"ఓటుకు నోటు" స్కామ్ వ్యవహారంపై ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాక దేశమంతటా చర్చ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో తొందరపడి జోక్యం చేసుకోకుండా సరైన నిర్ణయం తీసుకుంది . కాకపొతే ఈ అంశం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాజధాని నిర్మాణాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెపుతున్నారు . దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నట్లు తెలుస్తుంది . ఎట్టకేలకు రాజధాని నిర్మాణం మొదలవబోతున్నదన్న ఆ రాష్ట్ర ప్రజల ఆనందం ఎంతోకాలం నిలవలేదు . ఈ లోపే ఈ స్కాం లో సాక్షాత్తూ సీయం చిక్కుకోవడం వెనుక కారణాలపై ప్రజలు చర్చించు కుంటున్నారు . తెలంగాణా ప్రభుత్వం కక్షతోనే చంద్రబాబును ఇరికిన్చిందని ఎక్కువమంది నమ్ముతున్నారు . తమ రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేని కేసీయార్ ఈ పని చేయించి ఉంటారని వారి నిమ్మకం .
ఇక జగన్ కూడా ఈ విషయంలో తొందరపడి రాద్దాంతం చేస్తున్నారని ఆయన ఎక్కువగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి మాట్లాడితే బాగుండేదని కొందరి అభిప్రాయం . ఈ పరిస్థితిలో తానూ ఎలాగూ ముఖ్యమంత్రి కాలేదు కనుక రెండు అంశాలపై యుద్ధం చేసి న్యూట్రల్ గా ఉన్న అభిప్రాయం కలిగించాల్సిందని చెపుతున్నారు .
విదేశాలు ముఖ్యంగా సింగపూర్ , జపాన్ కూడా పరిణామాలను గమనిస్తున్నాయని విశ్లేషకుల అంచనా . చంద్రబాబు అరెష్ట్ అయి వేరే సీయం వస్తే రాజధాని నిర్మాణంపై తాము ముందు ఉన్నంత చొరవ చూపలేమని అక్కడి అధికారులు భావిస్తున్నట్లు వారంటున్నారు . ఇలాంటి విషయమే ఓ కాంగ్రెస్ నాయకుడు రామచంద్రయ్య కూడా ప్రకటించారు .