బుద్దుడు, ఏసుక్రీస్తు లాగా మహాత్మాగాంధీ కూడా చరిత్ర లో చిరస్థాయిగా
నిలిచిపోతారని భారతదేశ ఆఖరి బ్రిటిషు వైస్రాయి లూయీస్ మౌంట్ బాటన్ అన్నారు.
ఈ యుగంలో జన్మించిన మహాత్ములలో ప్రప్రధమంగా పేర్కొనవలసిన మహనీయుడు
గాంధీజీ. నేడు ఆయన బోధనలు కేవలం మనదేశంలోనే గాక ప్రపంచమంతా వ్యాప్తి
చెందాయి. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ గాంధీజీ గురించి ఇలా
అన్నారు. "రక్త మాంసాలతో నిండివున్న ఇలాంటి వ్యక్తి ఒకప్పుడు భూమి మీద
నడిచారు అంటే రాబోయే తరాల వారు నమ్మలేరు అని."
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 1869 అక్టోబరు 2 వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని పోర్ బందర్ లో జన్మించారు. గాంధీజీ చిన్నతనం నుండి అధ్యాత్మిక చింతన గలిగిన నాయకుడయ్యారు. చిన్నతనంలో తనకు ఆటలాడుకోవటం కన్నా ఒంటరిగా చాలా దూరం నడవటం అంటే ఇష్టంగా ఇండేదని చెప్పేవారు. గాంధీజీ 13 సం|| ల వయస్సు లో కస్తూరిబాతో వివాహం జరిగింది. 1888 లో న్యాయశాస్త్రం అభ్యసించడానికిగాను లండన్ వెళ్ళారు. విద్యార్ధిగా ఉన్న రెండున్నర సంవత్సరాలలో ఫ్రెంచి, లాటిన్, రోమన్ భాషలను భౌతిక శాస్త్రాలను ఆయన పూర్తి చేశారు.
భారతదేశం తిరిగి వచ్చాక న్యాయవాదిగా తొలిసారిగా ముంబాయి కోర్టులో తన వృత్తిని చేపట్టారు. ఆ తరువాత కొద్దికానానికి ఒక ధనవంతుడైన వ్యాపారస్తుని కేసు వాదించడంకోసం దక్షిణాఫ్రికా వెళ్ళి 21సం|| అక్కడే ఉండిపోయారు. అక్కడే ఉండగా ఆయన జీవితంలో చేదు అనుభవాలు ఎదురై సమస్త చరిత్రనే మార్చివేయడానికి పుట్టిన మహామనిషిగా మార్చివేశాయి. భారతీయుల ఆత్మగౌరవం కాపాడే విధంగా దక్షిణాఫ్రికాలో చేపట్టిన శాసనోల్లంఘణోద్యమం విజయం సాధించింది. 40 సం|| వయస్సులో భారతదేశానికి తిరిగి వచ్చి భారతదేశ సమస్యలు పూర్తిగా తెలుసుకున్నారు. దానిలో నిజాయితీ,సత్యం, బ్రహ్మచర్య, పేదరికం ఇతరులకు సేవచేయటం అనే లక్ష్యాలతో అహ్మాదాబాదు సమీపంలో సభర్మతి దగ్గర ఆశ్రమం స్థాపించారు.
1919లో బ్రిటీషు సైనిక అధికారి జనరల్ డైయర్ నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరపడం జలియన్ వాలా బాగ్ మారణ కాండ గాంధీజీ భారత రాజకీయాల్లోకి ప్రవేశించడానికి కారణ భూతులయ్యాయి. బ్రిటీషు వారు భారత దేశం వదలి వెళ్ళేదాకా తన ఉద్యమం కొనసాగించారు. సహాయ నిరాకరణ వల్లే మనకు స్వాతంత్ర్యం సిద్దిస్తుందని ప్రచారం చేశారు. పలు బహిరంగ సభల్లో బ్రిటిషు వారి వస్త్రాలను బహిష్కరించమని పిలుపు నిచ్చారు. దండి ఉప్పు సత్యాగ్రహం చేపట్టి శాసనోల్లంఘనోద్యమం లేవనెత్తి ఆయన కూడా 60 వేల మందితో పాటు అరెస్టయ్యారు. భారత దేశం భిన్నమతాలకు, కులాలకు, సంస్కృతులకు ఆలవాలమైంది. భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి గాంధీజీ ఎన్నో ప్రయత్నాలు చేసి సఫలీకృతులయ్యరు. 1947 ఆగస్టు 15వ దేదీన భారతదేశానికి స్వాతంత్రయం సిద్దింపచేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు.
గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమం కైరా సత్యాగ్రహం, రౌలత్ సత్యాగ్రహం, నిరాకరణోద్యమం, శాసనోల్లంఘనం, బార్డోలి సత్యాగ్రహం, సైమన్ కమీషన్ రాకను బహిష్కరించడం, ఉప్పుసత్యాగ్రహం, దండి యాత్ర, క్విట్ ఇండియా ఉద్యమం, లండన్లో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావడం ఆయన అవిశ్రాంత పోరాటానికి నిదర్శనాలు. ఆయన చరిత్రలో మరుపురాని సంఘటనలు.
స్వాతంత్ర్యం సిద్దించిన తరువాత హిందూ-ముస్లింల మధ్యన చెలరేగిన హింసాకాండను ఆపి శాంతిని నెలకొల్పడానికై కలకత్తాలో నిరాహారదీక్షను సాగించారు. అదే విధంగా ఉత్తర పంజాబు, బెంగాల్ లలో జరుగుతున్న హింసాత్మక చర్యలు ఆపుచేయడానికి ఆమరణనిరాహార దీక్ష చేపట్టారు. 1948 జనవరి 30 వ తేదీన ఒక మతోన్మాది కాల్పులకు ఆయన జీవితాన్ని అర్పించారు.
గాంధీజీ ఒక సత్యానికి ప్రతినిధి అని నెహ్రు అన్నారు. అంతే కాకుండా మన జీవితాల నుండి వెలుగు వెళ్ళిపోయింది. ఎటు చూసినా అంధకారం అలుముకుంది. మన ప్రియతమ నాయకుడు బాపు మనదేశానికి తండ్రి అని చెప్పుకున్న గాంధీజీ మనకు ఇక లేరు, అని దుఃఖించారు. ఆయన జీవితం ఒక సత్య - ప్రేమ సందేశం వంటిది. అటువంటి మహనీయుడు కొన్ని శతాబ్దాలవరకు జన్మించడేమో అని అంటే అతిశయోక్తి కాదు. గాంధీజీ జీవితం ఆయన బోధనలు అనోన్యమైన ఆయన నాయకత్వం ఆయన మరణం యావత్ జాతిపై చెరగని ముద్రవేసింది. ఈ సందర్భంలో ప్రతి రోజు ఆయన చేసే ప్రార్దనా గీతంతో ఈ వ్యాసాన్ని ముగిద్దాం.
లండన్ లో చదివేరోజుల్లో గాంధీజీ తొలిసారిగా భగవద్గీతను చదివారు. గీతా సందేశం ఆయన మనస్సులో అతుక్కుపోయింది. క్రమ శిక్షణతో నిరాడంబరంగా జీవించడం అలవాటు చేసుకున్నారు. గాంధీజీ జాతీయోద్యమంతో పాటు సాంఘిక సమస్యల పట్ల కూడా తన కృషిని కేంద్రీకరించారు. దేశం లోని లక్షలాది చేనేత పనివారి జీవితాలు ఆర్ధికంగా స్వయం సమృద్ది సాధించడానికి కృషి చేశారు. గ్రామీణ చేతి వృత్తులను ప్రోత్సహించేవారు. భారతదేశం లోని గ్రామాలు స్వయం పోషకత్వం చెందినప్పుడే దేశం ఆర్ధికంగా పరిపుష్టి చెందగలదని గాంధీజీ అనేవారు. దేశానికి గ్రామాలు ఆయువు పట్టు అని గాంధీజీ విశ్వాసం.
‘కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ మాలడై తిరుగుతేనేమి?’ అని ప్రజలు గాంధీజీ గురించి పాటలు పాడుకున్నారు. గాంధీజీ పట్ల కోట్లాది భారతీయులకు పూజ్య భావం ఏర్పడినందువల్ల ఆయన ‘జాతి పితగా’ బాపూజీ ప్రజలచే పిలువబడినారు.

రఘుపతి రాఘవ రాజారం - పతితపావన సీతారం ఈశ్వర అల్లా తేరేనాం - సబ్ కో సన్మతిదే భగవాన్ఆయన పేరిట నిర్మించిన రాజ్ ఘాట్ లోని సమాధిని ఎంతో మంది విదేశీ ప్రముఖులు సందర్శించి, శ్రద్దాంజలి ఘటిస్తున్నరు. భారతీయులకు స్మారక చిహ్నంగా పర్యాటక కేంద్రంగా నిలిచిపోయింది.
లండన్ లో చదివేరోజుల్లో గాంధీజీ తొలిసారిగా భగవద్గీతను చదివారు. గీతా సందేశం ఆయన మనస్సులో అతుక్కుపోయింది. క్రమ శిక్షణతో నిరాడంబరంగా జీవించడం అలవాటు చేసుకున్నారు. గాంధీజీ జాతీయోద్యమంతో పాటు సాంఘిక సమస్యల పట్ల కూడా తన కృషిని కేంద్రీకరించారు. దేశం లోని లక్షలాది చేనేత పనివారి జీవితాలు ఆర్ధికంగా స్వయం సమృద్ది సాధించడానికి కృషి చేశారు. గ్రామీణ చేతి వృత్తులను ప్రోత్సహించేవారు. భారతదేశం లోని గ్రామాలు స్వయం పోషకత్వం చెందినప్పుడే దేశం ఆర్ధికంగా పరిపుష్టి చెందగలదని గాంధీజీ అనేవారు. దేశానికి గ్రామాలు ఆయువు పట్టు అని గాంధీజీ విశ్వాసం.
‘కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ మాలడై తిరుగుతేనేమి?’ అని ప్రజలు గాంధీజీ గురించి పాటలు పాడుకున్నారు. గాంధీజీ పట్ల కోట్లాది భారతీయులకు పూజ్య భావం ఏర్పడినందువల్ల ఆయన ‘జాతి పితగా’ బాపూజీ ప్రజలచే పిలువబడినారు.
గాంధీజీ సూక్తులు:
- చదవడం వలన ప్రయోజనమేమంటే నలుమూలల నుంచి వచ్చే విఙ్ఞానాన్ని పొందడం, దాన్నుంచి గుణ పాఠాలు తీసుకోవడం.
- ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వహించుకుంటూ వుంటే హక్కులను పొందుటకు అర్హులవుతారు.
- నియమ బద్ద జీవితానికి కోర్కెలను జయించటం మొదటి మెట్టు అవుతుంది.
- ఆచరించటం కష్టమని మూలసూత్రాలను విడిచి పెట్టకూడదు. ఓర్పుతో వాటిని ఆచరించాలి.
- తనకు తాను తృప్తి పడే మానవుడు ఇక ఎదగడు
- దుర్బల బాధల అనుభవం నిజాయితీకి ఒరిపిడిరాయి.
- భయం వలన పొందే ఆధిపత్యం కంటే అభిమానంతో లభించే ఆధిపత్యం ఎన్నో రెట్లు ఉత్తమమైనది
- లేని గొప్పదనం ఉందని చెబితే ఉన్న గొప్పదనం కాస్తా ఊడిపోతుంది.
- స్వార్ధ త్యాగం, కృతనిశ్చయం, వినయ విశ్వాసాల వల్ల ఆత్మబలం చేకూరగలదు.
- మానవుల ఆవేశాలు వేగంగా పరుగెత్తుతాయి. వీటిని అదుపులో పెట్టడానికి ఎంతో సహన శక్తి అవసరం.