Monday, August 8, 2016

పుష్కర హడావుడి ఆంధ్రప్రదేశ్ లోనే ఎందుకు ఎక్కువ?


అదేమిటో కానీ,ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పనులుచేసి వార్తల్లోకి ఎక్కాలంటే కేవలం ఆది ఆంధ్ర ప్రదేశ్ కు మాత్రమే సాద్యం. అన్ని పనులు అలాగే ఉంటాయి కానీ ప్రస్తుతం పుష్కరాల ప్రహసనం నడుస్తుంది కాబట్టి ఈ విషయం మాత్రం చూద్దాం.
గత సంవత్సరం గోదావరి పుష్కరాలు అయ్యాయి. అందులో రాజమండ్రిలో 30 మంది దుర్మరణం పాలయ్యారు, గోదావరి నది రాజమండ్రిలో పుట్టి సముద్రంలో కలిసేది కాదు. ఎక్కడో మహారాష్ట్ర లో నాసిక్ లో పుట్టి తెలంగాణా గుండా ప్రవహించి చివరకు రాజమండ్రి వద్ద సముద్రంలో కలుస్తుంది కానీ వేరే ప్రాంతాల్లో ఎక్కడ లేని ప్రాణ నష్టం కేవలం రాజమండ్రిలో మాత్రమే ఎందుకు జరిగింది అని మాత్రం అడక్కండి ఎందుకంటే ఆది అంతే… ఇప్పుడు కృష్ణ పుష్కరాలు ముందునుండే ఆలయాలు కూల్చివేత గొడవలు మొదలయ్యాయి. కృష్ణ నది కూడా విజయవాడ లో పుట్టి సముద్రంలో కలవదు, ఆది కూడా మహారాష్ట్ర, మహాబలేశ్వర్ లో పుట్టి తెలంగాణా మీదుగా ప్రవహించి చివరికి తలగడ దీవి వద్ద సముద్రంలో కలుస్తుంది. మరి పుష్కరాలు మహారాష్ట్రలో, తెలంగాణాలో కూడా జరుపుతారు కానీ దానికోసం ఉన్న ఆలయాలు, అడ్డొచ్చాయని కట్టడాలు కూల్చేయడమ్ లేదే మరి కేవలం విజయవాడ లో మాత్రమే ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ఆంధ్ర పాలకులు ఏం చేసినా కూడా వెరైటీ ఉండాలిగా మరి.

temples demolition in the name of Krishna pushkaralu in vijayawada కృష్ణ పుష్కరాల పనుల పేరుతో వెనకేసుకున్న వాడికి వెనకేసుకున్నంత…

మహారాష్ట్ర లో పూణే ముంబై లాంటి పట్టణాలు ఎంత అభివృద్ది చెందినా కూడా, ఇప్పటికీ రాజులకోటలు మాత్రం బద్రంగా కాపాడుతూ ఉంటారు ఆది వారి గొప్పదనం కావచ్చు లేదా మన ఆంద్ర పాలకుల దృష్టిలో పిచ్చితనం కావచ్చు. పుష్కరాలు అన్న విషయం మిగతా ప్రాంతాల వారికి తెలియక కాదు, కానీ వాళ్ళు ప్రతీ విషయాన్ని వ్యాపార దృష్టితో చూడరు, దేనికి ఎంత ప్రచారం చెయ్యాలో అంతవరకే కేటాయిస్తారు. పుష్కరాలు అనేవి 12 ఏళ్లకు ఓ సారి వస్తాయి, ఇప్పుడు వచ్చేవి మొదటివి కావు అలా అని చివరివి కాదు, అవి ప్రతి పన్నెండు సంవత్సరాలకు వస్తూనే ఉంటాయి. మరెందుకు ఇంత హడావిడి అంటారా?? ఇవి ఒక్క రాజకీయ బినామీలకు మాత్రమే మొదటి పుష్కరాలు, డబ్బు సంపాదించుకునే అవకాశం ఉన్న చివరిపుష్కరాలు. పుష్కరాలలో మునిగిన వాడికి మునిగినంత పుణ్యం, పుష్కరాల పనుల పేరుతో వెనకేసుకున్న వాడికి వెనకేసుకున్నంత.
– శేఖర్ బాబు
సోర్స్: http://www.telugupunch.com/telugu/temples-demolition-in-the-name-of-krishna-pushkaralu-in-vijayawada/