Saturday, July 28, 2012

బయటపడిన తివారీ అబద్దాలు: రోహిత్ కు తండ్రి ఇతడే

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పితృత్వ కేసులో రోహిత్ శేఖర్ విజయం సాధించారు. న్యాయం ఉజ్వలా శర్మ పక్షాన నిలిచింది. రోహిత్‌ తండ్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ గవర్నర్ నారాయణ్‌ దత్‌ తివారీయేనని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. దీనితో ఇన్నాళ్ళూ తివారీ చిప్పినవన్నీ  అబద్దాలని తెలిసిపోయింది. ఇది నిజంగా మహిళలను అవమానించడమే. విడ్డూరమేమంటే తివారీపై చర్యకు కాంగ్రెస్ పార్టీకూడా సుముఖంగాలేదు. కాంగ్రెస్ కూడా ఇదంతా తివారీ ప్రయివేట్ వ్యవహారమని కొట్టి పారేసింది.
తండ్రి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రే కాకుండా ఒక రాష్ట్రానికి గవర్నర్ గా ఉండటంతో రోహిత్ శేఖర్ సుదీర్ఘంగానే పోరాడారు. అతనికి తల్లి ఉజ్వల శర్మ అండగా నిలిచారు. తీర్పు వెలువడిన తరువాత రోహిత్ మాట్లాడుతూ ఈ పోరాటంలో ఎన్నోసార్లు ఆత్మవిశ్వాసం కోల్పోయానని చెప్పారు. న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు తెలిపారు. 

రోహిత్ శేఖర్ మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నాయకుడు షంషేర్ సింగ్ మనవడు. ఉజ్వల సింగ్ తో తివారీకి గల వివాహేతర సంబంధం వల్ల రోహిత్ పుట్టారు. తివారీ యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నప్పుడు ఉజ్వల సింగ్ తో సంబంధాలు ఏర్పడ్డాయి. వారి మధ్య ఏర్పడి శారీరక సంబంధం కారణంగా రోహిత్ జన్మించారు. రోహిత్ ని కుమారుడుగా అంగీకరించడానికి తివారీ నిరాకరించారు. దాంతో 2008లో రోహిత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రోహిత్ చిన్నప్పుడు తల్లి ఉజ్వల, తండ్రి తివారీతో ఉన్న ఫొటోను కోర్టుకు సమర్పించారు. రోహిత్ పిటిషన్ ను 2008 ఏప్రిల్ లో కోర్టు విచారణకు స్వీకరించింది. తివారీకి నోటీసులు పంపింది. గౌరవప్రదమైన కుటుంబానికి చెందిన ఉజ్వల తెగువతో తన వివాహేతర సంబంధాన్ని వెల్లడించి కుమారుడికి అండగా నిలిచారు. డిఎన్ఎ పరీక్షకు రోహిత్ శేఖర్ అంగీకరించారు. తివారీ మాత్రం అందుకు నిరాకరించారు. అంతేకాకుండా అడ్డదిడ్డంగా వాదించారు. ఈ కేసును నీరుగార్చేందుకు ఆయన చేయని ప్రయత్నంలేదు. అవేమీ ఫలించలేదు. న్యాయస్థానం ముందు అతని హొదా, వాదనలు నిలువలేదు. రోహిత్ వేసిన పిటిషన్ పై రాష్ట్ర గవర్నర్ గా ఉన్న తివారీ ముందు కోర్టు విచారణ పరిధిని ప్రశ్నించారు. ఆ తరువాత తాను ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నానని, రోహిత్ లక్నోలో పుట్టాడని, అందువల్ల ఢిల్లీలో విచారణ సరైంది కాదని వాదించారు.

రోహిత్ బయటపెట్టిన ఫొటోను సాక్ష్యంగా తివారి అంగీకరించలేదు. తాను తివారీకి పుట్టానని రోహిత్ వాదనని నిర్ధారించడానికి కర్త నమూనా ఇవ్వాలని కోర్టు తివారీని ఆదేశించింది. అయితే, తివారీ అందుకు ముందుకు రాకుండా తీవ్ర జాప్యం చేశారు. తివారీ స్వచ్ఛందంగా ముందుకు రాకపోతే బలవంతంగా రక్తం నమూనాను సేకరించవలసి వస్తుందని కూడా కోర్టు ఆదేశించింది. తివారీ రక్తం నమూనాను పోలీసుల సహకారంతో తీసుకోవడానికి ఓ కమిషనర్‌ను నియమించాలని రోహిత్ శేఖర్ కోర్టును కోరారు. ఈ కేసుకు సంబంధించి తమకు సమర్పించిన ఫొటోలపై వివరణ ఇవ్వాలని కోర్టు తివారీకి ఆదేశాలు జారీ చేసింది. వివరణ ఇవ్వలేకపోతే స్వయంగా కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తివారీ వివరణ ఇవ్వకపోవడం వల్లనే వివాదం తలెత్తుతోందని, వివరణ ఇస్తే వివాదం ముగుస్తుందని కోర్టు తెలిపింది. వివరణ ఇవ్వకపోతే మే 20న తివారీ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

చివరకు సుప్రీం కోర్టు, హైకోర్టు ఆదేశాలతో తివారీ మే 29న డెహ్రాడూన్‌లోని తన నివాసంలో రక్త నమూనాలను ఇచ్చారు. ఎన్ డిఎ పరీక్షల నివేదికని బహిర్గతం చేయవద్దని తివారీ విజ్ఞప్తి చేశారు. అయితే ఆ నివేదికను బహిరంగ పరచాల్సిందేనని రోహిత్ శేఖర్, ఉజ్వల శర్మ కోరారు. హైదరాబాదుకు చెందిన డిఎన్ఎ ఫింగర్‌ ప్రింట్స్, డయాగ్నస్టిక్స్ కేంద్రం తివారీ, రోహిత్, ఉజ్వల శర్మల డిఎన్ఎ పరీక్షల నివేదికను ఇటీవల కోర్టుకు సమర్పించింది.

డీఎన్ఏ పరీక్షలను బహిర్గతం చేయవద్దంటూ తివారీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. రోహిత్‌ శేఖర్ తండ్రి ఎన్ డీ తివారీయేనని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. డీఎన్ఏ పరీక్షల నివేదికను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేవా ఖేత్రపాల్ శుక్రవారం విడుదల చేశారు. ఇద్దరి డీఎన్‌ఏలూ ఒక్కటే అని కోర్టు నిర్దారించింది. రోహిత్ శేఖర్ ఉజ్వల శర్మ, తివారీలకు కలిగిన సంతానమేనని కోర్టు తీర్పులో పేర్కొంది.

1 comment:

  1. Majority of the leaders are character less. The congress will always dis own people if they are exposed. They are our rulers, that is the pity.

    ReplyDelete