలుసుకోవాలని అనిపించడం సహజం కదా!
అలాంటి వాటిని కొన్నింటిని మీకోసం సిద్ధం చేశారు. చూడండి:
ముందుగా మనం తరుచుగా వినే మూల వాక్యాలు ఇవీ:
👉 *ధర్మో రక్షతి రక్షిత:*
👉 *సత్య మేవ జయతే*
👉 *అహింసా పరమో2ధర్మ:*
👉 *ధనం మూలమిదం జగత్*
👉 *జననీ జన్మ భూమిశ్చ*
👉 *స్వర్గాదపి గరీయసి*
👉 *కృషితో నాస్తి దుర్భిక్షమ్*
👉 *బ్రాహ్మణానా మనేకత్వం*
👉 *యథా రాజా తథా ప్రజా*
👉 *పుస్తకం వనితా విత్తం*
👉 *పర హస్తం గతం గత:*
👉 *శత శ్లోకేన పండిత:*
👉 *శతం విహాయ భోక్తవ్యం*
👉 *అతి సర్వత్ర వర్జయేత్*
👉 *బుద్ధి: కర్మానుసారిణీ*
👉 *వినాశ కాలే విపరీత బుద్ధి:*
👉 *భార్యా రూప వతీ శత్రు:*
👉 *స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:*
👉 *వృద్ధ నారీ పతి వ్రతా*
👉 *అతి వినయం ధూర్త లక్షణమ్*
👉 *ఆలస్యం అమృతం విషమ్*
👉 *దండం దశ గుణం భవేత్*
👉 *ఇవీ మన చెవిని పడుతూ ఉండే మూల వాక్యాలు. కదా?*
*ఇప్పుడు వీటి పూర్తి పాఠాలు చూదామా ?*
ధర్మ ఏవో హతో హంతి
"ధర్మో రక్షతి రక్షిత:"
తస్మా ధర్మో న హంతవ్యో
మానో ధర్మో హ్రతోవ్రధీత్
🔥ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే , అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. అందు చేత ధర్మాన్ని నాశనం చేయ కూడదు. ఎవరికి వారే తమంత తాముగా నశించి పోవాలని కోరు కోరు కదా !
🔥 సత్యమేవ జయతే నా2నృతం
సత్యేన పంథా వితతో దేవయాన:
యేనా క్రమం తృషయో హా్యప్త కామా
యత్ర త త్సత్యస్య పరమం నిధానమ్
🔥సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారై పరమేశ్వరుని పొంద గలుగు తున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.
🔥 అహింసా పరమో ధర్మ:
తథా2 హింసా పరం తప:
అహింసా పరమం ఙ్ఞానం
అహింసా పరమార్జనమ్
🔥అహింస గొప్ప ధర్మం. గొప్ప తపం. మంచి ఙ్ఞానం. గొప్ప సాధన
🔥 ధనమార్జాయ కాకుత్స్థ !
ధన మూల మిదం జగత్
అంతరం నాభి జానామి
నిర్ధనస్య మృతస్య చ
🔥ఓ రామా ! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనంతో తోనే లోకమంతా ఉంది. ఈ విషయం లోని ఆంతర్యం గమనించాలి. ధనం లేని వాడు మృతునితో సమానం.
🔥 అపి స్వర్ణ మయీ లంకా
న మే రోచతి లక్ష్మణ !
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసి.
🔥సోదరా, లక్ష్మణా ! ఈ లంక బంగరు మయ మయిన దైనప్పటికీ నాకు నచ్చదు. ఇక్కడ ఉండ లేను. ఎందుకంటే, తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !
🔥 కృషితో నాస్తి దుర్భిక్షమ్
జపతో నాస్తి పాతకమ్
మౌనేన కలహం నాస్తి
నాస్తి జాగరతో భయం.
🔥చక్కగా వ్యవసాయం చేస్తే కరవు అనేది ఉండదు. జపతపాలు చేస్తే పాపం పోతుంది. మౌనంగా ఉంటే ఎవరితోనూ విరోధమే ఉండదు. జాగురూకతతో ఉంటే దేనికీ భయపడే పని లేదు.
🔥 గజానాం మంద బుధ్ధిశ్చ సర్పాణా మతి నిద్రతా
బ్రాహ్మణానా మనేకత్వం త్రిభిర్లోకోపకారకమ్
🔥ఏనుగుల మంద బుద్ధి తనం, పాముల అతి నిద్రా గుణం, బ్రాహ్మణులలో ఉండే అనైక్యత ... వీటి వల్లన లోకోపకారం జరుగుతోంది కదా !
🔥 రాఙ్ఞ ధర్మిణి ధర్మిష్ఠా, పాపే పాప పరా: సదా
రాజాను మను వర్తంతే, యథా రాజా తథా ప్రజా !
🔥రాజు ధర్మ పరుడయితే రాజ్యం ధర్మ పథంలో నడుస్తుంది. పాప వర్తనుడయితే రాజ్యం పాప పంకిల మవుతుంది. ఎప్పుడూ ధర్మా ధర్మాలు రాజుని అనుసరించి నడుస్తాయి. రాజు ఎలా ఉంటే, ప్రజలూ అలాగే నడచు కుంటారు.
🔥 పుస్తకం వనితా విత్తం
పర హస్తం గతం గత:
అధవా పునరా యాతి
జీర్ణం భ్రష్ఠా చ ఖండశ:
🔥పుస్తకం, స్త్రీ , ధనం ఇవి మన వద్ద ఉన్నంత సేపే . ఇతరులు చేతిలో పడితే మరి వాటి పని అంతే. తిరిగి వస్తాయను కో వద్దు. ఒక వేళ వచ్చినా. సర్వ నాశన మయి పోయిన స్థితిలో మనకి తిరిగి దక్కుతాయి సుమీ. ( స్త్రీని జాగ్రత్తగా చూసుకోవాలి అనే భావం ఇక్కడ గ్రహించాలి)
🔥 శత నిష్కో ధనాఢ్యశ్చ
శత గ్రామేణ భూపతి:
శతాశ్వ: క్షత్రియో రాజా
శత శ్లోకేన పండిత:
🔥వంద నిష్కలు ( ధన విశేషం) ఉన్న వాడే ధనవంతుడు అనిపించు కుంటాడు. వంద గ్రామాలకు అధిపతి అయిన వాడే భూపతి అవుతాడు. వంద గుఱ్ఱాలు కల వాడే రాజు అనిపించు కుంటాడు. వంద శ్లోకాలు వచ్చిన వాడే పండితుడు.
🔥విద్వత్త్వం చ నృపత్వం చ
నైవ తుల్యం కదాచన
స్వ దేశే పూజ్యతే రాజా
విద్వాన్ సర్వత్ర పూజ్యతే.
🔥పండితుడికీ, రాజుకీ పోలికే లేదు ! ఎందు కంటే, రాజు తన దేశంలో మాత్రమే పూజింప బడతాడు. కాని, పండితుడు లోకమంతా గౌరవించ బడుతాడు.
🔥 శతం విహాయ భోక్తవ్యం
సహస్రం స్నాన మాచ రేత్
లక్షం విహాయ దాతవ్యం
కోటిం త్యక్త్వా హరిం భజేత్
🔥వంద మందిని విడిచి పెట్టి అయినా భుజించాలి. వేయి మందిని విడిచి పెట్టయినా స్నానం చేయాలి. లక్ష మంది నీ వెంట రాక పోయినా దానం చేయాలి. కోటి మందిని విడిచి పెట్టయినా శ్రీహరిని సేవించు కోవాలి.
🔥 అతి దానాత్ హత: కర్ణ:
అతి లోభాత్ సుయోధన:
అతి కామాత్ దశగ్రీవో
అతి సర్వత్ర వర్జయేత్
( ఇది మరోవిధంగా కూడా ఉంది)
🔥విచ్చల విడిగా దానం చేయడం వలన కర్ణుడు చెడాడు. మిక్కిలి స్వార్ధ గుణం చేత దుర్యోధనుడు చెడాడు. అతి కామం చేత రావణుడు నాశనమయ్యాడు. కనుక అంతటా అతిని విడిచి పెట్టాలి. ఎప్పుడూ అతి పనికి రాదు. ఓవరాక్షను వికటిస్తుంది.
🔥 సత్యాను సారిణీ లక్ష్మీ
కీర్తి: త్యాగాను సారిణీ
అభ్యాసాను సారిణీ విద్యా
బుద్ధి: కర్మాను సారిణీ.
🔥లక్ష్మీ దేవి ఎప్పుడూ సత్యాన్ని అనుస రించే ఉంటుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. అలగే, కీర్తి త్యాగాన్ని అనుసరించి ఉంటుంది. త్యాగ గుణం లేనిదే కీర్తి ప్రతిష్ఠలు రమ్మంటే రావు. అభ్యాసం లేనిదే విద్య అలవడదు. నిత్యం చదవనిదే చదువు ఎలా స్తుంది ? అభ్యాసం కూసు విద్య కదా. ఇక, బుద్ధి కర్మను అనుసరించి ఉంటుంది. చెడి పోయే రాత మనకి ఉంటే మన బుద్ధి చెడు త్రోవలోను, బాగు పడే రాత ఉంటే మన బుద్ధి మంచి దారిలోను ప్రవర్తిస్తుంది. బుద్ధి మన కర్మలను అనుసరించి ఉంటుంది సుమా !
🔥న నిర్మితో వై నచ దృష్ట పూర్వో
న శ్రూయతే హేమ మయం కురంగ:
తథా2పి తృష్ణా రఘు నందనస్య
వినాశ కాలే విపరీత బుద్ధి:
🔥బంగారు లేడి ఉన్నదని ఎన్నడయినా విన్నామా ? ఎప్పుడయినా ఎక్కడయినా అయినప్పటికీ రాముడు తన చెలి కోరిందని ముందు వెనుకలు యోచించ కుండా బంగారు లేడిని తెస్తానని వెళ్ళాడు. వినాశ కాలం దాపురించిన నాడు ఇలాంటి విపరీత బుద్ధులే పుడుతూ ఉంటాయి. చెడ్డ కాలం వచ్చి నప్పుడు తర్కం పని చెయ్యదు. బుద్ధి మందగిస్తుంది.
🔥 ఋణ కర్తా పితా శత్రు:
మాతా చ వ్యభిచారిణీ
భార్యా రూపవతీ శత్రు:
పుత్ర: శత్రురపండిత:
🔥 అప్పు చేసి, మనకి ఆస్తి కాకుండా అప్పు మిగిల్చే తండ్రి మనకి శత్రువుతో సమానం. వ్యభిచరించే తల్లి శత్రువు. రూపవతి అయిన భార్య శత్రువు. పండితుడు కాని కుమారుడు శత్రువు.
🔥 ఆత్మ బుద్ధి: సుఖం చైవ
గురు బుద్ధిర్విశేషత:
పర బుద్ధి ర్వినాశాయ
స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:
🔥 మనకి తోచినది చేయడం అన్నిటి కన్నా మేలు. పెద్దల సలహా ప్రకారం నడచు కోవడం ఇంకా మంచిది. కాని పరుల (శత్రువుల అని కూడా అర్ధం చెప్పు కోవచ్చును) ఆలోచనల మేరకు నడచు కోవడం నాశనం కొని తెచ్చు కోవడమే. ఇక, ఆడువారి ఆలోచనల బట్టి నడుచు కుంటే ప్రళయమే సుమా !
🔥 అసమర్ధస్య సాధూనాం
నిర్ధనస్య జితేంద్రియ:
వార్ధక్యో దేవతా భక్తి:
వృద్ధ నారీ పతివ్రతా.
🔥అసమర్ధుని మంచితనం, ధనం లేని పేద వాని ఇంద్రియ నిగ్రహం, ముసలి తనంలో దైవ భక్తి, వయసు ఉడిగిన ఆడుదాని పాతి వ్రత్యం ఒక్కలాంటివే.
🔥 ముఖం పద్మ దళాకారం
వచ శ్చందన శీతలం
హృదయం కర్తరీ తుల్యం
అతి వినయం ధూర్త లక్షణమ్
🔥ముఖమేమో, పద్మం లాగా ఉంటుంది. మాటలేమో చందనం వలె చల్లగా ఉంటాయి. కాని, దుర్జనుని మనసు మాత్రం కత్తెర పిట్టలాంటిది. అతి వినయం చూపడం చెడ్డ వాడి లక్షణం సుమా.
🔥 సిద్ధ మన్నం ఫలం పక్వం
నారీ ప్రథమ యౌవ్వనం
కాలక్షేపం నకర్తవ్యం
ఆలస్యం అమృతం విషమ్
🔥వండిన అన్నాన్ని భుజించడానికీ, పండిన పండును కొరుక్కు తినడానికీ, యౌవ్వన వతి పొందును స్వీకరించడానికీ ఆలస్యం చేయ రాదు సుమా ! ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమై పోతుంది. అన్నం చల్లారి పోవడం, పండు కుళ్ళి పోవడం, యౌవ్వనం తరగి పోవడం జరుగుతాయి. ఆలస్యం చేయడం వల్ల అమృతం కూడా విషతుల్యమవుతుంది.
🔥 విశ్వా మాత్రా హి పశుషు, కర్ద మేషు జలేషుచ
అంధే తమసి వార్ధక్యే, దండం దశ గుణం భవేత్.
🔥పక్షులు, కుక్కలు, శత్రువులు, పాములు, పశువులు వీటిని అదుపు చేయడానికి వరుసగా, బురదలో, నీటిలో, చీకటిలో, గ్రుడ్డితనంలో , ముసలి తనంలో సాయంగా ఉండేది చేతి కర్ర. అందు వల్ల దండానికి (కర్రకి) దశగుణాలు ఉన్నాయి సుమీ !🔥
*ఇవీ మూల వాక్యాలకి పూర్తి పాఠాలు.*
*పూర్వులు చెప్పిన దానిని మార్చరాదు*
***** 

Sunday, September 21, 2025

ఎప్పటికి నువ్వు నీలాగే ఉండూ..!!

 

Saturday, August 16, 2025

కార్టూన్లు (సేకరణ)

 

 

 

దేని నుంచి స్వేచ్ఛ? -నల్లమోతు శ్రీధర్

 ఇండిపెండెన్స్ డే సందర్భంగా నా మనస్సులో మాటని పంచుకోవాలనుకుంటున్నాను. ఫ్రీడమ్.. from what? దేని నుంచి స్వేచ్ఛ? 79 సంవత్సరాల క్రితం వరకూ భౌతికంగా వేరే వాళ్ల పాలనలో ఉన్న మన దేశం గురించే కదా.. యెస్.. ఆ స్వేచ్ఛ చాలా గొప్ప విషయం. ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుందాం. కానీ బాధ్యత కలిగిన భారతీయ పౌరుడిగా నిజమైన స్వేచ్ఛ గురించి ఇప్పుడు ప్రస్తావిస్తాను. ఈ దేశాన్ని ఇప్పటికీ అనేక బంధీఖానాలు సతమతం చేస్తున్నాయి.


ఏ దేశం ముందుకెళ్లాలన్నా యువశక్తి అత్యంత ముఖ్యమైనది. ఎక్కడైతే యువత నిర్వీర్యం అవుతుందో అక్కడ అభివృద్ధి కుంటుపడుతుంది. ఇప్పుడు దేశంలోని పలు ప్రాంతాల్లో యువత డ్రగ్స్ బారిన పడుతోంది. మీరు కొద్దిగా దృష్టి పెట్టి వింటే మీ చుట్టు పక్కల కొన్ని నగరాలు, పట్టణాల్లోనే ఇంజనీరింగ్ కాలేజీల పక్కన డ్రగ్స్ వినియోగం ఉదంతాలు మీ దృష్టికి వస్తాయి. మత్తులో జోగే ఏ యువతా దేశానికి ఉపయోగపడలేదు, లక్ష్యబద్ధంగా ఉండలేదు. అలాగే దేశం మొత్తం ఒకటే మొబైల్ అడిక్షన్. అన్ని పనులూ మానేసి.. పిచ్చి పిచ్చి థంబ్‌నెయిల్స్‌తో ఉన్న వీడియోలు చూడడమే గొప్పగా యువత ఫోన్లకి అడిక్ట్ అవుతోంది. మూడేళ్ల క్రితం నేను ఇండోనేషియా బాలి వెళ్లాను. అది చాలా చిన్న పర్యాటక ప్రదేశం. అక్కడ షాపింగ్‌కి వెళితే షాపుల వాళ్లు కస్టమర్స్ లేనప్పుడు మనలా ఫోన్లు పట్టుకుని కనిపించలేదు. రోడ్ మీద నిలబడి ఎవరికి వారు గిటార్, ఫ్లూట్ వంటివి నేర్చుకుంటూ, లేదా కస్టమర్ల రాక కోసం అలా రోడ్ మీద చూస్తూ కూర్చున్నారు. అసలు మొబైల్ అనేది అక్కడ అతిగా పట్టుకోవడం నేను చూడలేదు. 
దీనికి మన వాళ్లు.. మన దేశంలా ఆ దేశం అభివృద్ధి చెందిందా.. అని మాట్లాడొచ్చు. అభివృద్ధి వేరు, వ్యక్తి ఎదుగుదల వేరు. సహజవనరులు, వ్యవసాయ ఉత్పత్తులు, విస్తీర్ణం ఎక్కువగా ఉన్న మన దేశం, చైనా లాంటి దేశాలు ఎగుమతులు ద్వారా సంపద సృష్టించడం సంగతి మనం ఎదుగుదలగా భావిస్తున్నాం గానీ.. చిన్న దేశాలైన సింగపూర్, బాలి, న్యూజీలాండ్‌ లాంటి వాటిలో ఉన్న డిసిప్లెయిన్, వ్యక్తుల స్థాయిలో పరిపక్వత గురించి మనం గమనించకపోతే, నేర్చుకోకపోతే మన జనాభానే మన ఆర్థిక ఎదుగుదలని కొన్నేళ్లకి వెనక్కి నెట్టేలా తయారవుతారు.
ఇకపోతే.. మీడియా! ప్రపంచంలో ఏ అభివృద్ధి చెందిన దేశంలోనూ.. మన దగ్గర ఉన్నంతగా మీడియా సామాన్యుల మైండ్స్‌ని ప్రభావితం చేసే స్థాయిలో లేదు. వేలంవెర్రిగా నచ్చిన ఛానెల్స్, నచ్చిన భావజాలం మళ్లీ మళ్లీ మనసుల్లో ఇంజెక్ట్ చేసే ఛానెల్స్ చూడడం, కండిషనింగ్ కావడం, భావోద్వేగాలకు లోనవ్వడం, సమాజంలో ఏదైనా సంఘటన జరిగితే మాస్ హిస్టీరియా.. వారానికో కొత్త సంఘటనతో మీడియా మనషుల్ని ఏ పనీ స్వేచ్ఛగా చేసుకోనీయకుండా హైజాక్ చెయ్యడం ఇవన్నీ.. దేశానికి చాలా పెద్ద శత్రువులు. ఒకప్పుడు వ్యవస్థలు బాగా పనిచెయ్యడానికి మీడియా సహకారం అవసరం అయ్యేది. ఇప్పుడు ప్రభుత్వాలకు వంతపాడే స్వంత మీడియా వచ్చాక, వ్యవస్థలు బాగున్నా బాగాలేకపోయినా.. వాటి గురించి ఆలోచించే వారు లేరు. కోతి ఏడ్చింది, కుక్క పాలు తాగింది... లావణ్య బాయ్‌ఫ్రెండ్ గురించి వెల్లడించిన షాకింగ్ నిజాలు.. ఇవన్నీ వార్తలైన తర్వాత ఇలాంటి మీడియా, ఇలాంటి సోషల్ మీడియా దేశానికి ఎంత నష్టం చేకూరుస్తుందో గుర్తించకపోతే భవిష్యత్ తరాలు ఈ తప్పిదాలకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది.
రాజకీయ నాయకులకు వ్యక్తి పూజ చెయ్యడం మన దేశంలో ఎక్కువ. కొన్నేళ్ల క్రితం నేను వ్యక్తిపూజకి సంబంధించిన సైకలాజికల్ యాస్సెక్ట్స్, ప్రపంచంలో వివిధ దేశాల ప్రజల మనస్థత్వాల గురించి కొన్ని పరిశోధనా గ్రంధాలు చదివాను. ఏ దేశంలో అయితే ప్రజలకు తమ పట్ల తమకు నమ్మకం ఉండదో, ఆర్థిక స్వేచ్ఛ ఉండదో.. ఆ దేశంలో ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరిస్తారు.. అని నాయకులను దైవాంశ సంభూతులుగానూ, వారితో ఫొటోలు దిగాలి, వారిని కీర్తించాలి, వాళ్ల ప్రాపంకం పొందాలి, ఇంకా ఇంకా ఏదేదో చేసి వారి దగ్గర ఓ చిన్న పదవైనా పొందాలి.. ఇలాంటి మనస్థత్వం ఉంటుందని అర్థమైంది. మన దగ్గర ఇది స్పష్టంగా చూడొచ్చు. అసలు ప్రభుత్వం అంటే ఏంటి? అన్న స్పష్టత చాలామందిలో లోపించింది. ప్రజల నుండి పన్నుల రూపంలో వచ్చిన డబ్బులను రోడ్లు, విద్య, వైద్యం, సంక్షేమం వంటి మౌలిక సదుపాయాలకు సమర్థంగా ఖర్చుపెట్టడానికి, వ్యవస్థలను సమర్థంగా నిర్వహించడానికి ప్రభుత్వాలు తప్పించి.. అంతకన్నా ఆకాశం నుండి దిగివచ్చిన ఫీలింగ్ ఎందుకు మనం రాజకీయ నాయకులకు ఇస్తున్నాం? అది బానిసత్వం లాంటిది. బ్రిటీష్ వాళ్ల దగ్గర మన భౌతికంగా ఇబ్బందులు పడితే, ఇప్పుడు మానసికంగా అదే తరహా బానిసత్వంలో మనం ఉన్నట్లు ఎందుకు జనాలకు అర్థం కావట్లేదు? మోదీ అయినా, రాహుల్ అయినా, చంద్రబాబు అయినా, జగన్ అయినా, రేవంత్ అయినా, కెసీఆర్ అయినా.. ఎందుకు జనాలంతా పనులన్నీ మానుకుని కీర్తిస్తున్నారో, అది ఏ విధమైన బానిసత్వమో అర్థం చేసుకుంటే, యువశక్తి  స్వంత వ్యక్తిత్వంతో ముందుకు కదులుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో దేశ అధ్యక్షులను సైతం సామాన్య పౌరులుగా చూస్తుంటారు. అలాంటిది ఇక్కడ ఈ దైవాంశ సంభూత భావన చాలా ప్రమాదకరం కాదా?
ఐ.టి లాంటివి వచ్చి, ప్రపంచంతో పోల్చుకుంటే వాటిని ముందే అందిపుచ్చుకున్న వాళ్లం కాబట్టి.. ఇప్పుడు ఆర్థికంగా మన దేశం ఎంతో కొంత బాగుంది గానీ.. నిజానికి మన యువతలో, మన పెద్ద వాళ్లలో, మన ప్రతీ పౌరుడిలో సరిచేసుకోవలసిన అంశాలెన్నో! గురజాడ అన్నారు.. దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. అని!!
30, 40, 50, 60.. ఏళ్లకి కూడా అశ్లీల డ్యాన్స్‌లు చేస్తూ.. రీల్స్ చేస్తున్న భారతీయ మహిళలను చూస్తున్నాం. అలాగే మగాళ్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరూ కలిసి ఒకేసారి ఐదారుగురు బాయ్ ఫ్రెండ్స్‌ని, గర్ల్ ఫ్రెండ్స్‌ని మెయింటైన్ చేస్తున్నారు. కుటుంబ వ్యవస్థ కుప్పకూలింది. పిల్లలను అతిగా గారాబం చెయ్యడం లేదంటే పూర్తిగా వదిలేయడం.. తప్పించి పిల్లల పెంపకం గురించి బ్యాలెన్స్ లేదు. చదువుకునే పిల్లల్లో అటెన్షన్ స్పాన్ లేదు. ఎంతో ఫోకస్డ్‌గా ఆఫీస్ వర్క్ చెయ్యాల్సిన వాళ్లు కూడా టైమ్‌పాస్‌గా వర్క్ చేస్తున్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలా సమస్యలే కనిపిస్తున్నాయి. ఇవన్నీ సరిచేసుకోకుండా, పునాదులను బలోపేతం చేసుకోకుండా ఇండిపెండెన్స్ ఆస్వాదించలేం. అలాగే ఇవన్నీ ఎవరో వచ్చి సరిచేసేవి కాదు… ఓ బాధ్యత కలిగిన పౌరుడిగా మనం ఫోకస్డ్‌గా, డిసిప్లెయిన్‌గా, జీవితం పట్ల క్లారిటీతో ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్‌గా సరి అవుతాయి.
ఇండిపెండెన్స్ డే విషెస్ పది వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేసే వాడు దేశభక్తుడు కాదు.. తనకు తాను దేశ పౌరుడిగా బాధ్యతగా తయారయ్యే వాడు నిజమైన దేశభక్తుడు!!
నల్లమోతు శ్రీధర్

Thursday, July 31, 2025

పంట చేల గట్ల మీద నడవాలి (పాలగుమ్మి విశ్వనాథం)

 పాలగుమ్మి విశ్వనాథం గారు రచించి, స్వరపరచి గానం చేసిన పాట మనకోసం

 పంట చేల గట్ల మీద నడవాలి
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి
మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి

ఒయ్యారి నడకలతో సెలయేరు,
ఆ ఏరు దాటితే మా ఊరు!
ఊరి మధ్య కోవెలా, కోనేరు
ఒకసారి చూస్తిరా, తిరిగి పోలేరు!
ఊరి మధ్య కోవెలా, కోనేరు
ఒకసారి చూస్తిరా వదిలి పోలేరు!

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి


చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి
మనసువిప్పి మాట్లాడే మనుషులు కలవాలి
ఒకరొకరు ఆప్యాయతలొలకబొయ్యాలి
ఆగలేక నా కన్నులు చెమ్మగిల్లాలి

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
జ్ఞాపకాల బరువు తో తిరిగి రావాలి

పచ్చని పచ్చిక పైన మేను వాల్చాలి
పైరగాలి వచ్చి నన్ను కౌగిలించాలి
ఏరు దాటి తోట తోపు తిరగాలి
ఎవరెవరో వచ్చి నన్ను పలకరించాలి

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి 

 


 

 

Friday, July 25, 2025

అప్పు చేసి పప్పుకూడు చేయిస్తున్న బ్యాంకులు

 LOANS FOR GOVERNMENT EMPLOYEES WITH BAD CREDIT - QUICK

ఒకప్పుడు పండుగో పబ్బమో వస్తే షాపింగ్‌కి వెళ్లేవారు. ఇప్పుడు ఏమీ తోచకపోతే షాపింగ్‌కి వెళ్లిపోతున్నారు. 35 ఏళ్లలోపు యువత ఏటా ఫ్యాషన్, లైఫ్‌స్టైల్‌ వస్తువుల మీద పెడుతున్న ఖర్చు లక్షల కోట్లలో ఉంటోందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. మరో నివేదిక ప్రకారం- కేవలం దుస్తులు, యాక్సెసరీస్‌ మీదే ఏడాదికి రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టేవారు అనేక మంది ఉన్నారు మన దేశంలో. ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ రిపోర్ట్‌ చెబుతున్న విషయమూ ఆందోళనకరంగానే ఉంది. 5 నుంచి 10శాతం మధ్యతరగతి భారతీయులు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారట. వీరిలో 67శాతం వ్యక్తిగత రుణాలు తీసుకుని మరీ ఖర్చు పెట్టుకున్నారట. వడ్డీ ఎక్కువగా ఉండే ఈ రుణాలను ప్రాణాల మీదికి వస్తే తప్ప తీసుకోకూడదంటారు నిపుణులు. కానీ బ్యాంకులు ఫోన్‌ చేసి మరీ జీరో ప్రాసెసింగ్‌ ఫీజు అని చెబుతోంటే... తీసుకుని కోరుకున్న వస్తువు కొనేసుకుంటే పోలా... అనుకుంటున్నారు వినియోగదారులు.

కొనేటప్పుడు డోపమైన్‌ హర్మోన్‌ ప్రభావం సంతోషాన్నిస్తుంది కానీ బిల్లు కట్టేటప్పుడో? డబ్బులన్నీ అయిపోతే నెల గడిచేదెలా అన్న ఆలోచన ఒత్తిడిని పెంచి కార్టిసోల్‌ హార్మోన్‌ విడుదలకు కారణమవుతుంది. పలు అనారోగ్యాలకు అది దారితీస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే అనవసరమైన ఖర్చులు చేసి చేజేతులా అనారోగ్యాలను ఆహ్వానించడం అన్నమాట. జీతం... జీవితం రెండూ ఒకటే! చేజారిపోయేవరకూ రెండిటి విలువా తెలీదు. అప్పు పేరుతో తప్పు చేయడం మానేద్దాం. ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అన్నారు పెద్దలు.

ఆ వినాశకాలాన్ని విలాసాలతో కొని తెచ్చుకోవద్దు. 

Friday, July 18, 2025

గాలిలో ఊగిసలాడే దీపంలా Thandel Bujji Thalli Song Lyrics

తండేల్ మూవీ నుంచి బుజ్జి తల్లి అనే పాటను హీరో-హీరోయిన్ల (నాగ చైతన్య, సాయి పల్లవి) మధ్య మనసుకు హత్తుకునే విధంగా చిత్రీకరించారు. ప్రేమికుల మధ్య ఉన్న బంధాన్ని చాటేలా సాగే ఈ పాట సాగుతుంది...

దేవిశ్రీప్రసాద్‌ స్వరపరచిన ఈ మెలోడీ గీతాన్ని శ్రీమణి రచించగా, జావేద్‌ అలీ ఆలపించారు. బాధలో ఉన్న ప్రియురాలిని కథానాయకుడు ఓదార్చే నేపథ్యంలో ఈ పాట సాగింది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: చందూ మొండేటి.

https://suryaa.com/suryaa-images/cinema-telugu/bigimage/bujjithalli_9886.gif 

 లిరిక్స్ ఇక్కడ చూడండి.

పల్లవి :
గాలిలో  ఊగిసలాడే దీపంలా 
ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం 
నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా 
చీకటి కమ్మెను నీ కబురందక నాలోకం 

సుడిగాలిలో పడి పడి లేచే 
పడవల్లే తడబడుతున్నా ..

నీ కోసం వేచుందే నా ప్రాణం 
ఓ బుజ్జితల్లి
నా కోసం ఓ మాటైనా మాటాడే 
నా బుజ్జి తల్లి ..

చరణం -1 

నీరు లేని చేపల్లే 
తారలేని నింగల్లే 
జీవమేది నాలోన నువ్వు మాటలాడందే 

మళ్ళీ యాళకొస్తానే 
కాళ్ళా యేళ్ళ పడతానే 
లెంపలేసుకుంటానే 
ఇంక నిన్ను యిడిపోనే 

ఉప్పు నీటి ముప్పుని కూడా 
గొప్పగా దాటే గట్టోణ్ణే 
నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే 

నీ కోసం వేచుందే నా ప్రాణం 
ఓ బుజ్జితల్లి
నా కోసం ఓ మాటైనా మాటాడే 
నా బుజ్జి తల్లి 

చరణం -2 

ఇన్నినాళ్ళ మన దూరం 
తియ్యనైన ఓ విరహం 
చేదులాగ మారిందే అందిరాక నీ గారం 

దేన్ని కానుకియ్యాలే 
యెట్లా బుజ్జగించాలే 
బెట్టు నువ్వు దించేలా లంచమేటి కావాలే 

గాలివాన జాడేలేదే రవ్వంతైనా నా చుట్టూ 
ఐనా మునిగిపోతున్నానే దారే చూపెట్టు 

నీ కోసం వేచుందే నా ప్రాణం 
ఓ బుజ్జితల్లి
నా కోసం ఓ మాటైనా మాటాడే 
నా బుజ్జి తల్లి ..


 

Wednesday, July 9, 2025

అరుదైన ఆత్మహత్య by Avasarala Ramakrishna Rao

 అవసరాల రామకృష్ణారావుగారు 1966 లో రాసిన కథ ఇది. ఉపన్యాసాలు, ఉపదేశాలు, నినాదాలు, ప్రవచనాలు లేకుండా అతి సరళంగా, సూటిగా సాగిన స్త్రీవాద కథ. సమాజాన్ని అంగీకరించకుండా, స్త్రీ జాతిని గౌరవించకుండా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనుకునే ఒక మగ మహానుభావుడికి ఎదురైన ఆత్మహత్యా సదృశమైన సంఘటనలు..!! 

Link to Read Full Story: Click Here


 

Tuesday, July 8, 2025

తెలుగు నా భాష

తీయనైన భాష తేనెలొలుకు భాష 

త్రిజన్మోహనమైన భాష 

త్రిలింగమున శోభించు భాష 

మైత్రీభావాల మధురమైన భాష 

నిరంతరం నాతోనే ఉండి 

నన్ను నన్నుగా ఉన్నతంగా ఆలోచింపచేసింది 

ఔన్నత్యం చాటేది 

ప్రసన్నమైన కిన్నెరసానిలా 

అందమైన వాగులా 

వంకలా 

వయ్యారంగా 

పాటై 

పదమై 

పద్యమై 

పరవశమై 

 పలికించేదీ అమ్మ భాష 

Monday, July 7, 2025

నేటి రాజకీయాలు .. ఒక్క ముక్క (చిత్రం) లో

 నేను ఎన్నికయ్యాక .. నేను పూర్తి శాఖాహారిగా మారిపోతాను 


Thursday, June 26, 2025

కన్నడ భాష "చందన చిలుక భాష" - ಕನ್ನಡ ನಾಡಿನ ಸುಂದರ ವರ್ಣನೆಯ ಪಕ್ಷಿನೋಟ

 కన్నడ కేవలం అక్షరం కాదు, అది జీవన భాష. కన్నడ భూమి గురించి ఎన్ని వర్ణనలు సరిపోవు. 

కన్నడ భాష! నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నువ్వు ఏమి రాశావో, నువ్వు చందనంతో అలంకరించబడిన చిలుకగా మారతావు, నీ మాటల సంపద బంగారం కంటే గొప్పది, నీ మాటలు ముత్యం, కన్నడ భూమి గురించి ఎన్ని వర్ణనలు సరిపోవు.

                    కన్నడ అనేది కేవలం ఒక వర్ణమాల కాదు. అది భూమి, నీరు, అడవులు, జీవితం, సాహిత్యం, సంస్కృతి, కళ, సంగీతం, నాటకం మొదలైన వాటి నుండి అన్నింటినీ కలిగి ఉంటుంది. నేర్చుకోవడానికి మరియు మాట్లాడటానికి ఒకే ఒక భాష ఉంది, అది కన్నడ. మీరు జన్మించినట్లయితే, మీరు కన్నడ భూమిలో పుట్టాలి, మీరు దానిపై అడుగు పెడితే, మీరు కన్నడ నేలపై అడుగు పెట్టాలి మరియు నా కన్నడ భూమికి గొప్ప సంస్కృతి ఉంది.

                   కన్నడ భాష శాస్త్రీయ భాష హోదాను పొందిన అతి ముఖ్యమైన భాషలలో ఒకటి. కన్నడ సాహిత్యానికి 2,000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. కాలానుగుణంగా, అది తన పాత రూపాలను వదులుకుని, కొత్త రూపాలను సంతరించుకుంటూ, అనేక దిశల్లో అభివృద్ధి చెందుతోంది. చాలా మంది కవులు తమ రచనలతో కన్నడ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. ఇక్కడి రచనలు విషయం, కంటెంట్, తీరు మరియు శైలి పరంగా వైవిధ్యంగా ఉంటాయి.

            కన్నడ సాహిత్య చరిత్రను మనం పరిశీలిస్తే, కర్ణాటకలోని అనేక రాజ కుటుంబాలు కన్నడ కవులకు రాజ పోషకత్వాన్ని అందించడం ద్వారా గొప్ప సాహిత్య సృష్టికి దోహదపడ్డాయి.

        కన్నడ నాడు సాహిత్య రంగంలో అపారమైన విజయాలు సాధించింది. అంతే కాదు, ఆచారాలు, సంస్కృతి, మర్యాదలు, ఆచారాలు మరియు అనేక ఇతర భాషలకు కూడా చోటు కల్పించింది మరియు తన మాతృభాషను ప్రేమించడం ద్వారా అన్ని రంగాలలో తన గొప్పతనాన్ని ప్రదర్శిస్తోంది.

              కన్నడ నాడులో అనేక నదులు మరియు వివిధ రకాల జీవరాశులు ఉన్నాయి, ముఖ్యంగా వృక్షజాలం, కన్నడ నాడులో ఇది చాలా వైవిధ్యమైనది. అంతే కాదు, పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమలు దట్టమైన పచ్చని అడవులను కలిగి ఉన్నాయి. ఇది గొప్ప జంతుజాలం ​​మరియు పక్షుల జీవితాన్ని కలిగి ఉంది, అలాగే తీరప్రాంతాన్ని కలిగి ఉంది. ఇది అనేక రకాల నేలలను కలిగి ఉంది.

          కన్నడలో విద్యకు గొప్ప ప్రాముఖ్యత ఇవ్వబడింది. సాహిత్య రంగంలో, చాలా మంది కవులు సాహిత్యంలో అందం పట్ల తమ ప్రతిభను వ్యక్తం చేశారు మరియు కన్నడ వర్ణనను ఇచ్చారు. కన్నడ సాహిత్యం వెయ్యి సంవత్సరాల చరిత్రను చూసింది. కన్నడ అక్షరాలు క్రీ.శ. 450 నాటి హల్మిడి శాసనంలో ప్రస్తావించబడ్డాయి. శ్రీవిజయ కవిరాజమార్గం క్రీ.శ. 850లో కన్నడ వర్ణనను స్పష్టంగా విస్తరించింది. అంతేకాకుండా, విదేశీ సాహిత్యంలో, శిలప్పడిగరం అనే తమిళ రచనలో కన్నడ అక్షరాలు ప్రస్తావించబడ్డాయి. ఇంత చరిత్రను చూసిన కన్నడ, నేటికీ అంత గొప్పతనం నుండి పైకి ఎదుగుతోంది.

    కన్నడ భాషను నల్ల నేల భూమి, కరుణాడు, కల్పతరు భూమి, శ్రీగంధ భూమి, కర్ణాటక, కర్నాటక, బంగారు భూమి (ಕಪ್ಪು ಮಣ್ಣಿನ ನಾಡು,ಕರುನಾಡು,ಕಲ್ಪತರುಗಳ ನಾಡು,ಶ್ರೀಗಂಧದ ನಾಡು,ಕರ್ನಾಟಕ,ಕರ್ನಾಟ,ಚಿನ್ನದ ನಾಡುಹೀಗೆ ಅನೇಕ ಹೆಸರುಗಳಿಂದ ಕನ್ನಡ ನಾಡನ್ನು) వంటి అనేక పేర్లతో పిలుస్తారు.